నేను పవనాన్ని… జో ఏకిన్స్, అమెరికను
నేను నిలకడలేని పవనాన్ని
నువ్వు నిశ్చలమైన ధరిత్రివి;
నేను ఇసుకమీద
అటూ ఇటూ కదలాడే నీడని.
నేను గాలికి అల్లల్లాడే పత్రాన్ని
నువ్వు తొణకక నిలబడే వృక్షానివి;
నువ్వు తన ఉనికినుండి కదలని నక్షత్రానివి
నేను చంచలమైన సముద్రాన్ని.
నువ్వు శాశ్వతమైన వెలుగువి
నేను దివిటీలా సమసిపోతాను;
నువ్వు రసార్ణవంలో ముంచెత్తే సంగీతానివి
నేను? … ఒక కేకని.
.
జో ఏకిన్స్
(30 October 1886 – 29 October 1958)
అమెరికను కవయిత్రి
.
Zoë Akins, was an artist who became successful as a Broadway playwright. For Akins, this was a hard-earned title, which she achieved after years of false starts and near misses. She wrote over 40 plays, 18 of which appeared on the Broadway stage between 1919 and 1944. Also in her oeuvre are two novels, numerous short stories and essays, several film and television scripts, and two volumes of poetry…
Read the rest of the intro at:
http://rompedas.blogspot.com/2010/06/broadway-playwright.html
.
I Am the Wind
.
I am the wind that wavers,
You are the certain land;
I am the shadow that passes
Over the sand.
I am the leaf that quivers,
You the unshaken tree;
You are the stars that are steadfast,
I am the sea.
You are the light eternal—
Like a torch I shall die;
You are the surge of deep music,
I but a cry!
.
Zoë Akins
(30 October 1886 – 29 October 1958)
American Poet, Playwright
The New Poetry: An Anthology. 1917.
Harriet Monroe, ed. (1860–1936).
http://www.bartleby.com/265/5.html
నేను పవనాన్ని… జో ఏకిన్స్, అమెరికను కవయిత్రి
నేను నిలకడలేని పవనాన్ని
నువ్వు నిశ్చలమైన నేలవి;
నేను ఇసుకతిన్నెలమీద
క్షణికమై నిలిచే పదముద్రని.
నేను ఇట్టే కంపించే తలిరాకుని
నువ్వు మొక్కవోని మహా వృక్షానివి;
నువ్వు స్థిరమైన తారానివహానివి
నేను చంచలమైన నీటిపుట్టని.
నువ్వు నశ్వరమైన కాంతిపుంజానివి—
నేనొక దివిటీలా సమసిపోతాను;
ఉప్పొంగిన సంగీత కెరటానివి నువ్వు,
నే నేవో పిచ్చికూతలు కూస్తుంటాను.
.
జో ఏకిన్స్
October 30, 1886 – October 29, 1958
అమెరికను కవయిత్రి
.
Zoe Akins
.
I am the Wind
.
I am the wind that wavers,
You are the certain land;
I am the shadow that passes
Over the sand.
I am the leaf that quivers,
You the unshaken tree;
You are the stars that are steadfast,
I am the sea.
You are the light eternal—
Like a torch I shall die;
You are the surge of deep music,
I but a cry!
.
.
Zoe Akins
October 30, 1886 – October 29, 1958
American Poetess
Poem Courtesy:
The New Poetry: An Anthology. 1917.
Ed. Harriet Monroe,(1860–1936).
http://www.bartleby.com/265/5.html
దేశ సంచారి … జో ఏకిన్స్, అమెరికను కవయిత్రి
ఓడలు రేవులో లంగరేసి ఉన్నాయి.
సీగల్స్ వాటి స్థంబాలచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి.
నా ఆత్మ వాటిలాగే అశాంతిగా ఎద్రుచూస్తోంది
ఎప్పుడెప్పుడు నక్షత్రసీమల్ని చేరుకుంటానా అని.
.
నాకు దేశాలు తిరగాలంటే ఎంత సరదానో!
సముద్రమన్నా, నీలాకాశమన్నా చెప్పలేనంత ఇష్టం.
కానీ, ఒక చిన్న సమాధిలో ఇలా కదలకుండా పడుక్కోడం
ఎంత దయనీయమైన పరిస్థితి?
.
జో ఏకిన్స్
(30 October 1886 – 29 October 1958)
అమెరికను కవయిత్రి.
ఏ కవితకైనా మొదటి పాదాలూ, చివరి పాదాలూ చాలా ప్రాణం. సమర్థుడైన కవులు వీటిని చాలా జాగ్రత్తగా నిర్వహిస్తారు. ఎందుకంటే, మొదటి పాదాలు కవితని చివరిదాకా చదవడానికి కుతూహలపరిస్తే, చివరి పాదాలు, కవిత పూర్తయిన కొంతసేపటి వరకూ పాఠకుడిని వెన్నాడుతాయి. ఈ కవితలో, ఆశకీ, నిరాశకీ మధ్య ఉన్న సంఘర్షణ చివరి వరకూ, ఊహించలేనంత చక్కగా నడిపింది కవయిత్రి. చివరి పదాలు చదివేక జీవితం యొక్క అర్థం బోధపడుతుంది. జీవించడంలోని అదృష్టం కూడా బోధపడుతుంది. ఇందులో బలమైన ప్రతీక, రేవులో లంగరు వేసి ఉన్న ఓడలు. వాటిని సమాధిలోని శవంతో పోలుస్తోంది కవయిత్రి. ఓడలు ఉండవలసింది రేవులో కాదు… సముద్రం మీద; మనిషి ఉండవలసింది సమాధుల్లో కాదు… విశాల విశ్వంలో. ఎంత చక్కని భావవ్యక్తీకరణ. ఎంత రమణీయమైన సందేశం. మనం ప్రాణంతో ఉంటున్నందుకు నిజంగా చాలా సంతోషించాలి.
.

.
The Wanderer
.
The ships are lying in the bay,
The gulls are swinging round their spars;
My soul as eagerly as they
Desires the margin of the stars.
.
So much do I love wandering,
So much I love the sea and sky,
That it will be a piteous thing
In one small grave to lie.
.
Zoë Akins
(30 October 1886 – 29 October 1958)
American Poet, Playwright
Zoë Akins, was an artist who became successful as a Broadway playwright. For Akins, this was a hard earned title, which she achieved after years of false starts and near misses. She wrote over 40 plays, 18 of which appeared on the Broadway stage between 1919 and 1944. Also in her oeuvre are two novels, numerous short stories and essays, several film and television scripts, and two volumes of poetry…
Read the rest of the intro at:
http://rompedas.blogspot.com/2010/06/broadway-playwright.html
Poem Courtesy: http://www.bartleby.com/265/7.html
శోకనాయిక … జో ఏకిన్స్, అమెరికను కవయిత్రి

.
కడలిమీద తుఫాను కమ్ముకుంటోంది
పగలు చీకటిమయం, కెరటాలూ నలుపే
దూరాన సీగల్స్,విషాదంగా అరుస్తూఎగురుతున్నాయి,
కెరటాలు తుఫానుని తోసుకొస్తున్నాయి.
.
ఎడారినుండి వీస్తున్న పెనుగాలులకి
నగరం తన మీనారుల తలలెత్తుతోంది
బురుజులలోనూ, మీనారుల క్రిందా
బందీలైన మహిళలు రోదిస్తున్నారు.
.
థెసలీలోని ఒకానొక పర్వతాగ్రాన,
ఉపేక్షతో మరుగుపడ్డ కోవెల నాల్గుపక్కలా
విరిగి స్థంభాలు క్రమంలో నిలిచి ఉన్నై,
క్రింద తెల్లగా పండు వెన్నెల.
.
అయినా, సృష్టిలో నీ ముఖంలో ప్రతిబింబించేంత
విషాదమూ, ఒంటరితనం ఎక్కడా కనిపించవు.
.
జో ఏకిన్స్
(30 October 1886 – 29 October 1958)
అమెరికను కవయిత్రి
.

The Tragedienne
.
A Storm is riding on the tide;
Grey is the day and grey the tide,
Far-off the sea-gulls wheel and cry—
A storm draws near upon the tide;
.
A city lifts its minarets
To winds that from the desert sweep,
And prisoned Arab women weep
Below the domes and minarets;
.
Upon a hill in Thessaly
Stand broken columns in a line
About a cold forgotten shrine,
Beneath a moon in Thessaly:
.
But in the world there is no place
So desolate as your tragic face
.
Zoë Akins
(30 October 1886 – 29 October 1958)
Pulitzer Prize – winning American Playwright, Poet, and Author.
For more details, visit: http://en.wikipedia.org/wiki/Zo%C3%AB_Akins
Poem Courtesy: http://www.bartleby.com/265/4.html