అనువాదలహరి

నాకు తెలుసు… సర్ జాన్ డేవీస్, ఇంగ్లీషు కవి

నా శరీరం ఎంత దుర్బలమో నాకు తెలుసు
బయటి శక్తులూ, లోపలి బలహీనతలూ దాన్ని చంపగలవు;
నా మనసు దివ్యస్వభావమూ తెలుసు
కానీ, దాని తెలివీ, ఇఛ్ఛ కలుషితమైపోయాయి.

నా ఆత్మకి అన్నీ తెలుసుకోగల శక్తి ఉందని తెలుసు
కానీ అది గుడ్డిగా, మూర్ఖంగా ప్రవర్తిస్తుంది;
నేను ప్రకృతి గారాబు పట్టిలలో ఒకడినని తెలుసు
కానీ చాలా అల్పవిషయాలకీ, బలహీనతలకీ దాసుణ్ణి.

నాకు జీవితం బాధామయమనీ, క్షణికమనీ తెలుసు
నా ఇంద్రియాలు ప్రతిదానిచే కవ్వింపబడతాయనీ తెలుసు,
చివరగా, నాకు నేను మనిషినని తెలుసు, అందుకు
ఒక పక్క గర్వమూ, మరొకవంక దైన్యమూ ఉన్నాయి.
.
సర్ జాన్ డేవీస్,
16 April 1569 – 8 December 1626
ఇంగ్లీషు కవి

.

Of Human Knowledge

.

 I know my body’s of so frail a kind,

    As force without, fevers within can kill;

 I know the heavenly nature of my mind,

    But ’tis corrupted both in wit and will.

 I know my Soul hath power to know all things,

    Yet is she blind and ignorant in all;

 I know I am one of Nature’s little kings,

    Yet to the least and vilest things am thrall.

 I know my life’s a pain and but a span,

    I know my Sense is mock’d with every thing:

 And to conclude, I know myself a MAN,

    Which is a proud, and yet a wretched thing.

.

Sir John Davies

16 April 1569 (baptised) – 8 December 1626

English  poet

మానవ పరిజ్ఞానము… సర్ జాన్ డేవీస్, ఇంగ్లీషు కవి

నాకు తెలుసు నా శరీరము అతి బలహీనమైనది,కారణం

బయట శక్తులూ, లోపలి జ్వరాలూ దాన్ని నశింపజేయగలవు;

నాకు నా మనసు దివ్యాంశ సంభూతమనీ తెలుసు

కానీ, దాన్ని అతితెలివీ, లాలసా రెండూ చెడగొడతాయి. 

నాకు తెలుసు నా ఆత్మ అన్నిటినీ తెలుసుకోగల శక్తిగలది, 

కానీ అది అన్నివిషయాల్లోనూ అజ్ఞానీ,అవివేకీను;  

నాకు తెలుసు నేను ప్రకృతిలో ఒక మాదిరి మహరాజుని,

కానీ అధమమూ, నీచమూ అయిన విషయాలకి దాసుడిని.   

నాకు తెలుసు నా జీవితం క్షణికమూ, దుఃఖమయమూ

నా ఇంద్రియాలు నన్ను అన్నివిషయాల్లో మోసంచేస్తాయని

చివరకి చెప్పొచ్చేదేమిటంటే, నేను ఒక మానవుడిని

అది ఒక గర్వకారణమే కాదు, ఒక దౌర్భాగ్యం కూడా.

.

సర్ జాన్ డేవీస్

16 April 1569 (baptised) – 8 December 1626

ఇంగ్లీషు కవి 

ఈ కవిత ప్రత్యేకత చాలా సరళమైన భాషలో భౌతిక పదార్థానికీ, ఆత్మకీ మధ్య వివేచన చెయ్యడం. మానవ జీవితంలోని వరాల్నీ శాపాలనీ ఏకరువు పెడుతున్నట్టు కనిపించినా, కవి సానుభూతి ఎటో చెప్పకనే తెలుస్తుంది.  ఏ కాలంలోనైనా ఆ కాలపు మేధోవికసనము నాటి కవిత్వంలో ప్రతిబింబిస్తుందని ఒప్పుకుంటే, ఈ చిన్న కవిత ఎలిజబెత్ మహారాణి కాలంలో ఎంత ఆరోగ్యకరమైన సాహితీ వాతావరణం ఉందో అంచనావెయ్యొచ్చు ఈ కవితద్వారా.

.

.
Of Human Knowledge

.

I know my body’s of so frail a kind,
As force without, fevers within can kill;
I know the heavenly nature of my mind,
But ’tis corrupted both in wit and will.

I know my Soul hath power to know all things,
Yet is she blind and ignorant in all;
I know I am one of Nature’s little kings,
Yet to the least and vilest things am thrall.

I know my life’s a pain and but a span,
I know my Sense is mock’d with every thing:
And to conclude, I know myself a MAN,
Which is a proud, and yet a wretched thing.

Sir John Davies

(16 April 1569 (baptised) – 8 December 1626) English Poet and Lawyer

%d bloggers like this: