… కాబట్టి, కేటలస్ పోయినందుకు దేముడికి వెయ్యిదండాలు పెట్టు,
ప్రియమైన నెచ్చెలీ, ఒక విషయం మాత్రం నీకు నే చెప్పదలుచుకున్నా
ఇప్పుడైనా ఎప్పుడైనా, నీకు నచ్చినవాణ్ణి ఎవడినైనా ప్రేమించు,
ఒక్క కవిగాడిని తప్ప. వాడెవడైనా ఒక్కటే, చిత్రంగా ప్రవర్తిస్తారు.
.
వాళ్ళకి కలహమైనా, ముద్దుపెట్టుకోవడమైనా ఒక్కటే,
అవి వాళ్లకి పిల్లనగ్రోవిమీద పాడుకునే పాటల్లా ఉంటాయి.
అయితే దాన్ని స్తుతిస్తూనో, లేకుంటే దీనికోసం విలపిస్తూనో ఉంటాడు;
నా మట్టుకి నాకు, వ్యవహారజ్ఞానం ఉన్నవాడు కావాలి.
.
ఒకసారి ఆయన పిచ్చుకమీద ఒక స్మృతిగీతం రాసేడు,
నమ్మవు, ఎంతఘోరంగా ఉందో… అన్నీ దుర్భరమూ, ఏడుపొచ్చే పదాలే,
అయినా బాగుందన్నాను, నేను ఏడిచినట్టు నటించాను,
వెర్రి వెధవకి తెలీదు, నాకు పిట్టలంటే అసహ్యమని…
,
డొరతీ పార్కర్.
August 22, 1893 – June 7, 1967
అమెరికను కవయిత్రి
.

వ్యాఖ్యానించండి