అనువాదలహరి

శాంతశీలి సాలీడు… వాల్ట్ వ్హిట్మన్, అమెరికను కవి

ఒక చిన్నగుట్టమీద ఒంటరిగా నిశ్శబ్దంగా ఉన్న
శాంతశీలియైన ఒక సాలీడుని అది దానిపరిసరాల్లోని
ఖాళీజాగాలని ఎలా వాడుకుందికి ప్రయత్నిస్తుందో గమనించేను.
అది ముందుగా దానిపొట్టలోంచి ఒక సన్నని దారాన్ని తీసి దూకింది,
అక్కడినుండి అలసటలేకుండా దారాన్ని తీస్తూ అల్లుతూనే ఉంది…

పరీవ్యాప్తమైన, ఎల్లలులేని రోదసిచే చుట్టుముట్టబడి
నిర్లిప్తంగా నిలబడ్డ ఓ నా మనసా!
నిరంతరం ఆలోచిస్తూ, కనిపిస్తున్న గోళాలచలనాన్ని అర్థంచేసుకుందికి
సాహసంతో సిద్ధాంతాలు ప్రతిపాదిస్తూ, విడిచిపెడుతూ, చివరకి
నీకు నచ్చిన సిద్ధాంతం దొరికేక, నిరాధారమైన ఆలోచనల వంతెన
ఎలాగోలా నిలబడడానికి, అతిసన్నని హేతువుతో అల్లిన ప్రతిపాదనని
ఎక్కడైనా పట్టుదొరకకపోతుందా అన్న ఆశతో విసురుతూనే ఉంటావు, కదూ!
.
వాల్ట్ వ్హిట్మన్
May 31, 1819 – March 26, 1892
అమెరికను కవి

 

.

A Noiseless Patient Spider

.

A noiseless patient spider,

I mark’d where on a little promontory it stood isolated,

Mark’s how to explore the vacant vast surrounding,

It launch’d forth filament, filament, filament, out of itself,

Ever unreeling them, ever tirelessly speeding them.

And you O my soul where you stand,

Surrounded, detached, in measureless oceans of space,

Ceaselessly musing, venturing, throwing, seeking the spheres to connect them,

Till the bridge you will need be form’d, till the ductile anchor hold,

Till the gossamer thread you fling catch somewhere, O my soul.

Walt Whitman

May 31, 1819 – March 26, 1892

American

Poem Courtesy:

http://www.poemtree.com/poems/NoiselessPatientSpider.htm

ఇదిగో నీకే…. వాల్ట్ విట్మన్, అమెరికను

పద! అందరికీ దూరంగా మనిద్దరం కలిసినడుద్దాం;

ఇక మనిద్దరం ఏకాంతంగా ఉన్నాం గనుక
కాసేపు మర్యాదలన్నీ పక్కనబెడతావా?
ప్రారంభించు! నువ్వింతవరకు ఎవరికీ చెప్పనిది నాతో చెప్పు.
విషయమంతా ఉన్నదున్నట్టుగా చెప్పు.
నువ్వు నీ సోదరుడికీ, నీ భార్యకీ (లేదా భర్తకీ), వైద్యుడికీ చెప్పనివన్నీ వినిపించు.

.

వాల్ట్ విట్మన్

మే 31, 1819 – మార్చి 26, 1892 పద

అమెరికను

.

.

To You

.

Let us twain walk aside from the rest;

Now we are together privately,

do you discard ceremony,

Come! Vouchsafe to me what has yet been vouchsafed to none—

Tell me the whole story,

Tell me what you would not tell your brother, wife, husband, or physician.

.

Walt Whitman

May 31, 1819 – March 26, 1892

American poet

Poem Courtesy:

http://100.best-poems.net/you.html

 

 

కడసారి ప్రార్థన… వాల్ట్ వ్హిట్మన్, అమెరికను

ఎలాగైతేనేం, చివరకి, తేలికగా

కోటలా భద్రమైన ఈ ఇంటి గోడల మధ్యనుండీ

చక్కగా దువ్విన కురుల కౌగిలిబంధాలనుండీ

మూసిన తలుపుల చెరసాలనుండీ

నన్ను ఎగిరిపోనీ.

ఓ మనసా! తలుపులు తెరూ!

చప్పుడు చెయ్యకుండా ఇక్కడినుండి పోనీ;

మెత్తనైన తాళంచెవితో గుసగుసలాడుతూ తాళం తెరూ…

తొందరపడకు! ఓరిమి వహించు,

(ఓ నశ్వరమైన శరీరమా, నీమీది మోహం వదలదు సుమీ!

ఓ ప్రేమపాశమా, నీ బంధం ఒకంత వదలదు సుమీ!)

.

వాల్ట్ వ్హిట్మన్

మే 31 1819 – మార్చి 26 1892)

అమెరికను

.

Walt Whitman

.

The Last Invocation

.

At the last, tenderly,        

From the walls of the powerful fortress’d house,    

From the clasp of the knitted locks, from the keep of the well-closed doors,  

Let me be wafted. 

Let me glide noiselessly forth;        

With the key of softness unlock the locks—with a whisper,       

Set ope the doors O soul.

Tenderly—be not impatient,     

(Strong is your hold O mortal flesh,   

Strong is your hold O love).

Walt Whitman

(May 31, 1819 – March 26, 1892)

American

Poem Courtesy:

English Poetry III: From Tennyson to Whitman.

The Harvard Classics.  1909–14.

http://www.bartleby.com/42/823.html

అర్థరాత్రి నిద్రలో… వాల్ట్ వ్హిట్మన్, అమెరికను

1

అర్థ రాత్రి నిద్రలో, వ్యధాభరితమైన అనేక ముఖాలు,

చూడటానికి ప్రాణాంతకంగా గాయపడ్డ చూపులు —

                               వర్ణించనలవిగాని ఆ చూపులు;

వెల్లకిలాపడిన నిహతులు, చేతులు బార్లా జాపుకుని,

కలగంటి, కలగంటి, కలగంటి.

2

ప్రకృతి దృశ్యాలు, పంటచేలు, మహానగాలు,

తుఫానువెలిసిన తర్వాతి అందమైన ఆకాశాలు…

రాత్రిపూట అద్భుతంగా ప్రకాశిస్తూ చందమామ

తళతళా మెరుస్తూ,  క్రింద మేము కందకాలు తవ్వుతూ

మట్టి పోకలుపోస్తున్న చోట కాంతి ప్రసరిస్తూ,

కలగంటి కలగంటి కలగంటి

3

అవన్నీ గతించిపోయి ఎన్నేళ్ళో అయింది

— ఆ ముఖాలూ, ఆ కందకాలూ, ఆ పంటచేలూ…;

అక్కడి మారణహోమం నుండి,

నిర్లక్ష్యంతో కూడిన స్థైర్యంతో,

రాలిపోయిన వారికి దూరంగా,

ముందుకి కాలంతో పాటు పరిగెత్తేను.

కానీ ఇప్పుడు ఆ  ఆకారాలన్నీ రాత్రిపూట

కలగంటున్నా, కలగంటున్నా, కలగంటున్నా.

.

(From Leaves Of Grass)

.

వాల్ట్ వ్హిట్మన్

31 మే, 1819 – మార్చి 26, 1892

అమెరికను కవి

ఈ కవితలో గొప్ప సౌందర్యం ఉంది. ఈ కవిత ఒక వృద్ధసైనికుడి జ్ఞాపకాలగురించి అయినప్పటికీ, ఈ పరివేదన అందరికీ  చెందుతుంది.  జీవితం ఒక గొప్ప పోరాటం అనుకుంటే, మనకంటే ముందు గతించిపోయిన వారందరూ యుద్ధంలో నిహతులక్రిందే లెక్క. మనం వాళ్ళందరి నుండి కాలంతో పాటు పరిగెత్తుకుని వచ్చాం.  ఆ ముఖాలు అప్పటంత ప్రస్ఫుటంగా ఉండకపోవచ్చు.  మసకబారినా ఆముఖాలే మనకళ్ళకి నిద్రలో కనిపిస్తాయి.

.

.

In Midnight Sleep

1

In midnight sleep, of many a face of anguish,

Of the look at first of the mortally wounded—

                        of that indescribable look;

Of the dead on their backs,

                        with arms extended wide,

I dream, I dream, I dream.

2

Of scenes of nature, fields and mountains;

Of skies, so beauteous after a storm—

                        and at night the moon so unearthly bright,

Shining sweetly, shining down,

                        where we dig the trenches and gather the heaps,

I dream, I dream, I dream.

3

Long, long have they pass’d

                         — faces and trenches and fields;

Where through the carnage

                                I moved with a callous composure

                         — or away from the fallen,

Onward I sped at the time

                         — But now of their forms at night,

    I dream, I dream, I dream.

.

(From Leaves Of Grass)

.

Walt Whitman

(May 31, 1819 – March 26, 1892)

American

నిర్బంధించబడిన ఆత్మ … వాల్ట్ విట్మన్, అమెరికను కవి

చివరకి, తేలిపోతూ
 
కోటలా సురక్షితమైన ఈ ఇంటిగోడల మధ్యనుండీ
   
దగ్గరా మూసిన తలుపులనుండీ, పకడ్బందీగా వేసిన తాళాలనుండీ 
 
నన్ను ఎగిరిపోనీ…
 

 
నన్ను చప్పుడు చెయ్యకుండా జారుకోనీ…
 
సుతి మెత్తని గుసగుసలతో తాళాలు తీసుకుంటూ …
 
ఓ నా జీవమా! ద్వారాలు తెరుచుకోనీ.
 

 
ఓహో, నెమ్మదిగా! అంత అసహనం కూడదు..
 
ఎంత బిగువైనది నీ పట్టు, నశ్వరమైన శరీరమా!
 
ఎంత బలీయము ఈ వ్యామోహము, ప్రేమా!

.

వాల్ట్ విట్మన్


31 మార్చి, 1819 – 26 మార్చి 1892


అమెరికను కవి

.

Walt Whitman's use of free verse became apprec...
Walt Whitman’s use of free verse became appreciated by composers seeking a more fluid approach to setting text. (Photo credit: Wikipedia)

 

The Imprisoned Soul

.

At the last, tenderly,

From the walls of the powerful, fortress’d house,

From the clasp of the knitted locks—from the keep of the well-closed doors,

Let me be wafted.

 

Let me glide noiselessly forth;

With the key of softness unlock the locks—with a whisper

Set ope the doors, O soul!

 

Tenderly! be not impatient!

(Strong is your hold, O mortal flesh!

Strong is your hold, O love!)

.

Walt Whitman

(May 31, 1819 – March 26, 1892)

American Poet

(Poem Courtesy: http://www.bartleby.com/101/742.html

The Oxford Book of English Verse: 1250–1900, Arthur Quiller-Couch, ed. 1919.)

పరాయీ!… వాల్ట్ వ్హిట్మన్, అమెరికను కవి

.

అలా పక్కనుండి నడిచిపోయే పరాయీ!

నీకు తెలీదు నే నెంత ఆశగా నీకోసం వెతుకుతున్నానో,

నే నెదురుచూస్తున్న పురుషుడు, లేదా స్త్రీ, నువ్వే కావచ్చు,

(నా కది ఒక కలలా అనిపిస్తుంటుంది)

 నే నెక్కడో నీతోపాటు ఆనందంగా జీవితం గడిపేను,

ఒకరికొకరు తారసపడి కనుమరుగవగానే,

లీలగా అంతాగుర్తుకువస్తున్నట్టనిపిస్తుంది,

నువ్వు నా ఈడు బాలుడివో, బాలికవో,

వాత్సల్యంతో, నిష్కల్మషంగా, యుక్తవయసుకి

నాతోపాటే ఎదిగావునువ్వు

మనిద్దరం కలిసే తిన్నాం, కలిసే పడుక్కున్నాం—

నీ శరీరం నీదీ, నా దేహం నాదీ అనకుండా ఒక్క శరీరంలా పెరిగాం;

మనిద్దరం ఒకర్నొకరు దాటుకుని పోతుంటే,

నీ కళ్ళూ, ముఖమూ, దేహ ఛాయలతో మనసు చూరగొని

బదులుగా నా గడ్డమూ, హృదయమూ, చేతులూ తీసుకుంటావు;

నేను నీతో మాటాడే అవకాశం ఉండదు—

నే నొక్కడినే కూర్చున్నపుడూ,

రాత్రి ఒంటరిగా నిద్రలేచినపుడూ

నీ గురించి ఆలోచిస్తుంటాను;

నేను నీకోసం నిరీక్షించాలి,

మళ్ళీ నిన్ను కలవడం గురించి సందేహం లేదు,

కాని, ఈసారి నిన్ను తప్పిపోకుండా ఎలాగైనా పట్టుకోవాలి.

.

వాల్ట్ వ్హిట్మన్

అమెరికను కవి

.

ఇందులో ఈ పరాయి, నిజంగా పరాయి కాదు. అది మనమే, మన మనస్సే, మన అహం అంటే The inner self. జ్ఞానం వచ్చినది మొదలు మనల్ని అన్నివేళలా కనిపెట్టుకుని, తప్పొప్పుల్ని హెచ్చరిస్తూ మనతో పాటు పెరిగేది ఈ అహమే. కాని, ఈ అహం గురించిన స్పృహ (Awareness)…  మనల్ని మననుంచి విడదీసుకుని చూసి (alienating ourselves from the I)  మనల్ని భూమిమీద అనేకానేక జీవులలో ఒక జీవిగా గుర్తించి, అది నశ్వరమని అంగీకరించగల స్పృహ … అంత తొందరగా రాదు; వచ్చినా, అది ఇచ్చే హెచ్చరికలని పెడచెవిని పెట్టడమే గాని, తదనుగుణంగా నడుచుకోవడం ఉండదు. ఇది మరేదో కాదు… మనకి తెలియకుండానే మనం సమీకరించుకున్న తప్పొప్పుల, ఆదర్శాల, వివేచనల సమాహారం. మనం ఏకాంతంలో ఉన్నప్పుడు మన ఆలోచనలన్నీ మన చర్యల్ని సింహావలోకనం చేసుకోవడం (Introspection)  వైపు పరిగెడతాయి. మన తప్పుల్ని మనం ఎంతగా సమర్థించుకుందికి (rationalize చెయ్యడానికి) ప్రయత్నించినా, మనకీ, మన లోపలి వ్యక్తికీ తెలుసు అది నిజానికి నిలబడని వాదన అని.

కవి, ఈ అహాన్ని పరాయివ్యక్తి (The other person or one different from I) గా పోల్చి చెప్పేడు.

.

Walt Whitman, age 37, Fulton St., Brooklyn, N....
Walt Whitman, age 37, Fulton St., Brooklyn, N.Y., steel engraving by Samuel Hollyer from a lost daguerreotype by Gabriel Harrison. (Photo credit: Wikipedia)

.

To A Stranger

.

Passing stranger! you do not know how longingly I

         look upon you,

You must be he I was seeking, or she I was seeking,

         (it comes to me, as of a dream,)

I have somewhere surely lived a life of joy with you,

All is recall’d as we flit by each other, fluid, affection-

         ate, chaste, matured,

You grew up with me, were a boy with me, or a girl

         with me,

I ate with you, and slept with you—your body has

         become not yours only, nor left my body mine

         only,

You give me the pleasure of your eyes, face, flesh, as

         we pass—you take of my beard, breast, hands,

         in return,

I am not to speak to you—I am to think of you when

         I sit alone, or wake at night alone,

I am to wait—I do not doubt I am to meet you again,

I am to see to it that I do not lose you.

.

Walt Whitman

(May 31, 1819 – March 26, 1892)

American Poet

Poem Courtesy:  http://www.whitmanarchive.org/

సహనశీలియైన సాలీడు… వాల్ట్ వ్హిట్మన్, అమెరికను కవి

Hanging Spider-Thatcher Park Indian Ladder Trail

.

ఒక్కతే, ఏకాంతంగా,

చడీ చప్పుడూ లేకుండా

ఆ ఏత్తైన గుట్టమీద నుండీ వేలాడుతున్న

ఒక సహనశీలియైన సాలీడుని చూశాను;

ఆ విశాలమైన పరిసరాల

శూన్యపుహద్దులని శోధించడానికి

అలుపన్నది ఎరగకుండా

తనలోంచి నిరంతరాయంగా

ఒక్కొక్కపోగూ, ఒక్కొక్క పోగూ

తియ్యడాన్ని గమనించేను.

.

ఓ మనసా!

మేరలులేని శూన్యసాగరాలు

చుట్టుముట్టిన నువ్వు

అనంతంగా ఆలోచిస్తూ,

ఏదోప్రయాసపడుతూ, చేతులెత్తేస్తూ

చుక్కల్ని అందుకోవాలనీ,

ముడివెయ్యాలనీ ఆరాటపడతావు; కానీ,

తీగెసాగిన నీ ఊహలు సేతువు నిర్మించగలిగేదాకా

వేసిన బలహీనమైన  లంగరులు నిలదొక్కుకునేదాకా

నువ్వు విసరిన ఆ సన్ననిపోచ

మరొక అంచుకి తగులుకునేదాకా

ఓ మనసా!

దానితో పోలికకి నువ్వెక్కడ సాటిరాగలవు?

.

వాల్ట్ వ్హిట్మన్

English: Walt Whitman. Library of Congress des...
English: Walt Whitman. Library of Congress description: “Walt Whitman”. (Photo credit: Wikipedia)

A noiseless, patient spider

.

A noiseless, patient spider,

I mark’d, where, on a little promontory, it stood, isolated;

Mark’d how, to explore the vacant, vast surrounding,

It launch’d forth filament, filament, filament, out of itself;

Ever unreeling them—ever tirelessly speeding them.

And you, O my Soul, where you stand,

Surrounded, surrounded, in measureless oceans of space,

Ceaselessly musing, venturing, throwing,—seeking the
spheres, to connect them;

Till the bridge you will need, be form’d—till the ductile anchor hold;

Till the gossamer thread you fling, catch somewhere, O my Soul.

.

Walt Whitman

నేను ఖగోళ శాస్త్రజ్ఞుణ్ణి విన్నప్పుడు … వాల్ట్ వ్హిట్మన్

నే నొకసారి

ఖగోళశాస్త్రపారంగతుడిని విన్నప్పుడు

అతను సిధ్ధాంతాలనీ దాఖలాల్నీ,

అంకెల్లో అడ్డంగా, నిలువుగా

పట్టీలువేసి చూపిస్తూ;

పటాలూ, బొమ్మలతో విశదపరుస్తూ;

సంకలనవ్యవకలనాలతో

అంచనాలు వేసి చెబుతుంటే;

ఆ గదిలో అతని ప్రసంగాన్ని

అందరి అభినందనల మధ్యా

కూర్చుని నేను వింటున్నప్పుడు

నాకు వల్లమాలిన విసుగేసి,

ఎంత వెగటు అనిపించిందో చెప్పలేను.

తక్షణం అక్కడనుండి లేచి

మెల్లగా బయటకు జారుకున్నాను

.

మంత్రముగ్ధుల్ని చేసే ఆ చల్లని రాత్రిలో

ఒక్కడినీ బయట తిరుగుతూ

పరీవ్యాప్తమైన నీరవ నిశీధిలో

అప్పుడప్పుడు తలపైకెత్తి

నక్షత్రాలని

మౌనంగా వీక్షించేను

.

Walt Whitman's use of free verse became apprec...
Walt Whitman’s use of free verse became appreciated by composers seeking a more fluid approach to setting text. (Photo credit: Wikipedia)

వాల్ట్ వ్హిట్మన్

.

When I heard the Learn’d Astronomer

.

When I heard the learn’d astronomer;

When the proofs, the figures,

were ranged in columns before me;

When I was shown the charts and the diagrams,

to add, divide, and  measure them;

When I, sitting, heard the astronomer,

Where he lectured with much applause

in the lecture-room,

How soon, unaccountable,

I became tired and sick;

Till rising and gliding out,

I wander’d off by myself,

In the mystical moist night-air,

and from time to time, Look’d up

in perfect silence

at the stars.

.

Walt Whitman

ఓ నావికుడా! నా నాయకుడా! … వాల్ట్ వ్హిట్మన్

O Captain! My Captain!
O Captain! My Captain! (Photo credit: jfortugaleza)

ఓ నావికుడా! నా నాయకుడా!
మన భయంకర ప్రయాణం ముగిసింది.
మన ఓడ ప్రతి ప్రమాదాన్నీ తట్టుకుని నిలబడింది,
మనం లక్ష్యాన్ని సాధించగలిగాం
అదిగో, రేవు సమీపిస్తోంది, గంటలు వినబడుతున్నై
ప్రజలు ఉత్సాహంతో ఉరకలువేస్తున్నారు,
సాహసయాత్రముగించిన ఈ నౌక నిలకడగా లంగరు వేస్తుంటే
అందరికళ్ళూ దాని మీదే, మౌనంగా, విచారంగా…
అయ్యో నా హృదయమా! హృదయమా! హృదయమా!
నా నాయకుడు ఈ డెక్ మీద
రాలిపోయాడు… శరీరం చల్లబడి, నిశ్చైతన్యమై
రక్తం బొట్లు బొట్లుగా కారుతూనే ఉంది.

ఓ నాయకుడా! నా నావికుడా! లే! ఆ గంటలు ఒక్కసారి విను!
ఒక్క సారి లే! నీకోసం జండా విసురుతున్నారు పట్టుకో!
నీ కోసమే మేళాలు మధురంగా మ్రోగుతున్నాయి;
ఆ పూలదండలూ, అలంకరించిన మాలలూ నీ కోసమే,
నీ కోసమే తీరం తీరం అంతా జనసమ్మర్దమౌతోంది
నీ కోసమే ప్రజలంతా నిరీక్షిస్తూ, నీ పేరే జపిస్తున్నారు
అయ్యో మా తండ్రీ!
నీ తలక్రింద నా చెయ్యి ఉంచనీ
ఇక్కడ నీ కల సాకారమై ఎదురుచూస్తోంది
నువ్వుమాత్రం కూలబడిపోయావు, గతాసువువై.

నా నాయకుడిక పలకడు; అతనిపెదాలు వివర్ణమై, మెదలవు;
నా తండ్రికి నా మోచెయిస్పర్శతెలీదు; అతనికి నాడీలేదు, ఇచ్ఛాలేదు.
ఈ నౌక క్షేమంగా, నిర్భయంగా లంగరువేయబడింది.
దాని యాత్ర సమర్థవంతంగా పరిసమాప్తమయింది.
ప్రమాదభరితమైన యాత్ర చేసి, లక్ష్యం సాధించి, విజయంతో తిరిగివచ్చింది.
సమస్త తీరాల్లారా! హర్షధ్వానాలు చెయ్యండి!
సమస్త ఘంటికల్లారా! నిర్విరామంగా మ్రోగండి!
నేను, శోకంతో అడుగులేస్తూ నా కడపటి వందనం చెల్లిస్తాను
నా నాయకుడు డెక్ మీద శయనిస్తున్నాడు
ఉపహతుడై కూలబడిపోయాడు…నిర్జీవంగా.

.

Walt Whitman's use of free verse became apprec...
Walt Whitman’s use of free verse became appreciated by composers seeking a more fluid approach to setting text. (Photo credit: Wikipedia)

వాల్ట్ వ్హిట్మన్

(May 31, 1819 – March 26, 1892)

.

(అమెరికన్ సివిల్ వార్ నేపథ్యం లో ప్రతీకాత్మకంగా వ్రాసిన అద్భుతమైన కవిత ఇది. ఈ కవితలో   చెప్పిననాయకుడు… టెక్సాస్ లో నిహతుడైన అమెరికను ప్రెసిడెంటు అబ్రహాం లింకన్; పడవ… అమెరికా; ఉతర దక్షిణ రాష్ట్రాలమధ్య జరిగిన యుద్ధానికి బానిసత్వ నిర్మూలన ముఖ్యమైన విషయం. మీరు Dead Poets Society అన్న సినిమా చూసి ఉండకపోతే తప్పకుండా చూడండి. పిల్లలకి కవిత్వాన్ని ఎలా బోధించాలన్న ప్రధాన సమస్య దాని నేపధ్యం. ఈ కవితని హీరో అనేక సార్లు ఉటంకిస్తాడు. దాని ఔచిత్యం మీకు సినిమా ముగింపులో బోధపడుతుంది.

విడిగా కూడ ఇది చాలా భావోద్వేగాన్ని కలిగించే కవిత. అన్ని దేశాలలోనూ, అనేక సందర్భాలలోనూ విజయాన్ని అందించి దాన్ని చూసే తరుణంలో సజీవులై ఉండని వ్యక్తులు మనకి కనిపిస్తుంటారు. అంతెందుకు… చాలా కుటుంబాలలో తల్లిదండ్రులలో ఎవరో ఒకరు (కనీసం) ఈ  కోవకు చెందిన వారే.)

.

O Captain! My Captain!

.

O Captain! My Captain! Our fearful trip is done;
The ship has weather’d every rack, the prize we sought is won;
The port is near, the bells I hear, the people all exulting,
While follow eyes the steady keel, the vessel grim and daring:
But O heart! heart! heart!
O the bleeding drops of red,
Where on the deck my Captain lies,
Fallen cold and dead.

O Captain! my Captain! rise up and hear the bells;
Rise up–for you the flag is flung–for you the bugle trills;
For you bouquets and ribbon’d wreaths–for you the shores a-crowding;
For you they call, the swaying mass, their eager faces turning;
Here Captain! dear father!
This arm beneath your head;
It is some dream that on the deck,
You’ve fallen cold and dead.

My Captain does not answer, his lips are pale and still;
My father does not feel my arm, he has no pulse nor will;
The ship is anchor’d safe and sound, its voyage closed and done;
From fearful trip, the victor ship, comes in with object won;
Exult, O shores, and ring, O bells!
But I, with mournful tread,
Walk the deck my Captain lies,
Fallen cold and dead.
.

Walt Whitman

(May 31, 1819 – March 26, 1892)

Whitman's O Captain! My Captain!
Whitman’s O Captain! My Captain! (Photo credit: Wikipedia)

గుడారాల దీపాల వెలుగులో… Walt Whitman

గుడారాల దీపాలవెలుగులో,

నా చుట్టూ నిశ్శబ్దంగా,

నెమ్మదిగా కొన్ని అందమైన నీడలు తారట్లాడుతున్నాయి…

ముందుగా నేను గమనించింది

దూరాన నిద్రలో నున్న సైనిక  పటాలం;

రేఖామాత్రంగా కనిపిస్తున్న పొలాలూ;

చిట్టడవుల చివరలూ; చిమ్మచీకటీ;

ఉండుండి చీకటిని వెలిగిస్తూ

చలిమంటలను ఎగదోసినపుడు

పైకి ఎగసిపడే నిప్పు రవ్వలూ…

నిశ్శబ్దమూ;

అప్పుడప్పుడు  దెయ్యాల్లా కదుల్తున్న

ఒకటో అరో మనుషుల జాడలూ;

చెట్లూ చేమలూ

(ఒక్కసారి కళ్ళెత్తిచూసేసరికి

అవి నన్నుదొంగచాటుగా గమనిస్తున్నాయేమోనని అనిపించింది);

గాలికూడా ఆలోచనలతో జతకట్టి ఊరేగుతుంటే…

ఓహ్! ఎంత సున్నితమైన, అద్భుతమైన ఆలోచనలు…

జీవితం గురించీ, మృత్యువుగురించీ,

ఇంట్లోవాళ్లగురించీ, గతమూ, గతించిన ప్రేమలూ,

దూరమైపోయినవాళ్ళూ;

నేనలా నేలమీద కూర్చుని గమనిస్తుంటే,

నా చుట్టూ చప్పుడుచెయ్యకుండా వెళ్తున్న ఊరేగింపులా…

దూరాన్నున్న గుడారాల వెలుగునుండి

ప్రవాహంలా వస్తున్ననీడలు…

.

Walt Whitman's use of free verse became apprec...

వాల్ట్ వ్హిట్మన్

(May 31, 1819 – March 26, 1892)

.

By the Bivouac’s Fitful Flame

.

By the bivouac’s fitful flame,
A procession winding around me, solemn and sweet and slow;—but first I note,
The tents of the sleeping army, the fields’ and woods’ dim outline,
The darkness, lit by spots of kindled fire—the silence;
Like a phantom far or near an occasional figure moving;
The shrubs and trees, (as I lift my eyes they seem to be stealthily watching me;)
While wind in procession thoughts, O tender and wondrous thoughts,
Of life and death—of home and the past and loved, and of those that are far away;
A solemn and slow procession there as I sit on the ground,
By the bivouac’s fitful flame.

.

Walt Whitman

(May 31, 1819 – March 26, 1892)

American Poet

%d bloggers like this: