.
అది సాధ్యమా?
అంత తీవ్ర వాగ్వివాదం, అంత నిశితంగా,
అంత వాడిగా, అంత జోరుగా, జరిగింది
ఆలస్యంగా ప్రారంభమైనా
అంత తొందరగా ముగిసిందా?
అది సాధ్యమా?
అది సాధ్యమా?
అంత దుర్మార్గమైన ఆలోచన,
అంత క్షణికావేశము,
అంతతొందరగా తగ్గిపోయిందా,
ప్రేమనుండి ద్వేషానికి,
ద్వేషం నుండి జాలిపడడానికీ మారిందా?
అది సాధ్యమా?
అది సాధ్యమా?
ఆ గుండెలోనే ఒకసారి ప్రశాంతంగానూ,
మరోసారి కల్లోలంగానూ మారిపోగల
వైరుధ్యాలున్న మనసు ఉండడం…
అది నిజంగా సాధ్యమేనా?
అది సాధ్యమేనా?
ఎంతమాత్రం ఊహించలేని
పాచికవేస్తే పడే అంకెలా కదిలే
కళ్ళలోని సత్యాన్ని
ఎవరైనా గుర్తించగలరా?
అది సాధ్యమేనా?
అది సంభవమే.
తరచుగా,
అట్టడుగున ఉన్నది
అత్యున్నతస్థానం చేరడమూ,
ఉన్నతమైనది
పతనమై చులకనైపోవడమూ
సంభవమే.
ఏదైనా సంభవమే,
నమ్మడానికి సిధ్ధపడిన వాళ్ళకి.
కనుక ముందు విశ్వసించు,
తర్వాత సాధ్యాసాధ్యాలు ఋజువుచెయ్యి;
శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్న స్త్రీని
పురుషుడు ముందు విశ్వసించి,
తర్వాత వదిలేసి నట్టు,
అన్నీ సంభవమే.
.

వ్యాఖ్యానించండి