అనువాదలహరి

ఒక చక్కని ఉదయం… జాన్ స్టెర్లింగ్, స్కాటిష్ రచయిత

ఓ అగోచరమైన దివ్యాత్మా! నీ నుండి ఒక అపూర్వమైన
ప్రశాంతత ప్రసరిస్తోంది, భూమ్యాకాశాలు ఉప్పొంగుతున్నాయి!
వృక్షాలూ, కొండలూ, వాకిళ్ళూ స్పష్టంగా మెరుస్తున్నాయి,
నీ విశాలమైన సాగరం నలుదిక్కులా సేదదీరుతోంది.

ఊదారంగు ఆకాశ నేపధ్యంలో గిరిశిఖరాల వరుస
స్పష్టంగా, నిలువుగా, నల్లని రాళ్లతో, లోయలతో కనిపిస్తోంది,
అనాచ్చాదితమైన వెలుగు రేకలు విశాలంగా పరుచుకుంటున్నాయి
దూరంగా రోదసిలో నీ ఉనికికి ఆటపట్టయిన శూన్యంలో.

ఎక్కడో మ్రోగుతున్న గంటలు, మంద్రంగా ఘోషిస్తున్న సముద్రమూ,
అడవిలో, ఊసులాడే పొదల్లో పక్షులుపాడే కమ్మని పాటలూ
దూరగా ఏ నిమిత్తమూ లేకుండా ఆనందించే పిల్లల చేష్టలూ,
కన్నెపిల్ల  పాటలూ, అన్నీ ఒక సమ్యక్ శృతిలోనే సాగుతున్నాయి.

ఆ దట్టమైన పచ్చనాకుల సమూహంలోంచి ఆటాడుకునే సూర్యుని
వెలుగు నీడలు, మనోలోకంలోని జీవితాన్ని తలపిస్తున్నాయి.
తెల్లని ఆ ఓడ తెరచాప సున్నితంగా ఎగురుతూ ముందుకు సాగిపోతోంది,
రాబోయే తుఫానులూ, సమస్యలగురించి ఏ చింతా లేకుండా.
.
జాన్ స్టెర్లింగ్

20 July 1806 – 18 September 1844
స్కాటిష్ రచయిత

 

On a Beautiful Day

 

 

O unseen Spirit! now a calm divine

  Comes forth from thee, rejoicing earth and air!      

Trees, hills, and houses, all distinctly shine,      

  And thy great ocean slumbers everywhere.    

 

The mountain ridge against the purple sky      

  Stands clear and strong, with darkened rocks and dells,  

And cloudless brightness opens wide and high 

  A home aerial, where thy presence dwells.      

 

The chime of bells remote, the murmuring sea,

  The song of birds in whispering copse and wood,   

The distant voice of children’s thoughtless glee,         

  And maiden’s songs, are all one voice of good.        

 

Amid the leaves’ green mass a sunny play        

  Of flash and shadow stirs like inward life:     

The ship’s white sail glides onward far away,  

  Unhaunted by a dream of storm or strife.

.

John Sterling

(20 July 1806 – 18 September 1844)

Scottish Writer

 

Courtesy:

The World’s Best Poetry.

eds Bliss Carman, et al.. 

Volume V. Nature.  1904.

  1. Nature’s Influence

http://www.bartleby.com/360/5/3.html

గుడ్ నైట్, గుడ్ నైట్… జొవానా బెయిలీ, స్కాటిష్ కవయిత్రి

సూర్యుడస్తమించాడు, చీకటిపడింది,

ఆకాశంలో చుక్కలు మిణుకుమంటున్నాయి

దీపమైనా, దివిటీ అయినా ఎక్కువసేపు

ఉల్లాసమైన రోజుని ఇక పొడిగించలేవు;

ఝాములు దొంగలా తెలీకుండా జారుకున్నాయి

మనం సెలవుపుచ్చుకోక తప్పదు, గుడ్ నైట్, గుడ్ నైట్

పెళ్ళికూతురు పొదరింటిలోకి పంపబడింది,

ఆటలూ, ఆకతాయిపాటలూ ముగిసిపోయాయి;

ప్రేమికుల మాటలు పలచనై, కొందరు

అయిష్టంగా ప్రేయసికి వీడ్కోలు చెబుతున్నారు.

నాట్య రంగం ఇప్పుడు మూగబోయింది, అక్కడ

ఏ పాదమూ నర్తించడం లేదు, గుడ్ నైట్, గుడ్ నైట్!

అలరుబోడి తన ఆచ్ఛాదిత శయ్య చేరుకుంది.

పశులకాపరి తన పూరిగుడిశ చేరుకున్నాడు

గొప్పింటివాళ్ళు తమ విలాసమందిరాలు చేరుకున్నారు

మీకు అందరికీ సుఖనిద్ర కలుగుగాక!

గడచినరోజుల్లా భవిష్యత్తు హాయిగా గడవాలన్న ఆశతో

వీడ్కోలు చెప్పుకుందాం, గుడ్ నైట్ గుడ్ నైట్.

మనందరికీ కలతలేని నిద్ర కలుగుగాక!

దాని నిశ్చల ప్రశాంతతమీద

చురుకైన మనసు దృశ్యాలు పునః ప్రసరిస్తే

మరొక్క సారి ఆనందాన్ని తిరిగి అనుభవిద్దాం,

మనసు ఉల్లాసంగా,  దృశ్యాలు ఉత్సాహంగా ఉండే

మంచి మంచి కలలే అందరికీ రావాలి, గుడ్ నైట్, గుడ్ నైట్!

.

జొవానా బెయిలీ,

11 September 1762 – 23 February 1851

స్కాటిష్ కవయిత్రి.

 .

 

.

Good Night, Good Night!

.

The Sun is down, and time gone by,        

The stars are twinkling in the sky,     

Nor torch nor taper longer may

Eke out a blithe but stinted day;        

The hours have pass’d with stealthy flight,        

We needs must part: good night, good night!  

      

The bride unto her bower is sent,       

And ribald song and jesting spent;     

The lover’s whisper’d words and few

Have bid the bashful maid adieu;

The dancing floor is silent quite,        

No foot bounds there: good night, good night!     

 

The lady in her curtain’d bed,  

The herdsman in his wattled shed,     

The clansmen in the heather’d hall,

Sweet sleep be with you, one and all!

We part in hopes of days as bright    

As this gone by: good night, good night!  

   

Sweet sleep be with us, one and all!   

And if upon its stillness fall

The visions of a busy brain,     

We’ll have our pleasure o’er again,   

To warm the heart, to charm the sight,        

Gay dreams to all! good night, good night!

.

(From “The Phantom” Act I, Scene 3)

Joanna Baillie

11 September 1762 – 23 February 1851

Scottish Poetess and Dramatist

.

Poem Courtesy:

Women Poets of the Nineteenth Century. 1907.

Ed: Alfred H. Miles.

 

దురదృష్టం… జేమ్స్ ఏండర్సన్, స్కాట్లండు

నిన్నరాత్రి  ఒక మిత్రుడి శయ్య పక్కన

కూర్చుని అలా పరికిస్తున్నాను

బయటా లోపలా నిశ్శబ్దమే

నెత్తిమీద గోడగడియారం చేసే చప్పుడు తప్ప

నా ఆలోచనలు ముందుకీ ఊగిసలాడేయి

అలా చాలా సమయం గడిచిపోయింది,

“నా కంటే దురదృష్టవంతుడు ఉంటాడా?”

అన్న సంశయం చివరకి నివృత్తి అయేదాకా.

నా చెవులో ఒక మాట వినిపించింది…

బాగా అలసి, నీరసించిన గొంతు అది…

“నిస్సహాయులు” అని మూడుసార్లు అంది

ఆ మాటలు నే వినడం తప్ప వద్దనగలిగేవి కావు.

ఆ బాధితుడి ముఖాన్ని గమనించేను

మాటాడే ప్రతి మాటవెనుక బాధని అర్థం చేసుకున్నాను

నా లోని దెప్పిపొడిచే స్వభావం నిలదీసింది

“నీకెప్పుడైనా అంత కష్టం కలిగిందా?” అని.

ఆ ప్రశ్న నా హృదయాన్ని సూటిగా తాకింది…

ఒక్కసారి నిస్సత్తువ ఆవహించింది….

నా పరిస్థితిని అతని పరిస్థితితో

పోల్చుకుని ఊహించుకోలేకపోయాను

అందులో నాకో గుణపాఠం కనిపించింది:

మనం ఎప్పుడు మన కష్టాలే పెద్దవని మొరపెట్టుకోకూడదు

మన కష్టాలు ఎంత గొప్పవైనప్పటికీ

మనకంటే ఘోరమైన కష్టాలనుభవించేవారు ఉంటారు.

.

జేమ్స్ ఏండర్సన్

(1839 -1922)

స్కాట్లండు

 

Hard Luck

.

 

Last night I sat and watch’d

Beside a comrade’s bed–

An’ a’ was still, within an’ out,

Save the watch-beat overhead;

My thochts gaed back and fore,

Frae now to “ould lang syne,”–

Till a’ resolved to this at last,

“Was ever luck like mine?”

A voice then struck my ear–

Sae weary an’ sae wae

In words I couldna choose but hear,

And “helpless,” thrice did say;

I mark’d the sufferer’s face,

Read pain in ilka line–

A taunting spirit in me asked,

“Was ever luck like thine?”

This touch’d me to the heart–

I weaken’d richt awa–

I couldna thole to see my case

Compared wi’ his ava.

And sae a lesson’s taught,

That we should never tine

However hard your lot may be,

There’s ithers waur than thine!

.

James Anderson

(1839 -1922)

Scottish Poet

 

Poem Courtesy: http://rpo.library.utoronto.ca/poems/hard-luck-0

 

Notes

“ould lang syne”: Robert Burns’s phrase, “long time gone by.”

wae: woe(ful).

ilka: each.

thole: endure.

ava: at all.

tine: complain, moan.

ithers waur: others worse.

 

రైలుపెట్టెలోంచి… రాబర్ట్ లూయీ స్టీవెన్సన్, స్కాటిష్ కవి

యక్షిణుల కన్నా వేగంగా, మంత్రగత్తెలకన్నా వడిగా,

గుట్టలూ, ఇళ్ళూ, కంచెలూ, కందకాలూ;

యుద్ద్ధంలో సేనలు దాడి చేస్తున్నట్టు

పొలాల్లోంచి, గుర్రాలు, పశువుల మధ్యలోంచి;

కొండలూ, మైదానాల వింతలన్నీ

తరుముకొస్తున్న చిక్కని వర్షంలా పరిగెడుతునాయి;

రెప్పపాటులో రంగులేసిన స్టేషన్లు

మళ్ళీ కనిపించకుండా మాయమౌతునాయి.

అక్కడో కుర్రాడు చూడానికి కష్టపడి ఎగబాకుతున్నాడు

ముళ్ళకంపల్ని తనొక్కడూ పక్కకి తొలగించుకుంటూ;

ఇక్కడొ దేశదిమ్మరి నిలబడి తేరిపారి చూస్తున్నాడు;

అడివిపూలని మాలలల్లడానికి పచ్చని తీగ అదిగో!

రోడ్డు మీద పరిగెత్తే గూడుబండి ఇదిగో

మనుషులతో బరువులతో తడబడుతూ కదుల్తూ

ఇక్కడిమిల్లూ, అక్కడి నదీ క్షణకాలం కనిపించి

శాశ్వతంగా కనుమరుగైపోతునాయి

.

రాబర్ట్ లూయీ స్టీవెన్సన్

(13 నవంబరు  1850 – 3 డిశంబరు 1894)

స్కాటిష్ కవి, నవలాకారుడూ, వ్యాసకర్త.

.

RL Stevenson

.

From a Railway Carriage

.

Faster than fairies, faster than witches,

ridges and houses, hedges and ditches;

And charging along like troops in a battle

All through the meadows the horses and cattle:

All of the sights of the hill and the plain

Fly as thick as driving rain;

And ever again, in the wink of an eye,

Painted stations whistle by.

Here is a child who clambers and scrambles,

All by himself and gathering brambles;

Here is a tramp who stands and gazes;

And here is the green for stringing the daisies!

Here is a cart runaway in the road

Lumping along with man and load;

And here is a mill, and there is a river:

Each a glimpse and gone forever!

.

Robert Louis Stevenson

(13 November 1850 – 3 December 1894)

Scottish Novelist, Poet & Essayist.

చిరుగాలి… రాబర్ట్ లూయీ స్టీవెన్సన్, స్కాటిష్ కవి

రోజల్లా వీచే ఓ చిరుగాలీ!


బిగ్గరగా ఆలపించు చిరుగాలీ!


గాలిపటాలు మీదకి ఎగరెయ్యడం చూశాను


ఆకాశంలోకి పక్షుల్ని  ఎగరేసుకుపోవడం చూశాను


నా చుట్టూ నువ్వు వీస్తున్న చప్పుడు విన్నాను…


ఆడవాళ్ళ పరికిణీలు గడ్డిమీద చప్పుడు చేసినట్టు.


రోజల్లా వీచే ఓ చిరుగాలీ!


బిగ్గరగా ఆలపించు చిరుగాలీ!


నువ్వు చేసే చాలా పనులు చూశాను


కానీ ఎప్పుడూ నిన్ను నువ్వు దాచేసుకుంటావు

నువ్వు నన్ను తొయ్యడం తెలుస్తోంది, నీ పిలుపూ వినిపిస్తోంది


కానీ నాకంటికి నువ్వు ఏమాత్రం కనిపించడం లేదు.


రోజల్లా వీచే ఓ చిరుగాలీ!


బిగ్గరగా ఆలపించు చిరుగాలీ!


ఎంతో బలంగా, శీతలంగా ఉండే నువ్వు,


జోరుగా వీచే నువ్వు ఇంతకీ పిన్నవా? పెద్దవా?


చెట్లూ మైదానాలలో స్వేచ్ఛగా చరించే మృగానివా


లేక నాకంటే బలశాలివైన ఒక చిరుకూనవా?


.

రాబర్ట్ లూయీ స్టీవెన్సన్ ,

13 నవంబరు 1850 –  3 డిశంబరు 1894)

స్కాటిష్ కవీ, రచయితా, వ్యాసకర్తా, యాత్రా కథకుడు.

English: Photograph of Robert Louis Stevenson
English: Photograph of Robert Louis Stevenson (Photo credit: Wikipedia)

.

The Wind

 

.

 

saw you toss the kites on high

And blow the birds about the sky;

And all around I heard you pass,

Like ladies’ skirts across the grass—

O wind, a-blowing all day long,

O wind, that sings so loud a song!

 

I saw the different things you did,

But always you yourself you hid,

I felt you push, I heard you call,

I could not see yourself at all—

O wind, a-blowing all day long,

O wind, that sings so loud a song!

 

O you that are so strong and cold,

O blower, are you young or old?

Are you a beast of field and tree

Or just a stronger child than me?

O wind, a-blowing all day long,

O wind, that sings so loud a song!

 

.

 

Robert Louis Stevenson.

(13 November 1850 – 3 December 1894)

Scottish novelist, poet, essayist, and travel writer.

 

 

Poem Courtesy:

 

http://www.gutenberg.org/files/34237/34237-h/34237-h.htm#Page_45

నా ప్రియమిత్రుడు, జాన్ ఏండర్సన్, రాబర్ట్ బర్న్స్, స్కాటిష్ కవి

ప్రియ మిత్రమా, జాన్ ఏండర్సన్,

మనిద్దరికి తొలిసారి పరిచయమైనపుడు

నీ జుత్తు ఎంత కారునలుపుగా ఉండేదని,

ఒత్తైన నీ కనుబొమలు గోధుమరంగులో ఎంతో తీరుగా ఉండేవి;


కానీ జాన్, ఇప్పుడు ఆ కనుబొమలు పల్చబడ్డాయి,


నీ జుత్తు బాగా తెల్లబడింది;


ప్రియ మిత్రమా, జాన్ ఏండర్సన్,


నీకు అనేకానేక ఆశీస్సులు.


ప్రియ మిత్రమా, జాన్ ఏండర్సన్,


మనిద్దరం కొండ కలిసి ఎక్కేవాళ్ళం

ఎన్నో ప్రకాశవంతమైన రోజుల్ని

ఇద్దరం ఒకరికొకరు తోడుగా గడిపేం, గుర్తుందా,

కానీ, జాన్ ఇక మన అడుగులు తడబడక తప్పదు,

అయినా, చేతిలో చెయ్యి వేసుకుని నడుద్దాం లే,

ఇద్దరం కలిసే ఈ కొండ మొగల్లో నిద్రిద్దాం


ప్రాణ మిత్రమా, జాన్ ఏండర్సన్, సరేనా?

.

రాబర్ట్ బర్న్స్


25 January 1759 – 21 July 1796


స్కాటిష్ మహాకవి


.

English: Robert Burns Source: Image:Robert bur...
English: Robert Burns Source: Image:Robert burns.jpg Replacement of existing commons image with higher res version (Photo credit: Wikipedia)

.

John Anderson, my Jo

.

John Anderson, my jo, John,
When we were first acquent,
Your locks were like the raven,
Your bonnie brow was brent;
But now your brow is beld, John,
Your locks are like the snow;
But blessings on your frosty pow,
John Anderson, my jo!

John Anderson, my jo, John,
We clamb the hill thegither;
And monie a canty day, John,
We’ve had wi’ ane anither:
Now we maun totter down, John,
But hand in hand we’ll go,
And sleep thegither at the foot,
John Anderson, my jo.

.

Robert Burns

25 January 1759 – 21 July 1796

Scottish Poet

 

నేను చనిపోయిన పిదప… రాబర్ట్ బర్న్స్, స్కాటిష్ కవి

నేను చనిపోయిన పిదప స్పందనలేని ఈ మట్టిమీద

ఆడంబరానికి, లేని దుఃఖాన్ని ప్రదర్శించవద్దు;

బ్రతికున్నప్పుడు నేను ప్రేమించిన నా మిత్రులందరూ

ఒక కన్నీటిబొట్టు వదిలి, నా భార్యాబిడ్డల్ని ఓదార్చొచ్చు.

 

నేను చనిపోయిన పిదప అపరిచితుల్ని పక్కనుండి పోనీండి.

నా దేశ దిమ్మరి జీవితం గూర్చి హర్షించడానికిగాని

అవమాంచడానికిగాని ఎందుకూ, ఎలా  అన్నప్రశ్నలడగనీయొద్దు.

ఆశాశ్వతమైన కీర్తి కుసుమాల్ని నాపై వేయనీయొద్దు. 

 

నేను చనిపోయిన పిదప హత్యాసదృశంగా విమర్శించిన నాలుక

అంతవరకు నాగూర్చిచెప్పిన అబద్ధాలన్నిటినీ మరిచిపోయి

అది చేసిన దాఋణమైన తప్పులన్నిటినీ సరిదిద్దడానికి

వెగటుకలిగేలా రాయడమో, పొగుడుతూ పాడటమో చెయ్యొచ్చు.

 

నేను చనిపోయిన పిదప ప్రపంచానికి వచ్చే నష్టం ఏమిటి?

ఎప్పటిలాగే అంతులేని దాని గోలలో అది కొట్టుకుంటుంది.

ప్రతివ్యక్తీ జీవనక్రీడలో అలా నిస్సత్తువగా కాళ్ళీడ్చుకుంటూ

ఈ మైదానం నుండి కీర్తినో, దైవాన్నో చేరుకుందికి నిష్క్రమించవలసిందే. 

 

నేను చనిపోయిన పిదప, ఒక వివేకి తన కీర్తి కోసం

నా అస్థికలు ఒక ఉద్యానంలోనో, పట్టణంలోనో పదిలపరచొచ్చు;

ఒకప్పుడు నేను రొట్టెకోసం అలమటించినపుడు లేదన్నా, హతాసుడనై

చలువగమ్మి, గతాసువునైనపుడు చలువరాతి సమాధి కట్టొచ్చు.   

.

రాబర్ట్ బర్న్స్2

5 January 1759 – 21 July 1796

స్కాటిష్ మహాకవి

Robert Burns inspired many vernacular writers ...
Robert Burns inspired many vernacular writers across the Isles with works such as Auld Lang Syne, A Red, Red Rose and Halloween. (Photo credit: Wikipedia)

WHEN I AM DEAD.

.

When I am dead, let no vain pomp display

A surface sorrow o’er my pulseless clay,

But all the dear old friends I loved in life

May shed a tear, console my child and wife.


When I am dead, let strangers pass me by.

Nor ask a reason for the how or why

That brought my wandering life to praise or shame.

Or marked me for the fading flowers of fame.


When I am dead, the vile assassin tongue

Will try and banish all the lies it flung

And make amends for all its cruel wrong

In fulsome prose and eulogistic song.


When I am dead, what matters to the crowd.

The world will rattle on as long and loud,

And each one in the game of life shall plod

The field to glory and the way to God.


When I am dead, some sage for self-renown

May urn my ashes in some park or town.

And give, when I am cold and lost and dead,

A marble shaft where once I needed bread !

.

Robert Burns

25 January 1759 – 21 July 1796

Scottish National Poet.

ఆమెని సరిదిద్దడం వృధాప్రయాస… జార్జి స్మోలెట్, స్కాటిష్ కవి .

ఆమె మనసు మార్చడం … వృధా ప్రయాస
అది వర్షంలో చినుకులు లెక్కెట్టడం లాంటిది
ఆఫ్రికా ఊసరక్షేత్రాల్లో నారుపొయ్యడం లాంటిది
తుఫానుల్ని నిరోధించాలని శ్రమపడడం లాంటిది.

మిత్రమా! నాకు తెలుసు : ఆమె గాలికంటే తేలిక
బోయవాడి వలకంటే కళాత్మకమైన ఉచ్చు;
వీచే గాలికంటే నిలకడలేనిది;హేమంతపు
నీరవ మంచు మైదానాలంత దయమాలినది.

ఆమె చాలా లోభి, ఆఖరికి ప్రేమలో కూడా;
ఆమె కన్నులగెలుపులో తమభవిష్యత్తుకై
వందలమంది వీరులు ఆతృతగా ఎదురుచూస్తున్నా
ప్రేమలోని ఆనందమెవరితోనూ పంచుకోదు,ప్రకటించదు;

అటువంటి లజ్జాకరమైన ఆధిపత్యానికి సిగ్గుపడుతూ
నాకు ఒక్కోసారి ఆమె శృంఖలాల్ని తెంచుకోవాలనిపిస్తుంది
ఇక ఎంతమాత్రమూ మోసపోకూడదని నిశ్చయించుకున్న
నాకు నా వివేకం అండగా నిలుచుగాక

మిత్రమా! ఇది క్షణికమైన మైమరపు,
ఒక్క సమ్మోహనమైన చూపుతో పటాపంచలౌతుంది.
ఒక్క సారి ఆమె చూస్తే చాలు! అంగీకరిస్తాను
ఆ చూపులు నన్ను పూర్తిగా కరుణించినా, శపించినా.

అంత సున్నితంగా, అంత సొగసుగా, అంత అందంగా…
ఉన్న ఆమెలో ఏదో అలౌకికత్వం ఉంది; నిజం.
నేను తలవంచక తప్పదు; కలహించి ప్రయోజనం లేదు
ఈ సంకెలలు దుర్విధే నాకు ఇలాగ తొడిగింది.
.

జార్జి స్మోలెట్
19 March 1721 – 17 September 1771

స్కాటిష్ కవి .

.

Tobias Smollet was one of a number of literary...
Tobias Smollet was one of a number of literary critics who took part in Fielding’s Paper War. (Photo credit: Wikipedia)

. To Fix Her,—’Twere a Task As Vain .

To fix her,—’twere a task as vain
To count the April drops of rain,
To sow in Afric’s barren soil,—
Or tempests hold within a toil.

I know it, friend, she’s light as air,
False as the fowler’s artful snare,
Inconstant as the passing wind,
As winter’s dreary frost unkind.

She’s such a miser too, in love,
Its joys she’ll neither share nor prove;
Though hundreds of gallants await
From her victorious eyes their fate.

Blushing at such inglorious reign,
I sometimes strive to break her chain;
My reason summon to my aid,
Resolved no more to be betray’d.

Ah, friend! ’tis but a short-lived trance,
Dispell’d by one enchanting glance;
She need but look, and I confess
Those looks completely curse, or bless.

So soft, so elegant, so fair,
Sure, something more than human’s there;
I must submit, for strife is vain,
’Twas destiny that forged the chain.
.
Tobias George Smollett

(19 March 1721 – 17 September 1771)

Scottish Poet

http://www.bartleby.com/333/45.html
The Book of Georgian Verse. 1909. Ed. William Stanley Braithwaite

ఆత్మలేని మనిషి … సర్ వాల్టర్ స్కాట్, స్కాటిష్ కవి

ఇది నాది, నా జన్మభూమి అని

ఎన్నడూ తనకు తాను సంభావించుకోని

ఆత్మలేని మనిషి ఒకడక్కడ ఉన్నాడు. 

పరాయి నేలలమీద తిరిగి తిరిగి

కాళ్ళు ఇంటిముఖం పట్టినపుడు ఎవరి మనసు

జన్మభూమిని తలుచుకుని పులకరించదు?

వాడిలాంటి మనిషి కనిపిస్తే, జాగ్రత్త;  

ఏ జానపద సంగీతమూ అతనికై హోరెత్తదు; 

బిరుదులూ,పదవులతో,అతనిపేరు మార్మ్రోగిపోవచ్చు గాక,

కోరికల అవధులకి ధనం పోగుచేసుకుని ఉండవచ్చు గాక; 

కానీ, అతని పేరుకీ, అధికారానికీ, ఆ తుచ్ఛుడు 

తనకోసం పోగేసుకున్న తుచ్ఛమైన సంపదకీ,

ఉన్నంతకాలమూ మంచిపేరుతెచ్చుకోలేడు సరిగదా, 

బ్రతికినన్నాళ్ళూ జీవచ్ఛవంలా బ్రతికి, చివరకి 

ఏడ్చేవారూ, గౌరవించేవారూ, కీర్తించేవారూ లేక 

ఏ మట్టిలోంచి వచ్చాడో, ఆ మట్టిలోనే కలిసిపోతాడు.
.

సర్ వాల్టర్ స్కాట్.     

15 August 1771 – 21 September 1832

స్కాటిష్ కవి, నాటక కర్తా,  నవలాకారుడూ

ఈ రోజుల్లో, దేశభక్తి ఒక అనరాని పదమైపోయింది. చరిత్రలో చేసిన తప్పులను తెలుసుకుని, గుణపాఠం నేర్చుకుని, తప్పులని సరిదిద్దుకుంటూ, ఒక పతాకం క్రింద ఐకమత్యంగా, ఒక నాగరికతకి ప్రతిబింబంగా సాగిపోడానికి ఇతరదేశాలు ప్రయత్నిస్తుంటే;  చేసినతప్పులనే పునరావృతంచేస్తూ, అధికారయంత్రాంగాన్ని తమచెప్పుచేతలలో పెట్టుకుని, తమ అధికారాన్ని నిస్సిగ్గుగా దుర్వినియోగంచేసి తమకీ, తమ బంధువర్గానికీ దేశసంపదని దోచిపెట్టడానికి ఈ దేశంలో రాజకీయపార్టీలు ప్రయత్నిస్తుంటే, అస్తిత్వవాద సమస్యలతో ప్రజలు పెనుముప్పుగా రాబోతున్న “ఆర్థిక బానిసత్వం” గురించి ఏమాత్రం ఆలోచనలేకుండా, ఎవరి వర్గానికి వాళ్ళు వత్తాసులు పలుకుకుంటూ, జాతికి అస్తిత్వం లేకుండా చేస్తున్నారు.

ఈ కవితలో చెప్పిన మనిషిని పోలిన చాలామంది మనుషులు  ప్రస్తుత రాజకీయ ముఖచిత్రంలో కోకొల్లలుగా కనిపిస్తున్నారు. కానీ, వాళ్ళకి కవితలో చెప్పిన ముగింపు ఎక్కడా ఉన్నట్టు కనిపించదు. బ్రతికినంతకాలమూ వాళ్ళకి భజనచేసి, కీర్తించేవాళ్ళేగాక, పోయినతర్వాతకూడ ఆరాధించేవాళ్ళు కనిపిస్తున్నారు. బహుశా, స్కాట్లండు ప్రజల నైతిక చిత్తవృత్తికీ, మన నైతిక ప్రవృత్తికీ హస్తిమశకాంతరం తేడా ఉందేమో!

కొందరికైనా కనువిప్పుకలిగితే ఎంతబాగుణ్ణు.

.

English: Portrait of Walter Scott (1771 - 1832...
English: Portrait of Walter Scott (1771 – 1832), novelist and poet, oil on canvas, 76.20 x 63.50 cm (Photo credit: Wikipedia)

Breathes There the Man
.

Breathes there the man with soul so dead

Who never to himself hath said,

This is my own, my native land!

Whose heart has ne’er within him burned,

As home his footsteps he hath turned

From wandering on a foreign strand?

If such there breathe, go, mark him well;

For him no minstrel raptures swell;

High though his titles, proud his name,

Boundless his wealth as wish can claim,

Despite those titles, power, and pelf,

The wretch, concentred all in self,

Living, shall forfeit fair renown,

And, doubly dying, shall go down

To the vile dust from whence he sprung,

Unwept, unhonored, and unsung .

.

Sir Walter Scott

15 August 1771 – 21 September 1832

Scottish Poet, Novelist, and Playwright.

పెంబ్రోక్ కౌంటెస్ పై మృత్యుల్లేఖనం … బెన్ జాన్సన్, ఇంగ్లీషు కవి.

Portrait of Mary Sidney Herbert (1561–1621) Ga...

.

ఆంగ్ల సాహిత్యంలో పేరుపడ్డ మృత్యుల్లేఖనాలలో ఇది ఒకటి. దీనికి సర్ ఐజాక్ న్యూటన్ స్మృతిలో అలెగ్జాండర్ పోప్ వ్రాసిన స్మృతిగీతం అంత పేరు ఉంది.

.

ఈ శోకభరమైన నల్లని సమాధిని

పెంబ్రోక్ కన్న తల్లీ, సిడ్నీ సోదరీ,

కవిత్వానికే ఉపాధి, నిద్రిస్తోంది.

ఓ మృత్యువా! ఆమెవంటి చదువరీ

సుందరీ, మనస్వినీ మరొకరిని

నువ్వు బలిగొనేలోగా,

కాలం నిన్ను శరంతో కూల్చుగాక!

.

బెన్ జాన్సన్ 

11 June 1572 – 6 August 1637

ఇంగ్లీషు కవి

అతి సామాన్యమైన కుటుంబం నుండి వచ్చినా, స్వయం శక్తితో, కృషితో, చదువుమీద అచంచలమైన దీక్షతో పైకి చ్చిన కవీ, నాటక కర్తా బెన్ జాన్సన్. ఎలిజబెత్ మహారాణి కాలంలో అలరారిన షేక్స్ పియర్, క్రిష్టఫర్ మార్లో, సర్ ఫిలిప్ సిడ్నీ, ఎడ్మండ్ స్పెన్సర్ వంటి హేమా హేమీల మధ్య నెగ్గుకురావడం సామాన్య విషయం కాదు. రాణీయేగాక, కళలకీ కవిత్వానికీ రాజపోషకులుగా ఆమె దర్బారులో ఉన్న చాలా మంది ఉన్న రోజుల్లో, సర్ ఫిలిప్ సిడ్నీ, అతని సోదరి ప్రాపకం ఇతనికి దొరికింది. అదికూడా కేవలం తన ప్రతిభవల్లనే.   

.

Ben_Jonson
Ben_Jonson (Photo credit: Wikipedia)

.

Epitaph on Countess of Pembroke

.

Underneath this sable herse

Lies the subject of all verse

Sidney’s sister; Pembroke’s mother

Death! ere thou hast slain another

Learned and fair; good as she,

Time shall throw a dart at thee.

.

Ben Jonson

(Notes:

Sidney:  Sir Philip Sidney (1554-1586) was a noted poet, courtier, soldier and diplomat of Elizabethan era. He is reputed for his classical essay on literary criticism: An Apologie for Poesy

Countess of Pembroke:  Mary Sidney Herbert, sister of Sir Philip Sidney, was the first the first English woman poet and translator with some significant literary reputation. She was more reputed for her patronage . She died on sept. 25, 1621.

%d bloggers like this: