.
నువ్వొక అపురూపమైన గులాబీవనో, గోమేధిక మణివనో,
లేక నిప్పురవ్వల్లాంటి లవంగమొగ్గవనో ప్రేమించను.
నిన్ను కొన్ని రహస్యమైన వస్తువుల్ని ప్రేమించినట్టు,
ఎవరికీ తెలియకుండా గుండెకీ, నీడకీ మధ్య ప్రేమించాలి
ఎన్నడూ పుష్పించకపోయినా, కనపడని ఎన్నోపుష్పాలప్రకాశాన్ని
తనలో నిలుపుకున్న ఒక చెట్టుని ప్రేమించినట్టు, నిన్నుప్రేమిస్తా.
నీ ప్రేమ కారణంగానే, ఒక చెప్పలేని గాఢ సుగంధం
భూమినుండి వెలువడి నిగూఢంగా నాలో నిక్షిప్తమై ఉంది
ఎలా, ఎప్పుడు, ఎక్కడనుండి ప్రేమిస్తున్నానో తెలీదు
నిన్నునిన్నుగా, భేషజాలూ, అహం లేకుండా ప్రేమిస్తున్నాను.
నిన్నలా ఎందుకు ప్రేమిస్తున్నానంటే మరోలా తెలీదు కనుక
ఈ ప్రేమలో … “నేను” అన్నదీ లేదు … “నువ్వు” అన్నదీ లేదు
నాగుండెమీది నీ చెయ్యి నా చెయ్యే అనుకునేంత సామీప్యత
నేనునిద్రలోకి ఒరుగుతుంటే, నీ కళ్ళు మూతపడేంత మమేకత.
.

వ్యాఖ్యానించండి