.
ఈ కావ్యానికి తొలిపలుకుగా
నేను గొప్ప పీఠిక ఏదీ రాయలేను;
కానీ, ఖచ్చితంగా చెప్పగలను
ఇది ఒక కవి, కవితకిచ్చే అంకితం అని.
.
ఈ రాలిన సుమదళాలు
నీకు సుందరంగా కనిపించగలిగితే…
నీ కురులలో ఒద్దికగా ఒదిగేదాకా
నా ప్రేమ గాలిలో తేలియాడుతూనే ఉంటుంది.
.
ప్రేమరహితమైన ఈ ప్రపంచాన్ని
చలిగాలులూ, హేమంతమూ గడ్డకట్టిస్తే
అది నీ చెవులలో తోటఊసులు చెబుతుంది
అవి, నీకొకతెకే అర్థమవుతాయి.
.
ఆస్కార్ వైల్డ్.
16 October 1854 – 30 November 1900
ఐరిష్ కవీ, రచయితా, నాటక కర్తా.

వ్యాఖ్యానించండి