అనువాదలహరి

ప్రతిధ్వని… వాల్టర్ డి లా మేర్, ఇంగ్లీషు కవి

“ఎవరది పిలిచింది?” అన్నాన్నేను. నా మాటలు

ఊసులాడుతున్న వనసీమలలోంచి,

ఇటూ అటూ పోతూ పిట్టల్ని గాభరాపెట్టేయి

“ఎవరది పిలిచింది? ఎవరది పిలిచింది?” అంటూ.

చిటారుకొమ్మలనున్న ఆకులు

ఎండలో గలగలలాడాయి

ఎండకాగిన పొడిగాలి నా అరుపుని

సన్నగా మోసుకుపోయింది:

పచ్చదనం మద్య తొంగి చూస్తున్న కళ్ళూ, నీడలోనున్నవీ

కదలకుండా పడున్న డొంకలోని గొంతులు

నన్ను వెక్కిరించడానికి

నే నేమంటే తిరిగి అదే అంటున్నాయి.

నా కన్నీళ్ళలోంచి ఒక్క సారి అరిచేను: “ఎవడికి ఖాతరు?” అని;

గాలి ఒక్కసారి పల్చబడింది:

ఆ నిశ్శబ్దంలో “ఎవడికి ఖాతరు? ఎవడికి ఖాతరు?”

అన్నమాట ముందుకీ వెనక్కీ ఊగిసలాడింది.

.

వాల్టర్ డి లా మేర్

25 April 1873 – 22 June 1956

ఇంగ్లీషు కవి

.

.

Echo

.

“Who called?” I said, and the words

Through the whispering glades,

Hither, thither, baffled the birds—

“Who called? Who called?”

The leafy boughs on high

Hissed in the sun;

The dark air carried my cry

Faintingly on:

Eyes in the green, in the shade,

In the motionless brake,

Voices that said what I said,

For mockery’s sake:

“Who cares?” I bawled through my tears;

The wind fell low:

In the silence, “Who cares? Who cares?”

Wailed to and fro.

.

Walter de la Mare

25 April 1873 – 22 June 1956

British Poet

Poem Courtesy:

https://www.poetrynook.com/poem/echo-7

ప్రకటనలు

నవంబరు నెల… వాల్టర్ డి లా మేర్, ఇంగ్లీషు కవి

ఎక్కడ గులాబి ఉందో అక్కడ పిల్లతెమ్మెర ఉంది
ఎక్కడ చక్కని గడ్ది ఉందో అక్కడ మంచుసోన ఉంది
ఇక దొంతరదొంతరలుగా మేఘమాలికలు
అంతుదొరకని వినీల విహాయస వీధుల్లో
“లార్క్” తోపాటు విహరిస్తూనే ఉన్నాయి.

చెయ్యి ఎక్కడ ఉందో అక్కడ వేడి లేదు
జుత్తు ఎక్కడ ఉందో అక్కడ పసిడివెలుగు లేదు
ఏకాకిగా, దెయ్యంలా
ముళ్ళపొదలక్రింద
ప్రతి ముఖం ప్రేతకళ సంతరించుకుని ఉంది

ఎక్కడ మాటవినవస్తోందో, అక్కడ చలిగాలి వీస్తోంది
నాగుండె ఎక్కడ ఉందో అక్కడ కన్నీరే కన్నీరు
ఇక నా విషయానికి వస్తే
ఏమి చెప్పమంటావు బిడ్డా!ఎప్పటిలాగే
ఎక్కడ ఆశ అల్లుకుందో అక్కడ నిశ్శబ్దం తాండవిస్తోంది.
.

వాల్టర్ డి లా మేర్

25 April 1873 – 22 June 1956

ఇంగ్లీషు కవి.

.

November

There is wind where the rose was,

Cold rain where sweet grass was,

And clouds like sheep

Stream o’er the steep

Grey skies where the lark was.

Nought warm where your hand was,

Nought gold where your hair was,

But phantom, forlorn,

Beneath the thorn,

Your ghost where your face was.

Cold wind where your voice was,

Tears, tears where my heart was,

And ever with me,

Child, ever with me,

Silence where hope was.

.

Walter de la Mare

25 April 1873 – 22 June 1956 

English Poet 

Poem Courtesy:

http://www.poemtree.com/poems/November.htm

మార్తా… వాల్టర్ డి లా మేర్, ఇంగ్లీషు కవి

“అనగా అనగా ఒక ఊళ్ళో…”
అలా ఎన్ని సార్లు ప్రారంభించి
మార్తా మాకందరికీ ఆ చిలకపచ్చని
కోనలో ఎన్ని కథలు చెప్పేదో.

ఆమెవి చాలా స్వచ్ఛమైన గోధుమవన్నె కళ్ళు
మీరు గాని వాటిని అలా చూస్తూ ఉంటే
అసలు ఆ కథలన్నీ ఆ కళ్ళు తమ
కలల ప్రశాంతతతో చెబుతున్నట్టు అనిపిస్తుంది.

ఆమె తన సన్నని రెండు చేతులతో
తనముణుకులని బంధించినట్టు కూచునేది;
మేము మాత్రం మా రెండు చేతులమీదా
వెనక్కి వాలి ఆమె వంకే అలా చూసే వాళ్లం.

ఆమె గొంతుకా, కొనదేరిన చుబుకమూ
గంభీరంగా ఉండే ఆమె చిన్న తలా,
కథలో ఆమె వాడిన మాటలకు
సగం అర్థాన్ని చెబుతున్నట్టుండేవి

“అనగా… అనగా… ఒక ఊళ్ళో…”
అది మనం నిద్రలో కనే కలలాంటిది
అవన్నీ ఇప్పుడు అడవిలోని ఏ యక్షిణులో
పిశాచాలో ఎత్తుకుపోయాయి.

సుదూర భవిష్యత్తులో ఆమె అందం కూడా
కనుమరుగౌతుంది; ఆమె గోంతుకొనసాగుతూనే ఉంటుంది,
చివరకి ఈ అడవుల పచ్చదనం,   
వేసవి ఎండలూ అన్నీ సమసిపొయేదాకా.

అలసి అలసి అందరూ అన్నీ మరిచిపోతారు;
ఎత్తుగా ఆకాశం మీది మబ్బుల్లా
మా మనసులుకూడా గతించిన ఆ కాలపు
జ్ఞాపకాల మౌనంలో నిశ్చలంగా ఉండిపోయాయి.
.
వాల్టర్ డి లా మేర్

25 April 1873 – 22 June 1956

ఇంగ్లీషు కవి  .

.

Martha

.

“Once . . . Once upon a time . . .”

Over and over again,

Martha would tell us her stories,

In the hazel glen.

Hers were those clear gray eyes

You watch, and the story seems

Told by their beautifulness

Tranquil as dreams.

She’d sit with her two slim hands

Clasped round her bended knees;

While we on our elbows lolled,

And stared at ease.

Her voice and her narrow chin,

Her grave small lovely head,

Seemed half the meaning

Of the words she said.

“Once . . . Once upon a time . . .”

Like a dream you dream in the night,

Fairies and gnomes stole out

In the leaf-green light.

And her beauty far away

Would fade, as her voice ran on,

Till hazel and summer sun

And all were gone:—

All fordone and forgot;

And like clouds in the height of the sky,

Our hearts stood still in the hush

Of an age gone by.

.

Walter de la Mare

25 April 1873 – 22 June 1956

English Poet

Poem Courtesy:

http://www.poemtree.com/poems/Martha.htm

 

గతించినవన్నీ… వాల్టర్ డి లా మెర్, ఇంగ్లీషు కవి

ఈ వనాళి అతి పురాతనమైనది;
ముళ్ళపొదల్లోంచి పైకిలేచే లేతీవెలపై
కుసుమిస్తున్న మొగ్గలు,
వసంతాగమన సూచీ వీచికలకు,
ఎంత అందంతో ఇనుమడిస్తున్నాయో— !
ఈ గులాబి ఎన్ని అజ్ఞాత శతాబ్దులుగా
నలుచెరగులా విరబూస్తున్నాదో
ఏ మనిషీ చెప్పలేడు.

ఈ సెలయేళ్ళూ పురాతనమైనవే;
నీలాలనింగి క్రింద
చల్లగా నిద్రించే
హిమపాతాలనుండి
ఉద్భవించే కొండవాగులు
గతంలోకి జారుకున్న చరిత్రని
ఎంతగా ఆలపిస్తాయంటే
సాలమన్ చక్రవర్తికంటే వివేకవంతంగా
వాటి ప్రతి పదమూ పలుకుతుంది.

మనుషులం మనందరం పురాతనులమే;
ఈవ్ కి చెలికత్తెలైన నైటింగేల్ పిట్టలు
ఈడెన్ లోని చీకటితోటలలో చెప్పిన
కథలే మనందరం కలగనే కలలు;
మనం కాసేపు మేలుకుని గుసగుసలాడతాం
కానీ, ఈ లోపు రోజు గడిచిపోతుంది,
ఇక చెంగలువలా శాశ్వతంగా మిగిలేది
నిద్రా, నిశ్శబ్దమూ మాత్రమే…
.
వాల్టర్ డి లా మేర్
25 April 1873 – 22 June 1956
ఇంగ్లీషు కవి.

.

All That’s Past

.

Very old are the woods;

And the buds that break

Out of the brier’s boughs,

When March winds wake,

So old with their beauty are—

Oh, no man knows

Through what wild centuries

Roves back the rose.

Very old are the brooks;

And the rills that rise

Where snow sleeps cold beneath

The azure skies

Sing such a history

Of come and gone,

Their every drop is as wise

As Solomon.

Very old are we men;

Our dreams are tales

Told in dim Eden

By Eve’s nightingales;

We wake and whisper awhile,

But, the day gone by,

Silence and sleep like fields

Of amaranth lie.

Walter de la Mare

25 April 1873 – 22 June 1956

English Poet and Short story writer

Poem courtesy:

http://www.poemtree.com/poems/All-Thats-Past.htm

నెపోలియన్… వాల్టర్ డి లా మేర్, ఇంగ్లీషు కవి

సైనికులారా! ఈ ప్రపంచం ఎవరు?

అది నేనే;

నిరంతరం కురిసే ఈ మంచూ,

ఈ ఉత్తరదిశ ఆకాశం;

సైనికులారా, మనందరం

అనుభవించే ఒంటరి తనం

అంతా నేనే!

.

వాల్టర్ డి లా మేర్

25 April 1873 – 22 June 1956

ఇంగ్లీషు కవి

 

 

.

Napoleon

.

‘What is the world, O soldiers?

       It is I:

I, this incessant snow,

   This northern sky;

Soldiers, this solitude

   Through which we go

       Is I.’

.

Walter de la Mare

25 April 1873 – 22 June 1956

English Poet, Short Story Writer

 

Poem Courtesy: http://wonderingminstrels.blogspot.in/1999/11/napoleon-walter-de-la-mare.html

అస్పష్ట సంగీతం… వాల్టర్ డి లా మేర్, ఆంగ్ల కవి

రాలుతున్న ఉల్క నిశ్శబ్ద మార్గం, చప్పుడు చెయ్యని వాన;

నిశ్చలమైన అగడ్తనీటితో పొగమంచు మౌన భాషణ,

నిద్ర మరచిన పూవు విడిచే నిట్టూరుపూ,

ఆ గంట మోగించని స్వరమూ …

నిద్రమత్తు వదిలి అంతరాంతరాల్లోని మనిషి తిరగబడతాడు,

గర్భంలో రహస్యంగా రూపుదిద్దుకుంటుంది స్వచ్ఛమైన ప్రేమ

ప్రమాణం పలకకపోయినా అంత విశ్వాసంగానూ కొట్టుకుంటున్న గుండె…

అన్ని శబ్దాలూ కడకు నిశ్శబ్దం దగ్గరకి రావలసిందే!

.

వాల్టర్ డి లా మేర్

25 April 1873 – 22 June 1956

ఆంగ్ల కవి, కథా రచయితా, నవలాకారుడూ

.

Walter de la Mare

Walter de la Mare

.

Faint Music

.

The meteor’s arc of quiet; a voiceless rain;

The mist’s mute communing with a stagnant moat;

The sigh of a flower that has neglected lain;

That bell’s unuttered note;

A hidden self rebels, its slumber broken;

Love secret as crystal forms within the womb;

The heart may as faithfully beat, the vow unspoken;

All sounds to silence come.

.

Walter de la Mare

25 April 1873 – 22 June 1956

English Poet, Short Story Writer and Novelist

శ్రోతలు… వాల్టర్ డి లా మేర్, ఆంగ్ల కవి

…’ఎవరదీ లోపల?’ అని అడిగేడు బాటసారి

వెన్నెల జాల్వారుతున్న తలుపును తడుతూ.

ఒత్తుగా పచ్చిక మొలిచిన అడవినేలమీద

మౌనంగా  గడ్డి కొరుకుతోంది అతని గుర్రం:

ఇంటి కప్పుమీదనుండి రివ్వున ఎగురుకుంటూ

బాటసారి తలమీదనుండి ఒక పిట్ట దూసుకు పోయింది.

అతను తలుపుమీద రెండోసారి గట్టిగా తట్టేడు;

‘ఇంట్లో ఎవరైనా ఉన్నారా?’ అని అడిగేడు మరోసారి.

కాని ఎవ్వరూ బాతసారి వైపు కదల్లేదు;

లతలతో అల్లుకున్న ద్వారబంధం నుండి

ఒక్క తలకాయా అతనివైపు వంగి వాలలేదు, నిశ్చేష్టుడై

ఉన్నచోటే నిల్చున్న అతని అలసిన కనుల్లోకి తొంగిచూడలేదు.

అయితే,ఆ ఒంటరి ఇంట్లో నివసిస్తూ ఆ వెన్నెల ప్రశాంతతలో

మానవలోకం నుండి వస్తున్న ఆ శబ్దాన్ని వింటూ,

మౌనంగా ఉండిపోయిన అస్పష్ట శ్రోతలు చాలా మంది ఉన్నారు;

ఖాళీ చావడిలోంచి పోతూ   ఆ చీకటి మెట్లమీద పలచగాపడుతున్న

వెన్నెల చుట్టూ గుమిగూడేరు,  ఆ ఒంటరి యాత్రికుడి పిలుపులకి

కదిలి చెల్లాచెదరైన గాలిలోని శబ్దాలు వింటూ;

అతని ప్రశ్నకి సమాధానంగా నిశ్శబ్దమూ …

ఆకులమధ్య మధ్యచిక్కుకున్న నక్షత్రాలు పొదిగిన ఆకాసం క్రింద

ఆ చీకటి నేలమీది గుర్రం కాలితో గీరడమూ,

అతనికి మనసుకి ఏదో వింతగా అనిపించింది;

ఎందుకంటే, అతను అకస్మాత్తుగా తలుపుమీద

ముందుకంటే దబదబా బాది, తలెత్తి:

‘అలా అయితే,ఇచ్చిన మాట ప్రకారం నేను వచ్చాననీ

ఎవరూ బదులు పలకలేదనీ చెప్పండి,’ అన్నాడు.

అతను చెప్పిన ప్రతిమాటా ఆ ఇంటి నిశ్శబ్దపు

నీలినీడల్లోంచి ప్రతిధ్వనిస్తున్నా శ్రోతల్లో ఏ ఒక్కరూ

కించిత్తయినా కదిలే ప్రయత్నం చెయ్యలేదు;

అన్నట్టు, రికాబు మీద అతని కాలి చప్పుడూ

రాతినేలమీద గుర్రపుడెక్కల చప్పుడూ వినడంతోపాటు

పరిగెడుతున్న డెక్కలు దూరమవగానే, నిశ్శబ్దం తిరిగి

ఎలా నెమ్మదిగా వెనక్కి ఎగసిపడిందో గమనిస్తూనే ఉన్నారు….

.

వాల్టర్ డి లా మేర్

(25 April 1873 – 22 June 1956)

ఇంగ్లీషు కవీ, నాటకకర్తా, కథా రచయితా అయిన వాల్టర్ డి లా మేర్  తన ప్రఖ్యాతినందిన ఉపన్యాసం “Rupert Brooke and his intellectual imagination” లో ప్రతిపాదించిన మనుషులలోని రెండురకాల ఆలోచనా స్రవంతుల ద్వారా ఎక్కువగా నేడు గుర్తింపబడుతున్నాడేమో! బాల్యపుటూహలు(Childlike) సత్యమే సౌందర్యమని భావిస్తాయనీ, అవి సహజాతమూ (intuitive), ఆగమవాదములూ (inductive) అయితే, కౌమారపుటాలోచనలు(Boylike) సౌందర్యమే సత్యమని భావిస్తాయనీ, అవి తార్కికమూ, నిగమితములూ (Deductive) అని ప్రతిపాదించేడు. అంతేగాక, యౌవనారంభవేళలో, ఈ బాల్యపుటాలోచనలలోకి బాహ్యప్రపంచపు నిరంతరచొరబాటు వలన, అవి నత్తగుల్ల లోనికి ముడుచుకుపోయినట్టు, లోనికి ముడుచుకుపోవడముగాని, లేదా, శక్తిమంతముగా ఎదిగి బాహ్యప్రపంచాన్ని ఎదుర్కోడానికి తగిన సన్నద్ధత సమకూర్చుకోవడంగాని చేస్తాయని ప్రతిపాదించేడు.

“Memoirs of the Midget” అన్న అతని నవలా, 100 కు పైగా రాసిన అతని దయ్యాల కథలలో “Seaton’s Aunt”, “Out of the Deep” అన్న కథలూ అతనికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. “Songs of Childhood” తో పాటు అతను 5 కవితా సంకలనాలూ, 10కి పైగా కథా సంకలనాలూ, 5 నవలలూ వెలువరించాడు.
.

Walter de la Mare

PNG Courtesy: http://gutenberg.ca/ebooks/rothenstein-twelveportraits/rothenstein-twelveportraits-00-h-dir/rothenstein-twelveportraits-00-h.html

.
The Listeners
.
Is there anybody there?’ said the Traveller,
Knocking on the moonlit door;
And his horse in the silence champed the grasses
Of the forest’s ferny floor:
And a bird flew up out of the turret,
Above the Traveller’s head
And he smote upon the door again a second time;
‘Is there anybody there?’ he said.
But no one descended to the Traveller;
No head from the leaf-fringed sill
Leaned over and looked into his grey eyes,
Where he stood perplexed and still.
But only a host of phantom listeners
That dwelt in the lone house then
Stood listening in the quiet of the moonlight
To that voice from the world of men:
Stood thronging the faint moonbeams on the dark stair,
That goes down to the empty hall,
Hearkening in an air stirred and shaken
By the lonely Traveller’s call.
And he felt in his heart their strangeness,
Their stillness answering his cry,
While his horse moved, cropping the dark turf,
‘Neath the starred and leafy sky;
For he suddenly smote on the door, even
Louder, and lifted his head:-
‘Tell them I came, and no one answered,
That I kept my word,’ he said.
Never the least stir made the listeners,
Though every word he spake
Fell echoing through the shadowiness of the still house
From the one man left awake:
Ay, they heard his foot upon the stirrup,
And the sound of iron on stone,
And how the silence surged softly backward,
When the plunging hoofs were gone.

Walter de la Mare

25 April 1873 – 22 June 1956

 English poet, short story writer and novelist.

ఒంటరిగా … వాల్టర్ డి ల మేర్

Image Courtesy: Madhuravani http://madhurachitralu.blogspot.in/2012/02/blog-post_26.html

.

కోకిల గూడు చిన్నబోయింది.
విరిసిన మంచు, చలిగాలికి గడ్డకడుతోంది.
నక్క తన మంచుబిలంలోంచి అరుస్తోంది…
అయ్యో! నా ప్రేయసి నాకు దూరమయింది.
నేనా ఒంటరిని…
ఇది చూస్తే చలికాలం.
.

ఒకప్పుడు ఇవే నీర్కావి పూలు మత్తెక్కించేవి.
ఆ నల్లతుమ్మెద ఎందుకో పువ్వును వదలి రావడం లేదు.
అందాల్నివెదజల్లుతూ కాంతి దీప్తిమంతంగా ప్రసరిస్తోంది.
నేనా ఒంటరిని…
ఇది చూస్తే చలికాలం.
.

ఈ కొవ్వొత్తి నులివెచ్చని వేడిమినందిస్తోంది.
ఆకాశంలో మృగశిర మృగయావినోదంలో ఉంది.
ఇక చిమ్మటలు పట్టినా,
నీడలు వేలాడినా,
ఈ ప్రపంచం ఉనికి నాకు లేదు.
అయ్యో! నా ప్రేయసి నాకు దూరమయింది.
నేనా ఒంటరిని…
ఇది చూస్తే చలికాలం.
.

Image Courtesy: http://t3.gstatic.com

వాల్టర్ డి ల మేర్

.

Alone
.
The abode of the nightingale is bare,
Flowered frost congeals in the gelid air,
The fox howls from his frozen lair:
Alas, my loved one is gone,
I am alone:
It is winter.

Once the pink cast a winy smell,
The wild bee hung in the hyacinth bell,
Light in effulgence of beauty fell:
I am alone:
It is winter.

My candle a silent fire doth shed,
Starry Orion hunts o’erhead;
Come moth, come shadow, the world is dead:
Alas, my loved one is gone,
I am alone;
It is winter.

Walter de la Mare

(25 April 1873 – 22 June 1956)

English poet, Short Story Writer and Novelist.

మృత్యుల్లేఖము … వాల్టర్ డి ల మేర్

Image Courtesy: http://idiva.com

.

ఆర్య నిదురించునిచట సౌందర్య రాశి
లలితపద, నిరతహృదయోల్లాసి యామె,
“మాపు సీమ”ను లావణ్య రూపు రేఖ
కీరుగలవారు లేరు నా ఎరుక మేర.

.

వాయు సొబగులు, రూపలావణ్య మడగు
యెంత అపురూప మెంత దురంతమైన
కాలగతియంతె! ఎవరు వాక్కొనగ గలరు
మిత్తి ఎంతటిపోడుముల్  మట్టిగలుపు!

.

వాల్టర్ డి ల మేర్

(25 April 1873 – 22 June 1956)

ఇంగ్లీషు కవీ, నాటకకర్తా, కథా రచయితా అయిన వాల్టర్ డి ల మేర్  తన ప్రఖ్యాతినందిన ఉపన్యాసం “Rupert Brooke and his intellectual imagination” లో ప్రతిపాదించిన  మనుషులలోని రెండురకాల ఆలోచనా స్రవంతుల ద్వారా ఎక్కువగా నేడు గుర్తింపబడుతున్నాడేమో! బాల్యపుటూహలు(Childlike) సత్యమే సౌందర్యమని భావిస్తాయనీ, అవి సహజాతమూ (intuitive),  ఆగమవాదములూ (inductive) అయితే, కౌమారపుటాలోచనలు(Boylike) సౌందర్యమే సత్యమని భావిస్తాయనీ, అవి తార్కికమూ, నిగమితములూ (Deductive) అని ప్రతిపాదించేడు.  అంతేగాక, యౌవనారంభవేళలో, ఈ బాల్యపుటాలోచనలలోకి బాహ్యప్రపంచపు  నిరంతరచొరబాటు వలన, అవి నత్త గుల్లలోకి ముడుచుకుపోయినట్టు, లోనికి ముడుచుకుపోవడముగాని, లేదా, శక్తిమంతముగా ఎదిగి బాహ్యప్రపంచాన్ని ఎదుర్కోడానికి తగిన సన్నధ్ధత సమకూర్చుకోవడంగాని చేస్తాయని ప్రతిపాదించేడు.

“Memoirs of the Midget” అన్న అతని నవలా, 100 కు పైగా రాసిన అతని దయ్యాల కథలలో “Seaton’s Aunt”, “Out of the Deep” అన్న కథలూ అతనికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. “Songs of Childhood” తో పాటు అతను 5 కవితా సంకలనాలూ, 10కి పైగా కథా సంకలనాలూ, 5 నవలలూ వెలువరించాడు.

.

An Epitaph
.

Here lies a most beautiful lady,
Light of step and heart was she;
I think she was the most beautiful lady
That ever was in the West Country.

But beauty vanishes, beauty passes;
However rare — rare it be;
And when I crumble,who will remember
This lady of the West Country.

.

Walter de la Mare

(25 April 1873 – 22 June 1956)

English poet, Short Story Writer and Novelist  De la Mare, apart from his short stories and ghost stories for children, is perhaps most remembered for his lecture, “Rupert Brooke and the Intellectual Imagination,” wherein he delineated two kinds of imagination in people: the childlike and the boylike… the childlike imagination being visionary and “intuitive and inductive” whereas the Boylike imagination is “logical and deductive”. He also claimed that if ‘truth is beauty’ for childlike imagination, for boylike, it is the other way. He proposed that the increasing intrusions of the external world upon the mind would frighten the childlike imagination to retire it into a shell, like a shocked snail, and from then on the boyish imagination flourishes. By adulthood the childlike imagination would either retreat for ever or would grow bold enough to face the real world.

%d bloggers like this: