అనువాదలహరి

చిరుగులు… షున్ తారో తనికావా, జపనీస్ కవి

పొద్దుపొడవకముందే
ఒక కవిత
నా దగ్గరకి వచ్చి నిలుచుంది

ఒంటినిండా
చిరుగులుపడ్డ
మాటలు కప్పుకుని.

తనకి ఇవ్వడానికి
నా దగ్గర ఏమీ లేదు
అయినా తను నాకు
అందించిన
విరిగిన సూది అందుకున్నాను

అది తన నగ్నత్వాన్ని
క్షణకాలం గమనించే
అవకాశాన్ని కల్పించింది.

అంతే! దానితో
మరొకమారు
చిరుగులకు అతుకు వెయ్యగలిగాను.
.
షున్ తారో తనికావా

Born: 15 Dec. 1931

జపనీస్ కవి

Courtesy:
Wikipedia.org

TATTERS

Before daybreak
Poem
came to me
 
robed in
tattered
words
 
I have nothing
to offer him        I just
gratefully receive his gift
 
a broken seam
allowed me a momentary peek at
his naked self
 
yet once again
I mend
his tatters

.

Shuntaro Tanikawa

Born: December 15, 1931 

Japanese poet and translator

From: Minimal

https://www.poetryinternationalweb.net/pi/site/poem/item/23050/auto/0/from-minimal-TATTERS

నేను నేనే… షున్ తారో తనికావా, జపనీస్ కవి

నే నెవరో నాకు తెలుసు
ఇప్పుడిక్కడున్నాను
నేను మరుక్షణంలో మాయమవొచ్చు
నేనిక్కడ మరి ఉండకపోయినా నేను నేనే
నిజం చెప్పొద్దూ, నేను నేనుగా ఉండక్కర్లేదు.

నేనో మొక్కని, కొంతవరకు
నేను చేపనుకూడా … చాలవరకు
నేనో కాంతిహీనమైన ఖనిజాన్ని…
దానిపేరైతే నాకు తెలియదుగాని.
ఆమాటకొస్తే, నేను అచ్చం మీలా ఉంటాను.

నన్ను మరిచిపోయినంతమాత్రంచేత పోలేను గనుక
నేను నాలుకమీద ఆదే పల్లవిలోని లయని
నేను సూక్ష్మమైన కెరటాన్నీ, కణాన్నీ కూడా
ఎలాగూ వచ్చేను గనుక, గర్వంగా చెప్పాలంటే,
కొన్ని కాంతి సంవత్సరాల దూరం నుండి
మీ గుండె లయమీద నాట్యం చేస్తున్నాను.

నేనెవరినో నాకు తెలుసు
కనుక మీరెవరోకూడా నాకు తెలుసు
మీ పేరేమిటో నాకు తెలియకపోయినా.
ఇక్కడ ఏ జనాభా లెక్కల వివరాలు లేకపోయినా
నేను సరిగ్గా మీమీదకే వాలుతున్నాను.

వర్షంలో తడిసినందుకు ఆనందిస్తున్నాను
చుక్కల ఆకాశంలో ఇంట్లో ఉన్నంతసుఖంగా ఉంది
మొరటు హాస్యపు మాటలకు పగలబడి నవ్వుతూ
నేను నేనే,
“నేను నే”నన్న పునరుక్తికి అతీతంగా.
.
షున్ తారో తనికావా
జపనీస్ కవి

Courtesy: Wikipedia.org
Courtesy:
Wikipedia.org

I AM ME, MYSELF

I know who I am

I am here now

but I may be gone in an instant

even if I am no longer here I am me, myself

but in truth I do not have to be me

I am a plant at least a little

I may be a fish more or less

I am also an ore with a dull sheen

though I don’t know its name

and of course I am almost you

Because I cannot disappear after being forgotten

I am a rhythm in a refrain

I am a subtle wave and a particle

having arrived, if I may be so conceited,

riding on your heart’s beating rhythm

from the light years of distance

I know who I am

so I know who you are

even if I don’t know your name

even if there is no census record

I am crowding out into you

Feeling happy being wet in rain

feeling at home with the starry sky

cackling at crude jokes

I am me

beyond the tautology of “I am me”

.

Shuntaro Tanikawa

Contemporary Japanese Poet

 

Poem Courtesy:

http://www.poetryinternationalweb.net/pi/site/poem/item/21408/auto/0/from-I-Myself-I-AM-ME-MYSELF

ప్రయాణం-2 … షున్ తారో తనికావా, జపనీస్ కవి.

నేనీ క్షణాన్ని శాశ్వతం చెయ్యదలుచుకోలేదు
ఈ క్షణాన్ని ఉన్నదున్నట్టు స్వంతం చేసుకోవడమూ బాగుంటుంది
జారిపోతున్న క్షణాన్ని పట్టుకోగలిగే మార్గం ఉన్నా
సూర్యుడప్పుడే ముందుకి సాగిపోతున్నాడు.

ఈ మాటలన్నీ కేవలం
ఇసుకమీద రాయబడినవి
నా వేళ్ళతో కాదు
మరుక్షణంలో విషాదంలోకి జారిపోగల ఆహ్లాదమైన హృదయంతో.

నా పిల్లలకి నా పోలికలు ఉన్నా
నా పిల్లలకి నా పోలిక లేకపోయినా
రెండూ నాకు ఆనందదాయకమే.

గవ్వలూ, గులకరాళ్ళూ, గాజుపెంకులతో పాటు
ఈ గ్రహం అంచున నీటి ఒడ్డున నా హృదయాన్ని విడుస్తున్నాను
అది ఎంత కఠినమో అంత బలహీనము.

.
షున్ తారో తనికావా

(జననం డిశంబరు 15, 1931)

జపనీస్ కవి

Courtesy: Wikipedia.org
Courtesy:
Wikipedia.org

.

TOBA 2  (Journey)

I don’t want to make this moment eternal

It is fine to own this moment just as it is

Even I have a way to seize a transient moment

The sun is already moving on

.

.

.

.

[For complete poem Visit:

http://www.poetryinternationalweb.net/pi/site/poem/item/21382/auto/0/from-Journey-TOBA-2%5D

Shuntaro Tanikawa

Born Dec 15, 1931

Japanese Poet

 

తోబా 1… షున్ తారో తనికావా, జపనీస్ కవి

నాకు రాయడానికి విషయం ఏమీ లేదు
ఎండలో నా శరీరాన్ని ఆరబెట్టుకుంటున్నాను
నా భార్య అందంగా ఉంటుంది
నా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు

నేను మీకో నిజం చెప్పాలి
నేను కవిని కాదు
నేను అలా నటిస్తున్నాను, అంతే!

సృష్టించి, ఇక్కడ వదిలివేయబడ్డాను నేను.
చూడండి, సూర్యుడు కొండల్లోంచి ఎలా జారుకుంటున్నాడో
సముద్రాన్ని చిక్కటి చీకటి సముద్రం చేస్తూ.

అద్భుతమైన ఈ సమయంలోని ప్రశాంతత గురించి తప్ప
మీకు నేను ఏదీ చెప్పదలుచుకో లేదు.
మీ దేశంలో ఎన్ని రక్తకల్లీలు జరగనీ,
ఆహా! ఈ వెలుగులు ఎంత శాశ్వతమో గదా!

.

షున్ తారో తనికావా

జపనీస్ కవి

.

TOBA 1

I have nothing to write about

My flesh is bared to the sun

My wife is beautiful

My children are healthy

Let me tell you the truth

I am not a poet

I just pretend to be one

I was created, and left here

Look, the sun cascades among the boulders

making the sea look darker

Other than this quiet at the height of the day

I have nothing I want to tell you about

even if you are bleeding in your country

Ah, this everlasting radiance!

.

[From: Tabi (Journey) Translation: Takako Lento]

Shuntaro Tanikawa (born Dec 15, 1931)

Japanese Poet

Poem Courtesy: http://www.poetryinternationalweb.net/pi/site/poem/item/21379/auto/0/from-Journey-TOBA-1

సానెట్ 38… షున్ తారో తనికావా, జపనీస్ కవి

(దూరం అన్న ప్రాథమిక భావనని తీసుకుని అద్భుతంగా అల్లిన కవిత ఇది. “దూరపు కొండలు నునుపు” అని మనకు ఒక సామెత. దూరాలు లోపాలని గ్రహించలేనంతగా, లేదా పట్టించుకోలేనంతగా చేస్తాయి. ఈ దూరమే మనుషుల్ని దగ్గరకు చేరాలన్న ఆరాటాన్ని కలిగిసుంది. కానీ, దగ్గరగా ఎక్కువకాలం ఉన్నకొద్దీ లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. అవి మధ్య దూరాన్ని సృష్టిస్తాయి. కొంతకాలం గడిచేక ఈ దూరాలు కల్పించిన అవగాహనలేమి, ఈ లోపాలనన్నిటినీ కప్పిపుచ్చి మళ్ళీ మనల్ని ఒక సుందర దృశ్యంగా మలుస్తాయి. దీనికి ఉదాహరణగా ఎంతమంది వ్యక్తుల్నైనా మనం చూడొచ్చు. ఒక తరంలో బ్రతికిన వ్యక్తులు, కొందరు వ్యక్తులలోని లోపాలు మాత్రమే చూస్తూ దూరాలు సృష్టించుకుంటారు. ఆ వ్యక్తుల్ని ఏమాత్రం తెలియని వాళ్ళకి వాళ్ళ ప్రతిభ (అదిగూడాదూరాన్నుంచి చూడటంవల్లనే) చాలా గొప్పగా కనిపిస్తుంది. కాలం ఆ వ్యక్తుల్ని హరించిన తర్వాత, వాళ్లతో పాటే వాళ్లలోపాలూ దూరమైపోతాయి. కాలం దూరాన్ని పెంచుతున్నకొద్దీ కొందరు తాము బ్రతికినప్పటికంటే ఎక్కువ పేరునో, (మంచి కనిపించనపుడు) ఎక్కువ అపకీర్తినో సంపాదిస్తూంటారు. ఆ వ్యక్తులు కవులో, కళాకారులో, తల్లిదండ్రులో, గురువులో, స్నేహితులో ఎవరైనా కావచ్చు. మనం ఒకసారి సింహావలోకనం చేసుకుంటే అటువంటి వ్యక్తులు మనకు చాలమంది స్ఫురిస్తారు. ఈ దూరమే మంచిగానో, చెడుగానో, ఒక Myth సృష్టిస్తుంది.)

***

మహాపర్వతాలు మహాపర్వతాలుగా కనిపించడానికి కారణం
వాటికీ మనకీ మధ్యనున్న అనంతదూరాలు.
దగ్గరనుండి జాగ్రత్తగా గమనిస్తే
వాటిలోనూ నా పోలికలు కనిపిస్తాయి.

విశాలమైన దృశ్యాలు మనుషుల్ని నిలువునా ఆశ్చర్యచకితుల్ని చేస్తూ
వాటికీ తమకూ మధ్యనున్న అనంతదూరాల్ని మరోసారి గుర్తుచేస్తాయి.
నిజానికి వాటి అనంత దూరాలే
మనుషుల్ని మనుషులుగా చేస్తాయి.

ఇంతకీ, మనుషుల అంతరాంతరాల్లో కూడా
అనంతదూరాలు లేకపోలేదు.
అందుకే కొందరిపట్ల మరికొందరికి అంత ఆరాటం…

కానీ, త్వరలోనే వాళ్ళు తమని తాము
దూరాలు వంచించిన క్షేత్రాలుగా,
ఎవరూ పట్టించుకోని స్థలాలుగా గ్రహిస్తారు.
వాళ్ళిప్పుడొక సుందర ప్రకృతిదృశ్యంగా మిగిలిపోతారు.
.
షున్ తారో తనికావా
జననం 1931
జపనీస్ కవి

Sonnet 38

.

It’s distance that makes
mountains mountains.
Looked at closely,
they start to resemble me.

Vast panoramas stop people in their tracks
and make them conscious of the engulfing distances.
Those very distances make people
the people they are.

Yet people can also contain distances
inside themselves,
which is why they go on yearning…

They soon find they’re just places violated by distances,
and no longer observed.
They have then become scenery.

(From 63 Sonnets)

Shuntaro Tanikawa

Born 1931

Read the bio of the poet  here

Poem Courtesy:

 http://www.thethepoetry.com/2011/09/poem-of-the-week-shuntaro-tanikawa/

 

%d bloggers like this: