పచ్చికబయళ్ళలో లార్క్ పక్షి… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
https://www.youtube.com/watch?v=OsMSC3pkoDU
వానవెలిసిన తర్వాత మిగిలే వెండివెలుగులో
ఇంకా చినుకులు రాలుస్తున్న మెరుగు పచ్చ పొదలమధ్యనుండి
పచ్చికబయళ్ళలోని లార్క్ పక్షుల కుహూరవాలు వినడానికి
ఒంటరిగా, మహారాణిలా, ఎంతో ఉత్సాహంతో కాలిబాటపట్టేను.
బ్రతుకన్నా, చావన్నా నాకు భయపడడానికి ఏముంది?
అసలు ఈ మూడూ తెలిసినవారు లోకంలో ఎవరున్నారని:
రాత్రి ముద్దూ, గొంతులో పాట పలుకేటప్పుడు రెక్కతొడిగే ఆనందం,
ఈ వెండి వెలుగుల ప్రకృతి హేలలో లార్క్ పక్షుల రసధునీ?
.
సారా టీజ్డేల్
(August 8, 1884 – January 29, 1933)
అమెరికను కవయిత్రి
Meadow Larks
.
In the silver light after a storm,
Under dripping boughs of bright new green,
I take the low path to hear the meadowlarks
Alone and high-hearted as if I were a queen.
What have I to fear in life or death
Who have known three things: the kiss in the night,
The white flying joy when a song is born,
And meadowlarks whistling in silver light.
.
Sara Teasdale
(August 8, 1884 – January 29, 1933)
American Poet
వాలిపోతున్న బార్లీ పంటలా… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
Image Courtesy: https://www.farmingindia.in/barley-crop-cultivation/
సముద్రతలానికి దిగువన
గాలివాటుకి తలవాల్చినా
నిరంతరాయంగా కూని రాగాలు
తీసుకునే బార్లీపంటలా
తలను వాల్చినా, మళ్ళీ
తలెత్తుకునే బార్లీపంటలా
నేనుకూడా, బీటలువారకుండా
ఈ బాధనుండి బయటపడతాను.
నేనూ అలాగే, నెమ్మదిగా
ప్రతి పగలూ, ప్రతిరాత్రీ
దిగమింగుతున్న దుఃఖాన్ని
గేయంగా మలుచుకుంటాను.
.
సారా టీజ్డేల్
(August 8, 1884 – January 29, 1933)
అమెరికను కవయిత్రి
.
.
Like Barley Bending
.
Like barley bending
In low fields by the sea,
Singing in hard wind
Ceaselessly;
Like Barley bending
And rising again,
So would i, unbroken,
Rise from pain;
So would I softly,
Day long, night long,
Change my sorrow
Into song.
.
Sarah Teasdale
(August 8, 1884 – January 29, 1933)
American Poet.
From:
Sara Teasdale Poems Published by PoemHunter.com – The worlsd’s Poetry Archive, 2004 under Clessic Poetry Series.
అంతా అయిన తర్వాత … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
ఇప్పుడు నువ్వంటే నాకు ప్రేమ లేదు,
నీకూ నే నన్నా ప్రేమ లేదు,
అద్భుతమైన పెను తుఫానులా
ప్రేమ మనల్ని తాకి, వెళ్ళిపోయింది.
అయినప్పటికీ, మనిద్దరి మధ్యా
దూరాలూ, కాలమూ పెరుగుతున్నకొద్దీ
ఏవో చిన్న చిన్న విషయాలు
జ్ఞాపకానికి వస్తూనే ఉంటాయి:
వానతోపాటు వచ్చిన వాసన
చినుకులతోపాటు నేలమీదకి జారి
అక్కడ రాలిన ఎండుటాకుల్లోకీ
పుష్పించే లతాగుల్మాలలోకి చేరినట్టు…
స్ఫటికాల్లాటి వానబిందువులు
అక్కడి సాలెగూళ్ళ వలలపై తేలి
మిణుకుమనే తారకలతో
సామ్యాన్ని ఆపాదించుకున్నట్టు.
.
సారా టీజ్డేల్
(8 August 1884 – 29 January 1933)
అమెరికను కవయిత్రి
.
Afterwards
.
I do not love you now,
Nor do you love me,
Love like a splendid storm
Swept us and passed
Yet while the distance
And the days drift between us,
Little things linger
To make me remember
As the rain’s fragrance
Clings when the rain goes
To the wet under leaves
Of the verbena,
As the clear rain-drops
Cling to the cobwebs
Leaving them lightly
Threaded with stars.
.
Sara Teasdale
(August 8, 1884 – January 29, 1933)
American poet
వాసంత ప్రభాతవేళ… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
ఇంత చక్కని మనోజ్ఞ వాసంత ప్రభాతవేళ హృదయమా!
ప్రాణప్రదమైన నా ప్రియుని అడుగుజాడలు తెలుపవా?
అప్పుడు నేను నా స్వామికి, నా ప్రభువుకి
ఉచితమైన దృక్కులతో, నైవేద్యములతో
త్వరత్వరగా ఎదురేగి స్వాగతిస్తాను
సప్తవర్ణాల ఇంద్రధనుస్సులను సృష్టించే తుంపరలుగా
మహోన్నతమైన శిలలపై పతనమయే నీటిచాలుల
అతని కనుగొంటే, అవి నే తెచ్చే కలలకు సాటిరావని గ్రహిస్తాడు;
తెల్లని ఎండలో తళతళలాడే పచ్చని గోరింటలతో
మైదానం కళకళలాడే చోట అతని దర్శించితినా
‘ఆమె బంగారురంగు శిరోజసౌందర్యము ముందు
ఈ పూలసౌందర్యమేకాదు, ఏదీ సాటిరా’దనీ
‘ఆమె చెక్కిళ్ళలో పూచే గులాబులముందు, తోట
సరిహద్దుల పూచే గులాబులు దిగదుడు’పనీ తప్పక అంటాడు
.
ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్
(1866-1925)
అమెరికను కవయిత్రి
.
In Spring
.
On this most perfect morning of the spring,
Tell me my heart, where Love’s dearest feet shall stray,
That I may haste to meet him on the way,
With looks, and with an offering
That shall seem fitting for my lord and king.
If I shall find him where the waters play
About the mighty rocks, their rainbow spray
He’ll think less lovely than these dreams I bring:
And if I meet him in the meadows where
Are yellow cowslips gleaming in the sun,
I know that he will say, her golden hair
Outshines them in its glory, everyone,-
And in her cheeks my roses bloom so fair
That those upon the hedgerows are outdone!
.
Antoinette De Coursey Patterson
(1866-1925)
American Poet, Translator and Artist
From:
Page 16
Sonnets and Quatrains by Antoinette De Coursey Patterson
Philadelphia
H W Fisher & Company
MDCCCCXIII

ప్రేమే సర్వస్వం కాదు (సానెట్ 30) … ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
ప్రేమే సర్వస్వం కాదు; తినేదీ తాగేదీ అసలు కాదు.
సుఖంగా నిద్రపుచ్చేదో, వాననుండి రక్షించే పైకప్పో కాదు.
అందులో పడి మునుగుతూ తేలుతూ, మునుగుతూ తేలుతూ,
మళ్ళీ ములిగే మగాళ్ళని రక్షించగల ‘తేలే కలపముక్కా’ కాదు.
ప్రేమ దాని ఊపిరితో ఆగిపోయిన గుండెను కొట్టుకునేలా చెయ్యలేదు
రక్తాన్ని శుభ్రపరచలేదు, విరిగిన ఎముకను అతకనూ లేదు.
నేను ఇలా చెబుతున్నప్పుడుకూడా, ఎంతో మంది పురుషులు
కేవలం ప్రేమలేకపోవడం వల్ల మృత్యువుతో చెలిమిచేస్తున్నారు.
హాఁ! ఒకటి నిజం. ఏదో ఒక బలహీన క్షణంలోనో
బాధలు అణగద్రొక్కి, తప్పించుకుందికి అల్లాడినపుడో,లేదా
లేమి వెంటాడుతూ, మనసును ఇక అదుపుచేయగల శక్తి లేనపుడో,
ఉపశమనం కోసం నీ ప్రేమని మార్పిడిచేసుకుందామనిపించవచ్చు
ఆకలితీర్చుకుందికి ఈ రేయి జ్ఞాపకాలని వినిమయం చెయ్యొచ్చు.
అది కేవలం ఊహ. అలా చెయ్యగలనని నే ననుకోను.
.
ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే
(February 22, 1892 – October 19, 1950)
అమెరికను కవయిత్రి
Love is Not All
(Sonnet XXX)
.
Love is not all: it is not meat nor drink
Nor slumber nor a roof against the rain;
Nor yet a floating spar to men that sink
And rise and sink and rise and sink again;
Love can not fill the thickened lung with breath,
Nor clean the blood, nor set the fractured bone;
Yet many a man is making friends with death
Even as I speak, for lack of love alone.
It well may be that in a difficult hour,
Pinned down by pain and moaning for release,
Or nagged by want past resolution’s power,
I might be driven to sell your love for peace,
Or trade the memory of this night for food.
It well may be. I do not think I would.
.
Edna St. Vincent Millay
.
1892-1950
American Poet
Poem Courtesy: https://poets.org/poem/love-not-all-sonnet-xxx
కొత్త సంవత్సరం… ఎలా వ్హీలర్ విల్ కాక్స్, అమెరికను కవయిత్రి
I WISH
ALL MY FRIENDS
A VERY HAPPY AND PROSPEROUS
NEW YEAR 2020
MAY THIS YEAR
USHER IN
NEW FRIENDSHIPS,
SOOTHE OLD PAINS,
FULFILL YOUR DREAMS
AND
INSPIRE YOU TO ASPIRE FOR MORE.
ఇప్పటికే వేలసార్లు చెప్పి, చెప్పకుండా మిగిలినదేముందని
నూతన సంవత్సరంలో కొత్తగా కవితలో చెప్పడానికి?
కొత్త సంవత్సరాలు వస్తూంటాయి, పాతవి వెళుతూంటాయి,
మనం కలగంటామని తెలుసు, అయినా ఎన్నో కలలు కంటాం.
మనం వేకువతో నవ్వుతూ నిదుర మేల్కొంటాం,
చీకటితోపాటే శోకిస్తూ … నిద్రకుపక్రమిస్తాం.
మనల్ని కాటువేసేదాకా, లోకాన్ని హత్తుకుంటాం,
అప్పుడు శపిస్తాం, ఎగిరిపోడానికి రెక్కలులేవే అని నిట్టూరుస్తాం.
మనం జీవిస్తూ, ప్రేమిస్తాం, కామిస్తాం, పెళ్ళిళ్ళు చేసుకుంటాం,
పెళ్ళికూతుళ్ళను సింగారిస్తాం, మృతులను దుప్పటిలో చుడతాం.
మనం నవ్వుతాం, ఏడుస్తాం, ఎన్నో ఆశిస్తాం, ఎన్నిటికో భయపడతాం,
ఆ మాటకొస్తే, ఏ సంవత్సరానికైనా పల్లవి అదే!
.
ఎలా వ్హీలర్ విల్ కాక్స్
(November 5, 1850 – October 30, 1919)
అమెరికను కవయిత్రి
.
The Year
.
What can be said in New Year rhymes,
That’s not been said a thousand times?
The new years come, the old years go,
We know we dream, we dream we know.
We rise up laughing with the light,
We lie down weeping with the night.
We hug the world until it stings,
We curse it then and sigh for wings.
We live, we love, we woo, we wed,
We wreathe our brides, we sheet our dead.
We laugh, we weep, we hope, we fear,
And that’s the burden of the year.
.
Ella Wheeler Wilcox
(November 5, 1850 – October 30, 1919)
American Poet
Poem Courtesy:
https://www.familyfriendpoems.com/poem/the-year-by-ella-wheeler-wilcox
నన్ను స్వతంత్రదేశంలో సమాధిచెయ్యండి… ఫ్రాన్సెస్ ఎలెన్ వాట్కిన్స్ హార్పర్, అమెరికను కవయిత్రి
ఎత్తైన కొండశిఖరం మీదనో, సమతలపు బయలులోనో
మీకు ఎక్కడ వీలయితే అక్కడ నన్ను సమాధి చేయండి
భూమ్మీద అది ఎంత సామాన్యమైన సమాధి అయినా ఫర్వా లేదు
కానీ, మనుషులు బానిసలుగా ఉండే ఏ నేలమీదా సమాధి చెయ్యొద్దు.
నా సమాధి చుట్టూ భయం భయంగా నడిచే
బానిస అడుగులు వినిపిస్తే నాకు ప్రశాంతత ఉండదు;
నా నిశ్శబ్దపు సమాధిమీద అతని నీడ కనిపించినా
ఆ చోటు నాకు భయంకరంగా, బాధాకరంగా ఉంటుంది.
అమ్మకానికి నిర్దాక్షిణ్యంగా, మందలుగా తోలుకుపోతున్న బానిసల
తడబడుతున్న అడుగులసడి వింటే, నాకు మనశ్శాంతి ఉండదు.
నిరాశా నిస్పృహలతో ఒక తల్లి చేసే ఆక్రందన
గడగడలాడుతున్న ఆకాశంలోకి శాపంలా ఎగస్తుంది.
చేసిన ప్రతి భయంకరమైన గాయంనుండీ కారుతున్న ఆమె రక్తాన్ని
కొరడా తాగుతున్న చప్పుడు విన్నప్పుడూ, బెదురుతున్న పావురం పిల్లల్ని
గూటినుండి దొంగిలించినట్టు, తల్లి రొమ్మునుండి పాలుతాగుతున్న బిడ్దలని
లాక్కుని పోవడం చూసినప్పుడూ నాకు నిద్రపట్టదు.
రక్తపిపాసులైన వేటకుక్కలు తమ మానవ లక్ష్యాన్ని అందుకుని చేసిన
మొఱుగులు వినిపించినపుడూ, తిరిగి పట్టుబడిన ఆ బానిస బందీకి
బాధాకరమైన సంకెలలు తొడుగుతున్నప్పుడు అతను చేసే ప్రార్థనలు
విన్నప్పుడూ, నేను త్రుళ్ళిపడి, భయంతో గడగడలాడిపోతాను.
వస్తు మర్పిడిక్రింద జమకో, వాళ్ళ పరువాల వ్యాపారానికో,
తల్లి కౌగిలినుండి చిన్నారి యువతుల్ని లాక్కెళ్ళడం చూసినపుడు
శోకభరితమైన నా కళ్ళు మండి ఎరుపెక్కుతాయి
మృత్యువుతో తెల్లబారిన నా చెక్కిళ్ళు సిగ్గుతో ఎర్రనౌతాయి.
ప్రియ మిత్రమా! ఎక్కడ అధికార దర్పం మనిషినుండీ
ప్రాణప్రదమైన అతని హక్కుని లాక్కోదో అక్కడ నిద్రించగలను.
తన తోబుట్టువుని “బానిస”గా ఎక్కడ భావించరో
ఆ సమాధి ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా ఉండగలను.
ప్రక్కనుండి నడిచిపోయేవారి దృష్టి నాకట్టుకునేలా
గర్వంగా నెలకొల్పే ఏ ఎత్తైన స్మారక చిహ్నాలూ కోరను;
వేదనతో పరితపించే నా మనసుకోరుకునేదల్లా
బానిసలున్న ఏ దేశంలోనూ సమాధి చెయ్యొద్దనే.
.
ఫ్రాన్సెస్ ఎలెన్ వాట్కిన్స్ హార్పర్
(September 24, 1825 – February 22, 1911)
అమెరికను కవయిత్రి
.
.
Burry Me in a Free Land
.
Make me a grave where’er you will,
In a lowly plain, or a lofty hill,
Make it among earth’s humblest graves,
But not in a land where men are slaves.
I could not rest if around my grave
I heard the steps of a trembling slave;
His shadow above my silent tomb
Would make it a place of fearful gloom.
I could not rest if I heard the tread
Of a coffle gang to shambles led,
And the mother’s shriek of wild despair
Rise like a curse on the trembling air.
I could not sleep if I saw the lash
Drinking her blood at each fearful gash,
And I saw her babes torn from her breast,
Like trembling doves from their parent nest.
I’d shudder and start if I heard the bay
Of bloodhounds seizing their human prey,
And I heard the captive plead in vain
As they bound afresh his galling chain.
If I saw young girls from their mother’s arms
Bartered and sold for their youthful charms,
My eye would flash with mournful flame,
My death-paled cheek grow red with shame.
I would sleep, dear friend, where bloated might
Can rob no man of his dearest right;
My rest shall be calm in any grave
Where none can call his brother a slave.
I ask no monument, proud and high,
To arrest the gaze of passersby;
All that my yearning spirit craves,
Is bury me not in a land of slaves.
Frances Ellen Watkins Harrer
(September 24, 1825 – February 22, 1911)
African-American Abolitionist Poet
Read the bio of the poet here
Poem Courtesy:
https://www.poemhunter.com/poem/i-would-be-free-2/
ఒంటరిగా…. మాయా ఏంజెలో, అమెరికను కవయిత్రి
నిన్న రాత్రి
అలా పడుక్కుని ఆలోచిస్తున్నాను
నీరు దాహాన్ని తీర్చగలిగేదిగానూ
రొట్టి రాయిలాకాకుండా రొట్టిలా ఉండగలిగే
ప్రశాంతమైన చోటు ఏదైనా
ఈ మనసుకి సాధించగలనా అని.
నాకు ఒక్కటే సమాధానం దొరికింది
నేను పొరబడలేదనే అనుకుంటున్నాను:
ఇక్కడ
ఒంటరిగా, ఏకాకిగా
ఏ మినహాయింపులూ లేకుండా
ఏ ఒక్కడూ ఏదీ సాధించలేడు.
ఒంటరిగా, ఏకాకిగా
ఏ మినహాయింపులూ లేకుండా
ఏ ఒక్కడూ ఏదీ సాధించలేడు.
చాలా మంది కోటీశ్వరులున్నారు
వాళ్ల డబ్బు వాళ్ళకు ఎందుకూ కొరగాదు
వాళ్ల భార్యలు దెయ్యం పూనినట్లు అన్ని చోట్లకీ పరిగెడతారు
పిల్లలు ఏ ఉత్సాహమూ లేక, ఎప్పుడూ విచారంగా ఉంటారు.
రాతిగుండెలుగల వాళ్లని
ఖరీదైన వైద్యులు సేవిస్తుంటారు
ఒంటరిగా, ఏకాకిగా
ఏ మినహాయింపులూ లేకుండా
ఏ ఒక్కడూ ఏదీ సాధించలేడు.
మీరు జాగ్రత్తగా వింటానంటే
నాకు తెలిసిన మాటొకటి చెబుతాను మీకు
తుఫాను మేఘాలు కమ్ముకుంటున్నాయి
పెనుగాలులు వీచే సూచనలు కనిపిస్తున్నాయి
మానవజాతి కష్టాల్లో చిక్కుకుంది
ఆ మూలుగులు నాకు వినిపిస్తున్నాయి.
‘ఎందుకంటే, ఒంటరిగా,
ఏకాకిగా, ఏ మినహాయింపులూ లేకుండా
ఏ ఒక్కడూ ఏదీ సాధించలేడు.
ఒంటరిగా, ఏకాకిగా
ఏ మినహాయింపులూ లేకుండా
ఏ ఒక్కడూ ఏదీ సాధించలేడు.
.
మాయా ఏంజెలో
April 4, 1928 – May 28, 2014
అమెరికను కవయిత్రి.
.
Alone
.
Lying, thinking
Last night
How to find my soul a home
Where water is not thirsty
And bread loaf is not stone
I came up with one thing
And I don’t believe I’m wrong
That nobody,
But nobody
Can make it out here alone.
Alone, all alone
Nobody, but nobody
Can make it out here alone.
There are some millionaires
With money they can’t use
Their wives run round like banshees
Their children sing the blues
They’ve got expensive doctors
To cure their hearts of stone.
But nobody
No, nobody
Can make it out here alone.
Alone, all alone
Nobody, but nobody
Can make it out here alone.
Now if you listen closely
I’ll tell you what I know
Storm clouds are gathering
The wind is gonna blow
The race of man is suffering
And I can hear the moan,
‘Cause nobody,
But nobody
Can make it out here alone.
Alone, all alone
Nobody, but nobody
Can make it out here alone.
.
Maya Angelou
April 4, 1928 – May 28, 2014
American
Poem Courtesy:
https://100.best-poems.net/alone.html
