(ఈ కవితలో ఒక మహత్తర సందేశం ఉంది. అజ్ఞానులముందు వాళ్లకు ఎంతమాత్రం తెలియని విషయాల గురించి ప్రస్తావించినా, తమకు తెలుసినట్లు ప్రవర్తించడమేగాక, వాటి గురించి అసందర్భంగానైనా, అనర్గళంగా మాట్లాడగలరు… అని చెప్పడమే దీని తాత్పర్యం. ఇది యుధ్ధానికి వ్యతిరేకంగా అతని అభిప్రాయంగా కొందరు పరిగణిస్తారు.)
.
సాంద్ర సూర్యకిరణాలు వాళ్ళని ముంచెత్తాయి…
అ గుడ్డివాళ్ళ లోకం లో ఉన్న అందరినీ…
పాపం! అంధ ద్విపాదులు వాళ్ళకు తెలీదు వాళ్ళ వైకల్యం ఏమిటో.
తెలుస్తూనే ఉంది, ఏనాటిదో, ఈ శాపం
శతాబ్దాలనుండీ వదలక వాళ్ళని అలా మిగిల్చింది.
మధ్యలో ఎక్కడో సంధికాలంలో ఒకరిద్దరు
దురదృష్టవంతులకి కళ్ళు వచ్చేయనుకొండి, మార్పులు స్థిరపడ్డాక.
కానీ, మిగతా అందరూ చీకటిలో
వెలుగులోని వేదనలనుండి భద్రత పొందగలిగారు
.
నిర్వీర్యతకీ, నలుపులేమికీ, అనారోగ్యానికీ, ప్రతీకగా
వెలుతురు గురించి నిందాత్మకంగా మాటాడేటప్పుడు,
వాళ్ళ తాతలనాటి మాటలనే బిడియం లేకుండా వాడతారు
పాపం, వాళ్ళ మధ్యలో విపరీతం లా, కళ్ళున్న
అభాగ్యుడెవడైనా ఉషోదయాలగురించీ,
నక్షత్ర కాంతులగురించీ,
ఆకువన్నె ఏటవాలు కెరటాలగురించీ,
రాగోదయమైనతరుణిచెక్కిళ్ళలోని రంగుల అందాల గురించీ
మాటాడితే, ఎవరూ ప్రశ్నించడం గాని,
తెలియని భాష మాటాడుతున్నాడని నిలదియ్యడం గాని చెయ్యరు.
మీదుమిక్కిలి అంతా ఏకగ్రీవంగా “తెలిసిందే” అంటారు.
మాకూ అచ్చం అలానే అనిపిస్తుంది అంటారు.
కాని వాళ్ళు తప్పని అతనికి స్పష్టంగా, సందేహం లేకుండా తెలుసు.
కాని, వాళ్ళకు బోధపరచలేడు.
పాతబడి, భ్రష్టమై, నిర్లక్ష్యంగా విసిరేసిన మాటలవల్ల
ఇప్పుడు ప్రయోజనం లేదు. కనుక మౌనంగా ఉండవలసిందే.
కాని ఆ కుమ్మరిపురుగులు, వాచాలత ఇచ్చిన మూర్ఖపు ధైర్యంతో,
ఉపమానంగా వాడిన పదాలనే వస్తువులుగా భ్రమించి
ఒక కథని అల్లగలరు.
ఇది చాలా అసంగతంగా కనిపిస్తోంది కదూ?
సరే. అయితే ఇప్పుడు ప్రఖ్యాతి వహించిన వాళ్ళదగ్గరికి వెళ్ళి
అంతర్దృష్టికి స్పష్టంగా కనిపించి,
మహాపర్వతాలలా అచలమూ, ఉన్నతమూ, దివ్యమూ
కాని పైకి అగమ్యగోచరమైన ఒకప్పటి సత్యాల గురించి
మాట్లాడడానికి ప్రయత్నించండి. తెలుస్తుంది.
.

వ్యాఖ్యానించండి