Tag: (September 17
-
ఆశావాదికి … ఏంటోనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
Wall Paper Courtesy: http://www.modafinilsale.com/beautiful-sunset-wallpapers.html నీ జీవితం నాకెప్పుడూ ఒక అందమైన సూర్యాస్తమయంలా కనిపిస్తుంది:- ఆకాశంలో వేలాడే ప్రతి పేలవమైన మేఘశకలాన్నీ నీ రసవాద నైపుణి ఒక అద్భుతమైన మణిగా మార్చివేస్తుంది; వాటినుండి వెలువడే రంగురంగుల కిరణాలు నినుదర్శించేవారికి నయనానందం కలుగజేస్తాయి. . ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్ 1866- 1925 అమెరికను కవయిత్రి To an Optimist Thy life like some fair sunset ever seems:- Each dull grey cloud thy subtle…
-
స్వాప్నికుడు… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
కలల కనుమల్లో ఒక స్వాప్నికుడు అతన్ని పిచ్చివాడిగా పరిగణిస్తారు; అతనికి అదొకవెర్రి; బక్కచిక్కి, వంగిన శరీరాన్ని కప్పి ఉంచిన అతని ఉడుపుల మాసికలనుబట్టి అతన్ని విలువకడతారు. ప్రతిరోజూ సూర్యుడు పడమటికొండ దిగగానే, తీరికలేని నగర పొలిమేరలుదాటి, నింగీ నేలా కలిసే చోట వంపులుతిరిగి, తీరికగా, సడిచేయక పారే సెలయేటి తీరాన ఆ వింత మనిషి ప్రశాంతంగా అటూఇటూ తిరుగుతుంటాడు. అతని చెవులబడే సంగీతం గురించి, ఆహ్! ఏమని చెప్పను?! ఆ కన్నులాలోకించే అద్భుతదృశ్యాలను ఏమని వర్ణించను?! అతనా పేదవాడు? ఎన్నటికీ…
-
ఒక చిన్ని పక్షికి… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను
ఒక రోజు నువ్వు గూడునుండి రాలిపడడం చూసేను నీ రెక్కకి గాయమై, నువ్వు బెదురుచూపులు చూస్తున్నావు. నీ గాయాన్ని నయం చేసి నెమ్మదిగా నీ భయంపోగొట్టాను అప్పుడు నువ్వు ధైర్యంగా కూస్తూ పాడటం మొదలెట్టావు. నిన్ను పెంచుకుందామని నీకొక పంజరం తెచ్చాను నీకిక్కడ అడవి అంతగా తెలియదు కనుక నువ్వు కొద్దికాలంలోనే ఆ విషయం మరిచిపోయి నాతో కలిసి ఉండటానికి నిశ్చయించుకుంటావని అనుకున్నాను. కానీ వేసవి రాగానే, నీలో ఆశలు మోసులువేశాయి ఎక్కడికో అలా దూరదూరంగా ఎగరడానికి.…
-
హృదయంలేని ప్రియురాలు … ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను
ఓ ప్రకృతి కాంతా! నీ పాదాలముందు మోకరిల్లే వాడిని పాపాత్ముడివా, పుణ్యాత్ముడివా అని అడగవు. మనస్ఫూర్తిగా ఎవడు నిన్ను సేవిస్తూ గీతాలు పాడినా, గీతలు గీసినా విషాదంనుండి వినోదంవరకూ స్పష్టంగా మోహనంగా రూపుకట్టే అసంఖ్యాక ఛాయల నీ సౌందర్యవిలాసాన్ని పదిలంగా దాచుకుంటాడు. అతని స్తోత్రపాఠాల పరిమళ ధూపం నిను చుట్టుముట్టుతుంది ఒకవంక అతను నీ పాదాలముందు మోకరిల్లుతూంటే. నీవే గనక హృదయంలేని ప్రియురాలిగా మారినట్టయితే పాపం అతని పేద హృదయం మనశ్శాంతికై వెంపర్లాడుతుంది. అపుడు అతనికి నీమీద…
-
జ్ఞాపిక… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను
ఉత్తమోత్తమమైన పింగాణీ, ఎంచెంచి వేసినట్టున్న రంగుతో రాబిన్ పక్షి గూట్లో దొరికిన ఈ చిన్న గుడ్డును చూసి నెత్తిమీద బోర్లించినట్టు నీలం మూకుడుందిగదా, ఆకాశం అంటాం, దాని ముక్క ఒకటి తెగి భూమి గుండెలమీద పడిందేమో ననుకున్నాను. . ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్ అమెరికను అమెరికను కవయిత్రి, అనువాదకురాలు, చిత్రకారిణి The Souvenir . Of finest porcelain and of choicest dye, This bit of egg shell from a…