పరమాత్మ… మైకేలేంజెలో, ఇటాలియన్ శిల్పి, కవి
నా ప్రార్థనల వెనుక నీ ఆశీస్సులున్నపుడు
తండ్రీ! ఆ ప్రార్థనలు అర్థవంతమై ఉంటాయి:
నిస్సహాయమైన నా హృదయం జీవంలేని మట్టి వంటిది,
తనంత తానుగా ఏ మంచి, పవిత్రమైన వాక్యాల
సారాంశాన్నీ గుర్తించి గ్రహించ సమర్థురాలు కాదు.
నీవు విత్తువి, నీ అనుగ్రహంతో ప్రయత్నం వేగవంతమౌతుంది,
నీవే గనక మాకు సరియైన మార్గాన్ని చూపించకపొతే
దాన్ని ఏ మనిషీ కనుక్కోలేడు; నీవు మార్గదర్శనం చెయ్యి!
నా మనసులోకి ఎటువంటి ఆలోచనలు జొప్పిస్తావంటే
ఆ ప్రభావంతో నీ పవిత్రమైన అడుగుజాడలను
అనుసరించగల సమర్థత నాలో ఉద్భవిస్తుంది.
నాకున్న భాషాపరమైన సంకెలలను విడగొట్టు
నిన్ను స్తుతించగల సమర్థత నాకు చేకూరేట్టూ
నిను ఆచంద్రతారార్కం కీర్తించగలిగేటట్టూ.
.
(అనువాదం: విలియమ్ వర్డ్స్ వర్త్)
మైకేలేంజెలో
(March 1475 – 18 February 1564)
ఇటాలియన్ శిల్పి, కవి
Daniele da Volterra (Daniele Ricciarelli) (Italian, Volterra 1509–1566 Rome).Michelangelo Buonarroti (1475–1564), probably ca. 1544.Oil on wood; 34 3/4 x 25 1/4 in. (88.3 x 64.1 cm).The Metropolitan Museum of Art, New York, Gift of Clarence Dillon, 1977 (1977.384.1).http://www.metmuseum.org/Collections/search-the-collections/436771
The Supreme Being
.
The prayers I make will then be sweet indeed,
If Thou the spirit give by which I pray:
My unassisted heart is barren clay,
Which of its native self can nothing feed:
Of good and pious works. Thou art the seed,
Which quickens only where Thou say’st it may;
Unless Thou show to us Thine own true way,
No man can find it: Father! Thou must lead.
Do Thou, then, breathe those thoughts into my mind
By which such virtue may in me be bred
That in Thy holy footsteps I may tread;
The fetters of my tongue do Thou unbind,
That I may have the power to sing Thee,
And sound Thy praises everlastingly.
.
(Tr: William Wordsworth)
Michaelangelo Buonarroti
(March 1475 – 18 February 1564)
Italian sculptor, painter, architect and poet
https://archive.org/details/anthologyofworld0000vand/page/584/mode/1up
ఈ లోకంతో మనం అతిగా ప్రవర్తిస్తున్నాం… విలియమ్ వర్డ్స్ వర్త్, ఇంగ్లీషు కవి
వర్డ్స్ వర్త్ ప్రముఖ ప్రకృతి కవి. పారిశ్రామిక విప్లవం మనుషులలో తీసుకువచ్చిన భౌతికవాదానికి… అంటే ప్రకృతిని తన ఉనికికి మూలకారణమైన చేతన శక్తిగా కాక, తాత్కాలిక ప్రయోజనాన్ని కలిగించే వనరుగా చూడడం అతనికి నచ్చదు. ఈ భౌతిక సుఖాలవేటలో పడిన మనిషి దృశ్యమాన జగత్తులోని అందాలకి పరవశించి తన హృదయాన్ని ఉన్నతంగా చేసుకోగలిగే అవకాశాన్ని కోల్పోతున్నాడని అతని ఆరోపణ.
ఈ కవితలో “మనిషి తన తెలివితేటలని, జీవితాన్ని డబ్బుసంపాదనకి పణం పెట్టి, తను భాగమైన ఈ అనంతప్రకృతిని నాశనం చేస్తూ, కనీసం దాన్ని చూసి ఆనందించే అవకాశం కోల్పోతున్నాడు,” అని చెబుతున్నాడు. జ్ఞానవంతుడై ప్రకృతిని నాశనం చేసే నేటి ఈ స్థితికంటే, ఏ అనాగరిక జాతిలోపుట్టి,అజ్ఞానంలో మగ్గినా, ఈ ప్రకృతిని చూసి పరవశించే అవకాశం కోల్పోకపోవడమే ఉత్తమమని అతని భావన. మనం చేజేతులా వినాశనాన్ని కొనితెచ్చుకుంటున్నాం అని అతని వేదన.
ప్రగతి పేరుతో, భావితరాలపట్ల మన బాధ్యత కించిత్తుకూడా పట్టించుకోకుండా, ఉన్న ప్రకృతి వనరులన్నీ ఇప్పుడే దోచుకుందికి తాపత్రయపడుతున్న (ప్రపంచవ్యాప్తంగా) ప్రభుత్వాలూ, పారిశ్రామికవేత్తలూ ఉన్న ఈ రోజులు మనం గమనించినపుడు 200 సంవత్సరాల క్రిందట అతను రాసిన ఈ హృదయవేదన ఎంత సమంజసమైనదో మనం గ్రహించవచ్చు.
.
ఈ లోకంతో మనం అతిగా ప్రవర్తిస్తున్నాం, నాడూ నేడూ,
సంపాదనకీ, ఖర్చుపెట్టడానికే మన శక్తుల్ని వృధాచేసుకుంటున్నాం;
ప్రకృతిలో మనదంటూ ఏదీ గుర్తించలేకున్నాం;
మనహృదయాల్ని పణంపెట్టుకుని, క్షుద్రవరాల్ని ఇచ్చుకుంటున్నాం!
వెన్నెలకి తన హృదయాన్ని అర్పించుకుంటున్న ఈ సముద్రమూ
ఎల్లవేళలా తెరలుతెరలుగా వీచే ఈ చల్లగాలీ,
మనం ఇప్పుడు రాలిన పువ్వుల్లా ఏరుకుంటున్నాం.
దీనికి, ఆమాటకొస్తే ప్రతివిషయంలోనూ మనం గాడితప్పాం,
భగవంతుడా! మనల్ని ఏదీ కదిలించదు. నేను
అంతరించిన ఏ అనాగరికజాతిలో పుట్టినా విచారించను;
అప్పుడు నేను ఈ ఆహ్లాదకరమైన పచ్చికబీడులో నిలబడి
కనిపించే దృశ్యాలు నేను ఏకాకినన్న అనుభూతి కలిగించవు;
సముద్రంలోంచి ‘ప్రాటియస్ ‘అనేకరూపాల్లో ఉద్భవించడమూ చూస్తాను;
పురాణపురుషుడు ట్రైటన్ ఊదే శంఖనాదాన్నీ వినగలను.
.
విలియమ్ వర్డ్స్ వర్త్,
(7 April 1770 – 23 April 1850)
ఇంగ్లీషు కవి
The World is too much with us.
.
The world is too much with us; late and soon,
Getting and spending, we lay waste our powers;—
Little we see in Nature that is ours;
We have given our hearts away, a sordid boon!
This Sea that bares her bosom to the moon;
The winds that will be howling at all hours,
And are up-gathered now like sleeping flowers;
For this, for everything, we are out of tune;
It moves us not. Great God! I’d rather be
A Pagan suckled in a creed outworn;
So might I, standing on this pleasant lea,
Have glimpses that would make me less forlorn;
Have sight of Proteus rising from the sea;
Or hear old Triton blow his wreathèd horn.
.
William Wordsworth
(7 April 1770 – 23 April 1850)
English Poet
జూన్ నెలలో ఒక రాత్రి… విలియమ్ వర్డ్స్ వర్త్, ఇంగ్లీషు కవి
సూర్యుడెప్పుడో అస్తమించాడు
నక్షత్రాలు ఒక్కటొకటిగా మిణుకుమంటున్నాయి
చెట్లగుబురుల్లో
పిట్టలు ఇంకా రాగాలాపనలు అందుకోలేదు.
అక్కడొక కోయిల ఇక్కడ ఒక రెండు పాలపిట్టలూ
దూరాన్నుండి ఎగసివస్తున్న సుడిగాలి
పక్కనే పారుతున్న సెలయేటి పాట
ఒక్కసారిగా దిగంతాలవరకూ సాగుతూ
రోదసిని ముంచెత్తుతున్న కోయిల పాట…
ఇవన్నీ ఉంటే
ఎవడయ్యా ఇటువంటి జూన్ రాత్రిలో
ఆడంబరంగా లండను పోయేది?
మారువేషాలతో ఆటలాడేది?
అంత మెత్తని వెన్నలాంటి అర్థచంద్రుడూ
ఇంత ఖర్చులేని ఆనందాలూ దొరుకుతుంటే?
అందులో ఇంత చక్కని రాతిరి?
.
విలియమ్ వర్డ్స్ వర్త్
(7 ఏప్రిల్ 1770 – 23 ఏప్రిల్ 1850)
ఇంగ్లీషు కవి
.
A Night in June
(This Impromptu appeared, many years ago, among the Author’s poems, from which, in subsequent editions, it was excluded. It is reprinted at the request of the Friend in whose presence the lines were thrown off.)
The sun has long been set,
The stars are out by twos and threes,
The little birds are piping yet
Among the bushes and trees;
There’s a cuckoo, and one or two thrushes,
And a far-off wind that rushes,
And a sound of water that gushes,
And the cuckoo’s sovereign cry
Fills all the hollow of the sky.
Who would go “parading”
In London, and “masquerading,”
On such a night of June
With that beautiful soft half-moon,
And all these innocent blisses?
On such a night as this is!
.
William Wordsworth
(7 April 1770 – 23 April 1850)
English Poet
https://www.poetrynook.com/poem/night-june-3
పిల్లికూనల ఆట… విలియమ్ వర్డ్స్ వర్త్, ఇంగ్లీషు కవి
Today is 249th Birthday of William Wordsworth
ఆ గోడమీద పిల్లికూనలు కనిపిస్తున్నాయా
చక్కని వెలుతురుతో, హాయిగా ఉన్న ఈ ఉదయం
అతిచల్లని ప్రశాంతమైన వాతావరణంలో
ఎల్డర్ చెట్టునుండి ఒకటి… రెండు… మూడు…
ఒకటొకటిగా రాలుతున్న పండుటాకులతో
అవి ఆడుకుంటున్నాయి…
ఒకసారి గమనించు, ఓ పిల్లికూన ఎలా ప్రారంభించి
ఒళ్ళుకూడదీసుకుని, కాళ్ళు ఒక్కసారి సాగదీసి
పంజాతో నేలని దువ్వి ఒక్కసారి దూకుతోందో
పెద్దపులిలా ఒక దూకుదూకి రాలనున్న
తన వేటని మధ్యదారిలోనే అందుకుంటోంది,
అది ఎంత త్వరగా రాలినా ఫర్వాలేదు,
అది దాని గుప్పిట తప్పించుకోలేదు.
ఇప్పుడది మూడవ, నాల్గవ విన్యాసం చెయ్యబోతోంది
అలనాటి భారతదేశపు ఐంద్రజాలికుడిలా;
అతను తనకళలో ఎంత హస్తలాఘవం కనబరుస్తాడో
ఈ పిల్లికూన తనకేళిలో అంతచురుకుదనం చూపిస్తోంది;
అక్కడ వెయ్యిమంది ప్రేక్షకులుంటే ఉందురుగాక,
టాబీ వాళ్ళని ఎందుకు లక్ష్య పెడుతుంది?
.
విలియం వర్డ్స్ వర్త్
7 ఏప్రిల్ 1770 – 23 ఏప్రిల్ 1850
ఇంగ్లీషు కవి
.
The Kitten at Play
.
See the kitten on the wall,
Sporting with the leaves that fall,
Withered leaves, one, two and three
Falling from the elder tree,
Through the calm and frosty air
Of the morning bright and fair.
See the kitten, how she starts,
Crouches, stretches, paws and darts;
With a tiger-leap half way
Now she meets her coming prey.
Lets it go as fast and then
Has it in her power again.
Now she works with three and four,
Like an Indian conjurer;
Quick as he in feats of art,
Gracefully she plays her part;
Yet were gazing thousands there;
What would little Tabby care?
.
William Wordsworth
(7 April 1770 – 23 April 1850)
English Poet
Poem Courtesy: https://www.poetrynook.com/poem/kitten-play
నా మనసు ఎగిరి గెంతులేస్తుంది… విలియం వర్డ్స్ వర్త్, ఇంగ్లీషు కవి
ఆకాశంలో హరివిల్లు చూడగానే
నా మనసు ఎగిరి గెంతులేస్తుంది;
నేను పుట్టినపుడూ అలాగే ఉంది,
నేను పెద్దవాణ్ణి అయేకా అదే తీరు,
నేను ముసలివాణ్ణి అయినా అంతే,
నేను చనిపోయిన తర్వాత కూడా!
పసితనమే పెద్దరికాన్ని తీర్చిదిద్దుతుంది;
రాబొయే రోజులు ఒకదాని వెంట ఒకటి
అతి సహజంగా గడిచిపోవాలని భావిస్తున్నాను.
.
విలియం వర్డ్స్ వర్త్
(7 April 1770 – 23 April 1850)
ఇంగ్లీషు కవి
“My heart leaps up”
.
My heart leaps up when I behold
A rainbow in the sky;
So was it when my life began,
So is it now I am a man,
So be it when I shall grow old,
Or let me die!
The Child is father of the Man;
And I could wish my days to be
Bound each to each by natural piety.
.
William Wordsworth
(7 April 1770 – 23 April 1850)
English Poet
Poem Courtesy:
The World’s Best Poetry.
Eds: Bliss Carman, et al.,
Volume V. Nature. 1904.
- Nature’s Influence
నా ఆత్మను నిద్ర ఆవహించింది… విలియం వర్డ్స్ వర్త్, ఇంగ్లీషు కవి
నా ఆత్మని నిద్ర ఆవహించింది
నాకిపుడు ఏ లౌకిక బాధలూ లేవు
దొర్లిపోతున్న కాలాన్ని ఇపుడామె
గుర్తించగల స్థితిలో లేదు .
ఆమెలో చలనం లేదు, జీవం లేదు
ఆమె చూడనూ లేదు, విననూ లేదు;
భూమి మీది రాయి-రప్పా, చెట్టు-చేమతో పాటు
ఇక అహరహమూ పరిభ్రమిస్తూనే ఉంటుంది
.
విలియం వర్డ్స్ వర్త్
7 April 1770 – 23 April 1850
ఇంగ్లీషు కవి
A Slumber Did My Spirit Seal
.
A slumber did my spirit seal;
I had no human fears:
She seem’d a thing that could not feel
The touch of earthly years.
No motion has she now, no force;
She neither hears nor sees;
Roll’d round in earth’s diurnal course
With rocks, and stones, and trees.
.
William Wordsworth
7 April 1770 – 23 April 1850
English Poet
మొర… విలియం వర్డ్స్ వర్త్, ఇంగ్లీషు కవి
అంతా మారిపోయింది… నేను పేదనైపోయాను;
మొన్న మొన్నటి వరకూ, నీ ప్రేమ
నా హృదయ కవాటం ముందు
ప్రవహించడమే తన ధర్మంగా ఉండేది.
నా అవసరం, దాని ఔదార్యం అన్న
ఆలోచన లేకుండా అనంతంగా ప్రవహించింది.
ఎన్ని మధుర క్షణాలు లెక్కపెట్టుకుంటూ గడిపేను!
కైవల్యాన్ని మించిన ఆనందంలో మునకలేశాను నేను!
గలగలా, తళతళా, నిత్య చైతన్యంతో
ప్రవహించిన పవిత్రమైన ప్రేమకు బదులు, ఇప్పుడు,
నా దగ్గర ఏముంది? ఏముందని ధైర్యంగా చెప్పను?
పాడుబడి, అగాధమైన,
అగోచరమైన దిగుడుబావి తప్ప!
ఒక ప్రేమామృతపు చెలమ… బాగా లోతుగా ఉండొచ్చు…
అది ఎన్నటికీ ఇంకిపోదని నమ్ముతున్నాను.
అయినా పెద్దతేడా ఏముంది, అక్కడి ఊట
లోలోపలే నిశ్చలంగా, అందుబాటులో లేనపుడు?
అదిగో, ఆ మార్పే, అదీ నా గుండె కవాటం ముందు
నన్ను నిరుపేదను చేసింది.
.
విలియం వర్డ్స్ వర్త్
7 April 1770 – 23 April 1850
ఇంగ్లీషు కవి .
.
.
A Complaint
.
There is a change–and I am poor;
Your love hath been, not long ago,
A fountain at my fond heart’s door,
Whose only business was to flow;
And flow it did; not taking heed
Of its own bounty, or my need.
What happy moments did I count!
Blest was I then all bliss above!
Now, for that consecrated fount
Of murmuring, sparkling, living love,
What have I? Shall I dare to tell?
A comfortless and hidden well.
A well of love–it may be deep–
I trust it is,–and never dry:
What matter? If the waters sleep
In silence and obscurity.
–Such change, and at the very door
Of my fond heart, hath made me poor.
— William Wordsworth
.
గరికలో మిలమిల… వర్డ్స్ వర్త్, ఇంగ్లీషు కవి.
ఒకప్పుడు ఎంతో అందంగా ఉండి
మిలమిలలతో మెరిసిన దాని అందం
మనకళ్ళముందునుండే మాయమైతే నేమి?
గరికలో మెరిసిన
ఆ పువ్వు సౌరభమూ, మెరుపులూ
ఆ క్షణాలూ ఇక తిరిగి రాకపోయినా
మనమేమీ బాధపడము. బదులుగా
అది విడిచివెళ్ళిన దానిలోనుండి ఏదోధైర్యాన్నీ
అనాదిగా మనసు స్పృశించే సానుభూతి పంచుకుంటాం…
మానవ హృదయంలో బాధలు చూస్తున్నపుడు
అసంకల్పితంగా చిప్పిలే ఆత్మీయ అనుభూతి అది
ఒక సారి పొందిన అనుభూతి శాశ్వతంగా ఉంటుంది;
అదే విశ్వాసం మృత్యువును చూస్తున్నపుడూ కలుగుతుంది.
కాలం మనకి క్రమంగా కలిగే తాత్త్విక వివేచన అది.
.
విలియం వర్డ్స్ వర్త్
(7 April 1770 – 23 April 1850)
ఇంగ్లీషు కవి.
.
.
Splendour in the Grass
.
What though the radiance
which was once so bright
Be now for ever taken from my sight,
Though nothing can bring back the hour
Of splendour in the grass,
of glory in the flower,
We will grieve not, rather find
Strength in what remains behind;
In the primal sympathy
Which having been must ever be;
In the soothing thoughts that spring
Out of human suffering;
In the faith that looks through death,
In years that bring the philosophic mind.
.
William Wordsworth
(7 April 1770 – 23 April 1850)
English Romantic Poet
మేం ఏడుగురం … వర్డ్స్ వర్త్
(బహుశా వర్డ్స్ వర్త్ రాసిన కవితలన్నింటిలో అత్యంత ప్రాచుర్యం పొందినదీ, అత్యంత హేళనకు గురి కాబడిందీ కూడా ఈ కవితేననుకుంటాను. ఇందులో కవిత్వం లేదని సమకాలీన విమర్శకులు గేలి చేసినా, కవిత్వీకరణలేదని ఈసడించినా, ఈ కవితలోని సౌందర్యం సంభాషణ మాధ్యమంలో అందజేసిన అపురూపమైన ఆధ్యాత్మిక చింతనా సరళిగా తర్వాతి తరం వారు ఎంతో మెచ్చుకున్నారు.
అంతర్యుధ్ధాలూ, మతయుధ్ధాలూ, ఫ్రాన్సుతో వందేళ్ళ యుధ్ధం, సింహాసనం వారసత్వం కోసం పోరాటాలూ, అనైతిక వర్తనకి రోజుకి కనీసం ఇద్దరికి బహిరంగ మరణ శిక్ష అమలు పరచడం, శిశుమరణాలు అత్యధికంగా ఉండే ఆ శతాబ్దాల్లో మృత్యువు చుట్టూ కవిత్వం తిరగడం లో అతిశయోక్తి లేదు. ఈ నేపధ్యం గుర్తుంచుకుంటే ఈ కవితని ఇంకా బాగా ఆస్వాదించవచ్చు.)
.
అమాయకపు పిల్ల,
ఇప్పుడిప్పుడే ఊపిరి తియ్యడం నేర్చింది,
అవయవాల్లో జవజీవాలిప్పుడిప్పుడే గ్రహిస్తోంది,
పాపం! దానికి చావు అంటే ఏం తెలుస్తుంది ?
*
నేను గుడిసెలో ఉండే ఓ పిల్లని కలిసేను,
తనకి ఎనిమిదేళ్ళని చెప్పింది,
ఉంగరాలు తిరిగిన ఆమె జుట్టు,
తలచుట్టూ ఒత్తుగా అమరి ఉంది.
.
ఆమె చూడ్డానికి వన బాలికలా ఉంది,
ముతక బట్టలు వేసుకుని,
కళ్ళు విశాలంగా, అందంగా ఉన్నాయి,
ఆమె అందం నాకెంతో ఆనందాన్నిచ్చింది
.
‘అన్నదమ్ములూ, అప్పచెల్లెళ్ళూ, మీరెంతమందో?’,
‘అన్నదమ్ములూ అప్పచెల్లెళ్ళమా?
మేమేడుగురం,’ అందా అమ్మాయి,
నా వంక ఆశ్చర్యంగా చూస్తూ
.
‘అయితే వాళ్లెక్కడున్నారు? చెప్పమ్మా?’,
అంటే ఆమె చెప్పింది: ‘మేం ఏడుగురం,
ఇద్దరు కాన్వేలో ఉంటారు,
ఇద్దరు సముద్రం మీదకి వెళ్ళేరు
.
‘ఇద్దరు చర్చి పెరడులో ఉన్నారు,
నా అక్కా తమ్ముడూ,
ఈ చర్చి గుడిసెలో నేను
వాళ్ళకి దగ్గరగా అమ్మతో ఉంటాను ‘
.
‘ఇద్దరు కాన్వే లో ఉంటునా రంటున్నావు,
ఇద్దరు సముద్రం మీదకి వెళ్ళే రంటున్నావు,
అయితే బంగారు తల్లీ, నువ్వు చెప్పు
మీరు ఏడుగురెలా అయ్యేరో?’
.
‘అప్పుడా పిల్ల అన్నాది గదా,
‘మేము మొత్తం ఏడుగురు అన్నదమ్ములూ, అప్పచెల్లెళ్ళం,
ఇద్దరు చర్చి పెరట్లో ఉన్నారు,
అదిగో ఆ చెట్టు క్రింద సమాధిలో’
.
‘ఓసి పిల్లా! నువ్వు పరిగెడతావు,
ఆడుతూ పాడతావు.
ఇద్దరు సమాధిలో ఉంటే,
మరి మీరు అయిదుగురే కదా?’
.
‘ఆ సమాధులింకా కొత్తవే, మీరు చూడొచ్చు,’
ఆ పిల్ల అంది, ‘మహా అయితే
మా గుమ్మం దగ్గిరనుండి పన్నెండడుగులు,
రెండూ పక్క పక్కనే ఉన్నాయి కూడా.’
.
‘నేను నా మేజోళ్ళు అక్కడే అల్లుకుంటుంటాను,
నా చేతి రుమాలు కూడ అక్కడే మడిచి కుట్టుకుంటుంటాను;
అక్కడే నేను నేల మీద కూచుని,
వాళ్లకి పాటలు పాడతాను కూడా.
.
‘సాధారణంగా, సూర్యాస్తమయం అయ్యేక,
వెలుతురింకా చిక్కగా ఉండగానే,
నా అంబలి అక్కడికే తీసుకెళ్ళి,
అక్కడే భోజనం చేస్తుంటాను.
.
‘ముందు చనిపోయింది అక్క జేన్,
పాపం పక్కమీద బాధతో మూలుగుతుండేది,
దేముడు దయతలచి దానిని బాధలనుండి తప్పించేడు,
అందుకని అది వెళిపోయింది.
.
‘అందుకని ఆమెని చర్చి పెరట్లోనే పడుక్కోబెట్టేం.
ఎండలు వచ్చి, గడ్డి పొడిగా ఉన్నప్పుడు,
నేనూ, తమ్ముడు జాన్,
ఆమె సమాధిచుట్టూ పరిగెత్తి ఆడుకునే వాళ్ళం.
.
‘మంచు కురవడం ప్రారంభించి,
అందులో మేం జారడం ప్రారంభించేక,
తమ్ముడు జాన్ కూడా వెళ్ళిపోయేడు,
వాడు కూడా ఆమె పక్కనే పడుక్కున్నాడు ‘
.
‘మరలాంటప్పుడు, వాళ్ళిద్దరూ స్వర్గంలో ఉంటే
మీరెంతమంది?’ నేనడిగాను,
వెంటనే వచ్చింది సమాధానం అమె దగ్గరనుండి,
‘దొరా! మేం ఏడు మందిమి.’
.
‘కానీ వాళ్ళిద్దరూ చనిపోయారు,
వాళ్ళ ఆత్మలు స్వర్గం లో ఉన్నాయి!’
నేను మాటలు పారేసుకోవడం తప్ప ప్రయోజనం లేదు,
ఆ పిల్ల అభిప్రాయమేం మారలేదు,
అంటుంది కదా మళ్ళీ, ‘ఏం కాదు. మేం ఏడుగురమే!’
.
వర్డ్స్ వర్త్
.
We Are Seven
.
A simple child,
That lightly draws its breath
And feels its life in every limb,
what should it know of death?
.
I met a little cottage girl:
she was eight years old, she said;
Her hair was thick with many a curl
That clustered round her head.
.
she had a rustic, woodland air,
And she was wildly clad;
Her eyes were far, and very fair;
—-Her beauty made me glad.
.
‘Sisters and brothers, little Maid,
How many may you be?’
‘How many? Seven in all,’ she said,
And wondering look’d at me.
.
‘And where are they? I pray you tell.’
She answered, ‘Seven are we;
And two of us at Conway dwell,
And two are gone to sea.
.
‘Two of us in churchyard lie,
My sister and my brother;
And in the churchyard cottage I
Dwell near them with my mother.’
.
‘You say that two at Conway dwell.
And two are gone to sea,
Yet you are seven!— I pray you tell,
Sweet Maid, how this may be?’
.
Then did the little Maid reply,
‘Seven boys and girls are we;
Two of us in the churchyard lie,
Beneath the churchyard tree.’
.
‘You run about. my little Maid,
Your limbs they are alive;
If two are in the churchyard laid,
Then ye are only five?’
.
‘Their graves are green, they may be seen,’
The little maid replied;
‘Twelve steps or more from my mother’s door,
And they are side by side.
.
My stockings there I often knit,
My kerchief there I hem;
And there upon the ground I sit,
And sing a song to them.
.
‘And often after sunset, Sir,
When it is light and fair,
I take my little porringer,
And eat my supper there.
.
‘The first that died was sister Jane;
In bed she moaning lay,
Till God released her of her pain;
And then she went away.
.
‘So in the churchyard she was laid;
And when the grass was dry,
Together round her grave we play’d,
My brother John and I.
.
‘And when the ground was white with snow
And I could run and slide,
My brother John was forced to go’
And he lies by her side.’
.
‘How many are you, then,’ said I,
‘If they two are in heaven?’
Quick was the little Maid’s reply,
‘O Master! we are seven.’
.
‘But they are dead; those two are dead!
Their spirits are in heaven!’
‘Twas throwing words away; for still
The little Maid would have her will,
And said, ‘Nay, we are seven!’
.
William Wordsworth.
1798.
ఒంటరి కోతగత్తె … వర్డ్స్ వర్త్
- Image Courtesy: https://s3.amazonaws.com