అనువాదలహరి

అదే పాట… థామస్ హార్డీ , ఇంగ్లీషు కవి

ఓ పక్షి ఎప్పుడూ అదే పాట పాడుతుంది

ఆ పాటని ఎన్నేళ్ళనుండో ఇక్కడే వింటున్నాను.

అయినా, ఆ రసప్రవాహంలో

ఎక్కడా చిన్న తేడాకూడా కనిపించదు.

ఆనందంతో పాటు ఆశ్చర్యకరమైన విషయం

అంత మైమరపించే సంగీతంలోనూ

ఇన్నేళ్ళవుతున్నా ఒక్క అపస్వరమూ

దొర్లకుండా ఎలా కొనసాగించగలుగుతున్నదన్నదే!

… ఓహ్! పాడుతున్న పిట్ట మాత్రం ‘ఒక్కటి ‘ కాదు.

అది ఏనాడో కాలగర్భంలో కలిసిపోయింది.

దానితో పాటే నా కంటే ముందు

ఆ పాటని విన్నవాళ్ళు కూడా.

.

థామస్ హార్డీ

(2 June 1840 – 11 January 1928)

ఇంగ్లీషు కవి

Image Courtesy: http://upload.wikimedia.org

.

A bird sings the selfsame song,
With never a fault in its flow,
That we listened to here those long
Long years ago.

A pleasing marvel is how
A strain of such rapturous rote
Should have gone on thus till now
unchanged in a note!

–But its not the selfsame bird.–
No: perished to dust is he….
As also are those who heard
That song with me.

.

Thomas Hardy

(2 June 1840 – 11 January 1928)

English Poet

Poem Courtesy:

https://www.poemhunter.com/thomas-hardy/poems/

అతను చంపిన వ్యక్తి … థామస్ హార్డీ, ఇంగ్లీషు కవి

ఒక పాత వసతిగృహంలో ఎప్పుడైనా

అతనూ నేనూ కలుసుకుని ఉంటే

ఇద్దరం కలిసి కూచుని ఎన్ని

చషకాలైనా తాగేసి ఉండేవాళ్ళం.

కానీ, పదాతిదళంలో పెరగడం వల్ల

ఒకరికొకరు ఎదురుపడి తీక్ష్ణంగా చూసుకుంటూ

అతను నామీదా, నే నతనిమీదా కాల్పులుజరుపుకున్నాం.

నే నతన్ని ఉన్నవాణ్ణి ఉన్నట్టుగా కాల్చిచంపాను.

అతన్ని నేను ఎందుకు కాల్చి చంపేనంటే…

అతను నా శత్రువు గనుక;

అదంతే! అతను నా శత్రువు, వైరి వర్గం;

అందులో సందేహం లేదు, కాకపోతే

నా లాగే, అనుకోకుండా, బహుశా అతనికీ

సైన్యంలో చేరుదామనిపించి ఉండొచ్చు,

ఏ పనీ దొరక్క, వలలూ, బోనులూ అమ్ముకునేవాడు

అంతకంటే మరో కారణం కనిపించదు.

నిజం; యుద్ధం ఎంత వింతైనది, ఆసక్తికరమైనది!

యుద్ధభూమిలో కాక ఏ మద్యం దుకాణంలోనో తారసపడిఉంటే

ఆదరించాలనో, పదిరూపాయలు సాయంచేయాలనో అనిపించే

సాటి వ్యక్తిని … నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపుతాం.

.

థామస్ హార్డీ

ఇంగ్లీషు కవి

.

Image Courtesy: http://upload.wikimedia.org

.

The Man He Killed

.                                                                                                                           

Had he and I but met

By some old ancient inn,

We should have set us down to wet

Right many a nipperkin!

But ranged as infantry,

And staring face to face,

I shot at him as he at me,

And killed him in his place.

I shot him dead because–

Because he was my foe,

Just so: my foe of course he was;

That’s clear enough; although

He thought he’d ‘list, perhaps,

Off-hand like–just as I–

Was out of work–had sold his traps–

No other reason why.

Yes; quaint and curious war is!

You shoot a fellow down

You’d treat, if met where any bar is,

Or help to half a crown.

.

Thomas Hardy

(2 June 1840 – 11 January 1928)

English Novelist and Poet

Poem Courtesy:

http://famouspoetsandpoems.com/poets/thomas_hardy/poems/10687

పల్లెటూరిసంతలో… థామస్ హార్డీ, ఇంగ్లీషు కవి

మనిషికి వివేకము గొప్ప వరం. మనిషిని తక్కిన జంతువులతో వేరుచేయగల సాధనం అదే. కానీ, మనిషి తన వివేకాన్ని కాకుండా తన నమ్మకాలమీద ఎక్కువ ఆధారపడతాడు. అవి ఒంటికన్నువి. అంటే, నమ్మకాలు కొన్ని కోణాల్ని మాత్రమే చూపించగలవు. అయినా మనిషి ఆ ఒంటికన్ను నమ్మకాలకే, తన వివేకాన్ని బానిసగా చేసి ప్రవర్తిస్తాడని చాలా చమత్కారంగా చెప్పిన కవిత

***

మొన్న జరిగిన ఒక పల్లెటూరి సంతలో
ఒక మరుగుజ్జు ఒక మహాకాయుణ్ణి రుమాలువంటి
ఎర్రని తాడుతో నడిపించూకుంటూ వెళ్ళడం చూశాను.
ఆ ఇద్దరిలో తనెంత ఎక్కువ బలవంతుడో
ఆ మహాకాయుడు గుర్తించినట్టు లేదు.

తర్వాత మరింతజాగ్రత్తగా చూసి అతను గుడ్డివాడని గ్రహించేను
ఆ మరుగుజ్జు వ్యవహారదక్షతగలిగిన ఒంటికన్నువాడు;
ఆ మహాకాయుడు తనకంటూ స్వంత ఆలోచన లేనట్టు
సౌమ్యంగా, పిరికిపిరికిగా,
ఆ తాడు ఎలాతీసికెళితే అలా అనుసరించేడు.

ఆ మరుగుజ్జు ఎక్కడికి తీసికెళ్ళాలనుకుంటే అక్కడికి
అతని అడుగుల్లో అడుగువేసుకుంటూ వినమ్రంగా
(బహుశా వినిపించకుండా లోపల గొణుక్కుని ఉండొచ్చు)
అతనికి ఇష్టం ఉన్నా లేకున్నా
విధి అతన్ని శాశించిన వాడిలా అనుసరించేడు.

చాలా దేశాల్లో, చాలా సమయాల్లో ఇటువంటి
దృశ్యాన్ని చూసేను, ఇంకా ఇలాంటివి చూస్తాను కూడా
కానీ ఈ దృశ్యాన్ని మాత్రం నేను మరిచిపోలేను
నేను చూసిన వందల మూకాభినయాల్లో
ఇంత బాధాకరమైనది అదొక్కటే.
.

థామస్ హార్డీ

ఇంగ్లీషు కవి

           Image Courtesy:

 

wikimedia.org

At a Country Fair

At a bygone Western country fair
I saw a giant led by a dwarf
With a red string like a long thin scarf;
How much he was the stronger there
The giant seemed unaware.

And then I saw that the giant was blind,
And the dwarf a shrewd-eyed little thing;
The giant, mild, timid, obeyed the string
As if he had no independent mind,
Or will of any kind.

Wherever the dwarf decided to go
At his heels the other trotted meekly,
(Perhaps—I know not—reproaching weakly)
Like one Fate bade that it must be so,
Whether he wished or no.

Various sights in various climes
I have seen, and more I may see yet,
But that sight never shall I forget,
And have thought it the sorriest of pantomimes,
If once, a hundred times!

Thomas Hardy

(2 June 1840 – 11 January 1928)

English Poet

Poem Courtesy:

http://www.poemtree.com/poems/AtACountryFair.htm

అతని అంతిమ యాత్రలో ఆమె… థామస్ హార్డీ, ఇంగ్లీషు కవి

అతన్ని … తన కడపటి విశ్రాంతి స్థలానికి

నెమ్మదిగా నడుస్తూ తీసుకుపోతున్నారు;

నేనొక అపరిచితవ్యక్తిలా అనుసరిస్తున్నాను;

వాళ్ళు అతనికి బంధువులు; నే నతని ప్రేయసిని

వాళ్ళందరూ నల్లని శోకచిహ్నమైన నలుపుదుస్తుల్లో ఉన్నా,

నేను గాఢమైన రంగులో ఉన్న నా గౌనుని మార్చలేదు;

వాళ్ళు అతనిచుట్టూ ఏ విచారమూ లేకుండా నిలుచుంటారు,

కానీ, నా పశ్చాత్తాపము నన్ను దహిస్తుంది.

.

థామస్ హార్డీ

(2 June 1840 – 11 January 1928)

ఇంగ్లీషు కవి.

.

Image Courtesy: http://upload.wikimedia.org

.

She — at his funeral

.

They bear him to his resting-place –

In slow procession sweeping by;

I follow at a stranger’s space;

His kindred they, his sweetheart I.

Unchanged my gown of garish dye,

Though sable-sad is their attire;

But they stand round with griefless eye,

Whilst my regret consumes like fire!

.

Thomas Hardy

(2 June 1840 – 11 January 1928)

English Poet and Novelist

Poem Courtesy:

http://www.online-literature.com/hardy/wessex-poems/9/

నేను చంపిన సైనికుడు… థామస్ హార్డీ, ఇంగ్లీషు కవి

మేము గతంలో ఎప్పుడైనా
ఏ పాత సత్రం దగ్గరో కలిసి
ఉండి ఉంటే, పక్కపక్కన కూచుని
సరదాగా మద్యం సేవించి ఉండేవాళ్లమి.

కాని పదాతి దళంలో పెరిగి ఉండడం వల్ల
ఒకరికొకరు ఎదురై తేరిపార చూసుకుంటున్నప్పుడు
అతను నా మీదా నేనతని మీదా కాల్పులు జరుపుకున్నాం
అతను ఉన్నచోటే కూలబడి చనిపోయాడు.

అతన్ని నేను కాల్చి చంపేను
ఎందుకంటే, తను నా శత్రువు గనుక…
అంతే!— అతను నా శత్రువే అనుకొండి
అది స్పష్టం. సందేహమేమీ లేదు… కానీ…

నా లాగే, అతను కూడా, బహుశా
ఏ పంజరాలమ్ముకుంటూనో- పని పోయి- ఉన్నట్టుండి
సైన్యంలో చేరితేబాగుణ్ణనుకుని ఉంటాడు.
వేరే కారణం ఏదీ కనిపించదు.

నిజం. ఈ యుద్ధం ఎంత చిత్రాతిచిత్రమైనది కాకపోతే
మరొక చోట తారసపడి ఉంటే ఏదో సాయం చేయడమో
కడుపునింపి పంపించడమో చేసే సాటి మనిషిని,
ఇక్కడ నేలకూల్చవలసి వస్తుంది!
.
థామస్ హార్డీ
2 జూన్ 1840- 11 జనవరి 1928
ఇంగ్లీషు కవి, నవలా కారుడు

Image Courtesy: http://upload.wikimedia.org
Image Courtesy: http://upload.wikimedia.org

The Man He Killed

 .

    “Had he and I but met        

    By some old ancient inn,    

We should have sat us down to wet       

    Right many a nipperkin!     

 

    “But ranged as infantry,     

    And staring face to face,     

I shot at him as he at me,        

    And killed him in his place.

 

    “I shot him dead because—

    Because he was my foe,     

Just so—my foe of course he was;        

    That’s clear enough; although            

 

    “He thought he’d ’list, perhaps,         

    Off-hand like—just as I— 

Was out of work—had sold his traps— 

    No other reason why.         

 

    “Yes; quaint and curious war is!        

    You shoot a fellow down   

You’d treat if met where any bar is,       

    Or help to half-a-crown.”

.

Thomas Hardy

2 June 1840 – 11 January 1928

English Poet and Novelist

Poem Courtesy:

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).   

http://www.bartleby.com/265/153.html

వెన్నెల్లో… థామస్ హార్డీ, ఇంగ్లీషు కవి

“ఓ ఒంటరి పనివాడా, ఊహలలో తేలుతున్నట్టు
అక్కడ నిలబడి ఆమె సమాధివంక అలా
ప్రక్కన మరో సమాధిలేనట్టు ఎందుకు తేరి చూస్తావు?

శుష్కించిన నీ పెద్ద కన్నులు అంతగా ప్రాధేయపడితే
శవంలా చల్లబడిన ఈ వెన్నెల వెలుగులో, ఆమె ఆత్మ
బహుశా నిరాకారస్వరూపాన్ని ధరించి పైకి లేస్తుందేమో.”

“ఓయ్ వెర్రిడా! ఇక్కడ మనుషులెవరికీ అక్కరలేకపోయినా
నేను ఇపుడు చూద్దామనుకుంటున్నది సరిగ్గా అదే.
కాని ఏం లాభం? నా కలాంటి అదృష్టం లేదు.”

“అయితే, నిస్సందేహంగా ఆమె నీ ప్రేయసి అయి ఉంటుంది,
నీ మంచీ చెడులలో, కష్టాలూ సుఖాల్లో పాలుపంచుకొని
ఆమె పోగానే, నీ జీవితంలో వెలుగు హరించుకుపోయి ఉంటుంది.”

“లేదు. ఆమె నేను ప్రేమించిన స్త్రీ కాదు.
ఆమెని ఎవరికన్నాకూడా ఉన్నతంగా ఎవరూ పరిగణించలేదు.
ఆమె బ్రతికుండగా ఆమె గురించి ఆలోచించలేకపోయాను.” 
.
థామస్ హార్డీ

2 June 1840 – 11 January 1928

ఇంగ్లీషు కవి

Image Courtesy: http://upload.wikimedia.org
Image Courtesy: http://upload.wikimedia.org

 

.

In the Moonlight

.

“O lonely workman, standing there

In a dream, why do you stare and stare

At her grave, as no other grave there were?

“If your great gaunt eyes so importune

Her soul by the shine of this corpse-cold moon,

Maybe you’ll raise her phantom soon!”

“Why, fool, it is what I would rather see

Than all the living folk there be;

But alas, there is no such joy for me!”

“Ah—she was one you loved, no doubt,

Through good and evil, through rain and drought,

And when she passed, all your sun went out?”

“Nay: she was the woman I did not love,

Whom all the others were ranked above,

Whom during her life I thought nothing of.”

.

Thomas Hardy

2 June 1840 – 11 January 1928

English Poet, Novelist

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/152.html

మిగిలిపోయేవీ, తరిగిపోయేవీ … థామస్ హార్డీ, ఇంగ్లీషు కవి

తుంపరలమీద కదలాడే సూర్యుడి ఇంద్రధనుసులూ

పారుతున్న సెలయేటి మీది తళతళలూ

అందమైన ముఖాలూ, ప్రమాణాలూ, వెన్నెలరాత్రులూ…

ఇవన్నీ శాశ్వతంగా ఉండిపోవాలని కోరుకుంటాం

కానీ, అవి తరిగిపోతాయి.

హేమంతపు మంచులా పరుచుకున్న శూన్య ఋతువులూ

నిశ్శబ్దంగా ఓడుతున్న కుళ్ళిన ప్రపంచపు రక్తస్రావమూ 

వేలమంది దౌర్భాగ్యుల అవేదనపు కేకలూ —

ఇవి సమసిపోవాలని మనం కోరుకుంటాం,

కానీ, అవి మిగిలిపోతాయి. 

.

థామస్ హార్డీ

2 June 1840 – 11 January 1928

ఇంగ్లీషు కవి

Image Courtesy: http://upload.wikimedia.org
Image Courtesy: http://upload.wikimedia.org

.

Going and Staying

 

The moving sun-shapes on the spray,         

The sparkles where the brook was flowing,  

Pink faces, plightings, moonlit May,—         

These were the things we wished would stay;         

      But they were going.

 

Seasons of blankness as of snow,       

The silent bleed of a world decaying, 

The moan of multitudes in woe,—      

These were the things we wished would go; 

      But they were staying.

.

Thomas Hardy.

2 June 1840 – 11 January 1928

English Poet, Novelist.

 

Poem Courtesy:

Modern British Poetry.  1920.

Ed:  Louis Untermeyer (1885–1977).

http://www.bartleby.com/103/2.html

అద్దంలో చూసుకుంటూ… థామస్ హార్డీ, ఇంగ్లండు

 అద్దంలో నన్ను నేను చూసుకుంటూ

ముదిమితేరుతున్న చర్మాన్ని చూసి అనుకున్నాను:

“దేముడికి ఆలోచనవచ్చి చర్మమంత పల్చగా

హృదయాన్ని కూడా కృంగదీస్తే ఎంతబాగుండును!”

ఎందుకంటే, అప్పుడు,

నాపట్ల నిర్లిప్తంగా ఉండే హృదయాలను చూసి

ఏ బాధలూ లేకుండా, నిశ్చింతగా

అంతులేని విశ్రాంతికి ఒంటరిగా ఎదురుచూడొచ్చు.

కానీ, కాలం ఉందే, నన్ను ఏడిపించడానికి

కొన్ని లాక్కుని, కొన్ని వదిలేస్తుంది;

ఈ జీవన సంధ్యలో శుష్కించిన శరీరంలో

మధ్యాహ్నపు గుండెగుబుళ్ళు రగుల్కొల్పుతుంది.

 .

థామస్ హార్డీ

(2 June 1840 – 11 January 1928)

బ్రిటిషు నవలా కారుడూ, కవీ.

.

"Thomas Hardy," oil on panel, by the...
“Thomas Hardy,” oil on panel, by the Scottish painter and engraver William Strang. 17 in. x 15 in. Courtesy of the National Portrait Gallery, London. (Photo credit: Wikipedia)

.

I Look into My Glass

.

I look into my glass
And view my wasting skin,
And say, “Would God it came to pass
My heart had shrunk as thin!”

For then, I, undistrest
By hearts grown cold to me
Could lonely wait my endless rest
With equanimity.

But Time, to make me grieve,
Part steals, lets part abide;
And shakes this fragile frame at eve
With throbbings of noontide.

.

Thomas Hardy

(2 June 1840 – 11 January 1928)

British Novelist and Poet

నిరాశతో ముఖాముఖీ… థామస్ హార్డీ,ఆంగ్ల కవి

.

చీకటిపడేవేళకి నన్ను నేను చూసుకునేసరికి
నిస్సారమైన ఊషరక్షేత్రంలో ఉన్నాను.
నల్లని ఆ చిత్తడినేల ఏ రూపురేఖలులేకుండా
రూపుగట్టిన విషాదంలా కనిపించింది.

“ఇదికూడా నా జీవితంలానే ఉంది,
చీకటి పుట్టలా.” అనుకున్నాను నేను.
“దురదృష్టం వెన్నాడి చవుడు పడిపోయింది….
ఎటుచూసినా వెలుగురేక కనబడదు”

తలెత్తి ఒకసారి ఆకాశం లోకి చూసేసరికి,
అక్కడి వర్ణవ్యంజనము  నన్నాకట్టుకుంది.
మెరుగంచుల కారుమబ్బులు చూసేక అనిపించింది:
చూడాలేగాని, బహుశా సాంత్వన అన్నిచోట్లా దొరుకుతుందని.”

ఒక వక్ర బుద్ధి, నిర్దాక్షిణ్యంగా
మంచిని చెడుగ వ్యాఖ్యానించినపుడు
కలిగే బాధలా, నా తప్పుడు ఆలోచనకు
నన్నునేనే నిందించుకుంటూ నిలుచున్నాను.

వృత్తాకారపు దిగంతాల అంచులనుండి,
వింతఆకృతిగల ఒక చిత్రమైన ఆకారం పైకి లేచింది
చాలా అసహ్యంగా, భయంకరంగా ఉంది, దాన్ని
ఊహించగలనేమోగాని, చూడలేను.

“ఇదొక మృత్యుగహ్వరము. ఇక్కడ వెలుగుకూడా
చీకటి సంతరించుకుంటుంది” అని గర్జించింది ఆ ఆకారం.
నా కొత్తగా వచ్చిన ఆశావాదముతో అన్నాను:
“ఒక్క ఆకాశం లోకి తలెత్తి చూస్తే తప్ప”

“అవును. కానీ, ఒక క్షణం ఆగిచూడు…” అరిచేడు వాడు.
“హ్హహ్హహ్హా! ఇప్పుడు చూడు తెలుస్తుంది”
తలెత్తాను. ఆఖాశం నిండా చీకటి ఆవరించింది.
మునపటి దివ్యకాంతులు మాయమయాయి.
మెత్తనిపులిలా నవ్వేడతడు.

.

"Thomas Hardy," oil on panel, by the...
“Thomas Hardy,” oil on panel, by the Scottish painter and engraver William Strang. 17 in. x 15 in. Courtesy of the National Portrait Gallery, London. (Photo credit: Wikipedia)

థామస్ హార్డీ

(2 June 1840 – 11 January 1928)

ఆంగ్ల కవీ, నవలా కారుడూ

.

A Meeting With Despair

As evening shaped I found me on a moor
Which sight could scarce sustain:
The black lean land, of featureless contour,
Was like a tract in pain.

“This scene, like my own life,” I said, “is one
Where many glooms abide;
Toned by its fortune to a deadly dun–
Lightless on every side.

I glanced aloft and halted, pleasure-caught
To see the contrast there:
The ray-lit clouds gleamed glory; and I thought,
“There’s solace everywhere!”

Then bitter self-reproaches as I stood
I dealt me silently
As one perverse–misrepresenting Good
In graceless mutiny.

Against the horizon’s dim-descernèd wheel
A form rose, strange of mould:
That he was hideous, hopeless, I could feel
Rather than could behold.

“‘Tis a dead spot, where even the light lies spent
To darkness!” croaked the Thing.
“Not if you look aloft!” said I, intent
On my new reasoning.

“Yea–but await awhile!” he cried. “Ho-ho!–
Look now aloft and see!”
I looked. There, too, sat night: Heaven’s radiant show
Had gone. Then chuckled he.
.

Thomas Hardy

(2 June 1840 – 11 January 1928)

English Poet and Novelist

He is part of the “Naturalistic Movement ” a literary movement where its followers believed in the theory of evolution of Charles Darwin and that environment and heredity play an inescapable part  in shaping human character. And the literary works “exposed the dark harshness of life, including poverty, racism, violence, prejudice, disease, corruption, prostitution, and filth. As a result, naturalistic writers were frequently criticized for focusing too much on human vice and misery.”  Though Hardy produced more than a dozen novels in a literary career spanning over almost half a century, he is more renowned for his novels “Tess of the d’Umbervilles” (A movie based on it is being released all over US this week with the lead role played by Freida Pinto of Slum dog Millionnaire fame), Far From the Madding Crowd,  and The Mayor of Casterbridge.


వస్తానని రాలేదు … థామస్ హార్డీ

broken appointment
broken appointment (Photo credit: Jon Erickson)

.

నువ్వు వస్తానని రాలేదు

కాలం నిర్లిప్తంగా పరిగెత్తుకుంటూ పోయింది.

నన్ను మొద్దుబారిపోయేలా చేస్తూ.

అయినా, నువ్వు నా ఎదురుగా లేకపోవడంకంటే కూడ

ఎక్కువగా బాధించింది… నీ వ్యక్తిత్వంలో

మన విముఖతని సైతం త్రోసిరాజనగల

ఉదాత్తమైన కనికరభావన కనిపించకపోవడం.

ఆశల చిట్టచివరి ఘడియ గడిచిపోయి,

నువ్వురాకపోయిన తర్వాత నేనొంతో దుఃఖించాను.

.

నువ్వు నన్ను ప్రేమించటం లేదు.

ప్రేమ ఒక్కటే మనిషిపై విశ్వాసాన్ని కలుగజేస్తుంది.

నాకు నువ్వు ప్రేమించడం లేదనీ తెలుసు

నువ్వు రావనీ తెలుసు.

కానీ, దైవకార్యాలన్న పేరుపెట్టి పిలవకపోయినా,

మనిషి చేసే తత్సమానమైన ఆనేక పనులఖజానాలోకి,

ఒక స్త్రీ,  తను ప్రేమించకపోయినా,

కాలం చించిపోగులు పెట్టిన మగవాడికి

ఊరటకల్పించడానికి అతనితో ఒక గంటో, ఘడియో

గడపడాన్నికూడ చేర్చడం సబబుగా ఉండదూ?

.

Thomas Hardy
Thomas Hardy (Photo credit: Wikipedia)

థామస్ హార్డీ

(జూన్ 2, 1840 – 11 జనవరి 1928)

ఇంగ్లీషు కవీ, నవలాకారుడూ.

.

A Broken Appointment

.

You did not come,
And marching Time drew on, and wore me numb.
Yet less for loss of your dear presence there
Than that I thus found lacking in your make
That high compassion which can overbear
Reluctance for pure loving kindness’ sake
Grieved I, when, as the hope-hour stroked its sum,
You did not come.

You love not me,
And love alone can lend you loyalty;
-I know and knew it. But, unto the store
Of human deeds divine in all but name,
Was it not worth a little hour or more
To add yet this: Once you, a woman, came
To soothe a time-torn man; even though it be
You love not me.
.

Thomas Hardy

(2 June 1840 – 11 January 1928)

An English Novelist and Poet

%d bloggers like this: