అనువాదలహరి

మౌనప్రేమ… సర్ ఫిలిప్ సిడ్నీ, ఇంగ్లీషు కవి

నేను ఎవరుపడితే వాళ్ళదగ్గర ప్రేమ ప్రకటించను గనుక,

లేదా కొన్ని ప్రత్యేకమైన దుస్తులు ధరించను గనుక,

జుత్తుని కొన్ని విధాలుగా అలంకరించుకోను గనుక,

ప్రతి మాటలోనూ నిట్టూర్పులు విడిచిపెట్టను గనుక …

ఈ సొగసుకత్తెలు, అలవాటుగా ప్రేమనిప్రకటించేవారి

పెదాలపై నిట్టూర్పులకు అలవాటు పడి

“ఏమిటి? వాడా?” అంటుంటారు నా గురించి:” నేను ఒట్టేసి చెప్పగలను

అతనికి ప్రేమంటే తెలీదు. లాభంలేదు. అతన్ని ఒక్కణ్ణీ ఉండనీండి.”

ఇప్పటికీ అలాగే అనుకుంటారు… స్టెల్లా కి నా మనసు తెలిస్తే…

నిజమే, ఒప్పుకుంటాను. నాకు అనంగ కళలు తెలీవు;

కానీ, ఓ అందమైన పడుచులారా, చివరకి మీరు నిజం తెలుసుకుంటారు,

ప్రేమించినవాడు తన గుర్తులు మనసులో భద్రపరుచుకుంటాడు.

ప్రేమికులంటే వాగుడుకాయలు కాదు, మాటలకి వెదుక్కుంటారు;

నిజంగా ప్రేమించిన వాళ్ళు ప్రేమించేమని చెప్పడానికి వణుకుతారు.

.

సర్ ఫిలిప్ సిడ్నీ

30 November 1554 – 17 October 1586

ఇంగ్లీషు కవి

.

Love’s Silence

Because I breathe not love to everie one,   

  Nor do not use set colors for to weare,    

  Nor nourish special locks of vowèd haire,        

Nor give each speech a full point of a groane,— 

The courtlie nymphs, acquainted with the moane         

  Of them who on their lips Love’s standard beare,      

  “What! he?” say they of me. “Now I dare sweare       

He cannot love: No, no! let him alone.”     

  And think so still,—if Stella know my minde.  

Profess, indeed, I do not Cupid’s art;        

  But you, faire maids, at length this true shall finde,—

That his right badge is but worne in the hearte.  

  Dumb swans, not chattering pies, do lovers prove:    

  They love indeed who quake to say they love.

.

Sir Philip Sidney

(30 November 1554 – 17 October 1586)

English Poet

Poem Courtesy:

The World’s Best Poetry.

Bliss Carman, et al., eds. 

Volume II. Love.  1904.

Love’s Nature

http://www.bartleby.com/360/2/74.html

సానెట్ 31… సర్ ఫిలిప్ సిడ్నీ, ఇంగ్లీషు కవి

ఓ చంద్రమా! ఎంత మౌనంగా బరువుగా అడుగులేస్తూ
ఆకశానికి ఎగబ్రాకుతున్నావు! ఎంతగా అలసిపోయింది నీ వదణం!
ఏమిటి? అక్కడ స్వర్గంలో కూడా తీరుబాటు లేకుండా
పూవిలుకాడు తన వాడి బాణాలు ప్రయోగిస్తున్నాడా?
ప్రేమంటే ఏమిటో చిరపరిచయమున్న నాకళ్ళతో పరీక్షించినపుడు
నీది తప్పకుండా ప్రేమికుడిబాధలాగే కనిపిస్తోంది;
నీ కళ్ళలో స్పష్టంగా కనిపిస్తోంది; నీ సొగసులేమి చెబుతోంది;
సరి వేదన అనుభవిస్తున్న నాకు, నీ స్థితి అర్థం అయింది.
సహబాధితుడిగా, ఓ చంద్రమా నాకు తెలియక అడుగుతాను చెప్పు
ఎడతెగని ప్రేమ అంటే బుద్ధిలేని తనంతో సమానమా?
అక్కడకూడా ఇక్కడిలాగే గర్విష్టులైన అందగత్తెలున్నారా?
వాళ్లు ప్రేమింపబడడానికి అతీతులా? అయినా,
ప్రేమించిన వాళ్ళని చిన్న చూపుచూస్తారా?
వాళ్ళు ఒక సుగుణాన్ని కృతఘ్నతగా భావిస్తారా?
.

సర్ ఫిలిప్ సిడ్నీ

ఇంగ్లీషు కవి

Sonnet 31

.

With how sad steps, O Moon, thou climb’st the skies!

How silently, and with how wan a face!    

What, may it be that even in heavenly place       

That busy archer his sharp arrows tries!   

Sure, if that long-with-love-acquainted eyes       

Can judge of love, thou feel’st a lover’s case,     

I read it in thy looks; thy languisht grace, 

To me, that feel the like, thy state descries.

Then, even of fellowship, O Moon, tell me,        

Is constant love deem’d there but want of wit?   

Are beauties there as proud as here they be?      

Do they above love to be lov’d, and yet    

Those lovers scorn whom that love doth possess?       

Do they call virtue there ungratefulness?

.

(Sonnet 31 from Astrophel and Stella)

Sir Philip Sidney

(30 November 1554 – 17 October 1586)

English Poet

Poem Courtesy:

The English Poets.  1880–1918.

Ed: Thomas Humphry Ward.

Vol. I. Early Poetry: Chaucer to Donne

నిద్ర… సర్ ఫిలిప్ సిడ్నీ, ఇంగ్లీషు కవి

(కవిత్వమన్నా, స్నేహానికిప్రాణంపెట్టడమన్నా, ఉత్తమమైనశీలాన్ని అలవరచుకోవడమన్నా, చనిపోతున్నపుడుకూడా మానవీయవిలువలకి జీవితాన్నిఅంకితంచేసి ఉదాత్తంగా వ్యవహరించడమన్నా,  సర్ ఫిలిప్ సిడ్నీ నుండి  ఈ కాలపు కవులు నేర్చుకోవగలిగినది చాలా ఉంది.

ఇంగ్లీషు కవీ, రాజసేవకుడూ, సైనికుడూ అయిన సర్ ఫిలిప్ సిడ్నీది ఉదాత్తమైన వ్యక్తిత్వం. అతని అపురూపమైన వ్యక్తిత్వానికి చిహ్నంగా ఒక కథ బహుళ ప్రచారం లో ఉంది. తన స్నేహితుడికోసం యుధ్ధానికి వెళ్ళిన సిడ్నీ, గాయపడి పడిపోయి, దాహ దాహం అంటుంటే, ఎవరో తాగడానికి నీళ్ళు తీసుకు వచ్చి అతనికి ఇస్తే, తనపక్కనే నీటికోసం అలమటిస్తున్న ఇంకొక సైనికుడిని చూసి “నా అవసరం కంటే నీ అవసరం ఎక్కువ (your necessity is more than mine)” అని చెప్పి అతనకి నీళ్ళందించి చనిపోయాడట.  అందుకే Edmund Spencer అతనిమీద అద్భుతమైన ఎలిజీ వ్రాసేడు. అంతేగాక తన “Shephard’s Calendar” అన్న కావ్యాన్ని అంకితమిచ్చాడు. సిడ్నీ రచనలలో The Defence of poesy (aka An apology to poetry), The Arcadia, Astrophel and Stella  చాలా ముఖ్యమైనవి. )

.

ఓ నిద్రా దేవతా! రా!  ఉపశాంతికి వీడని బంధానివి

దుఃఖానికి లేపనానివి, మెదడుకి మంచి మేతవి,

నిర్భాగ్యుడి ఐశ్వర్యానివి, ఖైదీల స్వాతంత్ర్యానివి,

గొప్పా చిన్నా తారతమ్యం చూపని అపర సమవర్తివి.

నిరాశ నాపై సంధించే వాడి అమ్ముల్ని

నీ దుర్భేద్యమైన కవచంతో రక్షించు,

నా అంతరంగంలో చెలరేగుతున్న సంక్షోభాల్ని ఆపు

అలాచేస్తివా, నీకు మంచి ముడుపులు చెల్లించుకుంటాను.

ఈ మెత్తని తలగడాలు, తూలికల తల్పాలూ, తీసుకుపో

శబ్దాలు వినిపించని, వెలుగు కనిపించని ఈ భవంతినీ

ఒక గులాబి దండనీ, అలసిన నా తలనీ తీసుకుపో.

ఈ చెప్పిన వన్నీ, నీ హక్కు అంటావా, సరే కానీ,

నానుండి నీ అనుగ్రహం మాత్రం మరల్చకు. ఎందుకంటావా,

ఇంకెక్కడికన్నా కూడా అందంగా స్టెల్లా బొమ్మని చూడగలవు.

.

సర్ ఫిలిప్ సిడ్నీ

30 నవంబరు 1554 – 17 అక్టోబరు 1586

ఇంగ్లీషు కవి

.

.

Sleep

.

Come, Sleep; O Sleep! the certain knot of peace.

The baiting-place of wit, the balm of woe,

The poor man’s wealth, the prisoner’s release,

Th’ indifferent judge between the high and low;

With shield of proof shield me from out the prease

Of those fierce darts Despair at me doth throw:

O make in me those civil wars to cease;

I will good tribute pay, if thou do so.

Take thou of me smooth pillows, sweetest bed,

A chamber deaf to noise and blind of light,

A rosy garland and a weary head;

And if these things, as being thine by right,

    Move not thy heavy grace, thou shalt in me,

    Livelier than elsewhere, Stella’s image see.

.

Sir Philip Sidney

30 November 1554 – 17 October 1586

English Poet

Poem Courtesy:

http://www.bibliomania.com/0/0/frameset.html

 

%d bloggers like this: