Tag: Woma
-
పూ రేకలు… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి
జీవితం ఒక ప్రవాహం. దానిమీద మన హృదయపుష్పపు రేకలను ఒకటొకటిగా తెంపుతూ విడిచిపెడుతుంటాము; వాటి గమ్యం మన కలలో మరుగైపోయినా అవి మన కనుచూపుమేరవరకు తేలుతూ కనిపిస్తాయి. ఆనందంగా సాగే వాటి ప్రయాణపు తొలి అడుగులు మాత్రమే మనం చూడగలం. వాటిపై ఆశలబరువును మోపుతూ, ఆనందంతో ఎరుపెక్కి మనం గులాబీ తొలి రేకలను విరజిమ్ముతాం; అవి ఎంతవరకు విస్తరిస్తాయో, చివరకి అవి ఎలా వినియోగపడతాయో మనకెన్నడూ తెలియదు. ఆ అనంత ప్రవాహం వాటిని పక్కకి నెట్టివేస్తుంది, ఒక్కొక్కటీ…
-
బేరసారాలు … డెబోరా వారెన్, అమెరికను కవయిత్రి
నాకు ఒక ధనికుడి కథ తెలుసును: గాయాలనుండో, ప్లేగునుండో, అమ్మవారో, లేక కుష్టువ్యాధో… ఏదో రోగంతో మంచం పట్టో, మృత్యుముఖంలోకి వెళ్లినపుడో అతనొక ప్రమాణం చేసుకున్నాడు: భగవంతుడే గనక తన మొర ఆలకించి తిరిగి పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే, అతను అతని కృతజ్ఞతను ప్రకటించడానికి బ్రహ్మాండమైన శిలలతో ఒక అద్భుతమైన చర్చి కట్టిస్తానని. నా సంగతీ అంతే. నేనుకూడా దేముడితో నాకునచ్చినట్టు బేరసారాలు కొనసాగిస్తాను (అయితే, ఇక్కడ దేముడంటే నా ఉద్దేశ్యం నేనే). ఇలా అనుకుంటుంటాను: “ఓ…
-
మనలో మన మాట… కెరొలీన్ రఫేల్, అమెరికను కవయిత్రి
ఎవరన్నారు ఈ పిల్లల్ని ఎగిరిపోనివ్వాలని? ఈ పిల్లలు మన పేగుతో ముడిపడినవాళ్ళు వాళ్లకి మన అవసరం ఉంటుంది, చివరకి ఎగిరిపోనివ్వడమేనా? (నేను ఈ మాటలు అనవలసి వస్తుందని ఎన్నడూ ఊహించలేదు) ఋతువులన్నీ సంగీతంలోని స్వరాల్లా క్రమంతప్పకుండా వచ్చిపోయే ఈ ఇంటి చెట్టుకి దగ్గరలోనే … ఏ కొమ్మమీదో గూడుకట్టుకుంటే, ఏమిటిట నష్టం? ఈ-ఉత్తరాలనీ, పుట్టినరోజు కార్డులనీ, ఫోన్లనీ ఎప్పుడూ మనం రొట్టె తునకలే ఎందుకు ఏరుకోవాలి? తక్కినవాళ్లందరూ వాళ్ళపిల్లలతో హాయిగా ఉంటే మనమెందుకు ఇట్టే గడిచిపోయే శలవులతో…
-
గుప్తప్రేమ… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
నా ప్రేమని నేను హృదయంలోనే పదిలపరిచాను నా కళ్ళల్లో నవ్వులు వెలిగించుకున్నాను, ఎందుకంటే, మేం కలుసుకున్నప్పుడు నా ప్రేమ అమరమని అతనికి తెలియకూడదు. కానీ ఒక్కోసారి అతను రాత్రి సుగంధాలు విరజిమ్మే చిక్కని, పచ్చని తోటలను కలగంటునపుడు, బహుశా నా ప్రేమ మెల్లిగా బయటకి జారుకుని అతనికి ఆ కలని తేప్పించిందేమో! ఒక్కోసారి అతని మది వేదనా భరితమై వెనువెంటనే కోలుకున్నప్పుడు, బహుశా, అక్కడ నా ప్రేమ ఉందేమో అతనికి బాధనుండి విముక్తి కలిగించడానికి! . సారా…
-
శీతకాలపు స్వారీ… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి
గుర్రపుస్వారీలో ఉన్న ఆనందాన్ని ఎవరు ప్రకటించగలరు? ఎగరడంలో ఉన్న ఆనందాన్ని ఎవరు విప్పి చెప్పగలరు? అకస్మాత్తుగా కనిపించిన అడవిపూల గుత్తుల్ని తప్పించుకుంటూ విశాలమైన రెక్కలతో, ఆకాశంలో ఎగురుతూ వెళుతుంటే… క్షణికమైన లోకంలో కొన్ని శాశ్వతమైన క్షణాలుంటాయి భగవద్దత్తమైనవి, లిప్తపాటైనా, చెప్పలేని ఆనందాన్నిస్తాయి సూర్యుడు హరివిల్లులు చిందించే తళతళల మంచుస్ఫటికాలతో నా ముందు పరుచుకున్న విశాలమైన తెల్లని త్రోవకూడా అలాంటిదే, నేనూ, నా బలశాలి గుర్రమూ దౌడు తీస్తుంటే తెల్లని ఈ పొలాలు, నల్లని పొడవాటి మా జాడలతో…