Tag: Tu Fu
-
పొద్దు పోయింది… తూ-ఫూ, చీనీ కవి
ఆలమందలూ, జీవాలూ ఎప్పుడో ఇల్లు చేరాయి,పసులదొడ్డి ద్వారాలు మూయబడ్డాయి. స్పష్టమైన ఈ రేయి, తోటకి దూరంగా పర్వతాలమీదా నదులమీదా గాలి ఎగరగొట్టినట్టు చంద్రుడు పైకి లేస్తున్నాడు. ఎత్తైన, నల్లని చీకటి కొండగుహల్లోంచి సెలయేళ్ళు పలచగా జారుతున్నాయి, కొండ అంచున పచ్చిక మీద మంచు మెల్లగా పేరుకుంటోంది. లాంతరు వెలుగున నా జుత్తు ఇంకా తెల్లగా మెరుస్తోంది. పదే పదే అదృష్టాన్ని సూచిస్తూ దీపం ఎగుస్తోంది… ఎందుకో? . తూ- ఫూ 712- 770 చీనీ కవి . […]
-
శకటాల సంగీతం… తూ ఫూ, చీనీ కవి
శకటాలు ముందుకి కదులుతూ కిర్రు మంటున్నాయి గుర్రాలు మంద్రంగా శకిలిస్తూ మురుస్తున్నాయి నిర్బంధ సైనికుల నడుములకి ధనుర్బాణాలు వేలాడుతున్నాయి. వాళ్ళ తలిదండ్రులూ, భార్యాపిల్లలూ వీడ్కోలివ్వడానికి పరిగెడుతున్నారు, ఎంత దుమ్ము రేగుతోందంటే, గ్జ్యాన్యాంగ్ వంతెన కనిపించడం లేదు. వాళ్ళు బట్టలు చించుకుని, కాళ్లు నేలకు బాదుతూ, ఏడుస్తూ త్రోవకి అడ్డుపడుతున్నారు వాళ్ళ రోదనలు మింటికెగసి మబ్బుల్ని తాకుతున్నాయి. దారినపోయే దానయ్య ఒకడు సైనికుణ్ణడిగాడు “ఎందుకేడుస్తున్నా”రని సైనికుడు అన్నాడు: ఈ నిర్బంధపు సైనిక సేవ తరచు జరుగేదే. పదిహేనేళ్ళకు చాలా […]
-
శీలవతి… తూ ఫూ , చీనీ కవి
అందంలోనూ కులీనతలోనూ సాటిలేని ఒక ఉత్తమురాలైన స్త్రీ ఈ దిక్కుమాలిన లోయలో తలదాచుకుంటోంది. ఆమె చెప్పినదాన్ని బట్టి కలిగిన కుటుంబంలోంచే వచ్చింది గానీ ఇప్పుడు ఆ సంపద అంతా నశించిపోయింది; చెట్టూ చేమలాగ దక్షతలేక బతుకుతోంది. విప్లవకారులకి ముఖ్యభూబాగాలు చిక్కిన తర్వాత ఆమె అన్నదమ్ముల్ని వాళ్ళు మట్టుపెట్టేరు; పుట్టుక, హోదా అలాంటప్పుడు అక్కరకు రావుగదా! కనీసం వాళ్ళకి తగిన అంత్యక్రియలు చెయ్యడానికైనా వాళ్ళ అస్థికలు ఇంటికి తీసుకుపోడానికి ఆమెకు అనుమతించలేదు. ఒకప్పుడు వాళ్ళమాటకి ఎదురులేదనుకున్నవాళ్ళకి కూడా ప్రపంచం […]