Tag: Vasco Popa
-
పరుగు పందెం … వాస్కో పోపా సెర్బియన్ కవి
కొందరు మనుషులు అవతలివాడిది కాలో, చెయ్యో, ఏది దొరికితే ఒక ముక్క కొరికేస్తారు దాన్ని పళ్ళ మధ్య దొరకబుచ్చుకుని ఎంత వీలయితే అంత జోరుగా అక్కడినుండి ఉడాయించి దాన్ని గోతిలో కప్పెట్టి దాచుతారు. తక్కినవాళ్ళు నాలుగుపక్కలా కమ్ముకుని భూమంతా, వాసనచూడ్డం – తవ్వడం వాసనచూడ్డం – తవ్వడం చేస్తారు. వాళ్ళకి అదృష్టం కలిసొస్తే ఒక చెయ్యో, కాలో దొరుకుతుంది. ఇప్పుడు దాన్ని కొరికి పరిగెత్తడం వాళ్ళ వంతు. చేతులు దొరికినంత కాలం, కాళ్ళు అందినంతకాలం, చివరికి ఏదో […]
-
దొంగాట… వాస్కో పోపా, సెర్బియన్ కవి
ఒకడు మరొకడికి కనిపించకుండా దాక్కుంటాడు అతని నాలుకకింద దాక్కుంటాడు రెండవవ్యక్తి ఇతనికోసం నేలలో వెతుకుతాడు. ఒకడు తన తలరాతలో దాక్కుంటాడు రెండవవాడు ఇతనికోసం చుక్కల్లో వెతుకుతుంటాడు అతను తన మతిమరుపులో దాక్కుంటాడు రెండవవాడితనికోసం గడ్డిలో వెతుకుతుంటాడు. అతనికోసం వెతుకుతూనే ఉంటాడు అతనికోసం వెతకనిచోటుండదు. అలా వెతుకుతూ దారితప్పిపోతాడు. . వాస్కో పోపా June 29, 1922 – January 5, 1991 సెర్బియన్ కవి Hide and Seek Someone hides from someone else Hides […]
-
పొగరుబోతు పొరపాటు… వాస్కో పోపా, సెర్బియను కవి
అనగనగా ఒకప్పుడు ఓ పొరపాటు ఉండేది అది చాలా తెలివితక్కుదీ, చాలా చిన్నదీను. దాన్ని ఎవరూ కనీసం గుర్తించేవారుకూడా కాదు. అది తను తప్ప ఎవ్వరూ తనవంక చూడ్డంగాని వినడంగాని చెయ్యకపోడాన్ని సహించలేకపోయింది. అందుకని దానికి తోచిన అన్ని విషయాలూ కనిపెట్టింది దాని ఉనికి నిజంగా లేదని ఋజువుచెయ్యడానికి. అది దాని ఋజువులు భద్రపరచడానికి రోదసిని సృష్టించింది. అవి నిలవడానికి కాలాన్నీ, ఆ ఋజువులు చూడ్డానికి ప్రపంచాన్నీ సృష్టించింది. అది కల్పించినదంతా తెలివితక్కువ విషయమూ కాదు. అల్పవిషయమంతకన్నా […]
-
యాష్ ట్రేలో… వాస్కో పోపా, సెర్బియన్ కవి
ఒక చిన్ని సూర్యుడు పసుపుపచ్చ పుగాకు జులపాలతో మండుతున్నాడు యాష్ ట్రేలో. చవుకబారు లిప్ స్టిక్ నెత్తురు ఆరిపోయిన సిగరెట్టు కొనలను పీలుస్తోంది. శిరఛ్ఛేదం జరిగిన అగ్గిపుల్లలు సల్ఫరు కిరీటాలకై తహతహలాడుతున్నాయి. కొడిగట్టిన ధూమ్రవర్ణపు నుసిలో ఇరుక్కున్న నీలిపొగల గుర్రాలు హేషతో పైకి లేస్తున్నాయి. ఒక పెద్ద చేయి అరచేతిలో నిప్పులుమిసే కంటితో దిగంతాలలో పొంచి చూస్తోంది. . (అనువాదం: Anne Pennington) వాస్కో పోపా June 29, 1922 – Jan 5, 1991 సైబీరియన్ […]