అనువాదలహరి

ఒక కన్నియ రోదన … వాల్టర్ సావేజ్ లాండర్, ఇంగ్లీషు కవి

ఒకప్పుడతన్ని ప్రేమించలేదు; ఇప్పుడతను లేడు
నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను.
అతను మాటాడుతుంటే మందలించాను; అతను మాటాడగలిగితే
ఎంత బాగుండును. అయ్యో!ఇపుడు నేను మందలించను కదా!
ఒకప్పుడు అతన్ని ప్రేమించకపోవడానికి కారణాలు వెతికేను
అలసిపోయేదాకా నా ఆలోచనలన్నీ గిలకొడుతూ
అతన్నీ విసిగించేను,నేనూ వేసారేను;
నిన్నటి వరకు నా కోసం జీవించిన
అతనే గనుక బ్రతికి రాగలిగితే ఇపుడు నా ప్రేమని
అతనికి ఇవ్వడానికి సుముఖమే; ఎప్పుడైతే
అతను వృధాశ్రమ అనుకున్నాడో, అతని ముఖాన్ని
పవిత్రప్రదేశంలో మృత్యుచాయలో చాటుచేసుకున్నాడు.
తన శ్వాసని నాకోసం వృధాచేసినతనికి,
ఇపుడు నా ఊపిరి వృధాచేస్తున్నాను. నా ఊపిరి తిరిగొచ్చి,
ఈ ముక్కలైన హృదయం దహిస్తోంది
ఉక్కిరిబిక్కిరిచేసే మంటతో; నిద్రలో నను తట్టిలేపి
అతని హృదయాన్ని ద్రవింపజేసిన కన్నీళ్ళను
నన్నిపుడు మెలకువలో రోదించమని శాసిస్తోంది;
పాపం! తను ఎన్నాళ్ళు నాకై కన్నీళ్ళు కార్చేడో!
“దయామయుడవైన ప్రభువా!” అదే అతని కడసారి ప్రార్థన
“ఆమె వీటినెన్నటికీ అనుభవించుగాక!” అని.
అతని శ్వాస విశ్రాంతి తీసుకుంది. మట్టిపాలైన
కుసుమాలకన్నా, అతని గుండే చల్లగా ఉంది.
ఇప్పుడు చర్చికి అటూ ఇటూ, పిల్లలందరూ
అతని పేరునీ, సంక్షిప్త జీవితాన్నీ తలుచుకుంటున్నారు.
చిన్నారి హృదయాల్లారా! మీరెక్కడున్నా
అతనికోసం ప్రార్థించండి! అతనితోపాటు నా కోసమూ!
.
వాల్టర్ సావేజ్ లాండర్
(30 January 1775 – 17 September 1864)
ఇంగ్లీషు కవి

 

 

.

The Maid’s Lament

.

I loved him not; and yet now he is gone,

I feel I am alone.

I check’d him while he spoke; yet, could he speak,

Alas! I would not check.

For reasons not to love him once I sought,

And wearied all my thought

To vex myself and him; I now would give

My love, could he but live

Who lately lived for me, and when he found

’Twas vain, in holy ground

He hid his face amid the shades of death.

I waste for him my breath

Who wasted his for me; but mine returns,

And this lorn bosom burns

With stifling heat, heaving it up in sleep,

And waking me to weep

Tears that had melted his soft heart: for years

Wept he as bitter tears.

‘Merciful God!’ such was his latest prayer,

‘These may she never share!’

Quieter is his breath, his breast more cold

Than daisies in the mould,

Where children spell, athwart the churchyard gate,

His name and life’s brief date.

Pray for him, gentle souls, whoe’er you be,

And, O, pray too for me!

.

Walter Savage Landor

(30 January 1775 – 17 September 1864)

English writer and poet.

పిల్లలు… వాల్టర్ సావేజ్ లాండర్, ఇంగ్లీషు కవి

తల్లులెలాంటి వారో పిల్లలలాంటి వారు.
వెర్రి అభిమానపడే తండ్రి అంత వెర్రిగా చూచినా,
ఉయ్యాలలో నిద్రపోతున్న కొడుకుమీద
రాశిపోసిన తన అన్ని ఆశలూ, భయాలతో
తల్లి తన పేగుబంధంతో చూసినట్టుగా
ఆ చిన్నారి హృదయాన్ని ప్రేమగా చూడలేడు.

తన ప్రక్కన మోకాళ్ళమీద కూచుని
తన రూపుదిద్దుకుంటున్న తన ముఖంలో ఎప్పుడూ
తల్లి పోలికలు వెదుకుతున్న నాన్నను చూసి
ఆ చిన్నారి ఆశ్చర్యంగా,గుడ్లప్పగించి చూస్తాడు;
కానీ, ఆమె ఒక్కతెకే చేతులు చాచి
నిలబడతాడు; ఆమె ఒక్కతెకే ఆ కళ్ళు
ఆనందంతో విప్పారుతాయి, ఆశ్చర్యంతో కాకుండా.
.
వాల్టర్ సావేజ్ లాండర్

(30 January 1775 – 17 September 1864)

ఇంగ్లీషు కవి

Walter Savage Landor
Walter Savage Landor

Children

.

Children are what the mothers are.

No fondest father’s fondest care

Can fashion so the infant heart

As those creative beams that dart,

With all their hopes and fears, upon

The cradle of a sleeping son.

His startled eyes with wonder see

A father near him on his knee,

Who wishes all the while to trace

The mother in his future face;

But ’t is to her alone uprise

His waking arms; to her those eyes

Open with joy and not surprise.

.

Walter Savage Landor

(30 January 1775 – 17 September 1864)

English Poet

Poem Courtesy:

The World’s Best Poetry.

Eds.  Bliss Carman, et al.,

Volume I. Of Home: of Friendship.  1904.

Poems of Home: I. About Children

http://www.bartleby.com/360/1/23.html

ఓ నా కవితా!… వాల్టర్ సావేజ్ లాండర్, ఇంగ్లీషు కవి

పద, ఆమె దగ్గరకు వెళ్ళు, బెదిరిపోకు

ఆమె అందాన్ని చూసి పురుషులు సంకోచించినట్టు;

నీ వైపు తీక్షణంగా చూడదులే,

నిన్ను చూసి ముఖం అటు తిప్పుకోదు కూడా.

ఆమె మనోఫలకం మీద నువ్వు నిలిచేలా

నీకు కొన్ని సొగసులు అద్దుతానులే,

ఒకటి రెండు లోపాలు కూడా కలగలిసిపోవచ్చు

వాటిని ఆమె నవ్వుకుంటూ క్షమించెస్తుంది.

.

వాల్టర్ సావేజ్ లాండర్

జనవరి 30, 1775 – 17 సెప్టెంబరు 1864

ఇంగ్లీషు కవి

Walter Savage Landor Image Courtesy: http://www.poetryfoundation.org/bio/walter-savage-landor
Walter Savage Landor
Image Courtesy: http://www.poetryfoundation.org/bio/walter-savage-landor

.

To His Verse

Away my verse; and never fear,

  As men before such beauty do;

On you she will not look severe,

  She will not turn her eyes from you.

Some happier graces could I lend

  That in her memory you should live,

Some little blemishes might blend,

  For it would please her to forgive.

.

Walter Savage Landor

(30 January 1775 – 17 September 1864)

English Poet

Poem Courtesy:

The Oxford Book of Victorian Verse.  1922.

Comp:   Arthur Quiller-Couch

http://www.bartleby.com/336/11.html

తాత్త్వికుడి చివరి మాటలు… వాల్టర్ సావేజ్ లాండర్, ఇంగ్లీషు కవి

నేను ఎవరితోనూ పోరాడలేదు; ఎవరికీ నాలాంటి పోరాటం వద్దు;

ప్రకృతిని ప్రేమించాను, దాని తర్వాత ఆరాధించింది కళనే;

జీవితమనే మంట ముందు రెండు చేతులతో చలి కాచుకున్నాను;

అది చల్లారిపోతోంది; దానితోపాటే నేనూ నిష్క్రమించడానికి సిద్ధంగా ఉన్నాను.

.

వాల్టర్ సావేజ్ లాండర్

(30 January 1775 – 17 September 1864)

ఇంగ్లీషు కవి.

 .

Walter Savage Landor Image Courtesy: http://www.poetryfoundation.org/bio/walter-savage-landor
Walter Savage Landor
Image Courtesy: http://www.poetryfoundation.org/bio/walter-savage-landor

.

Dying Speech of an Old Philosopher

.

I strove with none, for none was worth my strife:

         Nature I loved, and, next to Nature, Art:

I warm’d both hands before the fire of Life;

         It sinks; and I am ready to depart.

.

Walter Savage Landor

(30 January 1775 – 17 September 1864)

English writer and poet.Poem Courtesy:

http://www.poetryfoundation.org/poem/173827

ఓడ… వాల్టర్ సేవేజ్ లాండర్, ఇంగ్లీషు కవి

కడకి ఈడ విశ్రాంతి తీసుకుఏ ఈ ఓడకి ఒకప్పుడు 
ఎత్తైన కంబమూ, బలమైన తట్టూ ఉండేవి
ఎంత చిన్నపాటి గాలి వాటు దొరికినా చాలు
విహారానికీ, ప్రయాణానికీ సిద్ధమయేది. 
పాపం,ఇప్పుడది పక్కకి ఒత్తిగిలి పడుకుంది పనిలేక,
సెలయేటితోపాటు జరజరా ప్రవహించడం మరిచిపోయి.
అయితేనేం, ఒకప్పుడు దీనిగురించి కథలు చెప్పుకునేవారు
పూలు సింగారించుకున్న చక్కని చుక్కలెందరో
దీని ముఖమండపంలో మకుటంలా ప్రకాశిస్తూ
తమకలలప్రపంచాల్ని మోసుకెళ్తుండేవాళ్ళు
లెక్కలేనన్ని కథలు చెప్పగలదది…
కానీ, గోప్యంగా ఉండడమే దానికి ఇష్టం.
రా, చిన్నారీ! కొంచెం ముందుకు రామ్మా!
నీకు చెప్పడానికి ఇంకా మరో కథ మిగిలి ఉందేమో!

.

వాల్టర్ సేవేజ్ లాండర్

30 January 1775 – 17 September 1864

ఇంగ్లీషు కవి   

The Yacht

.

The Vessel that rests here at last

Had once stout ribs and topping mast,

And, whate’er wind there might prevail,

Was ready for a row or sail.

It now lies idle on its side,

Forgetful o’er the stream to glide.

And yet there have been days of yore,

When pretty maids their posies bore

To crown its prow, its deck to trim,

And freighted a whole world of whim.

A thousand stories it could tell,—

But it loves secrecy too well.—

Come closer, my sweet girl, pray do!

There may be still one left for you.

.

Walter Savage Landor

30 January 1775 – 17 September 1864

English Writer and Poet

 

Poem Courtesy:

The Oxford Book of Victorian Verse. 1922.

Comp: Arthur Quiller-Couch.

http://www.bartleby.com/336/2.html

 

తన మృతిపై … వాల్టర్ సావేజ్ లాండర్, ఇంగ్లీషు కవి

 మృత్యువు నామీద నిలబడింది, వంగి, తలవాల్చి

నా చెవిలో ఏదో గుసగుసలాడుతోంది;

ఆ వింతభాష నాకు అర్థం కాలేదు గాని,

తెలిసిందల్లా, ఇకపై భయపడనవసరం లేదని.

.

వాల్టర్ సావేజ్ లాండర్

30 జనవరి- 1775 – 17 సెప్టెంబరు 1864

ఇంగ్లీషు కవి

On His Own Death

.

Death stands above me, whispering low   

I know not what into my ear: 

Of his strange language all I know   

Is, there is not a word of fear.

.

Walter Savage Landor

(30 January 1775 – 17 September 1864)

English Poet

కవితతో స్వగతం… వాల్టర్ సేవేజ్ లాండర్, ఇంగ్లీషు కవి

ఓ నా కవితా! ఫర్వాలేదు వెళ్ళు! భయపడకు,

అంతటి అందం ముందు పురుషులు భయపడినట్టు;

నిన్ను ఆమె తీక్షణంగా చూడదు,

నీనుంచి దృష్టికూడా మరల్చదు.

ఆమె జ్ఞాపకాల్లో నువ్వు పదిలంగా నిలిచేలా

నేను కొన్ని సొగసులు నీకు అద్దుతాను,

చిన్న చిన్న లోపాలుకూడా కలగలుపుతాను

ఆమె నిన్ను సంతోషంగా క్షమించేసేలా…

.

వాల్టర్ సేవేజ్ లాండర్

(30 January 1775 – 17 September 1864)

ఇంగ్లీషు కవి

.

Image Courtesy: Poetry Foundation

http://www.poetryfoundation.org/bio/walter-savage-landor

.

To His Verse

 .

Away my verse; and never fear,  

As men before such beauty do;    

On you she will not look severe,     

She will not turn her eyes from you.     

Some happier graces could I lend  

That in her memory you should live,    

Some little blemishes might blend, 

For it would please her to forgive.

.

Walter Savage Landor

(30 January 1775 – 17 September 1864)

English Poet

Poem Courtesy: The Oxford Book of Victorian Verse, 1922

Comp. Arthur Quiller-Couch

http://www.bartleby.com/336/11.html

 

ఆమె పేరు… వాల్టర్ సావేజ్ లాండర్, ఇంగ్లీషు కవి

బ్లాజ్ఞ్మిత్రులకీ,

సందర్శకులకీ 

జయ ఉగాది శుభాకాంక్షలు.

ఈ  సంవత్సరం

మీకూ మీ కుటుంబానికీ,

మీ మిత్రులూ శ్రేయోభిలాషులకీ

ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందోత్సాహాలు

కలుగజేయాలని కోరుకుంటున్నాను

***

మెత్తని సముద్రపుటిసకమీద

నీ పేరు నేను రాసున్నప్పుడు నవ్విన

నీ నవ్వు నాకింకా గుర్తే! “ఏమిటది, చంటిపిల్లడిలా!

నువ్వు ఏదో రాతి మీద రాస్తున్నాననుకుంటున్నావు!”

ఆ క్షణం తర్వాత

ఇయాంథే పేరు రాసేను

ఏ కెరటమూ ఎన్నడూ చెరపలేనట్టుగా;

భావి తరాలు విశాల సాగరంపై చదవగలిగేలా.

.

వాల్టర్ సేవేజ్ లాండర్

30 జనవరి 1775 – 17 సెప్టెంబరు 1864

ఇంగ్లీషు కవి

.

Her Name

.

Well I remember how you smiled

To see me write your name upon

The soft sea-sand … ‘O, what a child!

You think you’re writing upon stone!’

I have since written what no tide

Shall ever wash away; what men

Unborn shall read o’er ocean wide

And find Ianthe’s name again.

.

Walter Savage Landor

(30 January 1775 – 17 September 1864)

English Poet

Poem Courtesy:

The Oxford Book of Victorian Verse. 1922.

Compiled by: Arthur Quiller-Couch

(http://www.bartleby.com/336/4.html)

విహారనౌక… వాల్టర్ సేవేజ్ లాండర్, ఇంగ్లీషు కవి

కడకు ఇక్కడ విశ్రమిస్తున్న ఈ ఓడ

ఒకప్పుడు బలమైన పరుశువులూ, గావాయి గలది;

గాలి ఎప్పుడు ఎలా వీచినా

విహారానికీ, దూరయాత్రకీ సిద్ధంగా ఉండేది.

ఇప్పుడంటే ఒక ప్రక్కకి ఒరిగి రికామీగా ఉంది

గలగలపారుతున్న ప్రవాహంతో పరుగులెత్తడం మరిచి.

అయినా, దీనికి గతవైభవపురోజులున్నై;

అప్పుడు అందమైన పడుచులు పూలు తెచ్చి

దీని ముందరితట్టునలంకరించి, తలవరుస శుభ్రపరిచేవారు

కలలప్రపంచాల్ని తమతో మోసుకుపోతూ;

కొన్ని వేల గాథలు చెప్పగలదిది…

కానీ, మనసులో దాచుకోవడమే దానికి మహా ఇష్టం.

ఓ నా చిన్నారి బాలికా! దామ్మా! దగ్గరకి రా!

ఏమో, నీకు చెప్పడానికి దాని దగ్గర కొత్త గాథ ఉందేమో!

.

వాల్టర్ సేవేజ్ లాండర్

జనవరి 30, 1775 – సెప్టెంబరు 17, 1864)

ఇంగ్లీషు కవి.

.

ఈ కవిత De-commission చేసిన ఒక ఓడ గురించి చెప్పినట్లు ఉన్నప్పటికీ, అంతరంలో, ఒక వయోవృద్ధుడిగురించి (వృద్ధురాలుకూడా) చెబుతున్నట్టు ఊహించుకోవచ్చు. విశాలమైన జీవితపథంలో ఎన్నో వెలుగునీడలు చూసిన వారి జీవితం నిండా కథలే ఉంటాయి. కానీ వినేవాళ్లు లేక మౌనంగా ఉంటారు. వాళ్లని కదిలించగలిగితే చిన్నారులే కదిలించాలి.

.

The Yacht

.

The Vessel that rests here at last

Had once stout ribs and topping mast,

And, whate’er wind there might prevail,

Was ready for a row or sail.

It now lies idle on its side,

Forgetful o’er the stream to glide.

And yet there have been days of yore,

When pretty maids their posies bore

To crown its prow, its deck to trim,

And freighted a whole world of whim.

A thousand stories it could tell,—

But it loves secrecy too well.

Come closer, my sweet girl, pray do!

There may be still one left for you.

.

Walter Savage Landor

(30 January 1775 – 17 September 1864)

English Poet

Poem Courtesy:

The Oxford Book of Victorian Verse. 1922.
Compiled by: Arthur Quiller-Couch
(http://www.bartleby.com/336/2.html)

 

%d bloggers like this: