[చిత్రంగా ఈ కవిత ప్రేమ కవిత్వమైనా, ఇది జీవుడి ఆత్మవేదనకి కూడ సరిగా సరిపోతుంది. మన జీవితం లో ఎన్నో సందర్భాలలో మనం అచ్చం ఇలాగే ఫీల్ అవుతాం. మనకి ఇష్టమైన వస్తువులూ, వ్యక్తులే ఒక్కోసారి మన కష్టాలకీ/ మనోవ్యధకీ కారణం కావడం విధి చిత్రంలా అగుపించక మానదు.]
.
నాకు శాంతిలభించలేదు… నా పోరాటాలు సమసిపోయాయి
భయంతోనే ఆశా ఉంది;జ్వలిస్తూనే మంచులా ఘనీభవిస్తున్నా
ఎంతో ఎత్తులకిఎగురుతున్నా, నా అంత నేను లేవలేకపోతున్నా
నా దగ్గర ఏమీ లేదు, ప్రపంచాన్ని జయించినా;
దాచవలసినదీలేదు, పోగొట్టుకునేదీ లేదు; జైలులో నిర్బంధించి
నన్నేదీ ఆపలేదు, అయినా నేను పారిపోలేను;
నా ఇష్టప్రకారం నన్ను బ్రతకనీదు, చావనీయదు…
కాని, చావడానికి తగిన కారణం కల్పిస్తుంది
కళ్ళు మూసుకుని చూడగలను, మాటాడకుండా మాటాడగలను
చచ్చిపోదామని అనిపిస్తుంది, కానీ బతకాలనీ కొరుకుంటాను
నేనింకొకరిని ప్రేమిస్తూ, నన్ను నేను ద్వేషించుకుంటున్నా
విషాదంతో బ్రతుకుతున్నాను, అంత బాధలోనూ నవ్వగలను
ఆశ్చర్యం! చావూ బ్రతుకూ రెండూ బాధిస్తున్నాయి
దీనికంతటికీ కారణం… నాకు ఆనందం కల్గించే వ్యక్తే.
.

వ్యాఖ్యానించండి