అనువాదలహరి

పరుగు పందెం … వాస్కో పోపా సెర్బియన్ కవి

కొందరు మనుషులు అవతలివాడిది కాలో,

చెయ్యో, ఏది దొరికితే ఒక ముక్క కొరికేస్తారు

దాన్ని పళ్ళ మధ్య దొరకబుచ్చుకుని

ఎంత వీలయితే అంత జోరుగా అక్కడినుండి ఉడాయించి

దాన్ని గోతిలో కప్పెట్టి దాచుతారు.

తక్కినవాళ్ళు నాలుగుపక్కలా కమ్ముకుని

భూమంతా,  వాసనచూడ్డం – తవ్వడం

వాసనచూడ్డం – తవ్వడం చేస్తారు.

వాళ్ళకి అదృష్టం కలిసొస్తే

ఒక చెయ్యో,  కాలో దొరుకుతుంది.

ఇప్పుడు దాన్ని కొరికి పరిగెత్తడం వాళ్ళ వంతు.

చేతులు దొరికినంత కాలం,

కాళ్ళు అందినంతకాలం,

చివరికి ఏదో ఒకటి దొరికినంత కాలం

ఈ ఆట చక్కని గతితో కొనసాగుతూ ఉంటుంది.

.

వాస్కో పోపా

(June 29, 1922 – January 5, 1991)

సెర్బియన్ కవి.

.

Race

.

Some bite from the others

A leg an arm or whatever

Take it between their teeth

Run out as fast as they can

Cover it up with earth

The others scatter everywhere

Sniff look sniff look

Dig up the whole earth

If they are lucky and find an arm

Or leg or whatever

It’s their turn to bite

The game continues at a lively pace

As long as there are arms

As long as there are legs

As long as there is anything

.

Vasko Popa

(June 29, 1922 – January 5, 1991)

Serbian Poet of Romanian descent

Poem Courtesy:

http://famouspoetsandpoems.com/poets/vasko_popa/poems/16170

చిన్నిపెట్టె… వాస్కో పోపా, సెర్బియన్ కవి

ఇక్కడ “చిన్ని పెట్టె” ఒక ప్రతీక. అది మనిషి జ్ఞాపకాలకీ, మెదడుకీ కూడా సంకేతం కావొచ్చు. ఇలా సున్నితంగా ప్రారంభమైన జీవితం, దృశ్య, శ్రవణాది ఇంద్రియాల అనుభూతుల్నీ, వాటి జ్ఞాపకాలను పోగుచేసుకోవడం ప్రారంభిస్తుంది. ఇంత చిన్నదీ, ప్రపంచం గురించి అవగాహన చేసుకుంటూ, ప్రపంచాన్ని తనలో ఇముడ్చుకోగలిగేలా ఎదిగిపోతుంది. ఈ జ్ఞాపకాలని ఇతరులతో పంచుకుంటుంది. వయసు మీరినపుడు అందులో కొన్ని పోగొట్టుకుంటుంది. నిజానికి ఎవరికైనా, జీవితమంతా అనుభూతుల, జ్ఞాపకాల భరిణ. అందుకే వాటిని పదిలంగా కాచుకోవాలని చెబుతున్నాడు కవి.

***

ఈ చిన్ని పెట్టెకు పాలపళ్ళు మొలిచి,
కొంత పొడుగు ఎదిగి
ఒళ్ళు చేసి, ఈ శూన్యావరణంలో
దానికి ఒక రూపం ఏర్పడుతుంది.

ఒకప్పుడు తను పట్టిన బీరువా
ఇపుడు తనలో ఇమడగలిగేలా
క్రమంగా ఎదుగుతూ ఎదుగుతూ పోతుంది.

అదింకా పెద్దవుతూ పోతుంటే
ఇప్పుడు ఆ గది తనలో ఇమిడిపోతుంది,
తర్వాత ఈ ఇల్లూ, ఈ ఊరూ, ఈ భూమి
చివరకి ఈ విశ్వం అందులో ఇముడుతుంది.

ఈ చిన్నిపెట్టెకు తన బాల్యం గుర్తుంటుంది
అమితమైన కాంక్షతో
తిరిగి తనో చిన్న పెట్టె ఐపోతుంది.

ఇపుడా చిన్నిపెట్టెలో
ఈ విశ్వమంతా సూక్ష్మరూపంలో ఉంది.
ఇపుడు మీరు సులభంగా జేబులో పెట్టుకోవచ్చు,
ఎవరైనా దొంగిలించవచ్చు, మీరు పోగొట్టుకోవచ్చు.

కనుక ఆ చిన్నిపెట్టె జాగ్రత్త !
.
వాస్కో పోపా

June 29, 1922 – January 5, 1991

సెర్బియన్ కవి

 

.

The Little Box

.

`The little box gets her first teeth
And her little length
Little width little emptiness
And all the rest she has

The little box continues growing
The cupboard that she was inside
Is now inside her

And she grows bigger bigger bigger
Now the room is inside her
And the house and the city and the earth
And the world she was in before

The little box remembers her childhood
And by a great longing
She becomes a little box again

Now in the little box
You have the whole world in miniature
You can easily put in a pocket
Easily steal it lose it

Take care of the little box
.
Vasko Popa
June 29, 1922 – January 5, 1991
Serbian Poet

Poem Courtesy:

https://www.poemhunter.com/poem/the-little-box/

దొంగాట… వాస్కో పోపా, సెర్బియన్ కవి

ఒకడు మరొకడికి కనిపించకుండా దాక్కుంటాడు

అతని నాలుకకింద దాక్కుంటాడు

రెండవవ్యక్తి ఇతనికోసం నేలలో వెతుకుతాడు.

ఒకడు  తన తలరాతలో దాక్కుంటాడు

రెండవవాడు ఇతనికోసం చుక్కల్లో వెతుకుతుంటాడు

అతను తన మతిమరుపులో దాక్కుంటాడు

రెండవవాడితనికోసం గడ్డిలో వెతుకుతుంటాడు.

అతనికోసం వెతుకుతూనే ఉంటాడు

అతనికోసం వెతకనిచోటుండదు.

అలా వెతుకుతూ దారితప్పిపోతాడు.

.

వాస్కో పోపా

June 29, 1922 – January 5, 1991

సెర్బియన్ కవి

Hide and Seek

Someone hides from someone else

Hides under his tongue

The other looks for him under the earth

He hides on his forehead

The other looks for him in the sky

He hides inside his forgetfulness

The other looks for him in the grass

Looks for him looks

There’s no place he doesn’t look

And looking he loses himself

.

Vasko Popa

June 29, 1922 – January 5, 1991

Serbian Poet of Romanian Descent

Poem Courtesy:

https://www.poemhunter.com/poem/hide-and-seek/

పరుగు… వాస్కో పోపా, సెర్బియన్ కవి

కొందరు పక్కవాళ్ళది కొరికెస్తారు  

మోచెయ్యో, కాలో, ఏది దొరికితే అది.

దానిని పళ్ళ మధ్య బిగబట్టి

వీలయినంత వేగంగా పరిగెడతారు.

దాన్ని మట్టిలో కప్పెస్తారు.

 

అందరూ అన్ని దిక్కులా పరిగెడతారు

వాసన చూడ్డం, వెతకడం, వాసనచూడ్డం, వెతకడం

భూమినంతటినీ తవ్వెస్తారు.

అదృష్టం బాగుంటే వాళ్లకో చెయ్యో

లేదా కాలో, మరొకటో దొరుకుతుంది

ఇప్పుడిక కొరకడం వాళ్ళ వంతు.

ఈ ఆట మహా జోరుగా సాగుతుంది

చేతులు దొరికినంత కాలం

కాళ్ళు దొరికినంతకాలం

అసలేదో ఒకటి దొరికినంతకాలం.

.

వాస్కో పోపా

June 29, 1922 – January 5, 1991

సైబీరియన్ కవి

Race… Vasko Popa

Some bite from the others
A leg an arm or whatever

Take it between their teeth
Run out as fast as they can
Cover it up with earth

The others scatter everywhere
Sniff look sniff look
Dig up the whole earth

If they are lucky and find an arm
Or leg or whatever
It’s their turn to bite

The game continues at a lively pace

As long as there are arms
As long as there are legs
As long as there is anything
.

Vasko Popa
June 29, 1922 – January 5, 1991
Siberian Poet

poem Courtesy:

http://www.poemhunter.com/poem/race/

యాష్ ట్రేలో… వాస్కో పోపా, సెర్బియన్ కవి

ఒక చిన్ని సూర్యుడు
పసుపుపచ్చ పుగాకు జులపాలతో
మండుతున్నాడు యాష్ ట్రేలో.

చవుకబారు లిప్ స్టిక్ నెత్తురు
ఆరిపోయిన సిగరెట్టు కొనలను పీలుస్తోంది.

శిరఛ్ఛేదం జరిగిన అగ్గిపుల్లలు
సల్ఫరు కిరీటాలకై తహతహలాడుతున్నాయి.

కొడిగట్టిన ధూమ్రవర్ణపు నుసిలో ఇరుక్కున్న
నీలిపొగల గుర్రాలు హేషతో పైకి లేస్తున్నాయి.

ఒక పెద్ద చేయి
అరచేతిలో నిప్పులుమిసే కంటితో
దిగంతాలలో పొంచి చూస్తోంది.
.
(అనువాదం: Anne Pennington)

వాస్కో పోపా
June 29, 1922 – Jan 5, 1991
సైబీరియన్ కవి

.

.

“In the Ashtray”

A tiny sun
With yellow tobacco hair
Is burning out in the ashtray

The blood of cheap lipstick suckles
The dead stumps of stubs

Beheaded sticks yearn
For sulphur crowns

Blue roans of ash whinny
Arrested in their prancing

A huge hand
With a burning eye in its palm
Lurks on the horizon

(Translated by Anne Pennington)

.

Vasco Popa

(June 29, 1922 – Jan 5, 1991)

Siberian Poet ( A prolific poet with 43 published collections of poetry in his lifetime)

Poem Courtesy: http://hedgeguard.blogspot.com/2006/01/vasko-popa.html

 

%d bloggers like this: