అనువాదలహరి

వాళ్ళు… సీ ఫ్రై ససూన్, ఇంగ్లీషు కవి

మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో వచ్చిన గొప్ప కవితలలో ఇదొకటి. యుద్ధంలో స్వయంగా పాల్గొని, మృత్యువుని దగ్గరగా చూసిన అనుభవంతో యుద్ధం ఎంత నిష్ప్రయోజనమో ససూన్ చాలా చక్కగా వివరించడంతో పాటు, అందులో పాల్గొనకుండా, యుద్ధాన్ని గొప్పగా కీర్తించే వాళ్ళ ఆత్మవంచన స్వభావాన్ని ఎండగడుతుంది ఈ కవిత.

.

బిషప్ మాతో ఇలా అన్నాడు: “వాళ్ళు యుద్ధం నుండి తిరిగొచ్చేక

మునపటిలా ఉండరు; కారణం వాళ్ళు క్రీస్తుకి వ్యతిరేకులపై

చిట్టచివరి ధర్మ యుద్ధం చెయ్యడానికి వెళ్ళేరు;

వాళ్లు కళ్ళజూసిన తోటి సైనికుల రక్తం

జాతి తలెత్తుకు జీవించడానికి కొత్త అధికారాన్నిచ్చింది.

వాళ్ళు మృత్యువుకి ఎదురునిలిచి మరీ పోరాడేరు.”

“అవును, మాలో ఎవ్వరం మునపటిలా లేము,” అన్నారు కుర్రాళ్ళు.

“జార్జికి రెండు కాళ్ళూ పోయాయి; బిల్ కి కళ్ళు అసలు కనపడవు,

పాపం ఊప్రితిత్తులలోంచి గుండు దూసుకెళ్ళి, జిం చావే నయమనుకుంటున్నాడు;

బెర్ట్ కి సిఫిలిస్ వ్యాధి సోకింది. అసలు యుద్ధానికి వెళ్ళిన వాడు

ఒక్కడైనా ఏదో ఒకటి పోగొట్టుకోకుండా తిరిగొస్తే ఒట్టు!”

దానికి బిషప్, “భగవంతుని లీలలు చిత్రంగా ఉంటాయి!” అన్నాడు.

.

సీ ప్రై ససూన్

(8 September 1886 – 1 September 1967) 

ఇంగ్లీషు కవి

.

Siegfried Sassoon
Siegfried Sassoon
Image Courtesy: http://www.spartacus.schoolnet.co.uk/Jsassoon.htm

.

‘They’

.

The Bishop tells us: ‘When the boys come back

‘They will not be the same; for they’ll have fought

‘In a just cause: they lead the last attack

‘On Anti-Christ; their comrades’ blood has bought

‘New right to breed an honourable race,

‘They have challenged Death and dared him face to face.’

‘We’re none of us the same!’ the boys reply.

‘For George lost both his legs; and Bill’s stone blind;

‘Poor Jim’s shot through the lungs and like to die;

‘And Bert’s gone syphilitic: you’ll not find

‘A chap who’s served that hasn’t found some change.

‘ And the Bishop said: ‘The ways of God are strange!’

.

Siegfried Sassoon 

(8 September 1886 – 1 September 1967)

English Poet and Soldier

Poem Courtesy:

https://allpoetry.com/’They

అందరూ పాడిన పాట… సీ ఫ్రై ససూన్, ఇంగ్లీషు కవి

అందరూ ఒక్కసారి పాట అందుకున్నారు;
నాలో ఎంత ఉత్సాహం పొంగిపొరలిందంటే
పంజరంలో బంధించబడిన పక్షులు విముక్తులై
తెల్లని పూదోటలమీద రెక్కలల్లార్చుకుంటూ
పచ్చనిపొలాలమీదుగా విహరిస్తూ విహరిస్తూ
కంటికి కనిపించనంతదూరంవెళ్లినంతగా.

అందరిగొంతుకలూ ఒక్కసారి తారస్థాయికి చేరుకున్నాయి;
సూర్యాస్తమయవేళ సౌందర్యం అందర్నీ ఆవహించింది,
నా మనసు కన్నీటితో పులకించిపోయింది;
భయం పటాపంచలయింది… ఓహ్! కానీ అందరూ
పక్షుల్లాగే… పాటలో పదాలు లేవు; పాట ఇక ఎవరూ పాడలేరు.
.
సీ ఫ్రై ససూన్

(8 September 1886 – 1 September 1967)

ఇంగ్లీషు కవి, సైనికుడు

Siegfried Sassoon
Siegfried Sassoon
Image Courtesy: http://www.spartacus.schoolnet.co.uk/Jsassoon.htm

.

Everyone Sang

Everyone suddenly burst out singing;

And I was filled with such delight

As prisoned birds must find in freedom,

Winging wildly across the white

Orchards and dark-green fields, on- on- and out of sight.

 

…… deliberately edited… copyrighted poem…. ….

 

Siegfried Sassoon CBE MC

(8 September 1886 – 1 September 1967)

English Poet, Soldier

please Read the  Original Copyrighted poem here

 

స్త్రీల ఔన్నత్యము… సీ ఫ్రై ససూన్, ఇంగ్లీషు కవి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీలందరికీ శుభాకాంక్షలతో

.

మేము గొప్పపనులు చేస్తే ప్రేమిస్తారు, శలవులకి ఇంటికి వచ్చినా,

లేక చెప్పలేని చోట గాయాలపాలై తిరిగొచ్చినా.

మీరు పతకాల్ని ఆరాధిస్తారు; మీకు గొప్ప నమ్మకం

యుద్ధంలోని కళంకాన్ని శౌర్యం కప్పిపుచ్చుతుందని.

మమ్మల్ని ఉక్కు కవచాల్లా తయారు చేస్తారు. మహాసంతోషంగా వింటారు,

మట్టికొట్టుకుపోతూ ప్రమాదాల్నెదిరించిన మా కథలకి పులకిస్తారు.

దూరంగా ఎక్కడో యుద్ధం చేస్తున్నపుడు మా లోపలి ఉద్రేకం మీరే

మేము మరణిస్తే, జ్ఞాపకాలను పచ్చగా ఉంచుకుంటూమరీ శోకిస్తారు.

నరకసదృశమైన ఉత్పాతం ఎదురైనపుడు, రక్తమోడుతూ

బ్రిటిషు సేనలు కూడా వెన్నిచ్చి వెనక్కి పరిగెడతాయనీ,ఆ పరుగులో

నేలమీది భీతావహమైన శవాల్ని తొక్కుకుంటూ పోతాయంటే మీరు నమ్మలేరు.

చలిమంట ప్రక్కన కలలుగంటున్న ఓ జర్మను మాతా!

నీ కొడుకుకి పంపిద్దామని మేజోళ్ళు అల్లుతున్నావు గానీ,

అతని ముఖం బురదలో లోతుగా చొచ్చుకుపోయింది తల్లీ!

.

సీ ఫ్రై ససూన్.

8 September 1886 – 1 September 1967

ఇంగ్లీషు కవి

యుద్ధోన్మాదం ఎంత ప్రమాదకరమో, ఎన్ని కలలు, కన్నీళ్ళు నేలపాలవుతాయో, కవులు కేవలం ఊహిస్తే, స్వయంగా యుద్ధరంగంలో పనిచేసిన సైనికుడిగా, కవితాహృదయంతో స్పందించి అనేక కవితలు వ్రాసేడు సీ ఫ్రై ససూన్.

ఒక చిన్న ఉపమానంతో ఎంత అందమైన బాధామయ చిత్రాన్ని ఆవిష్కరించాడో చూడండి. యుద్ధం ఎవరికి అన్యాయం చేసినా చెయ్యకపోయినా, స్త్రీలకు యుద్ధం ఎప్పుడూ అన్యాయమే చేస్తుంది… ఎటునుండి చూసినా.

.

Siegfried Sassoon
Siegfried Sassoon
Image Courtesy: http://www.spartacus.schoolnet.co.uk/Jsassoon.htm

.

Glory of Women

.

You love us when we’re heroes, home on leave,

Or wounded in a mentionable place.

You worship decorations; you believe

That chivalry redeems the war’s disgrace.

You make us shells. You listen with delight,

By tales of dirt and danger fondly thrilled.

You crown our distant ardours while we fight,

And mourn our laurelled memories when we’re killed.

You can’t believe that British troops ‘retire’

When hell’s last horror breaks them, and they run,

Trampling the terrible corpses–blind with blood.

O German mother dreaming by the fire,

While you are knitting socks to send your son

His face is trodden deeper in the mud.

.

Siegfried Sassoon

8 September 1886 – 1 September 1967

English Poet, Writer, Soldier.

Poem Courtesy:

http://www.poemhunter.com/poems/women/page-1/29714/

చావుతప్పిన వాళ్ళు… సీ ఫ్రై ససూన్, ఇంగ్లీషు కవి

సందేహించనక్కరలేదు, వాళ్ళు త్వరలోనే కోలుకుంటారు

ఒత్తిడీ, దిగ్భ్రాంతీ వాళ్ళు నత్తిగా, అర్థంలేకుండా మాటాడేట్టు చేశాయి.

“వాళ్ళకి మళ్ళీ యుద్ధంలోకి వెళ్ళాలనిపిస్తుం” దనుకొండి సందేహం లేదు 

గాట్లుపడ్డమొహాలతో, నడవడం నేర్చుకుంటున్న ఈ సైనికులకి.

వాళ్ళు త్వరలోనే తమ నిద్రలేని రాత్రుళ్ళగురించి మరిచిపోతారు;

చనిపోయిన మిత్రుల ఆత్మలకు భయంతో మోకరిల్లడం కూడా,

హత్యలతో రక్తమోడుతున్న వాళ్ళ కలలూ, వాళ్ళ గర్వాన్ని సమూలంగా

హరించిన మాహా యుద్ధం గురించి ఇప్పుడు మహా గొప్పగా చెప్పుకుంటారు.

విచారంతోనూ, ఆనందంగానూ యుద్ధానికి వెళ్ళేరు పురుషులు

నిన్ను ద్వేషించే కళ్ళతో, దిక్కులేక, పిచ్చెక్కినట్టున్నారు పిల్లలు.

.

సీ ఫ్రై ససూన్

(8 September 1886 – 1 September 1967)

ఇంగ్లీషు కవి.

Siegfried Sassoon
Siegfried Sassoon
Image Courtesy: http://www.spartacus.schoolnet.co.uk/Jsassoon.htm

.

Survivors

 .

No doubt they’ll soon get well; the shock and strain

Have caused their stammering, disconnected talk.

Of course they’re ‘longing to go out again,’

These boys with old, scared faces, learning to walk.

They’ll soon forget their haunted nights; their cowed

Subjection to the ghosts of friends who died,

Their dreams that drip with murder; and they’ll be proud

Of glorious war that shatter’d all their pride…

Men who went out to battle, grim and glad;

Children, with eyes that hate you, broken and mad.

.

Siegfried Sassoon.

(8 September 1886 – 1 September 1967)

English Poet

 

అంతిమ విజయం… విల్ఫ్రెడ్ ఓవెన్ … ఇంగ్లీషు కవి

, జీసస్! గట్టిదెబ్బే తగిలింది అంటూ, అతను నేలకొరిగాడు.

అతను వృధాగా శత్రువుని శపించేడో, దేవుణ్ణి తలుచుకున్నాడో గాని,

బుల్లెట్లు మాత్రం వృధా! వృధా! వృధా! అని ముక్తకంఠంతో చెప్పేయి

మెషీన్ గన్ లు ” టట్, టట్ టట్ టట్” అంటూ నవ్వుకున్నాయి

పెద్ద ఫిరంగి బడబడా పగలబడి నవ్వింది.

 

మరొకడు, – “అమ్మా! అమ్మా! నాన్నా!”

అంటూ పిల్లాడిలా దేనికినవ్వుతున్నాడో తెలీని ముఖంతో మరణించేడు.

ఎత్తునుండి కురుస్తున్న గుళ్ళవర్షం

తాపీగా మందలించింది “మూర్ఖుడు” అంటూ

రాలి పడుతున్న వాడి ములుకులు ముసిముసిగా నవ్వేయి.

 

ప్రియతమా!” ఒకడు మూలిగేడు. ప్రేమకోసం తపిస్తున్నట్టుంది అతని స్థితి,

అతను నెమ్మదిగా కూలబడ్డాడు ముఖం మట్టిని ముద్దాడుతూ.

శత్రువు బాయ్ నెట్ కున్న పళ్ళు వెకిలిగా నవ్వేయి

ఒక్కసారిగా గుళ్ళ వర్షం మోత మోగింది

విషవాయువు బుసకొట్టింది.

.

విల్ఫ్రెడ్ ఓవెన్

18 March 1893 – 4 November 1918

ఇంగ్లీషు కవీ, WWI సైనికుడు

.

.

The Last Laugh

 

‘O Jesus Christ! I’m hit,’ he said; and died.

Whether he vainly cursed, or prayed indeed,

       The Bullets chirped – ‘In vain! vain! vain!’

       Machine-guns chuckled, ‘Tut-tut! Tut-tut!’

       And the Big Gun guffawed.

 

Another sighed, – ‘O Mother, Mother! Dad!’

Then smiled, at nothing, childlike, being dead.

       And the lofty Shrapnel-cloud

       Leisurely gestured, – ‘Fool!’

       And the falling splinters tittered.

 

‘My Love!’ one moaned. Love-languid seemed his mood,

Till, slowly lowered, his whole face kissed the mud.

       And the Bayonets’ long teeth grinned;

       Rabbles of Shells hooted and groaned;

       And the Gas hissed.

.

Wilfred Owen

18 March 18934 November 1918

English poet and soldier, one of the leading poets of the First World War  

దార్శనికత … సీ ఫ్రై ససూన్, ఇంగ్లీషు కవి

నాకు కాలగతిలో కలిసిపోయే వస్తువులన్నీ ఇష్టం; వాటి క్షణికతే  

నిలకడలేని నిశ్శబ్దాలమీద సంగీతమై, క్రమంగా అంతరిస్తుంది.

సుడిగాలులు, పక్షులు, లే చివుళ్ళు, అన్నీ ఒక వెలుగు వెలిగి రాలిపోతాయి   

ప్రపంచానికి ఆనందాన్ని వెదజల్లుతాయి;  దానికి

మెరుపులా లయబద్ధంగా కదలగల అవయవాలు కావాలి,

 ప్రభాతవేళ యవ్వనపు జిగితో వెలిగే మోమూ,

మృత్య్తువుతో ముగిసే క్షణణకాల ప్రేమా…  

“ఓ సౌందర్యమా! నువ్వు నశ్వరమైన వస్తువులోంచే జనిస్తావు సుమీ!”  

 .

సీ ఫ్రై ససూన్

(8 September 1886 – 1 September 1967)

ఇంగ్లీషు కవి

 

.

Siegfried Sassoon
Siegfried Sassoon
Image Courtesy: http://www.spartacus.schoolnet.co.uk/Jsassoon.htm

 

.

Vision

.

I love all things that pass; their briefness is

Music that fades on transient silences.

……………………………………………………..

……………………………………………………..

……………………………………………………..

a moment in dawn for Youth’s lit face,

a moment’s passion, closing on the cry,

“O beauty! born of lovely things that die!”

(1918)

Siegfried Sassoon.

(8 September 1886 – 1 September 1967)

English Poet

Poem Courtesy: First World War Digital archive

(From : Fifty Poems by Siegfried Sassoon.)

This is copyrighted. For complete text, please visit:

http://www.oucs.ox.ac.uk/ww1lit/collections/document/9854

 

 

వీరుడు… సీ ఫ్రై ససూన్, ఇంగ్లీషు కవి

“తను కోరుకున్నట్టుగా జాక్ వీరమరణం పొందాడు” అంది తల్లి,

తను చదువుతున్న ఉత్తరాన్ని మడిచిపెడుతూ.

“కలనల్ చాలా అద్భుతంగా రాస్తాడు,”

అలసిన ఆమె గొంతుకి ఏదో అడ్డుపడి గద్గదమైపోయింది.

సగం తలపైకెత్తి,” మా లాంటి తల్లులము

అటువంటి వీరపుత్రులను చూసి గర్వపడతాం.” ముఖం వాలిపోయింది. 

బ్రదర్ ఆఫీసరు మౌనంగా బయటకి నడిచేడు.

అతను ఆ అమాయకపు తల్లికి పెద్ద అబద్ధాలు చెప్పేడు

వాటిని, సందేహం లేదు, ఆమె జీవితకాలం నెమరువేసుకుంటుంది.

అతను మాటాడడానికి మాటలు వెతుక్కుంటూ, గొణుగుతుంటే,

ఆ ముసలి కళ్ళు ఆనందంతో,  ఏదో సాధించిన గర్వంతో మెరిసాయి:

అవును, ఆమె కొడుకు అంత సాహసి, ఖ్యాతితెచ్చిన కొడుకు.

అతను జాక్ ఎంత పిరికివాడో, పనికిమాలినవాడో గుర్తుచేసుకున్నాడు:

ఆ వికెడ్ కార్నర్ దగ్గర మందుపాత్రపేలినపుడు

ట్రెంచిలో ఎంతగాభరాపడ్డాడో; తనను ఇంటికిపంపేసేలా

ఎలా ప్రయత్నించాడో, చివరకి ఎలా చనిపోయాడో…

తునాతునకలిపోయి. ఎవరికీ పట్టినట్టు లేదు…

ఒక్క ఆ ఒంటరి ముదివగ్గు … తల్లికి తప్ప.! 

.

సీ ఫ్రై ససూన్

(8 September 1886 – 1 September 1967)

ఇంగ్లీషు కవి

.

Siegfried Sassoon
Siegfried Sassoon
Image Courtesy: http://www.spartacus.schoolnet.co.uk/Jsassoon.htm

.

The Hero

 

‘Jack fell as he’d have wished,’ the mother said,

And folded up the letter that she’d read.

‘The Colonel writes so nicely.’ Something broke

In the tired voice that quavered to a choke.

She half looked up. ‘We mothers are so proud

Of our dead soldiers.’ Then her face was bowed.

 

Quietly the Brother Officer went out.

He’d told the poor old dear some gallant lies

That she would nourish all her days, no doubt

For while he coughed and mumbled, her weak eyes

Had shone with gentle triumph, brimmed with joy,

Because he’d been so brave, her glorious boy.

 

He thought how ‘Jack’, cold-footed, useless swine,

Had panicked down the trench that night the mine

Went up at Wicked Corner; how he’d tried

To get sent home, and how, at last, he died,

Blown to small bits. And no one seemed to care

Except that lonely woman with white hair.

.

Siegfried Sassoon

(8 September 1886 – 1 September 1967)

English Poet

 

అందరూ పాడిన పాట… … సీ ఫ్రై ససూన్, ఇంగ్లీషు కవి

అందరూ ఒక్కసారి పాడటం ప్రారంభించేరు

నాకు ఎంతగా ఆనందంతో పులకరింత కలిగిందంటే

పంజరంలో బంధించిన పక్షి స్వేచ్ఛగా రెక్కలాడిస్తూ

తెల్లని పళ్ళతోటల్లోంచీ, పచ్చని మైదానాలమీంచీ

అలా అలా ఎగురుకుంటూ … కనుచూపు దాటిపోయినంత…

అందరి గొంతూ ఒక్కసారి తారస్థాయి చేరుకుంది;

సూర్యాస్తమయమంత శోభాయమానంగా ఉంది;

నా గుండె కన్నీళ్ళతో నిండిపోయింది; భయం

నెమ్మదిగా తొలగిపోయింది… ఓహ్, ప్రతివ్యక్తీ ఒక పిట్ట;

పాటకి పదాలు లేవు… పాట మాత్రం ఎప్పటికీ ఆగదు…

.

సీగ్ ఫ్రై ససూన్

.

సీగ్ ఫ్రై ససూన్

(8 September 1886 – 1 September 1967)

ఇంగ్లీషు కవీ, సైనికుడూ

‘సీఫ్రెడ్ ససూన్’ మొదటి ప్రపంచ సంగ్రామంలో ప్రత్యక్షంగా పాల్గొన్నవాడు.  యుద్ధరంగంలోని భీభత్సరసాన్ని స్వయంగా అనుభవించిన వాడు.


మృత్యువుతో భుజం భుజం రాసుకుంటున్నప్పుడు ఒక ప్రక్క భీతావహంగా అనిపించినా వేరొక పక్క మొండిదైర్యంకూడా వస్తుంది. వేదనలోంచే తాత్త్విక చింతనా, అందులోంచే ఒక అనిర్వచనీయమైన ఆనందమూ వస్తాయి. అప్పుడే గొంతులోంచి ఒక రాగం వస్తుంది. పంజరంలోంచి చిలక బయటికి ఎగిరిపోవడం అదే. బహుశా ప్రాణం మీద అంతవరకూ ఉన్న తీపి ఒక్క సారి పోతుందేమో.  పదిమందితో చావు పెళ్ళితో సమానం అని మనకో నానుడి ఉంది. ఇలాంటి సందర్భాన్ని బట్టే వచ్చిందేమో.  అలా వచ్చిన పాటకి పదం లేకపోయినా రాగం మాత్రం మనసులో మారుమోగుతూనే ఉంటుంది.

.

Everyone Sang

 .

 Everyone suddenly burst out singing;

 And I was filled with such delight

 As prisoned birds must find in freedom,

 Winging wildly across the white

 Orchards and dark-green fields; on – on – and out of sight.

 

 Everyone’s voice was suddenly lifted;

 And beauty came like the setting sun:

 My heart was shaken with tears; and horror

 Drifted away … O, but Everyone

 Was a bird; and the song was wordless; the singing will never be done.

 

Siegfried Sassoon

8 September 1886 – 1 September 1967

English Poet and Soldier

Poem Courtesy:  http://wonderingminstrels.blogspot.in/2002/04/everyone-sang-siegfried-sassoon.html

పనికిమాలిన వివరాలు… సీ ఫ్రై ససూన్

నాకే గనక బట్టతలై, కోపంతో ఎగశ్వాసవస్తుంటే

నేను స్థావరానికి పోయి ఇతర మేజర్లతో కూచుని

కుర్రాళ్లని యుద్ధరంగానికి పంపేవ్యూహాలు పన్నేవాణ్ణి.

ఉబ్బిన నా ముఖం ఎప్పుడూ చిటపటలాడుతూ కనిపించేది

ఉన్నంతలో ఉత్తమమైన భోజనశాల్లో తిని తాగుతూ,

కవాతుల్లో అమరవీరుల చిఠాచదువుతుండే వాడిని:

“పాపం, ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఉన్న కుర్రాడు!”

వీళ్ళనాన్నని నాకు బాగా తెలుసు; నిజమే!

ఈ తాజా పోరాటంలో మనం భారీగా నష్టపోయాం,” అనే వాణ్ణి,

యుద్ధం ముగిసిన తర్వాత, యువకులందరూ శిలాఫలకాలైనపిదప

మా ఇంటికి క్షేమంగా నడుచుకుంటూపోయి,

ప్రశాంతంగా నా పక్కమీద హాయిగా మరణించేవాడిని.

.

సీ ఫ్రై ససూన్

ఆంగ్ల కవి

(8 సెప్టెంబరు 1886 – 1 సెప్టెంబరు 1967)

కవిత చాలా పదునైన వ్యంగ్యంతో కూడుకున్నది. యుద్ధంలో పిరికిపందలు అధికార్లుగానూ, యువకులు సైనికులుగా ఉండడం తరచు జరిగేదే. కొన్ని సందర్భాలలో ఇవి ఇంకా ఎక్కువ నిజం. మొదటి ప్రపంచ సంగ్రామంలో ప్రత్యక్షంగా పాల్గొన్నసీ ఫ్రై ససూన్’ యుద్ధరంగంలో పై అధికారులు అవలంబించే వ్యూహాలపట్ల, వారి పిరికితనం పట్ల చాలా తీవ్రమైన స్వరంతో నిరసన వ్యక్తపరచిన వాడు. అతని కవిత్వం వీటికి బాగా నెలవైందిఅవసరం లేకపోయినా యుద్ధాన్ని కొనసాగించి, దేశానికి భవిష్యత్తైన యువకుల్ని యుద్ధానికి అప్పగించి, పిరికిపందలైన పైఅధికారులు తాము ప్రత్యక్షంగా కదనరంగంలోకి వెళ్ళవలసివచ్చినపుడు సంధిప్రయత్నాలు చేసుకుని ప్రాణాలు నిలబెట్టుకోవడం సర్వసాధారణమే.  అలాంటి ఒకానొక మేజర్ గురించి కవిత.

ఇందులో ససూన్ యుద్ధంపట్ల, చాతకాని సైనికాధికారులపట్ల  తన తీవ్రనిరసనని రికార్డు చేశాడు.  

.

Siegfried Sassoon
Siegfried Sassoon
Image Courtesy: http://www.spartacus.schoolnet.co.uk/Jsassoon.htm

.

Base Details

.

If I were fierce, and bald, and short of breath,

I’d live with scarlet Majors at the Base,

And speed glum heroes up the line to death.

You’d see me with my puffy, petulant face,

Guzzling and gulping in the best hotel,

Reading the Roll of Honour.  ‘Poor young chap,’

I’d say — ‘I used to know his father well;

Yes, we’ve lost heavily in this last scrap.’

And when the war is done and youth stone dead,

I’d toddle safely home and die — in bed.

Siegfried Loraine Sassoon.

(8 September 1886 – 1 September 1967)

English poet, writer, and soldier

Poem Courtesy: http://wonderingminstrels.blogspot.in/2000/03/base-details-siegfried-sassoon.html

The following makes an interesting read about the poem: http://www.studymode.com/essays/Base-Details-526070.html

%d bloggers like this: