అనువాదలహరి

మరో ట్రాయ్ ఎక్కడుంది? … విలియం బట్లర్ యేట్స్, ఐరిష్ కవి

Maud Gonne

Picture Courtesy: Wikipedia

ఇది యేట్స్ తన ప్రియురాలు, ఐరిష్ నటి, విప్లవకారిణి Maud Gonne మీద వ్రాసిన కవిత. ఇక్కడ ఒక చారిత్రక సత్యాన్ని తీసుకుని (హెలెన్ కోసం ట్రాయ్ పట్టణం దహించబడడం), ఒక విలక్షణమైన ప్రతిపాదన చేస్తున్నాడు: అందం నిప్పులాంటిది. అది ఇతరులనైనా దహిస్తుంది. తనని తానైనా దహించుకుంటుంది. “యేట్స్ ప్రేయసి Maud Gonne కోసం ఇప్పుడెవరూ యుద్ధం చెయ్యడం లేదు గనుక (ఇది అతని ఊహ మాత్రమే), ఆమె తన లక్ష్యంకోసం తనని తాను దహించుకుంటోంది” అని అతని భావం .

.

నా జీవితాన్ని దుఃఖభాజనము చేసిందని ఆమెని ఎందుకు నిందించాలి,

ఈమధ్య ఏమీ ఎరుగని అమాయకులైన యువకులకు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లో గొడవలుచేసేవాళ్లలా కాకుండా

అత్యంతహింసాత్మకమైన మార్గాలను బోధిస్తోందని ఎందుకు అనాలి …

వాళ్ళకి కోరికున్నంత గాఢంగా ధైర్యంకూడా ఉన్నప్పుడు?

సారించడానికి సిద్ధంగా ఉన్న నారి లాంటి ఆమె అందమూ,

ఈ రోజుల్లో అటువంటిది అంత సహజమైన విషయం కాదు,

రాజీలేని తీవ్రత, ఏకాగ్రత, తిరుగులేని నిశ్చయమూ,

ఉదాత్తమైన వ్యక్తిత్వం నిప్పంత నిర్మలంగా ఉంచిన

ఆమె మనసుకి, ఏది ప్రశాంతతని అందివ్వగలదు?

ఏమీ, ఆమె ఆమె అయిన తర్వాత, అంతకంటే ఏం చేస్తుంది?

తగలబెట్టడానికి మరో ట్రాయ్ ఎక్కడుంది?
.

విలియం బట్లర్ యేట్స్

(13 June 1865 – 28 January 1939)

ఐరిష్ కవి.

.

Why should I blame her that she filled my days

With misery, or that she would of late

Have taught to ignorant men most violent ways,

Or hurled the little streets upon the great,

Had they but courage equal to desire?

What could have made her peaceful with a mind

That nobleness made simple as a fire,

With beauty like a tightened bow, a kind

That is not natural in an age like this,

Being high and solitary and most stern?

Why, what could she have done, being what she is?

Was there another Troy for her to burn?

.

WB Yeats  

(13 June 1865 – 28 January 1939)

Irish Poet

(The Poem was  published in 1921 in the collection Green Helmet and Other Poems.)

Poem Courtesy: https://www.poetryfoundation.org/poems/49772/no-second-troy

 

మరణాన్ని ముందే పసిగట్టిన ఐరిష్ వైమానిక సైనికుడు … విలియమ్ బట్లర్ యేట్స్, ఐరిష్ కవి

నాకు తెలుసు ఆ మేఘాల్లో ఎక్కడో

నేను మృత్యువుని కలుసుకుంటానని;

నేను యుద్ధం చేస్తున్నవారిపట్ల ద్వేషమూ లేదు,

నేను పరిరక్షిస్తున్న వారి పట్ల నాకు ప్రేమా లేదు;

నా జన్మభూమి కిల్టార్టన్ క్రాస్

నా ప్రజలు కిల్టార్టన్ కి చెందిన నిరుపేదలు,

యుద్ధం ముగిసేక వాళ్ళకి కొత్తగా వచ్చే నష్టమూ లేదు

వాళ్ళ జీవితాలు మునపటికంటే ఆనందంగా ఉండేదీ లేదు.

ఏ చట్టమూ, ఏ కర్తవ్యమూ, నన్ను పోరాడమనలేదు,

ఏ రాజకీయ నాయకులూ, ప్రజల జేజేలూ ప్రేరేపించలేదు

కేవలం ఆనందంలో వచ్చిన క్షణికావేశం

నన్నీ మేఘాల్లోకి విధ్వంసానికి పురికొల్పింది;

నేను అన్నీ బేరీజు వేసుకున్నాను, మనసులో గణించాను,

ఇక రానున్న రోజులన్నీ నిరర్ధకంగా బ్రతకాలి,

గడిచిన రోజులన్నీ నిరర్ధకంగానే గడిచిపోయాయి.

కనుక ఈ జీవితానికి నికర బాకీ, ఈ మృత్యువే.

.

విలియమ్ బట్లర్ యేట్స్

(13 June 1865 – 28 January 1939)

ఐరిష్ కవి

W B Yeats

13 June 1865 – 28 January 1939

Irish Poet

An Irish Airman Foresees His Death

.

I know that I shall meet my fate

Somewhere among the clouds above;

Those that I fight I do not hate,

Those that I guard I do not love;

My country is Kiltartan Cross,

My countrymen Kiltartan’s poor,

No likely end could bring them loss

Or leave them happier than before.

Nor law, nor duty bade me fight,

Nor public men, nor cheering crowds,

A lonely impulse of delight

Drove to this tumult in the clouds;

I balanced all, brought all to mind,

The years to come seemed waste of breath,

A waste of breath the years behind

In balance with this life, this death.

.

William Butler Yeats

(13 June 1865 – 28 January 1939)

Irish Poet

Note:

Kiltartan Cross is a place in Ireland. It is the name of a barony in Galway County of western Ireland (a barony is kind of smaller county). Kiltartan was home to one Lady Gregory, a very close friend of Yeats’ who had this really awesome estate called Coole Park. (It was cool in all senses of the word.) Yeats spent lots of time at Coole Park, which is why the volume that contains this poem “An Irish Airman… “ is called The Wild Swans at Coole. The Irish airman named in the poem’s title is Lady Gregory’s son, Robert Gregory, who was killed in the First World War.

Poem Courtesy:

http://wonderingminstrels.blogspot.com/1999/03/irish-airman-foresees-his-death-william.html

నీకు వయసు పైబడిన తర్వాత… విలియమ్ బట్లర్ యేట్స్, ఇంగ్లీషు కవి

నీకు వయసు పైబడి, జుత్తు నెరిసి, నిద్రాళువువై, పొయ్యిదగ్గర

చలికాచుకుంటూ తలూపేవేళ, ఈ పుస్తకం చేతిలోకి తీసుకుని

తీరికగా చదువుకుంటూ, యవ్వనంలో నీ కనులెంత కోమలంగా,

వాటి ఛాయలు ఎంత గంభీరంగా ఉండేవో ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకో.

నువ్వు ఆనందంతోమురిసి మిసమిసలాడినపుడు నిన్నెందరు ప్రేమించేరో లెక్కలేదు

నీ సౌందర్యాన్ని స్వచ్ఛమైన ప్రేమతోనూ, కపటంతోనూ ఆరాధించినవారున్నారు.

కాని ఒక్కవ్యక్తి మాత్రం “దేహసంచారియైన నీ ఆత్మని” మనసారా ప్రేమించాడు

ఆమ్రేడితమవుతున్న దుఃఖాలకి మారుతున్న నీ ముఖకవళికల్నీ ప్రేమించాడు.

జ్వలిస్తున్న ఆ కట్టెల సమీపంలో ఒదిగి కూచుని, కొంచెం విచారంతోనైనా,

నిన్ను ప్రేమించినవాడు ఎలా అకస్మాత్తుగా జీవితంలోంచి కనుమరుగై, ఎదురుగా

అంబరాన్ని తాకుతున్న గిరిశిఖరాలపై తిరుగాడుతూ, అక్కడ చుక్కలగమిలో

ఎలా తలదాచుకున్నాడో మనసులో ఒకసారి తలపోసుకో.

.

విలియమ్ బట్లర్ యేట్స్

13 June 1865 – 28 January 1939

ఇంగ్లీషు కవి.

 Photo Courtesy: http://ireland-calling.com

.

[Some useful information: This poem, When You Are Old, is based on a poem by the French poet, Ronsard entitled, “Quand vous serez bien vieille”. The poem is addressed to his life long friend but cold to his proposal(s) for marriage, Maud Gonne. She was a beautiful actress.]

 

When You Are Old

 .

When you are old and grey and full of sleep,

And nodding by the fire, take down this book,

And slowly read, and dream of the soft look

Your eyes had once, and of their shadows deep;

How many loved your moments of glad grace,

And loved your beauty with love false or true,

But one man loved the pilgrim soul in you,

And loved the sorrows of your changing face;

And bending down beside the glowing bars,

Murmur, a little sadly, how Love fled

And paced upon the mountains overhead

And hid his face amid a crowd of stars.

.

William Butler Yeats

13 June 1865 – 28 January 1939

English Poet

Poem Courtesy:

http://www.poemtree.com/poems/WhenYouAreOld.htm

 

ఒక ముసలి తల్లి బతుకుపాట… WB యేట్స్, ఐరిష్ కవి

(విలియం బట్లర్ యేట్స్ 150 వ జన్మదిన సందర్భంగా)

నేను పొద్దు పొడుస్తూనే లేస్తాను, మోకాళ్లమీద ఆనుకుని

నిప్పురవ్వ నిలిచి బాగా వెలిగేదాకా పొయ్యి ఊదుతాను;

తర్వాత ఇల్లు ఊడ్చి, అంట్లుతోమి,వంటవండుతాను

చీకటిపడి చుక్కలు తొంగిచూసి మిణుకుమనేదాకా; 

పిల్లలు పొద్దెక్కేదాకా పడుక్కుని కలలు కంటుంటారు

జుత్తుకీ, జాకెట్టుకీ ఏ రిబ్బన్లు జోడీ కుదురుతాయా అని,

వాళ్ళకి రోజంతా పూచికపుల్ల పనిలేకుండా గడిచిపోతుంది

జుత్తు గాలికి చెదిరితే చాలు, వాళ్ళు నిట్టూర్పులు విడుస్తారు

నేను ముసలిదాన్ని కదా అని పని చేస్తూనే ఉండాలి 

ఒంట్లోని శక్తి సన్నగిలి వేడి తగ్గిపోతోంది.

.

విలియం బట్లర్ యేట్స్

13 June 1865 – 28 January 1939

ఐరిష్ కవి

 

(In Commemoration of 150 th Birthday of WB Yeats)

The Song of the Old Mother

,

I rise in the dawn, and I kneel and blow

Till the seed of the fire flicker and glow;

And then I must scrub and bake and sweep

Till stars are beginning to blink and peep;

And the young lie long and dream in their bed

Of the matching of ribbons for bosom and head,

And their day goes over in idleness,

And they sigh if the wind but lift a tress:

While I must work because I am old,

And the seed of the fire gets feeble and cold.

.

William Butler Yeats

13 June 1865 – 28 January 1939

Irish Poet

Poem Courtesy:

Anthology of Irish Verse.  1922.

 Padraic Colum (1881–1972).

http://www.bartleby.com/250/2.html

నా రాతల గమ్యం … విలియం బట్ల యేట్స్, ఐరిష్ కవి

నేను మాటాడిన మాటలన్నీ

నేను రాసిన పదాలన్నీ

విషాద భరితమైన నీ గుండెలు చేరే దాకా…

అలుపులేకుండా వాటి రెక్కలని సాచాలి,

విరామమెరుగకుండా ఎగరాలి…

ఎగిరి, ఆ రాత్రి, ప్రవహిస్తున్న నీ కన్నీరు

నక్షత్రకాంతిలో మెరిసినా,

తుఫాను చీకట్లకు నల్లబడినా,

నా పాటను నీకు వినిపించాలి.

.

విలియం బట్ల యేట్స్

13 June 1865 – 28 January 1939

ఐరిష్ కవి 

.

.

Where My Books Go

.

All the words that I utter

And all the words that I write

Must spread out their wings untiring

And never rest in their flight

Till they come where your sad, sad heart is,

And sing to you in the night,

Beyond where the waters are moving

storm darkened or starry bright.

.

WB Yeats

13 June 1865 – 28 January 1939

Irish Poet

 

Poem Courtesy:

The Oxford Book of English Verse: 1250–1900.

Ed. Arthur Quiller – Couch

http://www.bartleby.com/101/862.html

 

మూడు ఉద్యమాలు… WB యేట్స్. ఐరిష్ కవి

షేక్స్పియరు కాలం నాటి చేప తీరానికి బహుదూరంగా, సముద్రంలో ఈదింది;

కాల్పనికోద్యమం చేతికి అందుబాటులో వలల మధ్య ఈదింది.

ఆ ఒడ్డున ఇసకలో గిజగిజకొట్టుకుంటున్న చేపలు అవేమిటి?

.

WB యేట్స్.

13 June 1865 – 28 January 1939

ఐరిష్ కవి

.

William Butler Yeats (1865 – 1939), Irish poet...
William Butler Yeats (1865 – 1939), Irish poet and dramatist (Photo credit: Wikipedia)

.

Three Movements

Shakespearean fish swam the sea, far away from land;

Romantic fish swam in nets coming to the hand;

What are all those fish that lie gasping on the strand?

.

William Butler Yeats

13 June 1865 – 28 January 1939

Irish Poet

నాదగ్గరే గనక దేవతావస్త్రాలుంటేనా … WB Yeats

Image Courtesy: https://encrypted-tbn3.google.com

(ఈ కవితలో గొప్పదనం అలతి అలతి మాటలతో సుకుమారమైన భావనని అందించగలగడం. మొదటి నాలుగు పాదాల్లో అపురూపమైన దేవతా వస్త్రాల్నీ, వాటి రంగుల్నీ వర్ణించిన కవి, వాటిని దేనికి నియోగిస్తానంటాడు?  తన ప్రేయసి పాదాలక్రింద పరచడానికి. అంటే ఆమె తనకెంత ప్రీతిపాత్రమైనదో  చెప్పకనేచెబుతున్నాడు. కాని, తను పేదవాడు. అటువంటి అపురూపవస్త్రాలు తనదగ్గరలేవు. కానీ, అంతకంటే పదిలంగా తను ఆలోచనలతో, ఊహలలో రంగురంగులతో అల్లుకున్న కలలున్నాయి ఆమెకివ్వడానికి. వాటిని పరుస్తానంటున్నాడు తివాచీలా. కానీ, ఒక హెచ్చరిక చేస్తున్నాడు. అవి దేవతా వస్త్రాల్లాగే విలువైనవీ, అపురూపమైనవీ. తను నిర్లక్ష్యంగా నడిస్తే చిరిగో, విరిగో చెల్లాచెదరైపోతాయని హెచ్చరిక చేస్తున్నాడు.

ఈ కవిత విశేష జనాదరణ పొందటమేగాక చాలా సినిమాల్లో, బి.బి.సి. రేడియో కార్యక్రమాల్లో… చాలాచోట్ల వినియోగించబడింది. ప్రేమికులమధ్య తరచుగా బట్వాడా అయ్యే ఈ కవిత చాలాసార్లు వివాహాలలో  పాడబడిందికూడా.)

.

నా దగ్గరే గనక బంగారు, వెండి జలతారులతో

రచించి సింగారించిన దేవతా వస్త్రాలుండి ఉంటే

చీకటిలోని ముదురు, లేత రంగుల నీలవస్త్రాలూ

పగటిలో సగవన్నెగలిగిన ధవళ వస్త్రాలూ ఉండి ఉంటే

నీ పాదాలక్రింద పరిచి ఉండే వాడిని…

కాని,  నిరుపేదనైన నాదగ్గర ఉన్నవి కలలు మాత్రమే!

నా కలల తివాచీ పరచాను నువ్వు పాదాలు మోపడానికి

నెమ్మదిగా నడువుసుమీ! నువ్వు నడిచేది నా కలలమీద!

.

Image Courtesy: http://www.jssgallery.org/paintings/mugs/William_Butler_Yeats.jpg

విలియం బట్లర్ యేయ్ ట్స్.

.

He wishes for the cloths of heaven

.

Had I the heavens’ embroidered cloths,

Enwrought with golden and silver light,

The blue and the dim and the dark cloths

Of night and light and the half-light,

I would spread the cloths under your feet:

But I, being poor, have only my dreams;

I have spread my dreams under your feet;

Tread softly, because you tread on my dreams.

.

William Butler Yeats

(13 June 1865 – 28 January 1939)

Irish Poet and Playwright and Nobel Laureate for Literature, 1923.

This is one of his most famous poems, sweet and short. This is packed

with emotion, imagery and artistic expression.

[In Drumcliff, Co. Sligo, Ireland, in the churchyard where Yeats is buried, there’s a life-size sculpture of a man crouched over a bronze cloth, set in a marble base. Inscribed in the marble and bronze is this poem.

It is commonly believed that Yeats wrote this poem for his unrequited love Maud Gonne.

The poem appears  quoted in the movie “84 Charing Cross Road” and the sci-fi movie “Equilibrium“. And in the BBC Programme Ballykissangel – Series 3, there will be a touching scene in which a young priest, who falls in love with a young woman, and who even decides to leave his priesthood for her sake, finds his love electrocuted before he could express his mind to her and the poem is played in the background.

(Material Courtesy: wonderingminstrels.blogspot.in)]

%d bloggers like this: