Tag: Sept 10
-
ఒక వేసవి పొద్దు… మేరీ ఆలివర్, అమెరికను కవయిత్రి
ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు? ఆ తెల్లని హంసనీ నల్లని ఎలుగుని ఎవరు సృష్టించారు? ఈ మిడతని ఎవరు సృష్టించారు? ఈ మిడత… గడ్డిలోంచి తన్నుకుంటూ పైకెగసిన ఈ మిడత నా చేతిలోనున్న పంచదారని తింటున్న మిడత పైకీ క్రిందకీ కాకుండా ముందుకీ వెనక్కీ దవడలు కదుపుతున్న ఈ మిడత తన పెద్ద, సంకీర్ణమైన కనులతో నిక్కి చూస్తున్న మిడతని. దాని బలహీనమైన ముందుకాళ్ళు పైకెత్తి తన ముఖాన్ని నులుముకుంటోంది. దాని రెక్కల్ని చాచి టపటప కొట్టి […]