అనువాదలహరి

చిన్నిపెట్టె… వాస్కో పోపా, సెర్బియన్ కవి

ఇక్కడ “చిన్ని పెట్టె” ఒక ప్రతీక. అది మనిషి జ్ఞాపకాలకీ, మెదడుకీ కూడా సంకేతం కావొచ్చు. ఇలా సున్నితంగా ప్రారంభమైన జీవితం, దృశ్య, శ్రవణాది ఇంద్రియాల అనుభూతుల్నీ, వాటి జ్ఞాపకాలను పోగుచేసుకోవడం ప్రారంభిస్తుంది. ఇంత చిన్నదీ, ప్రపంచం గురించి అవగాహన చేసుకుంటూ, ప్రపంచాన్ని తనలో ఇముడ్చుకోగలిగేలా ఎదిగిపోతుంది. ఈ జ్ఞాపకాలని ఇతరులతో పంచుకుంటుంది. వయసు మీరినపుడు అందులో కొన్ని పోగొట్టుకుంటుంది. నిజానికి ఎవరికైనా, జీవితమంతా అనుభూతుల, జ్ఞాపకాల భరిణ. అందుకే వాటిని పదిలంగా కాచుకోవాలని చెబుతున్నాడు కవి.

***

ఈ చిన్ని పెట్టెకు పాలపళ్ళు మొలిచి,
కొంత పొడుగు ఎదిగి
ఒళ్ళు చేసి, ఈ శూన్యావరణంలో
దానికి ఒక రూపం ఏర్పడుతుంది.

ఒకప్పుడు తను పట్టిన బీరువా
ఇపుడు తనలో ఇమడగలిగేలా
క్రమంగా ఎదుగుతూ ఎదుగుతూ పోతుంది.

అదింకా పెద్దవుతూ పోతుంటే
ఇప్పుడు ఆ గది తనలో ఇమిడిపోతుంది,
తర్వాత ఈ ఇల్లూ, ఈ ఊరూ, ఈ భూమి
చివరకి ఈ విశ్వం అందులో ఇముడుతుంది.

ఈ చిన్నిపెట్టెకు తన బాల్యం గుర్తుంటుంది
అమితమైన కాంక్షతో
తిరిగి తనో చిన్న పెట్టె ఐపోతుంది.

ఇపుడా చిన్నిపెట్టెలో
ఈ విశ్వమంతా సూక్ష్మరూపంలో ఉంది.
ఇపుడు మీరు సులభంగా జేబులో పెట్టుకోవచ్చు,
ఎవరైనా దొంగిలించవచ్చు, మీరు పోగొట్టుకోవచ్చు.

కనుక ఆ చిన్నిపెట్టె జాగ్రత్త !
.
వాస్కో పోపా

June 29, 1922 – January 5, 1991

సెర్బియన్ కవి

 

.

The Little Box

.

`The little box gets her first teeth
And her little length
Little width little emptiness
And all the rest she has

The little box continues growing
The cupboard that she was inside
Is now inside her

And she grows bigger bigger bigger
Now the room is inside her
And the house and the city and the earth
And the world she was in before

The little box remembers her childhood
And by a great longing
She becomes a little box again

Now in the little box
You have the whole world in miniature
You can easily put in a pocket
Easily steal it lose it

Take care of the little box
.
Vasko Popa
June 29, 1922 – January 5, 1991
Serbian Poet

Poem Courtesy:

https://www.poemhunter.com/poem/the-little-box/

మా పూర్వీకుల గ్రామంలో… వాస్కో పోపా, సెర్బియన్ కవి

ఒకరు నన్ను కాగలించుకుంటారు
ఒకరు నా వంక తోడేలులా చూస్తారు
మరొకరు తన టోపీని తీస్తారు
తనని నేను బాగా చూడగలిగేలా.

ప్రతివారూ నన్నడుగుతుంటారు
నేన్నీకు ఏమౌతానో చెప్పగలవా అంటూ

ఎన్నడూ ఎరుగని వృద్ధ స్త్రీలూ, పురుషులూ
నా చిన్నప్పటి జ్ఞాపకాలలోనిలిచిన పేర్లు
చెబుతూ … వాళ్ళు తామే అంటారు.

అందులో ఒకర్ని అడుగుతాను:
నామీద దయ ఉంచి చెప్పండి
“తోడేలు జార్జి” ఇంకా బ్రతికున్నాడా?

ఏదో మరో లోకంనుండి మాటాడినట్టు
ఒక వ్యక్తి “అది నేనే” అంటాడు.

అతని చెంపలు నా చేత్తో రాస్తూ
కళ్ళతోనే సంజ్ఞచేస్తాను:
నేనింకా బ్రతికే ఉన్నానా? అని.

.

వాస్కో పోపా

June 29, 1922 – January 5, 1991

సెర్బియన్ కవి.

.

.

In the Village of My Ancestors

.

Someone embraces me

Someone looks at me with the eyes of a wolf

Someone takes off his hat

So I can see him better

Everyone asks me

Do you know how I’m related to you

Unknown old men and women

Appropriate the names

Of young men and women from my memory

I ask one of them

Tell me for God’s sake

Is George the Wolf still living

That’s me he answers

With a voice from the next world

I touch his cheek with my hand

And beg him with my eyes

To tell me if I’m living too

.

Vasko Popa

June 29, 1922 – January 5, 1991

Serbian Poet

Poem Courtesy:

https://www.poemhunter.com/poem/in-the-village-of-my-ancestors/

 

పరుగు… వాస్కో పోపా, సెర్బియన్ కవి

కొందరు పక్కవాళ్ళది కొరికెస్తారు  

మోచెయ్యో, కాలో, ఏది దొరికితే అది.

దానిని పళ్ళ మధ్య బిగబట్టి

వీలయినంత వేగంగా పరిగెడతారు.

దాన్ని మట్టిలో కప్పెస్తారు.

 

అందరూ అన్ని దిక్కులా పరిగెడతారు

వాసన చూడ్డం, వెతకడం, వాసనచూడ్డం, వెతకడం

భూమినంతటినీ తవ్వెస్తారు.

అదృష్టం బాగుంటే వాళ్లకో చెయ్యో

లేదా కాలో, మరొకటో దొరుకుతుంది

ఇప్పుడిక కొరకడం వాళ్ళ వంతు.

ఈ ఆట మహా జోరుగా సాగుతుంది

చేతులు దొరికినంత కాలం

కాళ్ళు దొరికినంతకాలం

అసలేదో ఒకటి దొరికినంతకాలం.

.

వాస్కో పోపా

June 29, 1922 – January 5, 1991

సైబీరియన్ కవి

Race… Vasko Popa

Some bite from the others
A leg an arm or whatever

Take it between their teeth
Run out as fast as they can
Cover it up with earth

The others scatter everywhere
Sniff look sniff look
Dig up the whole earth

If they are lucky and find an arm
Or leg or whatever
It’s their turn to bite

The game continues at a lively pace

As long as there are arms
As long as there are legs
As long as there is anything
.

Vasko Popa
June 29, 1922 – January 5, 1991
Siberian Poet

poem Courtesy:

http://www.poemhunter.com/poem/race/

%d bloggers like this: