అనువాదలహరి

ఉరుములూ మెరుపులూ….సుజేన్ డోయిల్, అమెరికను కవయిత్రి

(మాత్యూ డోయిల్ జాకోబస్ కి)

నువ్వు నా బిడ్డవి కావు; నా సోదరి బిడ్దవి.
పాలచారికలుకట్టిన నీ మెత్తని పెదాలు అమ్మ కమ్మని
తలపులతో తియ్యగా నవ్వుతున్నప్పుడు, నువ్వు ఊపిరి
తీసినపుడల్లా పువ్వులా కదులుతూ విచ్చుకుంటున్నాయి.

నాకూ ప్రేమంటే తెలుసు, కానీ ఇలా కాదు; ఈ విషాదమయ
ప్రపంచంలోకి ఇంత అందాన్ని నా సోదరి ఎలా తీసుకురాగలిగింది?
రాత్రి తుఫాను హోరుకి అలల్లా ఎగుస్తున్న కిటికీ పరదాలు
ఎక్కడో దూరానున్న ఒంటరి కుక్క భీకరమైన అరుపు మోసుకొస్తున్నాయి.

అందాలభరిణా, నా తండ్రీ! కాలం నీ కెటువంటి భవిష్యత్తు తెస్తుందిరా?
ఏ రాత్రి ఏ ప్రేమ నీ గుండె కోతకోస్తుందిరా?
ఇప్పటికే అక్కరలేని భయాలకీ, కోరికలకీ ఆటబొమ్మవైన నువ్వు
ఆనందాన్ని ఎలా దక్కించుకోవాలో ఎలా తెలుసుకుంటావురా?

నీకు ఏ జ్ఞానాన్ని, ఆశీస్సుని, రక్షరేకుని కట్టగలను?
ఇక్కడ సర్ప-గంధి, నాభివంటి విషాలతో పాటు,
అడుగంటుతున్న నీ అమాయకత్వాన్ని, క్షీణిస్తున్న ఆరోగ్యాన్నీ
నిలబెట్టడానికి తిరుగులేని ఆశీస్సులూ, అమృతజలాలూ ఉన్నాయి.

ఏటవాలుగా పడుతున్న చినుకులమధ్యనుంచి ఉరుములూ మెరుపులూ
ఆకశాన్ని చీలుస్తున్నాయి; భారమితిలో పడిపోతున్న పాదరసమట్టం
నాకు తలపోటు తెస్తున్న గడ్డురోజులకి ప్రతీక.
నాదంటూ ఒక వస్తువును నీకు వారసత్వంగా విడిచిపెట్టనీ.

ఈ కవితలు ఎంతో కష్టపడి భద్రంగా దాచుకున్నవిరా తండ్రీ!
ఎందుకంటే సమాధానం చెప్పలేనురా నాన్నా! నన్ను గుర్తుంచుకో.
నేను సగంలో విడిచిపెట్టిన పనులు నువ్వయినా పూర్తి చెయ్యి.

.

సుజేన్ డోయిల్

జననం 1953

అమెరికను కవయిత్రి.

.

Wild Lightning

(for Matthew Doyle Jacobus)

You are not mine; you are my sister’s child.

Your soft mouth blossoms as you breathe and move

Your lips, just souring with milk, to smile

In sweet maternal dream.  I have known love,

But not like this.  How can my sister dare

To risk such beauty in a world so dark?

Billowing curtains in the night storm air

Admit some feral bitch’s lonely bark.

What will time leave you, Beauty, Oh my boy?

What love will cut your heart out in the night?

Already blind fear and desire’s toy,

What will you learn to salvage of delight?

What knowledge, blessing, charm might I dispense?

Here’s snake-root, wolf’s-bane, holy water, Word

To hold against your crumbling innocence

And cruel attrition, of which you are assured.

Wild lightning scores the sky through this slant rain.

The plummeting barometer’s a sign

Of these sharp times that needle at my brain,

And I would leave you something that was mine.

I have these hard won pages and no son,

For reasons I don’t know.  Remember me,

And do not leave what I have left undone.

Suzanne Doyle

Born 1953

American

Poem Courtesy: 

http://www.poemtree.com/poems/WildLightning.htm 

 

జ్ఞాపకం… సుజేన్ డోయిల్, అమెరికను కవయిత్రి

(మాత్యూ డోయిల్ జేకోబస్ కి)

.

ఒకరోజు నేను నిన్ను మీ అమ్మపక్కనుండి ఎత్తుకొచ్చాను
(ఆ సారవంతమైన ఉప్పుటేరు ఎంత ఉత్సాహంగా ఉందో నీకు గుర్తుండదు)
అక్కడికి నెత్తళ్ళు (మిన్నోలు) కెరటాలతోపాటే కొట్టుకొచ్చాయి
ఉక్కపోతగా ఉన్న ఆ చోట, మేము ఊపిరాడక తెగ కష్టపడ్డాము.
నీకప్పటికి ఇంకా నాలుగు నిండలేదు, నాకు వయసుపైబడి
(నీకు గుర్తుండదు గాని నువ్వు గుర్తుపెట్టుకోవాలి)
నేను మమకారంతో కొట్టుకుంటున్నాను. “ఇక్కడ ఈదకూడదు” అని
రాసి ఉండడం చదివేను; అయినా నిన్ను ఈదడానికి విడిచిపెట్టేను.
నల్లికండ్ల పాములా నువ్వు నా చేతిలో దిగంబరంగా కొట్టుకుంటున్నావు
నేను కెరటాల “ఆటు” తట్టుకు నిలబడడానికి ప్రయత్నిస్తున్నాను
సన్నగా, నులివెచ్చగా అపురూపమైన ప్రాణంతో కొట్టుకుంటూ
(నీకు గుర్తుండదు, అదే మంచిదని కొందరంటారు)
నీకు ఎదిరించడమూ, ఆలోచించడమూ తెలీవు; నీ అతి చిన్న కోరికే
నాకూ ఇష్టమై కూచుంది. ఆ మిట్ట మధ్యాహ్నం వేళ
ఈ దక్షిణపు వేడిలో, రెండు వింత, పాలిపోయిన చేపల్లా
తల్లీ బిడ్డా అలా ఉగ్గబట్టుకుని ఉన్నాం. ఎంత సేపో.
నీకు గుర్తులేదు గానీ, నీ కదంతా తెలుసు.
ఇప్పుడు నీ అంతట నువ్వే పెద్ద కెరటాలు ఈదుకుంటూ
ఇన్నాళ్ళూ నిన్ను పట్టుకున్న చేతుల్ని విదుల్చుకుని, చాకచక్యంగా
విశాలమైన, సారవంతమైన సముద్రంలోకి అడుగుపెడుతున్నావు.
.

సుజేన్ డోయిల్

అమెరికను కవయిత్రి

Memory

(For Matthew Doyle Jacobus)

One day I took you from your mother’s side

(you won’t recall the fertile estuary’s seethe),

Down where the minnows surfaced with the tide

And we labored in the muggy air to breathe.

You weren’t quite four, while I was old and smitten

(you won’t remember and you’ll need to know)

Sick with love.  I read NO SWIMMING written

On the sign, and yet I let you go.

Naked as a newt you paddled in my arms

While I kicked in the murky undertow,

Bouyed up by life too golden, sleek and warm

(you don’t remember, some think it better so)

To reason or resist.  Your slightest wish

Became my choice and in the southern heat

We hung in that white noon, two strange, pale fish,

Woman and child, eternal and complete.

You don’t remember, but you knew it all:

Swimming the tidal waters by yourself,

Scorning the arms that held you, deftly to crawl

Onto that wide, alluvial silt shelf.

.

Beaufort, North Carolina

Suzanne Doyle

Born 1953

American

http://www.poemtree.com/poems/Memory.htm

%d bloggers like this: