అనువాదలహరి

మరణశయ్య… థామస్ హుడ్, ఇంగ్లీషు కవి

రాత్రంతా ఆమె ఊపిరితియ్యడాన్ని గమనిస్తూ గడిపాం, 

పోల్చుకోలేనంత నెమ్మదిగా ఆమె ఊపిరి తీస్తూనే ఉంది

ఆమెగుండెలో కొట్టుకుంటున్నట్టే 

ప్రాణం అటూ ఇటూ కొట్టుమిట్టాడుతోంది.

మేం ఎంత నెమ్మదిగా మాటాడుకున్నామంటే

ఎంత నెమ్మదిగా ఆమె చుట్టూ కదలాడేమంటే

ఆమెకి ఊపిసితీయగలశక్తి నివ్వడానికి

మా శక్తులన్నీ ధారపోస్తున్నామేమో అనిపించేంతగా.

మా ఆశలు మా భయాల్ని వమ్ము చేశాయి

మా భయాలు మా ఆశల్ని వమ్ము చేశాయి;

ఆమె పడుకున్నప్పుడు చనిపోయిందనుకున్నాం,

చనిపోయినపుడు పడుకుందనుకున్నాం.

ఎందుకంటే, చిన్న చినుకులతో, చలితో,

మసకమసకగా, నిరాశగా పొద్దుపొడిచినపుడు

ఆమె కనురెప్పలు శాశ్వతంగా మూసుకున్నాయి

మనదికాని వేరొక సూర్యోదయంలోకి ఆమె మేలుకుంది.

.

థామస్ హుడ్,

(23 May 1799 – 3 May 1845)

ఇంగ్లీషు కవి

.

.

The Deathbed

.

We watched her breathing through the night,

Her breathing soft and low,

As in her breast the wave of life

Kept heaving to and fro.

So silently we seemed to speak,

So slowly moved about,

As we had lent her half our powers,

To eke her being out.

Our very hopes belied our fears,

Our fears our hopes belied;

We thought her dying when she slept

And sleeping when she died.

For when the morning came dim and sad,

And chill with early showers,

Her quiet eyelids closed- she had

Another morn than ours.

.

Thomas Hood

(23 May 1799 – 3 May 1845)

English Poet

Poem Courtesy:

https://archive.org/details/WithThePoets/page/n258

నీరవము… థామస్ హుడ్, ఇంగ్లీషు కవి

ఎక్కడా చప్పుడు పుట్టని చోట నిశ్శబ్దం ఉండిఉండొచ్చు

చల్లని సమాధుల్లోనూ, సముద్రపు లో లోతుల్లోనూ

ఏ శబ్దమూ వినిపించని చోట నిశ్శబ్దం ఉండొచ్చు,

మూగబోయి, ఇంకా దీర్ఘనిద్రలో ఉన్న

ఏ ప్రాణి కనరాని విశాలమైన ఎడారుల్లోనూ ఉండొచ్చు;

కానీ ఏ గొంతుకా మూగపోలేదు, ఏ ప్రాణీ నిశ్శబ్దంగా చరించలేదు

సోమరిగా ఈ నేల మీద తిరిగి, ఎన్నడూ మాటాడక

నాచుపేరుకున్న శిధిలాల్లోనూ, పాడైన భవనాల్లోనూ

ఒకప్పుడు మనిషి వసించిన పురాతన భవంతుల్లోనూ

తిరిగే మేఘాలూ, మేఘాల్లా స్వేచ్ఛగా సంచరించే నీడలూ తప్ప; 

మధ్య మధ్యలో నక్కలూ, దుమ్ములగొండులూ అరిచినా,

అటూ ఇటూ త్వరగా ఎగిరే గుడ్లగూబలు వాటి ప్రతిధ్వనికి

అరిచినా, చిరుగాలి వినీవినిపించకుండా శోకించినా,

అక్కడే, ఒంటరిగా, సచేతనంగా నిజమైన నీరవం ఉంటుంది.

థామస్ హుడ్,

23 May 1799 – 3 May 1845

ఇంగ్లీషు కవి

 

.

.

 

Silence

There is a silence where hath been no sound,

There is a silence where no sound may be,

  In the cold grave—under the deep, deep sea,

Or in wide desert where no life is found,

Which hath been mute, and still must sleep profound;

  No voice is hush’d—no life treads silently,

  But clouds and cloudy shadows wander free,

That never spoke, over the idle ground:

But in green ruins, in the desolate walls

  Of antique palaces, where Man hath been,

Though the dun fox or wild hyæna calls,

  And owls, that flit continually between,

Shriek to the echo, and the low winds moan—

There the true Silence is, self-conscious and alone.

.

Thomas Hood.

English Poet

23 May 1799 – 3 May 1845

The Oxford Book of English Verse: 1250–1900

Ed: Arthur Quiller-Couch, 1919.

 http://www.bartleby.com/101/648.html

చొక్కా గీతం… థామస్ హుడ్, ఇంగ్లీషు కవి

వేళ్ళు అరిగి అరిగి నీరసించి

కనురెప్పలు ఎర్రబడి బరువెక్కి

స్త్రీకి యోగ్యం కాని చింకిపాతలలో

పాపం ఒక స్త్రీ, కూచుని

ఆమె సూదినీ దారాన్నీ లాక్కుంటూ

ఒక కుట్టు, రెండో కుట్టు, మూడో కుట్టు వేసుకుంటూ

పేదరికంతో, ఆకలితో, మురికిలో

విషాదము నిండిన గొతుతో

ఈ “చొక్కా గీతం” ఆలపించ సాగింది..

 

పని ! పని ! పని!

ఉదయం దూరంగా ఎక్కడో కోడికూయడం మొదలు

పని! పని ! పని!

రాత్రి చూరులోంచి నక్షత్రాలు కనిపించేదాకా!

అబ్బ! బానిసగా బ్రతకడం

అందులో ఒక మోటు, గర్విష్ఠి దగ్గర

ఈ పనే సేవ అనుకున్నప్పుడు

ఏ ఆడదానికీ మోక్షం లేదు..

 

పని! పని! పని!

తల తిరిగేదాకా పని!

ఓని! పని! పని!

కళ్లు బరువెక్కి చూపు మందగించేదాకా!

కుట్టూ, బకరం, పట్టీ,

పట్టీ, బకరం, కుట్టూ

చివరకి గుండీలమీద నిద్రొచ్చి వాలిపోయేదాకా!

ఇక కలల్లోనే వాటికి కుట్టడం.. 

 

ఇష్టమైన అక్కచెల్లెళ్ళున్న సోదరులారా!

తల్లులూ, భార్యలూ ఉన్న పురుషులారా!

మీరు ధరిస్తున్నది వస్త్రాలు కావు

అక్షరాలా సాటి జీవుల ప్రాణాలు!

కుట్టు– కుట్టూ- కుట్టు

పేదరికంలో, ఆకలిలో, మురికిలో

రెండు దారాలతో ఏకకాలంలో

ఒక పక్క చొక్కా, మరో పక్క కఫన్.   

 

నేను చావుగురించెందుకు మాటాడుతున్నాను

భయంకరమైన ఎముకల పోగు గురించి?

నాకిప్పుడు ఆ వికృతరూపమంటే భయం లేదు,

అదిప్పుడు నాలాగే ఉంటుంది

అది అచ్చం నా లాగే ఉంటుంది

ఇప్పుడు నే చేసే కటిక ఉపవాసాలవల్ల;

దేముడా! ఎంత చిత్రం, రొట్టె అంత ఖరీదైపోయి

రక్త మాంసాలు అంత వెలతక్కువవీ అయిపోయాయా?

పని! పని! పని!

నా శ్రమకి అలుపన్నది లేదు;

దానికి కూలి ఏమిటి? గడ్డి పరుపు

ఒక రొట్టె ముక్క… నాలుగు గుడ్డపీలికలు.

అదిగో పాడుబడ్డ ఇంటి కప్పు- ఇదిగో వట్టి నేల

ఒక మేజా- విరిగిపోయిన కుర్చీ

ఖాళీ గోడ… అప్పుడప్పుడు కనీసం

నా నీడైనా దానిమీదపడుతోందని సంతోషిస్తాను.

 

పని! పని! పని!

పగలు లేచినదగ్గరనుండి రాత్రి అలసి

గంటకొట్టీదాకా పని! పని! పని!

ఖైదీలు నేరానికి శిక్షగా పనిచేసినట్టు! 

కుట్టూ, బకరం, పట్టీ,

పట్టీ, బకరం, కుట్టూ 

గుండె బలహీనమై, చేతికి స్పర్శపోయినట్టు

చివరకి మెదడుకూడా చచ్చుపడిపోయేదాకా!

 

పని! పని! పని!

కనీకనిపించని డిశంబరు వెలుతురులోనూ;

పని! పని! పని!

వాతావరణం వెచ్చగా వెలుతురు ఉన్నపుడూ; 

ఇంటి చూరుల క్రింద

పొదగబోతున్న పిచ్చుకలు గూడుపెట్టి

వాటి మెరుస్తున్న మేనులు చూపిస్తూ

వసంతం రాగానే వెక్కిరిస్తూ పోతాయి.

 

ఓహ్! ఒక్క సారి ఆ మల్లెలానో, 

సన్నజాజిలానో జీవిస్తే ఎంతబాగుంటుంది

నెత్తిమీద వినీలాకాశంతో

పాదాలకింద పచ్చని నేలతో

లేమి అంటే ఏమిటో బాధ తెలియక ముందు

ఒకపూట తిండికి ఎంతకష్టపడాలో తెలియక

ఒకప్పుడు నేను అనుభూతి చెందినప్పటిలా

ఒక ఘడియ సేపయితే మాత్రం ఏమి?

 

ఓహ్! క్షణికమైన ఒక గంట చాలు!

ఎంత చిన్నపాటి విశ్రాంతి దొరికినా చాలు!

ఆశకోసమో, ప్రేమకోసమో విరామం కాదు

కేవలం దుఖాన్ని వెళ్ళగక్కుకుందికి!

కాసేపు రోదించినా గుండెకొంత తేలికౌతుంది నాకు

కానీ కన్నీళ్ళతో తడిసిన ఆ పక్కమీదే

నా ఏడుపు ఆపుకోవాలి. ఎందుకంటే ప్రతి కన్నీటిచుక్కా

నా సూదినీ దారాన్నీ కనిపించకుండా అడ్డుపడుతుంది.

 

వేళ్ళు అరిగి అరిగి నీరసించి

కనురెప్పలు ఎర్రబడి బరువెక్కి

స్త్రీకి యోగ్యం కాని చింకిపాతలలో

పాపం ఒక స్త్రీ, కూచుని

ఆమె సూదినీ దారాన్నీ లాక్కుంటూ

ఒక కుట్టు, రెండో కుట్టు, మూడో కుట్టు వేసుకుంటూ

పేదరికంతో, ఆకలితో, మురికిలో

విషాదము నిండిన గొతుతో

ఈ “చొక్కా గీతం” ఆలపించ సాగింది.

ఈ పాట ధనికుల చెవుల సోకుతుందా?

.

థామస్ హుడ్

23 May 1799 – 3 May 1845

ఇంగ్లీషు కవి

ఇది  ఊహాత్మక కథనం కాదు. Mrs Biddell అని లండనులో  “Lambeth” అనే ఒక చిన్న సబర్బ్ లో దీనాతి దీన మైన పరిస్థితులలో మగ్గుతూ చొక్కాలు కుట్టుకుని జీవనం గడిపే స్త్రీ గురించి రాసిన కవిత ఇది. ఈ కవిత మొదటిసారి 1843లో “Punch”  అనే పత్రిక క్రిస్మస్ సంచికలో మారుపేరుతో ప్రచురించబడింది. తక్షణమే బహుళప్రచారంలోకి రావడమే గాక,   Mrs Biddell తోపాటు ఆమెలాంటి దుర్భరమైన జీవితం గడుపుతున్న అనేకమంది స్త్రీ కార్మికుల  జీవితాలపై ప్రజల దృష్టి మళ్ళించేలా చెయ్యగలిగింది. ఆ రోజుల్లో ఇంగ్లండులో, మనదేశంలో బీడీ కార్మిక స్త్రీలలాగ, 2 పౌండ్లు డిపోజిట్ కడితే గాని స్త్రీలకు ఇంటిదగ్గర పేంట్లూ, చొక్కాలూ కుట్టే పని ఇచ్చేవారు కాదు.  దానికి నామమాత్రం కూలి దొరుకుతుండేది.  తన పిల్లలకి తిండి పెట్టలేని స్థితిలో తనుకుట్టే బట్టలనే కుదవబెట్టి తీర్చుకోలేని అప్పుతెచ్చుకుంది మగదక్షతలేని Mrs Biddell. అప్పుతీర్చలేకపోవడంతో చివరలి ఆమెను చట్టప్రకారం “Work house”  కి తరలించారు. ఆమె గతి చివరకి ఏమయ్యిందో ఎవరికీ తెలీదు. అయితేనేమి, ఆమె జీవితం, వారానికి 7 రోజులూ కష్టపడుతున్నప్పటికీ తమ జీవితాలలో ఏ మార్పూ లేకుండా దుర్భరమైన పరిస్థితులలో నామమాత్రంగా బ్రతికే అనేకానేకమంది కార్మికుల జీవితాల ప్రక్షాళనకి ఒక వెలుగురేక అయింది.

అందమైన ఆహ్లాదకరమైన ప్రకృతే కాదు, దుర్భరమైన పరిస్థితులలో బ్రతికే సాటి మనుషుల జీవితాలను చూసినపుడుకూడా  కవిమనసు తాదాత్మ్యంతో ప్రతిస్పందించాలి.     

.

The Song of the Shirt

 

WITH fingers weary and worn,
With eyelids heavy and red,
A woman sat, in unwomanly rags,
Plying her needle and thread–
Stitch! stitch! stitch!
In poverty, hunger, and dirt,
And still with a voice of dolorous pitch
She sang the “Song of the Shirt.”

“Work! work! work!
While the cock is crowing aloof!
And work–work–work,
Till the stars shine through the roof!
It’s Oh! to be a slave
Along with the barbarous Turk,
Where woman has never a soul to save,
If this is Christian work!

“Work–work–work
Till the brain begins to swim;
Work–work–work
Till the eyes are heavy and dim!
Seam, and gusset, and band,
Band, and gusset, and seam,
Till over the buttons I fall asleep,
And sew them on in a dream!

“Oh, Men, with Sisters dear!
Oh, men, with Mothers and Wives!
It is not linen you’re wearing out,
But human creatures’ lives!
Stitch–stitch–stitch,
In poverty, hunger and dirt,
Sewing at once, with a double thread,
A Shroud as well as a Shirt.

“But why do I talk of Death?
That Phantom of grisly bone,
I hardly fear its terrible shape,
It seems so like my own–
It seems so like my own,
Because of the fasts I keep;
Oh, God! that bread should be so dear,
And flesh and blood so cheap!

“Work–work–work!
My labour never flags;
And what are its wages? A bed of straw,
A crust of bread–and rags.
That shatter’d roof–and this naked floor–
A table–a broken chair–
And a wall so blank, my shadow I thank
For sometimes falling there!

“Work–work–work!
From weary chime to chime,
Work–work–work–
As prisoners work for crime!
Band, and gusset, and seam,
Seam, and gusset, and band,
Till the heart is sick, and the brain benumb’d.
As well as the weary hand.

“Work–work–work,
In the dull December light,
And work–work–work,
When the weather is warm and bright–
While underneath the eaves
The brooding swallows cling
As if to show me their sunny backs
And twit me with the spring.

“Oh! but to breathe the breath
Of the cowslip and primrose sweet–
With the sky above my head,
And the grass beneath my feet,
For only one short hour
To feel as I used to feel,
Before I knew the woes of want
And the walk that costs a meal!

“Oh! but for one short hour!
A respite however brief!
No blessed leisure for Love or Hope,
But only time for Grief!
A little weeping would ease my heart,
But in their briny bed
My tears must stop, for every drop
Hinders needle and thread!”

With fingers weary and worn,
With eyelids heavy and red,
A woman sat in unwomanly rags,
Plying her needle and thread–

Stitch! stitch! stitch!
In poverty, hunger, and dirt,
And still with a voice of dolorous pitch,–
Would that its tone could reach the Rich!–
She sang this “Song of the Shirt!”

.

Thomas Hood

23 May 1799 – 3 May 1845

English Poet

సర్వం శూన్యం… థామస్ హుడ్, ఇంగ్లీషు కవి

సూర్యుడు లేడు- చంద్రుడు లేడు
ఉదయం లేదు— మధ్యాహ్నం లేదు
సుర్యోదయం లేదు- సూర్యాస్తమయం లేదు-
అసలు రోజులో ఏ సమయమూ తెలీదు
ఆకాశం లేదు- చక్కని భూతల దృశ్యాలు లేవు
దిగంతాల కనిపించే నీలి రంగులు లేవు
రోడ్డు లేదు- వీధి లేదు- మరో మార్గం లేదు
ఏ వరసకీ అంతం లేదు
ఏ వంపు ఎటు తిరుగుతుందో గుర్తులు లేవు
ఏ చర్చికీ గోపురాలు లేవు
పరిచయమైన ముఖాలు లేవు
వాళ్ళకి చూపించడానికి మర్యాదలు లేవు
వాళ్ళని తెలుసుకునే అవకాశం లేదు
ప్రయాణం లేదు– వాహనాలు లేవు
అసలు తోవ ఎక్కడున్నదో ఊహకుకూడా దొరకదు
నేలమీద గాని, నీటిమీదగాని వెళ్ళే అవకాశం లేదు
ఉత్తరాలు లేవు- పత్రాలు లేవు
ఏ దేశం నుండి ఏ వార్తలూ లేవు
పార్కుల్లేవు- వినోదాలు లేవు- ఏ నాగరిక వ్యాపారాలూ లేవు
పదిమంది జతగూడడాలు లేవు- ఏ పండగలూ లేవు
వెచ్చదనం లేదు- సంతోషాలు లేవు-
ఆరోగ్యకరమైన వ్యాయామాలు లేవు-
ఎవరికీ సుఖం లేదు
ఓ నీడ లేదు- ఓ వెలుగు లేదు-
తుమ్మెదలు లేవు- తేనెటీగలూ లేవు
పళ్ళు లేవు- పూలు లేవు-
ఆకులు లేవు- పిట్టలు లేవు—
ఈ నవంబరు నెలలో!
.
థామస్ హుడ్
23 మే 1799 – 3 మే 1845
ఇంగ్లీషు కవి

.

No!

.

No sun–no moon!

 No morn–no noon!

 No dawn–no dusk–no proper time of day–

 No sky–no earthly view–

 No distance looking blue–

 No road–no street–no “t’other side this way”–

 No end to any Row–

 No indications where the Crescents go–

 No top to any steeple–

 No recognitions of familiar people–

 No courtesies for showing ’em–

 No knowing ’em!

 No traveling at all–no locomotion–

 No inkling of the way–no notion–

 “No go” by land or ocean–

 No mail–no post–

 No news from any foreign coast–

 No Park, no Ring, no afternoon gentility–

 No company–no nobility–

 No warmth, no cheerfulness, no healthful ease,

 No comfortable feel in any member–

 No shade, no shine, no butterflies, no bees,

 No fruits, no flowers, no leaves, no birds–

 November!

.

Thomas Hood

23 May 1799 – 3 May 1845

English Poet

Poem Courtesy: 

http://wonderingminstrels.blogspot.com/1999/11/no-thomas-hood.html

 

%d bloggers like this: