అనువాదలహరి

సానెట్ 10…. షేక్స్పియర్

ఇది షేక్స్పియర్ 400వ వర్థంతి సంవత్సరం

(ఈ సానెట్ లు వివాహానికి విముఖత చూపించే అందమైన యువకుణ్ణి ఉద్దేశించి రాసినవి)

సిగ్గు సిగ్గు! ఎవరిమీదా నీకు ప్రేమలేదని ఒప్పుకో

నువ్వంటే ఇష్టపడని తెలివితక్కువవాళ్ళెవరుంటారు?

నిన్ను ఇష్టపడే వాళ్లు అసంఖ్యాకం, నికిష్టమయితే ఒప్పుకో.

కానీ, నీకు ఎవరిమీదా ప్రేమ లేదన్నది మాత్రం స్పష్టం.

నీకు అందరిపట్లా ఎంత ఏవగింపు అంటే,

నిన్నుకూడా నువ్వు ద్వేషించుకుందికి వెనుకాడవు.

మీ వంశాన్ని నిలబెట్టడం ఎలాగా అని కోరుకోవడం పోయి

దానిని అంతం చెయ్యాలని కోరుకుంటున్నావు.

విను! నా మనసు మారకముందే, నీ మనసు మార్చుకో!

ప్రేమనిలబడని చోట ద్వేషం మాత్రం శాశ్వతంగా ఉంటుందా?

నీ వైఖరి ఎంత ఉదాత్తమో అంత ఉదాత్తంగా, దయగా ఉండు,

కనీసం నీపట్లైనా నువ్వు ఉదారంగా ఉన్నావని ఋజువుచేసుకో.

కనీసం నా మీద ప్రేమతోనైనా పిల్లల్ని కను.

నీలోనూ, నీ ప్రతిరూపంలోనూ సౌందర్యం నిలిచేలా.

.

షేక్స్పియర్

 

.

William Shakespeare

.

 

.

SONNET 10

For shame deny that thou bear’st love to any,

Who for thyself art so unprovident.

Grant, if thou wilt, thou art beloved of many,

But that thou none lovest is most evident;

For thou art so possess’d with murderous hate

That ‘gainst thyself thou stick’st not to conspire.

Seeking that beauteous roof to ruinate

Which to repair should be thy chief desire.

O, change thy thought, that I may change my mind!

Shall hate be fairer lodged than gentle love?

Be, as thy presence is, gracious and kind,

Or to thyself at least kind-hearted prove:

    Make thee another self, for love of me,

    That beauty still may live in thine or thee.

.

 

http://www.shakespeare-online.com/sonnets/10.html

 

 

నటజీవితానికి వేదనతో మిత్రుడికి లేక… షేక్స్పియర్, ఇంగ్లీషు కవి

ఇది షేక్స్పియర్ 400 వ వర్ధంతి సంవత్సరం

.

నా కృషికి తగిన ఫలాన్నందించలేని దోషి
అదృష్టాన్ని నా కోసం తట్టిలేపుతున్నావా మిత్రమా!
నా జీవితానికి పదిమందినీ అర్థించడం తప్ప
ఏదీ దొరకలేదు; నా ప్రవర్తన కూడా అందుకే అలా.
అందువల్లనే, నా పేరుకీ ఒక ముద్ర పడిపోయింది,
అప్పటి నుండే నా నడవడికూడా మెతకబడింది,
రంగుల్లో నానీ నానీ కలంకారుడి చెయ్యి రంగుదేరినట్టు.
నన్ను కనికరించు! నాకీ జీవితం మీద విసుగేస్తోంది;
ఈ మహత్తరమైన రోగానికి నువ్వు ఏ కషాయమిచ్చినా,
ఇష్టపడి సేవించే రోగిలా, దాన్ని తీసుకుందికి సిద్ధం,
అది ఎంతచేదు సలహా ఐనా నిన్ను తప్పుగా తీసుకోను
ఒక తప్పుకి మరో తప్పు చేస్తున్నానే అని విచారించను కూడా.

మిత్రమా! నాపై జాలిచూపించు! నీకు మాట ఇస్తున్నా,
నీ కనికరం చాలు! అదే నాకు నయం చేస్తుంది.
.
షేక్స్పియర్

29 ఏప్రిల్ 1564 – 23 ఏప్రిల్ 1616

ఇంగ్లీషు కవి

 William Shakespeare

.

The Poet Laments to a Friend His Profession as an Actor

O, FOR my sake do you with Fortune chide,      

The guilty goddess of my harmful deeds,  

That did not better for my life provide      

Than public means, which public manners breeds.       

Thence comes it that my name receives a brand, 

And almost thence my nature is subdued  

To what it works in, like the dyer’s hand. 

Pity me then, and wish I were renewed;     

Whilst, like a willing patient, I will drink  

Potions of eysell ’gainst my strong infection:             

No bitterness that I will bitter think,

Nor double penance, to correct correction.

  Pity me then, dear friend, and I assure ye,        

  Even that your pity is enough to cure me.  

.

William Shakespeare (1564–1616)

The Book of the Sonnet.  1867.

Hunt and Lee, comps. 

 http://www.bartleby.com/341/15.html

Note:

This sonnet, though it has one admirable passage,—about the dyer’s hand,—is not selected on account of its superiority to the general run of the author’s compositions of this kind, but because Shakespeare is here “unlocking his heart,” and because all his sonnets appear to have been written after he had entered upon a line of life for which he and others had not yet procured its just social consideration.

          “Public means, which public manners breeds”

is very harsh versifying,—to say nothing of the bad grammar, which was a license of the time. And the concluding rhyme “assure ye” and “cure me,” is no rhyme. The nature

                          “subdued

To what it works in, like the dyer’s hand”

is true Shakespearian writing.

  I have noticed the faulty passages, because cultivators of the Sonnet must not be misled, even by Shakespeare. He can afford to err, where it would be presumption to follow him.

  “Eysell” is vinegar. Etymologists—in whose way so small a thing as a consonant is never allowed to stand—derive the word from the German Essig,—vinegar.

ఎండ మెరుగు (Sonnet 33)…విలియం షేక్స్పియర్, ఇంగ్లీషు కవి

ఇది షేక్స్పియర్ 400 వ వర్ధంతి సంవత్సరం

మహోత్తుంగ నగాగ్రాలకి రాచ ఠీవినలదుతూ 

పచ్చని తరులతానికుంజములకు పసిడిచాయ నద్దుతూ

వన్నెవెలిసిన సెలయేటి నీటికి నాకధునీరుచు లద్దుతూ 

అరుణరాగరంజితమైన మహత్తర సూర్యోదయాలనెన్నిటినో చూసేను;  

అంతలోనే, అతని అలౌకిక తేజోమయ వదననాన్ని ఆచ్చాదిస్తూ 

నిమ్న,కుటిల వారివాహనివహాలను అనుమతించడమూ చూశాను.

ఈ ప్రపంచాన్ని పరిత్యజించి, విరక్తితో, ముఖం చాటుచేసుకుని 

కళంకిత భారంతో అపరాద్రి చేరుకోవడమూ చూశాను.

అయినప్పటికీ, ఒకరోజు ప్రభాతవేళ నా కనుబొమలపై

ఈ స్నేహితుడు ఎదురులేని వెలుగులతో ఒక్కసారి మెరిసాడు.  

అంతే! అలా ఒక గంట సేపే అతని పొందు నే పొందగలిగింది

అతన్ని నానుండి అక్కడి మేఘాలగుంపు దూరం చేసింది.

అంత మాత్రం చేత అతన్ని ఇసుమంతైనా తప్పుపట్టను.

ఈ లోకంలో సూర్యుడున్నంతసేపూ పురుషులు శ్రమింతురుగాక!

.

విలియం షేక్స్పియర్

 ఏప్రిల్ 26, 1564 – ఏప్రిల్ 23, 1616

ఇంగ్లీషు కవి

 

 William Shakespeare

Short Sunshine (Sonnet 33)

.

Full   many a glorious morning have I seen      

Flatter the mountain tops with sovran eye,       

Kissing with golden face the meadows green,  

Gilding pale streams with heavenly alchemy;  

Anon permit the basest clouds to ride     

With ugly rack 2 on his celestial face,     

And from the forlorn world his visage hide,      

Stealing unseen to west with this disgrace.      

E’en so my sun one early morn did shine

With all-triumphant splendour on my brow;      

But out, alack! he was but one hour mine,        

The region cloud hath masked him from me now.     

Yet him for this my love no whit disdaineth;     

Suns of the world may stain when heaven’s sun staineth.  

.

William Shakespeare

(1564–1616)

Poem Courtesy:

The Book of Elizabethan Verse.  1907.

Ed.  William Stanley Braithwaite

http://www.bartleby.com/331/15.html

 

ఇహ మన సంబరాలు ముగిసినట్టే … షేక్స్పియర్, ఇంగ్లీషు కవి

ఇది షేక్స్పియర్ 400 వర్థంతి సంవత్సరం

 

సాహిత్యం మానవజీవితపు అపురూపమైన సంపదను దాచుకునే అందాల భరిణె అనుకుంటే, దానిలో … రాగద్వేషాలూ, భావోద్వేగాలూ, చేతనాచేతనావస్థలూ….ఒకటేమిటి జీవితపు ఏ పార్శ్వాన్నీ విడిచిపెట్టకుండా, ఏ పాత్రతోనూ మమేకమవకుండా, అన్ని పాత్రలకీ సమన్యాయంచేస్తూ సృష్టించిన వస్తుసముదాయపు శిల్పి … షేక్స్పియర్. ఏ భాషకు ఆ భాషలోనే సాటిలేని మహాకవులూ, సాహిత్యకారులూ ఉన్నా, దేశకాల పరిమితులకి అతీతంగా అన్నిభాషలవారిచే తనకావ్యసృష్టికి మన్ననలను అందుకోగలిగిన కవి షేక్స్పియర్. కవిత్వం ఆ రోజుల్లో (మన కాళిదాసు శకంలో లాగే) నాటకంద్వారా మాత్రమే ప్రకటించబడేది. అందుకే సానెట్స్ వంటివి తప్ప, ప్రత్యేకంగా “ఖండకావ్యాల” వంటి కవిత్వ సృష్టి అతనిది కనిపించదు.

కవి ఎప్పుడూ నశ్వరమైన ఈ జీవితం గురించిన ఎరుకలేకుండా ఉండకూడదు. అది అతన్ని నేలమీద ఉంచుతుంది. అత్యాశకీ, దురహంకారానికి తావులేకుండా చేస్తుంది. షేక్స్పియర్ నాటకాలలో ఏ చిన్న అవకాశం వచ్చినా ఈ సత్యాన్ని చెప్పడానికి అతను వెనుకాడలేదు. ఎన్నిసార్లు చెప్పినా, ఎప్పుడూ కొత్తదనంతో, కొత్త ప్రతీకలతో, పదబంధాలతోనే చెప్పాడు. 

***

ఇహ మన సంబరాలు ముగిసినట్టే… మన ఈ పాత్రధారులు

మీకు ఇంతకు ముందే చెప్పినట్టు, అవన్నీ కేవలం ప్రేతాత్మలు,

అంతా గాలిలో కరిగిపోయాయి;గాలిలో కలిసిపోయాయి:

నిరాధారమై శూన్యంలో వేలాడే ఈ మిధ్యా ప్రపంచంలా,

మేఘాచ్చాదితాలైన మహోన్నత భవనశిఖరాగ్రాలూ,

శోభాయమానములైన అంతః పురాలూ,

భక్తితత్పరతతో నిండిన దేవాలయాలూ,

అసలు ఈ చరాచరజగత్తుతో కూడిన భూమండలం యావత్తూ,

అది వారసత్వంగా తెచ్చుకున్న అన్నిసంపదలతోనూ

నిస్సందేహంగా, నామరూపాలు లేకుండా అంతరించిపోతుంది,

రూపురేఖలు లేని ఈ ఉత్సవంలాగ మటుమాయమౌతుంది,

ఒట్టుకి లేశమాత్రపు అవశేషమైనా మిగలదు.

మనందరం కలలకి తోబుట్టువులమి,

మనజీవితాలు మృత్యువుతో పరిపూర్ణమౌతాయి.

.

షేక్స్పియర్

26 ఏప్రిల్ 1558- 23 ఏప్రిల్ 1616

ఇంగ్లీషు కవి

 William Shakespeare

.

Our Revels Now Are Ended

.

Our revels now are ended

Our revels now are ended. These our actors,

As I foretold you, were all spirits and

Are melted into air, into thin air:

And, like the baseless fabric of this vision,

The cloud-capp’d towers, the gorgeous palaces,

The solemn temples, the great globe itself,

Yea, all which it inherit, shall dissolve

And, like this insubstantial pageant faded,

Leave not a rack behind. We are such stuff

As dreams are made on, and our little life

Is rounded with a sleep.

(from : ‘The Tempest’, Act IV, Scene i.)

.

William Shakespeare

26 April 1564 (baptised) – 23 April 1616

English Poet

పోర్షియా చిత్రపటం… విలియం షేక్స్పియర్, ఇంగ్లీషు కవి

 

ఇది షేక్స్పియర్ 400 వ వర్థంతి సంవత్సరం 

ఇది పోర్షియా సుందరి ప్రతిమా? ఏ దివ్యాంశ సంభూతుడు

సృష్టికి అతిదగ్గరగా రాగలిగేడు? ఆ కళ్ళు కదుల్తున్నాయా?

లేక, నా కనుగుడ్లమీద కదులుతూ అవి కదులుతున్నట్టు

అనిపిస్తోందా? అవిగో విప్పారిన పెదాలు,

మధురమైన శ్వాసతో దూరమయ్యాయి; ఎంత అందమైన పలువరుస

అంత ప్రియమైన స్నేహితులని ఎడబాయ వలసివచ్చిందో గదా!

ఇవిగో ఆమె కురులు, చిత్రకారుడు సాలీడులా ఆడుకున్నాడు;

పురుషుల హృదయాలను కొల్లగొట్టడానికి పసిడివన్నె వల అల్లేడు,

సాలెగూడులో దోమకన్నా తొందరగా చిక్కుకునేలా: ఓహ్, ఏమి ఆమె కనులు!

అసలు ఆ రెండిటినీ వెయ్యడానికి ఎలా చూడగలిగేడు? ఒక కన్ను గీసేక,

నా ఉద్దేశంలో దానికి అతని రెండుకళ్ళనూ లోబరచుకునే శక్తి ఉంటుంది,

ఆ మోహంలో ఇక ఈ చిత్రం ఎన్నటికీ పూర్తికానీకుండా చేస్తూ …

.

(వెనిస్ నగర వర్తకుడు నాటకం- 3వ అంకం, దృశ్యం 2 నుండి)

విలియం షేక్స్పియర్

ఇంగ్లీషు కవి

William Shakespeare.

Portia’s Picture

FAIR Portia’s counterfeit? What demi-god         

Hath come so near creation? Move these eyes?  

Or whether, riding on the balls of mine,    

Seem they in motion? Here are severed lips,       

Parted with sugar breath; so sweet a bar   

Should sunder such sweet friends. Here in her hairs     

The painter plays the spider; and hath woven    

A golden mesh to entrap the hearts of men,        

Faster than gnats in cobwebs: but her eyes!—    

How could he see to do them? having made one,

Methinks it should have power to steal both his,

And leave itself unfurnished.

(From “The Merchant of Venice,” Act III. Sc. 2.)

.

William Shakespeare

(1564–1616)

The World’s Best Poetry.

Bliss Carman, et al., eds. 

Volume II. Love.  1904.

  1. Admiration

http://www.bartleby.com/360/2/10.html

సానెట్ 106- షేక్స్పియర్

ఇది షేక్స్పియర్ 400వ వర్ధంతి సంవత్సరం

***

మిత్రులకీ, నా  బ్లాగు సందర్శకులకీ  సంక్రాంతి శుభాకాంక్షలు

వృధాగా గడిపిన కాలాన్ని చరిత్రకెక్కించినపుడు
అందులో అందమైన వ్యక్తుల వివరాలు చదువుతున్నప్పుడు
మరణించిన అందమైన స్త్రీలనూ, వీరులనూ పొగుడుతూ
అందాన్ని, అందంగా మలిచిన కవిత్వం చదివినపుడు…
అందమైన వ్యక్తుల చేతుల్నీ, పాదాల్నీ, పెదాల్నీ,
కళ్ళనీ, కనుబొమల్నీ సొగసుగా చేసిన ఆ వర్ణనలలో,
అంత ప్రాచీన కవులూ, వాళ్ళ ఊహలలో చెప్పింది
చాలవరకు ఇప్పుడు నీ సొమ్మయిన అందమని తెలుస్తోంది.
కనుక, వాళ్ళ పొగడ్తలన్నీ కేవలం భవిష్యవాణులు
ఈ కాలంలో మూర్తీభవించిన నిన్ను, కల్పనతో చెప్పినవి;
వాళ్ళు ఖచ్చితంగా దివ్య చక్షువులతో చూసి ఉంటారు
నీ గుణాల్ని పొగడడానికి, తగిన శక్తి వాళ్ళకి లేదు;
కాని, ఈ కాలంలోపుట్టి నిను స్వయంగా చూడగలుగుతున్నా మాకు
ఆశ్చర్యపోగల కళ్ళయితే ఉన్నాయి, పొగడగల శబ్దచాతురే లేదు.

 .

 షేక్స్పియర్

ఇంగ్లీషు కవి

 

.

Sonnet CVI.

.

When in the chronicle of wasted time

I see descriptions of the fairest wights,

And beauty making beautiful old rhyme,

In praise of ladies dead, and lovely knights;

Then, in the blazon of sweet beauty’s best

Of hand, of foot, of lip, of eye, of brow,

I see their antique pen would have expressed

Even such a beauty as you master now.

So all their praises are but prophecies

Of this our time, all you prefiguring;

And, for they looked but with divining eyes,

They had not skill enough your worth to sing;

  For we, which now behold these present days,

  Have eyes to wonder, but lack tongues to praise.

.

William Shakespeare

26 April 1564 (baptised) – 23 April 1616

English Poet

సానెట్ 8… షేక్స్పియర్

ఇది షేక్స్పియర్ 400 వ వర్ధంతి సంవత్సరం

***

వినగల మధురగీతమున్నప్పుడు, విషాదగీతమేలవినాలి?

తియ్యందనాలు పోట్లాడుకోవు, ఒకదాని సన్నిధిలో ఒకటి అతిశయిస్తాయి

నీకు ఆనందంతో సమర్పింపబడనిదాన్ని బలవంతంగా ప్రేమించడమెందుకు?

నీకు చిరాకుకలిగించేదాన్ని ప్రేమగా స్వాగతించడమెందుకు?

ఒద్దికగా కలగలిసిన స్వర అనుస్వరాలమేళవింపు

వాటి సమాగమం నీ చెవులకు ఇంపుగా వినిపించడంలేదంటే,

ఒంటరితనంలో భరించవలసి వస్తున్న విషయాలకూ

ఆ భ్రమకు… నిన్ను సుతిమెత్తగా మందలిస్తున్నాయన్నమాట.

ఒకసారి గమనించు, ఒక తీగ, రెండవదానికి సరిగ్గా తగిన జోడీ

ఒకదాని నొకటి ప్రోత్సహించుకుంటూ రాగమధురమౌతున్నాయి.

తండ్రీ, బిడ్డా, పరవశించే మాతృమూర్తిలా

అన్నీ కలిసి ఏక స్వరంతో వీనులకి విందుచేస్తున్నాయి.

భాషలేనట్టు కనిపిస్తున్న ఆ గీతాలు అంతర్లీనంగా

నీకు వినిపిస్తున్నదిది: “ఒంటరివై నువ్వు సాధించేది శూన్యం”

.

విలియం షేక్స్పియర్

ఇంగ్లీషు కవి

William Shakespeare

 

Sonnet VIII

.

Music to hear, why hear’st thou music sadly?
Sweets with sweets war not, joy delights in joy:
Why lov’st thou that which thou receiv’st not gladly,
Or else receiv’st with pleasure thine annoy?
If the true concord of well-tuned sounds,
By unions married, do offend thine ear,
They do but sweetly chide thee, who confounds
In singleness the parts that thou shouldst bear.
Mark how one string, sweet husband to another,
Strikes each in each by mutual ordering;
Resembling sire and child and happy mother,
Who, all in one, one pleasing note do sing:
Whose speechless song being many, seeming one,
Sings this to thee: ‘Thou single wilt prove none.

.

William Shakespeare

Courtesy:

http://www.shakespeares-sonnets.com/sonnet/8

 

సానెట్- 100 షేక్స్పియర్, ఇంగ్లీషు కవి

ఇది షేక్స్పియర్ 400వ వర్థంతి సంవత్సరం

ఎక్కడున్నావు కవితా, చాలరోజులయింది మమ్మల్ని మరిచావా?

నీకు ఈ శక్తి అంతా ఎక్కడనుండి వస్తుందో వివరించవా?

నీ ఆవేశాన్ని అర్హతలేనివాటికి వినియోగిస్తున్నావా?

హీనమైన వస్తువు ప్రచారానికి నీ శక్తిని ధారపోస్తున్నావా?

ఓ మతిభ్రమించిన కవితా! నీ కీర్తి పునరుద్ధరించుకో

కాలాన్ని నిష్ప్రయోజనంగా దుర్వినియోగంచేసిన అపవాదునుండి;

ఏదీ, నీ గౌరవం ఇనుమడింపజేసే గీతాల్ని ఇంపుగా ఆలపించు

నీ కలానికి పదునునీ, వివేకాన్ని తిరిగి ప్రసాదించు.

లే! తీసుకున్న విశ్రాంతి చాలు! నా ప్రేమిక వదనాన్ని పరికించు

అక్కడ కాలం వృద్ధాప్యచాయలు అద్దుతోందేమో గమనించు,

అలాచేసి ఉంటే, నిర్దాక్షిణ్యంగా పరిహరించు; అంతేకాదు,

కాలం చేసిన వికృతచేష్టని సర్వత్రా అందరూ గర్హించేలా చెయ్యి.

కాలం జీవితాన్ని హరించేగతికి మిన్నగా నా ప్రేమికకు కీర్తినివ్వు

దాని పదునునీ, వంకరలనీ నీ శక్తి అధిగమించుగాక!
.
విలియం షేక్స్పియర్

ఇంగ్లీషు కవి

William Shakespeare

.

Sonnet 100

.

Where art thou Muse that thou forget’st so long,
To speak of that which gives thee all thy might?
Spend’st thou thy fury on some worthless song,
Darkening thy power to lend base subjects light?
Return forgetful Muse, and straight redeem,
In gentle numbers time so idly spent;
Sing to the ear that doth thy lays esteem
And gives thy pen both skill and argument.
Rise, resty Muse, my love’s sweet face survey,
If Time have any wrinkle graven there;
If any, be a satire to decay,
And make time’s spoils despised every where.
Give my love fame faster than Time wastes life,
So thou prevent’st his scythe and crooked knife.

.

Shakespeare

Sonnet Courtesy:

http://www.shakespeares-sonnets.com/

సానెట్ 50… విలియం షేక్స్పియర్, ఇంగ్లీషు కవి

ఇది షేక్స్పియర్ 400 వ వర్థంతి సంవత్సరం

నా మార్గంలో అడుగులు ఎంత దుఃఖభరితంగా పడుతున్నాయో చెప్పలేను.
నేను కోరుకుంటున్న ఈ ప్రయాణం ముగిసే వేళకి నాకు దొరకవలసిన
సుఖమూ, విశ్రాంతి దొరకకపోవడమేగాక, గుర్తుచేస్తున్నాయి:
ఇకనుండి మైళ్ళు “నీ నుండి నా దూరం”తో కొలవబడుతాయని.
నా బరువుతోపాటు బాధలబరువూ మోస్తూ ఈ జంతువు అలిసిపోయింది
అందుకే కాళ్ళీడుస్తోంది, నా లోపలి బరువు మోయడానికి వీలుగా,
ఈ గుర్రం ఏ అతీంద్రియ శక్తితో తెలిసుకుందో తెలీదు గాని
రౌతుకి నీ నుండి త్వరగా దూరం కావాలనిలేదని తెలుసుకుంది
ఒక్కోసారి కోపం వచ్చి దాని డొక్కలోకి తన్నినపుడు
కాలి జోడు రక్తంవచ్చేలా చర్మంలోకి గుచ్చుకున్నా చలించడం లేదు
అది బాధతో గట్టిగా ఒక మూలుగు మూలిగి ఊరుకుంటోంది తప్ప;
ఆ మూలుగు నా జోడు దానికి గుచ్చుకున్న బాధకంటే ఎక్కువ బాధిస్తోంది.
ఎందుకంటే, ఆ మూలుగు పదే పదే నాకు గుర్తుచేస్తోంది:
నా ఆనందం వెనుకనీ, దుఃఖం ముందునీ ఉన్నాయని.
.
విలియం షేక్స్పియర్

26 April 1564 (baptised) – 23 April 1616

ఇంగ్లీషు కవి.

.

William Shakespeare

.

Sonnet L

.

How heavy do I journey on the way,

When what I seek, my weary travel’s end,

Doth teach that ease and that repose to say,

‘Thus far the miles are measured from thy friend!’

The beast that bears me, tired with my woe,

Plods dully on, to bear that weight in me,

As if by some instinct the wretch did know

His rider lov’d not speed being made from thee.

The bloody spur cannot provoke him on,

That sometimes anger thrusts into his hide,

Which heavily he answers with a groan,

More sharp to me than spurring to his side;

   For that same groan doth put this in my mind,

   My grief lies onward, and my joy behind.

.

Shakespeare,

26 April 1564 (baptised) – 23 April 1616

English Poet .

Sonnet Courtesy: http://www.shakespeares-sonnets.com/sonnet/50

సానెట్ 73… షేక్స్పియర్, ఇంగ్లీషు కవి

ఇది షేక్స్పియర్ 400 వ వర్ధంతి సంవత్సరము

 

నువ్వు నాలో చూసే వయసు ఎలాంటిదంటే

పేరుకి ఒకటి రెండు పండుటాకులు కొమ్మలకి వేలాడుతూ

ఒకప్పుడు కలకూజితాలతో పులకించి, రాగహీనమై

శీతకాలం రాగానే వణికే చెట్టులాటిది;

నువ్వు నాలో చూస్తున్న సాంధ్యరాగం

సూర్యాస్తమయం కాగానే చీకటిలో కలిసిపోయేటిది.

మృత్యువుకి ప్రతిరూపమై, అన్నిటినీ కనుమరుగుచేసే

చిమ్మ చీకటి దానిని అంచెలంచెలుగా కబళిస్తుంది.

నువ్వు ఇపుడు నాలో చూస్తున్న వెలుగు

యవ్వనపు చితాభస్మము మీద కనిపించే జిగి లాంటిది.

మరణశయ్యమీద ముగిసే ఆ వయసు  

దేనితో పోషించబడిందో, దానిచే దహించబడుతుంది.

 

ఇది నువ్వు గ్రహించగలిగితే, నీ ప్రేమ గాఢమవుతుంది

దేన్ని విడిచిపోవాలో, దాన్నంతగా ప్రేమించగలుగుతావు

.

షేక్స్పియర్ 

ఇంగ్లీషు కవి

William Shakespeare

 

The narrator of Sonnet 73 is approaching death and thinking about how different it is from being young. It’s like the branch of a tree where birds once sang but the birds have gone and the leaves have fallen, leaving only a few dry yellow leaves. It’s like the twilight of a beautiful day, where there is only the black night ahead. It’s like the glowing ashes of a fire that once roared. The things that one gave him life have destroyed his life. From that experience he has learnt that one has to love life as strongly as one can because it will end all too soon.

That time of year thou mayst in me behold

When yellow leaves, or none, or few, do hang

Upon those boughs which shake against the cold,

Bare ruined choirs, where late the sweet birds sang.

In me thou see’st the twilight of such day

As after sunset fadeth in the west;

Which by and by black night doth take away,

Death’s second self, that seals up all in rest.

In me thou see’st the glowing of such fire,

That on the ashes of his youth doth lie,

As the death-bed, whereon it must expire,

Consumed with that which it was nourish’d by.

   This thou perceiv’st, which makes thy love more strong,

   To love that well, which thou must leave ere long.

.

William Shakespeare

English Poet

Poem Courtesy:

http://www.shakespeares-sonnets.com/sonnet/73

 

%d bloggers like this: