అనువాదలహరి

జీవితమొక కల… పెడ్రో కాల్డెరాన్ బార్కా, స్పానిష్ కవి

మనం జీవించి ఉన్నంత కాలమూ

జీవితమూ, కలా ఒకటిగా జీవిస్తాము. 

జీవితం నాకు నేర్పిన పాఠం ఇది:

జీవితం ముగిసిపోయే వరకూ మనిషి

తనదైన జీవితాన్ని కలగంటూనే ఉంటాడు 

మహరాజు తనొక మహరాజునని కలగంటాడు

అధికారం, అజమాయిషీ చలాయిస్తూ

మహరాజునని మోసగించుకుంటూ బ్రతుకుతాడు.

అతని గురించి చేసిన పొగడ్తలన్నీ 

గాలిమీద రాతల్లాంటివి, దారిలో కొంత

దుమ్మూ ధూళీ కూడా పోగిచేసుకుంటాయి 

అకస్మాత్తుగా మృత్యువా చివరిశ్వాస లాక్కునే వరకూ.

మృత్యువనే రెండో కలలో, ఎవరికీ

ఏమీ తెలియకుండా సర్వనాశన మైనపుడు  

ఈ సింహాసనంవల్ల ఏమి ప్రయోజనం?  

భాగ్యవంతుడు తన సంపదతో బాటుగా  

దా న్ననుసరించే భయాల్నీ కలగంటాడు;

నిరుపేద తన దైనిక అవసరాల్ని కలగంటాడు,

అతని దుఃఖాలూ, కన్నీళ్ళతోబాటు;

కాలక్రమంలో తన స్థితి మెరుగౌతున్నట్టూ,

తనుకూడా పదిమందికి దానంచేస్తున్నట్టూ,

శత్రువుల్ని తిడుతున్నట్టూ కలగంటాడు.

నేను చూస్తున్న ఈ విశాల ప్రపంచంలో

మనిషి తనెటువంటి వాడైనా, రెండో కంటికి

తెలియకుండా, తన కల తాను కంటూనే ఉంటాడు. 

నేనూ కలగంటూ కలకై ఎదురుచూస్తుంటాను,

నన్నెవరో సంకెలలలో బందించినట్టూ,

ఇప్పుడు నే ననుభవిస్తున్న బాధలన్నీ

గతంలో చేసిన మంచికి పర్యవసానాలని.  

ఇంతకీ, జీవితమంటే ఏమిటి? చరిత్రకెక్కిన ఒక కథా? 

జీవితమంటే ఏమిటి? అవధులులేని ఆవేశమా?

ఉన్నట్టు భ్రమింపజేసే వస్తువుల క్రీనీడ;

దానివల్ల వచ్చే ఎంత గొప్ప మంచైనా, చిన్నమెత్తే, 

అందరికీ జీవితమంతా ఒక కలగా కనిపిస్తుంది,

ఆ మాటకొస్తే, అసలు కలలన్నవే ఒక కల.

.

(అనువాదం: ఆర్థర్ సైమండ్స్) 

పెడ్రో కాల్డెరాన్ ది ల బార్కా

(17 January 1600 – 25 May 1681)

స్పానిష్ కవి

From “Life is a Dream”

.

We live, while we see the sun,

Where life and dreams are as one;

And living has taught me this,

Man dreams the life that is his,

Until his living is done.

The king dreams he is king, and he lives

In the deceit of a king,

Commanding and governing;

And all the praise he receives

Is written in wind, and leaves

A little dust on the way

When death ends all with a breath.

Where then is the gain of a throne,

That shall perish and not be known

In the other dream that is death?

Dreams the rich man of riches and fears,

The fears that his riches breed;

The poor man dreams of his need,

And all his sorrows and tears;

Dreams he that prospers with years

Dreams he that feigns and foregoes,

Dreams he that rails on his foes;

And in all the world I see.

Man dreams whatever he be,

And his own dream no man knows.

And I too dream and behold,

I dream and I am bound with chains,

And I dreamed that these present pains

Were fortunate ways of old.

What is life? A tale that is told?

What is life? A frenzy extreme,

A shadow of things that seem;

And the greatest good is but small,

That all life is a dream to all,

And that dreams themselves are a dream.

(Tr: Arthur Symons)

Pedro Calderon de la Barca

(17 January 1600 – 25 May 1681)

Spanish Poet

https://archive.org/details/anthologyofworld0000vand/page/647/mode/1up

మృత్యుఘంటికలు (సానెట్)… ఫ్రాన్సిస్కో దె కెబెదో, స్పానిష్ కవి

ఈ కవితలో కవి రెండు అవసాన దశకు వచ్చిన వస్తువులు తీసుకుని (స్వంత ఊరులో ఉన్న తన ఇల్లు, తన శరీరం) శిధిలమౌతున్న మొదటి వస్తువు ద్వారా, రెండవ దాని (తన శరీర) స్థితిని గ్రహించడం చక్కగా చూపిస్తాడు. మనం రోజూ చనిపోతున్న వాళ్ళనీ చూస్తుంటాం, శిధిలమైపోతున్నవీ చూస్తుంటాం. కానీ, రోజు రోజుకీ మనంకూడా తెలియకుండనే శిధిలస్థితికి చేరుకుంటున్నామన్న ఎరుక మనకి కలుగదు. 18వ శతాబ్దం వరకూ, మనదేశంలో కూడా ప్రతి ఊరుచుట్టూ, పెద్ద పెద్ద నగరాలకీ ఊరి/ నగర సరిహద్దులో చుట్టూ ఒక ప్రహారీ ఉండేదిట.

* * *

నా పుట్టిన ఊరి పొలిమేరల ప్రహారీని గమనించాను

ఒకప్పుడు దృఢంగా ఉండేది, ఇప్పుడు పాడుబడి పెల్లలూడిపోతోంది. 

 ఇప్పటి తీరుకు తగ్గట్టు నిర్లక్ష్యానికి గురై ఆ గోడల శక్తి నశించింది  

ఒకప్పుడు మహోన్నతంగా ఉండే ప్రాకారాలు శిధిలమైపోయాయి.

నేను పొలాలు చూడటానికి వెళ్ళేను. అక్కడ అప్పుడే మంచు కరిగి

ఏర్పడ్డ నీటి తడిని సూర్యుడు ఆబగా తాగేయడం గమనించాను.

కొండవాలున పశువులు గిట్టలతో నేలదువ్వుతూ అరుస్తున్నాయి.

వాటి బాధలు చూసి ఇక్కడకు వచ్చిన ఆనందం ఆవిరైపోయింది. 

మా యింటికి వెళ్ళాను; తేమకి ఆ పాత గోడలు మచ్చలు పడి 

పాడు బడుతున్న వస్తువులన్నీ ఆ ఇంటిని కొల్లగొంటున్నాయి; 

అరిగిపోయిన నా చేతికర్ర అప్పుడే వంగిపోసాగింది.

కాలం గెలుస్తున్నట్టు గ్రహించాను; నా కత్తీ తుప్పుపట్టింది;

శిధిలం కానిది ఏదైనా ఉందేమో చూద్దామనుకుంటే

మచ్చుకి ఒక్కటికూడా కంటికి కనిపించలేదు.

.

ఫ్రాన్సిస్కో దె కెబెదొ

(14 September 1580 – 8 September 1645)

స్పానిష్ కవి

Sonnet: Death warnings

.

I saw the ramparts of my native land,

One time so strong, now dropping in decay,

Their strength destroyed by this new age’s way

That has worn out and rotted what was grand.

I went into the fields; there I could see

The sun drink up the waters newly thawed;

And on the hills the moaning cattle pawed,

Their miseries robbed the light of day for me.

I went into my house; I saw how spotted,

Decaying things made that old home their prize;

My withered walking-staff had come to bend.

I felt the age had won; my sword was rotted;

And there was nothing on which to set my eyes

That was not a reminder of the end.

.

(Tr: John Masefield)

Francisco de Quevedo y Villegas

(14 September 1580 – 8 September 1645)

Spanish Poet

https://archive.org/details/anthologyofworld0000vand/page/645/mode/1up

సానెట్ 2 … లూయిజ్ వాజ్ ది కమోజ్, స్పానిష్ కవి

నా పెదవినుండి వెలువడిన మధుర గీతాల్లారా, నను విడిచిపొండి,

సంగీతానికి శృతిబద్ధమైన వాద్యపరికరాల్లారా, నను వీడిపొండి,

మైదానాల్లోని రమణీయమైన ఎగిసే నీటిబుగ్గలారా, నను వీడిపొండి

కొండకోనల్లోని మంత్రముగ్ధుణ్ణిచేసే తరు, లతాంతాల్లారా, నను వీడిపొండి, 

అనాదిగా వేణువునుండి వెలువడుతున్న రసధునులారా, నను విడిచి పొండి,

జనపదాల్లోని విందు, వినోద, జాతర సమూహాల్లారా, నను విడిచిపొండి,

రెల్లుపొదలలోదాగిన జంతు, పక్షి సమూహాల్లారా, నను వీడిపొండి,

శీతలతరుచాయలలో హాయిగా విశ్రమించే గోపకులారా, నను వీడిపొండి,

నాకిపుడు ఏ సూర్య చంద్రులూ ఉదయించి వెలుగులీనబోరు,

మనః శాంతి అంతరించి,చీకటి నాపై పెను పొరలా కమ్ముకుంది

నాకిక దిక్, దిగంతరసిమలలో ఎక్కడా సంతోషమన్నది కనరాదు,

నేను ఆశించినవీ, ప్రేమించినవీ నశిస్తే ఇక నశించనీ,

కానీ, ఓ నా దౌర్భాగ్యమా! నువ్వు మాత్రం నన్ను విడిచిపోకు, 

చివరకి ప్రాణాలు హరించి నాకు విముక్తి కలిగించగలిగేది నువ్వే!

.

  (అనువాదం: రిఛర్డ్ గార్నెట్)

లూయిజ్ వాజ్ ది కమోజ్  

(1524 or 1525 – 20 June1580) 

స్పానిష్ కవి

Sonnet

.

Leave me, all sweet refrains my lip hath made;

Leave me, all instruments attuned for song;

Leave me, all fountains pleasant meads among;

Leave me, all charms of garden and of glade;

Leave me, all melodies the pipe hath played;

Leave me, all rural feast and sportive throng;

Leave me, all flocks the reed beguiles along;

Leave me, all shepherds happy in the shade.

Sun, moon, stars, for me no longer glow;

Night would I have, to vail for vanished peace;

Let me from pole to pole no pleasure know;

Let all that I have loved and cherished cease;

But see that thou forsake me not, my Woe,

Who wilt, by killing, finally release.

.

(Tr: Richard Garnett)

Luís Vaz de Camões

(1524 or 1525 – 20 June1580

Spanish Poet

https://archive.org/details/anthologyofworld0000vand/page/635/mode/1up

సానెట్… లూయిజ్ వాజ్ ది కమోజ్, స్పానిష్ కవి

కాలమూ మనిషీ ఎన్నడూ స్థిరంగా ఉండరు;

అదృష్టం దూరమైన మనిషి ధైర్యమూ దూరమౌతుంది;

సరి కొత్త స్వభావాన్ని సంతరించుకున్న ప్రకృతితో 

ఈ ప్రపంచమంతా “తిండిపోతు మార్పు” ఆహారంలా కనిపిస్తోంది.

ఏ దిక్కు చూసినా అంతులేని సరికొత్త చిగుళ్ళు కనుపిస్తున్నాయి 

ఎంతగా అంటే, ఈ భూమి ఇంత భరించగలదని ఊహించలేనంత.

బహుశా గతాన్ని గురించిన శోకమే నిలకడగా ఉంటుంది, 

గతంలో చేసిన మంచికై వగపూను, అది నిజంగా మంచి అయితే.

 కాలం పచ్చదనంతో మొన్నటిదాకా ఈ మైదానాన్ని ఉల్లాసం నింపింది. 

ఇప్పుడు హేమంతపు మంచుసోనలతో తెల్లని తివాచీ పరుస్తోంది  

నా పాట ఈ సమయంలో విషాద రాగాలాపనకి ఆయత్తమౌతోంది 

అన్నిటికంటే ముఖ్యంగా, నేను సోకించే సందర్భం

మానవ సమూహం గురించే; వాళ్ల మార్పు ఎప్పుడూ చెడువైపే, 

నీ లా, కనీసం అరుదుగానైనా, మంచిని చేయ తలపోయరు గదా!

 .

(అనువాదం:  రిఛర్డ్ గార్నెట్)   

 లూయిజ్ వాజ్ ది కమోజ్  

(1524 or 1525 – 20 June1580) 

స్పానిష్ కవి

Sonnet

.

Time and mortal will stand never fast;

Estranged fates man’s confidence estrange;

Aye with new quality imbued, the vast

World seems but victual of voracious change.

New endless growth surrounds on every side,

Such as we deemed not earth could ever bear,

Only doth sorrow for past woe abide

And sorrow for past good, if good it were.

Now Time with green hath made the meadows gay,

Late carpeted with snow by winter frore,

And to lament hath turned my gentle lay;

Yet of all change chiefly I deplore,

The human lot, transformed to ill alway,

Not chequered with rare blessing as of yore.

(Tr.:  Richard Garnett)

Luís Vaz de Camões

(1524 or 1525 – 20 June1580)

Spanish Poet

https://archive.org/details/anthologyofworld0000vand/page/636/mode/1up?q=614

నా హృదయం నిద్రపోయిందా?… ఆంటోనియో మచాడో, స్పానిష్ కవి

నా హృదయం నిద్రపోయిందా?

నా కలల తేనెటీగలు

పనిచెయ్యడం మానేసాయా?

నా కోరికల ఏతాము

అడుగంటిందా?

కంచాలు ఖాళీయై అందులో

నీడలుమాత్రమే మిగిలాయా?

ఏం కాదు.  నా హృదయం నిద్రపోలేదు.

మేలుకునే ఉంది, పూర్తి మెలకువలో ఉంది.

నిద్రపోనూ లేదు, కలలుగనడమూ లేదు…

కళ్ళు గచ్చకాయల్లా తెరిచి

దూరాననున్న సంకేతాలు పరిశీలిస్తున్నాయి.

అనంతనిశ్శబ్దపు నేమిపై చెవి ఒగ్గి వింటోంది.

.

ఆంటోనియో మచాడో

26 July 1875 – 22 February 1939

స్పానిష్ కవి

.

Antonio Machado

Image Courtesy: Wikipedia

.

Has My Heart Gone To Sleep?

.

Has my heart gone to sleep?

Have the beehives of my dreams

stopped working, the waterwheel

of the mind run dry,

scoops turning empty,

only shadow inside?

No, my heart is not asleep.

It is awake, wide awake.

Not asleep, not dreaming—

its eyes are opened wide

watching distant signals, listening

on the rim of vast silence.

.

Antonio Machado

26 July 1875 – 22 February 1939

Spanish Poet

Poem Courtesy: http://famouspoetsandpoems.com/poets/antonio_machado/poems/2172

నీ కోసం నేను వదులుకున్నవి… రఫేల్ ఆల్బెర్టి, స్పానిష్ కవి

నీ కోసం నా తోటా, నా ఉద్యానమూ,
నిద్రపోక ఎదురు చూసే పెంపుడు కుక్కలూ,
నా జీవితాన్ని ముందే హేమంతంలోకి నెట్టిన
నా వసంతంలాంటి వయసూ…

ఒక భయాన్నీ, ఒక అదురుపాటునీ,
ఆరని మంటలాంటి ప్రతిభనీ,
నిస్సహాయంగా వీడ్కోలుపలికే రక్తపుజీరల
కన్నులలో నా ప్రతిబింబాన్నీ వదిలిపెట్టేను.

నది ఒడ్డున విషణ్ణలైన పావురాయిల్నీ,
మైదానంలో గుర్రాలనీ, నిన్ను చూడడానికి
కమ్మని సముద్రపు సుగంధాన్ని వదిలిపెట్టేను.

నీ కోసం నాదనుకున్న ప్రతీదీ విడిచిపెట్టేను.
ఓ రోము మహానగరమా!  నా బాధలకీ, నిన్నుపొందడానికి
వదులుకున్నవన్నిటికీ, … తగినప్రతిఫలాన్ని  ప్రసాదించు!

.

రఫేల్ ఆల్బెర్టి

16 December 1902 – 28 October 1999

స్పానిష్ కవి.

.

Rafael Alberti

.

What I Left, For You

.

For you I left my woods, my lost

Grove, my sleepless dogs,

My important years, those banished

Almost to my life’s winter.

I left a tremor, a shock

A brilliance of un-extinguished fire,

I left my shadow on the desperate

Blood-stained eyes of farewell.

I left sad doves beside a river,

Horses in the sand of the arena,

I left the scent of the sea, I left to see you.

For you, I left everything that was mine.

Give me, Rome, in exchange for my pains,

All I have left in order to attain you.

.

Rafael Alberti

16 December 1902 – 28 October 1999

Spanish Poet

(Translated by A. S. Kline)

Poem Courtesy: http://www.poetryintranslation.com/PITBR/Spanish/Alberti.htm#_Toc323549691

ఉన్నదున్నట్టుగా … జార్జ్ లూయిస్ బోర్హెస్, అర్జెంటీనా కవి

తోట వాకిలి తెరుచుకుంటుంది,

సేవకుడికుండే విధేయతతో

బహుకాల సేవన ఇచ్చే చనవుతో అడిగే ప్రశ్నలా;

తోటలోకి ప్రవేశించిన తర్వాత

అక్కడ ఉండే ప్రతి వస్తువూ యథాతథంగా

మనసులో ముద్రవేసి ఉండడంతో

వాటిని ఏకాగ్రతతో పరిశీలించవలసిన అవసరం లేదు.

నాకు అన్ని సంప్రదాయాలూ, ఆలోచనలూ

ప్రతి జనసమూహమూ అల్లే

పలుకుబడుల అంతరార్థాలూ తెలుసు;

వాటిగూర్చి ప్రత్యేకంగా చెప్పనక్కరనూ లేదు,

లేని హక్కులూ, అధికారాలూ కోరదలుచుకోనూ లేదు.

నా చుట్టూ ఉన్నవాళ్ళకి నా గురించి బాగా తెలుసు

నా మానసిక వ్యధలూ, బలహీనతలూ తెలుసు.

బహుశా మనకు భగవంతుడు ప్రసాదించిన

ఉన్నత స్థితి చేరుకోవడమంటే ఇదేనేమో :

గెలుపులూ, పొగడ్తలూ కాదు,

చెట్లూ, గుట్టలులా

నిరాకరించలేని సత్యంలో భాగంగా

మనల్ని మనల్నిగా  అంగీకరించడమే.

.

 జార్జ్ లూయిస్ బోర్హెస్,

24 August 1899 – 14 June 1986

అర్జెంటీనా కవి.

.

.

Simplicity

.

It opens, the gate to the garden

with the docility of a page

that frequent devotion questions

and inside, my gaze

has no need to fix on objects

that already exist, exact, in memory.

I know the customs and souls

and that dialect of allusions

that every human gathering goes weaving.

I’ve no need to speak

nor claim false privilege;

they know me well who surround me here,

know well my afflictions and weakness.

This is to reach the highest thing,

that Heaven perhaps will grant us:

not admiration or victory

but simply to be accepted

as part of an undeniable Reality,

like stones and trees.

.

Jorge Luis Borges

24 August 1899 – 14 June 1986

Argentinian Poet

 

Poem Courtesy: http://www.poetryintranslation.com/PITBR/Spanish/Borges.htm#_Toc192667903

 

 

స్పెయిను కి… జోస్ జొరిల్ల, స్పానిష్ కవి

ఓ నా దేశమా! నీకోసం ఎన్ని కన్నీళ్ళు కారేయి!

ఎంతమంది సోదరుల రక్తం ఏరులై ప్రవహించింది!

ఎంతమంది వీరులు అపురూపమైన నీ

నేలమాళిగల్లో ప్రశాంతంగా నిద్రిస్తున్నారు !

ఎనాళ్ళనుండో మా కళ్ళు కవోష్ణ బిందువులతో నిండేయి…

ఎన్నిసార్లో అవి బయటకి ఉబుకుదామని ప్రయత్నించేయి!

కాని, ప్రతి సారీ మరో యుద్ధభూమికి మొగ్గుతూ

విపత్తులకీ, రక్తానికీ జారి పడడం మానుకున్నాయి.

చూడు! అదిగో అల్లంత దూరాన ఉన్న అడవులూ,

నేలగుండెమీద నిద్రిస్తున్న పంటచేలూ,

ఈ లోయలపై తమ పచ్చని చేతులూపుతున్న తరువులూ,

ఆ చిరునవ్వుల పూలూ, వాటిక్రింద సేదదీరమని పిలుస్తున్నై.

రండి, సోదరులారా, మనం ప్రేమ శాంతులలో జన్మించాం

ప్రేమ శాంతులలోనే మన కలహాలని మట్టుపెడదాం,

అంతే కాదు, మన విజయాలగురించి మరిచిపోదాం,

ఒకే నేలనీ, ఒకే జండానీ మనం పరిరక్షించుకుందాం.

.

జోస్  జొరిల్ల

21 February 1817 – 23 January 1893

స్పానిష్ కవి

 

 

José Zorrilla

.

To Spain

 

Many a tear, O country, hath been shed,       

Many a stream of brother’s blood been poured,    

Many a hero brave hath found his bed,

In thy deep sepulchres, how richly stored!    

Long have our eyes with burning drops been filled,—             

How often have they throbbed to overflow! 

But always bent upon some crimsoned field,  

They could not even weep for blood and woe.       

Look! how beseech us to their own sweet rest 

Yon smiling flowers, yon forests old and brave,           

Yon growing harvests, sleeping on earth’s breast,   

Yon banners green that o’er our valleys wave.      

Come, brothers, we were born in love and peace,    

In love and peace our battles let us end;       

Nay, more, let us forget our victories,—       

Be ours one land, one banner to defend!

.

José Zorrilla

21 February 1817 – 23 January 1893)

Spanish Romantic poet and dramatist.

Translated by Samuel Eliot

Poem Courtesy:

Poems of Places: An Anthology in 31 Volumes.

Spain, Portugal, Belgium, and Holland: Vols. XIV–XV. 1876–79.

  1. Henry Wadsworth Longfellow

http://www.bartleby.com/270/6/2.html

సుప్రభాత నామావళి … రఫేల్ ఆల్బర్టీ, స్పానిష్ కవి

లేకావి కిరణాల ప్రభాతమా!

నీకు కొన్ని పేర్లు పెడుతున్నాను.

నువ్వొక పొరబడ్డ కలవి,

వీడని దేవకన్యవి,

చెట్లమీది వర్షపు ఆభాసవి

నదీప్రవాహాల్ని గుర్తుచేసుకునే

నా ఆత్మాంచలాల

సందిగ్ధంగా, వెనకాడుతూ,

చివరకి స్థిరంగా ఉంటావు.

నువ్వొక తారా విస్ఫోటనానివనీ,

వేవెలుగుల ఆనందానివనీ,

చప్పుడుచెయ్యని పారదర్శకతవనీ అందునా?

కాదు, నువ్వు

నీటిమీదిమంచుకి అపభ్రంశానివి.

.

రఫేల్ ఆల్బర్టీ

16 December 1902 – 28 October 1999

స్పానిష్ కవి 

 

Rafael Alberti

Naming The Dawn  

With gentle red assaults, Dawn, I was granting you names:

Mistaken dream, Angel without exit, Falsehood of rain in the trees. 

         At the edges of my soul, that recalls the rivers,

Indecisive, hesitant, still.

Spilt star, Confused light weeping, Glass without voice?

          No.

Error of snow in water, is your name.

.

(Translated by A S Kline)

.

Rafael Alberti 

16 December 1902 – 28 October 1999

Spanish Poet

Poem Courtesy:

http://www.poetryintranslation.com/PITBR/Spanish/Alberti.htm#_Toc323549689

 

%d bloggers like this: