అనువాదలహరి

నాకు ఒంట్లో బాగులేదు… షెల్ సిల్వర్ స్టీన్, అమెరికను కవి

“ఇవాళ నేను బడికి వెళ్ళలేను”

అంది పెగ్గీ ఏన్ మెకే.

నాకు మశూచిసోకిందో, గవదబిళ్ళలు లేచాయో

అక్కడక్కడగాట్లూ, దద్దుర్లూ, ఎర్రగా పొక్కులూ ఉన్నాయి.

నా నోరు తడిగానూ, గొంతు పొడారిపోతూనూ ఉంది

నాకు కుడికన్ను కనిపించడం లేదు.

నా టాన్సిల్స్ బండరాయిల్లా తయారయ్యాయి

నేను లెక్కెట్టేను పదహారు అమ్మవారుపోసిన పొక్కులున్నాయి

ఇదిగో, దీనితో కలిపి పదిహేడు

నా ముఖం నీకు పచ్చగా కనిపించటం లేదూ?

నా కాలుకి దెబ్బతగిలింది, కళ్ళు వాచిపోయాయి…

బహుశా అప్పుడే ఫ్లూ జ్వరం వచ్చిందేమో.

నాకు దగ్గూ, తుమ్ములూ, ఆయాసంతో ఊపిరాడటం లేదు

నా ఎడంకాలు విరిగిపోయిందని బలమైన నమ్మకం…

నా దవడకదిపితే తుంటి నొప్పెడుతోంది.

చూడు నా బొడ్డు ఎంతలోతుకిపోతోందో.

నా వీపు వొంగిపోయింది, చీలమండ బెణికింది

చినుకులు పడ్డప్పుడల్లా నా ‘ఎపెండిక్స్’ నొప్పెడుతోంది

నాకు రొంపజేసింది, కాలివేళ్ళు కొంకర్లుపోయాయి,

నా బొటకనవేలు చూడు చీరుకుపోయింది,

నాకు మెడ పట్టేసింది, మాట నీరసంగా వస్తోంది,

మాటాడుతుంటే గుసగుసలాకూడా పెగలడం లేదు,

నోరంతా పూచి  నాలుక మొద్దుబారిపోయింది

ఏమిటో, జుట్టంతా రాలిపోతున్నట్టు అనిపిస్తోంది

నా మోచెయ్యి వంగిపోయింది, వెన్ను తిన్నగా నిలబడడం లేదు

జ్వరం 108 డిగ్రీలుందేమో అనిపిస్తోంది

నా మెదడు కుదించుకుపోయింది, నాకు వినిపించడం లేదు,

నా కర్ణభేరికి పెద్ద కన్నం పడిపోయినట్టుంది.

నా వేలిగోరు ఊడిపోయింది… నా గుండె… ఏమిటీ?

ఏమంటున్నావూ? ఏమన్నావో మరోసారి చెప్పూ?

ఇవాళ శనివారం అనా? సరే అయితే!

టాటా!  నేను ఆడుకుందికి పోతున్నా!

.

షెల్ సిల్వర్ స్టీన్

(September 25, 1930 – May 10, 1999)

అమెరికను కవి

.

Sick

.

“I cannot go to school today,”

Said little Peggy Ann McKay,

“I have the measles and the mumps,

A gash, a rash, and purple bumps.

My mouth is wet, my throat is dry,

I’m going blind in my right eye.

My tonsils are as big as rocks,

I’ve counted sixteen chicken pox

And there’s one more–that’s seventeen,

And don’t you think my face looks green?

My leg is cut, my eyes are blue–

It might be instamatic flu.

I cough and sneeze and gasp and choke,

I’m sure that my left leg is broke–

My hip hurts when I move my chin,

My belly button’s caving in,

My back is wrenched, my ankle’s sprained,

My ‘pendix pains each time it rains.

My nose is cold, my toes are numb,

I have a sliver in my thumb.

My neck is stiff, my voice is weak,

I hardly whisper when I speak.

My tongue is filling up my mouth,

I think my hair is falling out.

My elbow’s bent, my spine ain’t straight,

My temperature is one-o-eight.

My brain is shrunk, I cannot hear,

There is a hole inside my ear.

I have a hangnail, and my heart is–what?

What’s that? What’s that you say?

You say today is—Saturday?

G’bye, I’m going out to play!”

.

Shel Silverstein

(September 25, 1930 – May 10, 1999)

American poet

Poem Courtesy:

https://100.best-poems.net/sick.html

ఈ బొమ్మ ఏమై ఉంటుంది?… షెల్ సిల్వర్ స్టీన్, అమెరికను కవి

ఒక పాత బొమ్మలో చిన్న ముక్క
రోడ్డుమీద పడి ఉంది.
ఒక పాత బొమ్మలో చిన్న ముక్క
వానలో తడుస్తూంది.
అది అలవాటుగా షూ వేసుకునే
స్త్రీ తొడుక్కున్న కోటుకి
ఉండే నీలిరంగు బొత్తాము కావచ్చు.
అది magic bean గాని
ఒక మహారాణి గారు ధరించిన ఎర్రని
మొకమలు వస్త్రంమీది మడత కావొచ్చు,
లేదా, Snow White కి
సవతి తల్లి ఇచ్చిన ఏపిలును ఆమె
కొరికినపుడు పడిన పంటి గాటు కావొచ్చు.
అది ఒక పెళ్ళికూతురు వేసుకున్న ముసుగో,
అల్లరి భూతాన్ని బంధించిన సీసానో కావొచ్చు.
అది బాగా పొడుచుకొచ్చిన
Bobo The Bear పొట్టమీది
రోమాల గుంపు కావొచ్చు,
లేదా Witch of the West
పొగై గాలిలో కలిసిపోయేముందు
ధరించిన కోటులో చిన్న భాగం కావొచ్చు.
అది ఒక దేవదూత కంటినుండి కారిన
కన్నిటి చుక్కల లీలామాత్రపు జాడ కావొచ్చు.
ఆ పాత బొమ్మ ప్రహేళికకి అఏదైనా అవడానికి
ఉన్నన్ని అవకాశాలు మరి దేనికీ లేవు.
.

షెల్ సివర్ స్టీన్

(25 September 1930 – 10th May 1999)

అమెరికను కవి.

.

Picture Puzzle Piece

.

One picture puzzle piece

Lyin’ on the sidewalk,

One picture puzzle piece

Soakin’ in the rain.

It might be a button of blue

On the coat of the woman

Who lived in a shoe.

It might be a magical bean,

Or a fold in the red

Velvet robe of a queen.

It might be the one little bite

Of the apple her stepmother

Gave to Snow White.

It might be the veil of a bride

Or a bottle with some evil genie inside.

It might be a small tuft of hair

On the big bouncy belly

Of Bobo the Bear.

It might be a bit of the cloak

Of the Witch of the West

As she melted to smoke.

It might be a shadowy trace

Of a tear that runs down an angel’s face.

Nothing has more possibilities

Than one old wet picture puzzle piece.

.

Shel Silverstein

(September 25, 1930 – May 10, 1999)

American Poet

Poem Courtesy:

http://famouspoetsandpoems.com/poets/shel_silverstein/poems/14821

బెంగలు… షెల్ సిల్వర్ స్టీన్, అమెరికను కవి

(నిజానికి ఇది వ్యాఖ్యానం అక్కరలేని కవిత.  పిరికి మనిషి ఎప్పుడూ ఒక అభద్రతాభావనలో కొట్టుమిట్టాడుతుంటాడు. ఎన్ని అనుకూలతలు ఉన్నా, చింత ఎప్పుడూ లేనిదానిగురించే.  కొందరిని భగవంతుడు సైతం సుఖపెట్టలేడు. )

నిన్న రాత్రి నేనిక్కడ ఆలోచిస్తూ పడుక్కుంటే

కొన్ని బెంగలు నా చెవుల్లోకి మెల్లగా దూరి

రాత్రల్లా ఒకటే గెంతులూ, అరుపులూ…

అవి ఎప్పటిలా వాటి పాత బెంగలపాటే పాడేయి:

స్కూల్లో నాకు నోటంట మాట పెగలప్పోతే?

వాళ్ళు ఈతకొలను మూసెస్తే?

నన్ను ఎవరైనా చితక్కొడితే?

నా కప్పులో ఎవరైనా విషం కలిపేసిఉంటే?

నాకు పట్టలేని దుఃఖం వస్తే?

ఏదో జబ్బు చేసి నేను చచ్చిపోతే?

నేను ఆ పరీక్షలో తప్పితే?

నా గుండెలమీద తెల్లవెంట్రుకలు మొలిస్తే?

నన్ను ఎవరూ ఇష్టపడకపోతే?

నా మీద ఎప్పుడైనా పిడుగు పడిపోతే?

నేను పొడవు ఎదగకపోతే?

నా బుర్ర రోజురోజుకీ కుంచించుకుపోతే?

ఒక వేళ చేప ఎరకి చిక్కుకోకపోతే?

గాలిజోరుకి నా గాలిపటం చిరిగిపోతే?

వాళ్ళే ఒకవేళ యుద్ధం మొదలుపెడితే?

మా అమ్మా నాన్న విడాకులు తీసుకుంటే?

బస్సు ఒకవేళ ఆలస్యం అయితే?

నా పళ్ళు తిన్నగా పెరక్కుండా గొగ్గిపళ్ళు అయిపోతే?

నేను నా నిక్కరు చించేసుకుంటే?

నేను అసలు ఎప్పటికీ నాట్యం నేర్చుకోలేకపోతే?

అన్నీ సవ్యంగా ఉన్నట్టే ఉంటాయి,

కానీ, రాత్రి అవడమే ఆలస్యం,

నా బెంగలు నన్ను మళ్ళీ చుట్టుముడతాయి.

.

షెల్ సిల్వర్ స్టీన్,

(September 25, 1930 – May 10, 1999)

అమెరికను కవి.

 Shel Silverstein

.

 

What-if

 

.

Last night, while I lay thinking here,

some What-ifs crawled inside my ear

and pranced and partied all night long

and sang their same old What-if song:

What-if I’m dumb in school?

What-if they’ve closed the swimming pool?

What-if I get beat up?

What-if there’s poison in my cup?

What-if I start to cry?

What-if I get sick and die?

What-if I flunk that test?

What-if green hair grows on my chest?

What-if nobody likes me?

What-if a bolt of lightning strikes me?

What-if I don’t grow talle?

What-if my head starts getting smaller?

What-if the fish won’t bite?

What-if the wind tears up my kite?

What-if they start a war?

What-if my parents get divorced?

What-if the bus is late?

What-if my teeth don’t grow in straight?

What-if I tear my pants?

What-if I never learn to dance?

Everything seems well, and then

the nighttime What-ifs strike again!

.

Shel Silverstein

(September 25, 1930 – May 10, 1999)

American poet, singer-songwriter, cartoonist

 Poem Courtesy:

http://www.poetrysoup.com/famous/poems/best/shel_silverstein

 

చిందరవందర గది… షెల్ సిల్వర్ స్టీన్, అమెరికను కవి

ఈ గది ఎవడిదో గాని వాడు సిగ్గు పడాల్సిందే!
వాడి  లాగు లాంతరుకి వేలాడుతోంది.
వాడి రెయిన్ కోటు అప్పటికే బట్టల్తో నిండిపోయిన కుర్చీలో ఉంది
ఆ కుర్చీ తడి తడిగా ముక్క కంపుగొడుతోంది.

వాడి చిత్తుపుస్తకం కిటికీ తలుపుపడిపోకుండా అడ్డం పెట్టి ఉంది
వాడి స్వెట్టరు నేలమీదకి  విసిరేసి ఉంది.
వాడి రుమాలూ, ఒక Ski, TV  క్రింద ఉన్నాయి
వాడి పేంట్లు ఆశ్రద్ధగా తలుపుకి వేలాడదీసి ఉన్నాయి.

వాడి పుస్తకాలు బీరువాలో కుక్కేసినట్టున్నాయి,
వాడి బనీను హాల్లోనే వదిలేసి ఉంది
ఎడ్ అన్న ఒక ఊసరవెల్లి వాడి పక్కమీద పడుకున్నాడు
వాడి కంపుకొడుతున్న మేజోడు గోడకి అతుక్కుపోయి ఉంది.

ఈ గది ఎవరిదో గాని వాడు సిగ్గుపడాల్సిందే!
డొనాల్డో, రాబర్టో, విల్లీయో… మరెవడో…
ఏమిటీ? ఇది నా గదే నంటావా? అప్పుడే అనుకున్నాను
ఏమిట్రా ఇదెక్కడో చూసినట్టుందే అని!

.

షెల్  సిల్వర్ స్టీన్

September 25, 1930 – May 10, 1999

అమెరికను కవి

.

Shel Silverstein

.

Messy Room

 .

Whosever room this is should be ashamed!

His underwear is hanging on the lamp.

His raincoat is there in the overstuffed chair,

And the chair is becoming quite mucky and damp.

His workbook is wedged in the window,

His sweater’s been thrown on the floor.

His scarf and one ski are beneath the TV,

And his pants have been carelessly hung on the door.

His books are all jammed in the closet,

His vest has been left in the hall.

A lizard named Ed is asleep in his bed,

And his smelly old sock has been stuck to the wall.

Whosever room this is should be ashamed!

Donald or Robert or Willie or–

Huh? You say it’s mine? Oh, dear,

I knew it looked familiar!

 .

 Shel Silverstein

September 25, 1930 – May 10, 1999

American Poet, singer, cartoonist, Author of Children Books.

పిల్లవాడూ- ముసలాయనా… షెల్ సిల్వర్ స్టీన్, అమెరికను కవి

“అప్పుడప్పుడు నేను చెమ్చా జార్చెస్తుంటాను,” అన్నాడు కుర్రాడు,

“ఓస్, అంతే కదా, నేను కూడ జార్చెస్తుంటాను,” అన్నాడు ముసలాయన.

కుర్రాడు గుసగుసగా, “అప్పుడప్పుడు పక్కతడిపేస్తుంటాను,” అన్నాడు.

దానికి నవ్వుతూ, ” ఓ అదా, అప్పుడప్పుడు నేనూ చేస్తుంటాను,” అన్నాడు.

 

“ఎందుకో, నాకు తరచు ఏడుపొస్తుంటుంది,” అన్నాడు కుర్రాడు.

ముసలాయన తల తాటిస్తూ, “నేనూ అంతే” అన్నాడు.

 

ఫిర్యాదుగా “నాకు అన్నిటికంటే బాధించే విషయమేమిటంటే,

పెద్దవాళ్ళు ఎప్పుడూ నన్ను పట్టించుకోరు,” అన్నాడు కుర్రాడు.

 

ముడుతలపడ్డ చెయ్యి వెచ్చగా తగిలింది ఆ కుర్రాడికి.

“నీ మాటలవెనక ఉన్న బాధ నేను అర్థం చేసుకోగలను,” అన్నాడు ముదుసలి.

.

షెల్ సిల్వర్ స్టీన్

(September 25, 1930 – May 10, 1999).

అమెరికను కవీ, గేయ రచయితా, చిత్రకారుడూ, స్క్రీన్ ప్లే రచయితా, బాలసాహిత్యకారుడూ .

.

Shel Silverstein

.

The Little Boy and the Old Man

.

Said the little boy, “Sometimes I drop my spoon.”

Said the old man, “I do that too.”

The little boy whispered, “I wet my pants.”

I do that too,” laughed the little old man.

Said the little boy, “I often cry.”

The old man nodded, “So do I.”

But worst of all,” said the boy, “it seems

Grown-ups don’t pay attention to me.”

And he felt the warmth of a wrinkled old hand.

I know what you mean,” said the little old man.”

.

Shel Silverstein 

(September 25, 1930 – May 10, 1999)

American poet, singer-songwriter, cartoonist, screenwriter, and author of children’s books.

వర్ణన… షెల్ సిల్వర్ స్టీన్, అమెరికను కవి

జార్జి “దేముడు పొట్టిగా లావుగా ఉంటాడు,” అన్నాడు.

 


నిక్ “లేదు, సన్నగా పొడవుగా ఉంటాడు,” అన్నాడు.

 


“అతనికి తెల్లని పొడవాటి గడ్డం ఉంటుంది,” అని లెన్ అంటే

 


“లేదు, అతను నున్నగా గడ్డం గీసుకుని ఉంటాడు,” అన్నాడు జాన్.

 


విల్ “అతను నల్లని వాడు,” అంటే, “కాదు, తెల్లని వాడు” అన్నాడు బాబ్.

 


రోండా రోజ్ అంది: “దేముడు పురుషుడు కాదు, స్త్రీ.”

 


నాలో నేను నవ్వుకున్నాను గాని, దేముడు స్వయంగా సంతకం చేసి

 


నాకు పంపిన ఫోటోని వాళ్ళకెవ్వరికీ చూపించలేదు.

 


.

 


షెల్ సిల్వర్ స్టీన్

 


(September 25, 1930 – May 10, 1999)

 


అమెరికను కవి 

 

 

ఈ చిన్న కవితలో మంచి చమత్కారం చూపించేడు కవి.  నలుగురు గుడ్డివాళ్ళు ఏనుగును వర్ణించమంటే దాన్ని తడుముతూ ఎవరికి ఏ అవయవం దొరికితే అదే ఏనుగు అని  వర్ణించినట్టు, భగవంతుణ్ణి ఎవరికి నచ్చినరీతిలో వాళ్ళు ఊహించుకుంటారు. స్వామి వివేకానంద, ఒకవేళ బర్రెలకు గాని భగవంతుడు గురించి ఊహ వస్తే, వాటి భగవంతుణ్ణి  వెయ్యి కొమ్ములున్న బర్రెగా ఊహించుకుంటాయని చెప్పినమాట ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఊహలూ ఉత్ప్రేక్షలూ భగవంతుడిని వర్ణించడంలో మనం సహజంగా చేసే పనులు.

 

ప్రకృతిలోని వస్తువుల్ని మనమాటలు  ఎంతగా వివరించడానికి ప్రయత్నించినా, మనమాటలుమించి అవి ఉంటాయి తప్ప, మన మాటలపరిమితులకి అవిలోనుగావు.(Our descriptions are only an approximation to the Truth and Truth is not constrained by our description of it.  That is the very limitation of language. So we need not over-value our descriptions of Truth  ఇక్కడ భాష సత్యానికి దగ్గరగా వెళ్లడానికి ప్రయత్నిస్తుంది తప్ప, సత్యం భాషకు దగ్గరగా రాదు.  ఇది భాషకీ భావానికీ ఉన్న పరిమితి అని అర్థం చేసుకున్నవారు, సత్యాన్ని దర్శించడానికి అవకాశం ఉంది.  ఈ విషయాన్ని కవి చాలా సున్నితంగా చెప్పాడు ఈ కవితలో.

 

 

.

 

 

Shel Silverstein
Shel Silverstein (Photo credit: Wikipedia)

 

.

 

 

Description

 

 .

 

 

George said, “God is short and fat.”

 

Nick said, “No, He’s tall and lean.”

 

Len said, “With a long white beard.”

 

“No,” said John, “He’s shaven clean.”

 

Will said, “He’s black,” Bob said, “He’s white.”

 

Rhonda Rose said, “He’s a She.”

 

I smiled but never showed ’em all

 

The autographed photograph God sent to me.

 

.

 

 

Shel Silverstein

 

 

(September 25, 1930 – May 10, 1999)

 

 

American poet, singer-songwriter, cartoonist, screenwriter, and author of children’s books.

 

 

He styled himself as Uncle Shelby in his children’s books. Translated into more than 30 languages, his books have sold over 20 million copies.

 

%d bloggers like this: