.
నాకు చాలా విషయాల గురించి తెలుసు.
ఇంకా తెలుసుకుంటూనే ఉంటాను.
ఎంత ఎక్కువంటే, ఇక నా బుర్రపట్టనంత.
ఇవతలవాళ్ళ గురించి ఎక్కువ తెలుసుకోవడం,
వాళ్ళు ఏమిటి చేస్తుంటున్నారో తెలుసుకోవాలనే బలహీనతే
నన్ను నిలబెడుతోంది.
దాని విలువేమిటో నాకు తెలియదంటే
గొప్ప చికాకు తెప్పిస్తుంది.
వాళ్ళకి దాని విలువేమిటో
నాకు తెలుసు.
అందుకే నాకు అసహ్యం
.
ఫ్రాంక్ ఒహారా
(మార్చి 27, 1926 – జులై 25, 1966 )
అమెరికను రచయితా, కవీ, విమర్శకుడూ అయిన ఒ హారా కి సంగీత సాహిత్యాలే గాక, కళలూ, తత్వశాస్త్రమూ, వేదాంతమూ మొదలైన చాలా విషయాలపై ఆసక్తి ఉండేది. ఆర్థర్ రింబో, మలామే, బోరిస్ పాస్టర్నాక్, వ్లాడిమిర్ మయకోవ్స్కీ అతని అభిమాన కవులు. అతని మరణానంతరం ప్రచురించబడ్డ కవితా సంకలనం కవిత్వ విభాగానికి 1972 నేషనల్ బుక్ ఎవార్డ్ ను ఇతరులతో పంచుకుంది. ఈ కవితలో మానవ స్వభావాలైన ఈర్ష్యా అసూయలూ, ప్రక్కవాళ్ల విషయాలలో మనకి అక్కరలేని కుతూహలము ఉండడం గురించి చెబుతున్నాడు.

వ్యాఖ్యానించండి