
గొల్ల తన ప్రేయసికి … క్రిష్టఫర్ మార్లో

రమ్ము నెచ్చెలి, నాదు ప్రేయసివి కమ్ము
కాంచుదము మనము శిలలపై గూరుచుండి
ఏ నమర్తు గులాబుల సెజ్జ నీకు
మించు మఱకల నెరి సేకరించి నట్టి
కొలికి పగడపు, జేగురు గుబ్బమేకు
బుడుత గొల్లలు నిన్నలరించుకొరకు
Come live with me and be my love,
And we will sit upon the rocks,
And I will make thee beds of roses,
A gown made of the finest wool,
A belt of straw and ivy buds,
The shepherd swains shall dance and sing
“గొల్ల తన ప్రేయసికి … క్రిష్టఫర్ మార్లో” కి 2 స్పందనలు
-
ఏమో ఛందస్సులు, మాత్రలు యేమీ తెలియవు కాని, భావం యెలా వున్నది అన్నది ముఖ్యంగా కనపడుతుంది, నాకు. ఛందస్సు కావలసిందే, కాని దానికోసం పాకులాడుతూ భావం పోగొట్టుకో కూడాదుకదా!
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
శర్మగారూ,
మీరన్నమాట వాస్తవమే. ఇది 16వ శతాబ్దానికి చెందిన రచన. ఆ రోజుల్లో గ్రామీణవాతావరణాన్ని సూచించే “Pastoral Poems” కవి ప్రతిభకు గీటురాళ్ళు. సాధారణంగా మూలవస్తువు, అనువాదం చేసే ఛందో రీతినీ (Verse or free verse), అందులో ఉపయోగించే భాషనీ sub-consciousగా ప్రభావితం చేస్తాయి. అనువాదం మొదలెడితే అది తేటగీతిలో ప్రారంభం అయింది. అందుకని దానినే కొనసాగించేను నా పరిమితులకు లోబడి.
అభివాదములతో,మెచ్చుకోండిమెచ్చుకోండి
వ్యాఖ్యానించండి