Tag: Scottish Poet
-
సాంధ్యమేఘం… జాన్ విల్సన్, స్కాటిష్ కవి
అస్తమిస్తున్న సూర్యుడి సమీపంలో ఒక మేఘం వ్రేలాడుతోంది మంచుతో పెనవేసుకున్నట్టున్న దాని అంచు పసిడిలా మెరుస్తోంది, దిగువన స్ఫటికంలా మెరుస్తున్న నిశ్చల తటాకంలో నెమ్మదైన దాని నడకని అలా గమనిస్తూ ఎంతసేపు గడిపానో! దాని హృదయం ప్రశాంతతతో నిండే ఉంటుంది, అందుకే అంత నెమ్మది! అసలు దాని నడకలోనే ఎంత ఠీవి ఉందని. ఆ సాయంత్రం వీచిన ప్రతి చిన్న గాలి రివటా ఆ విహాయస విహారిని పడమటికి తేలుస్తూనే ఉంది. శరీరబంధాన్ని త్రెంచుకున్న ఆత్మలా, బ్రహ్మానందాన్ని […]
-
కవిత్వం… డాన్ పాటర్సన్, స్కాటిష్ కవి
ఈ గ్రహం రూపుదిద్దుకుంటున్నప్పుడు దాని అగ్నికీలలోని ఒకానొక మెరుపును, వజ్రం తన గర్భంలో శాశ్వతంగా పొదువుకున్న చందాన, కవిత్వం ప్రేమ తర్వాత కలిగే విరహాన్ని కాకుండా నిశ్శబ్దంగా మనలో అణురూపంలో ఉత్పన్నమయే స్థితినే ప్రతిబింబిస్తుంది; కనుక, నిప్పుకణికలాంటి అతని ప్రేమ నివురుగప్పుతున్నపుడు, మధుశాలలోని గాయకుని గొంతులోంచి అకస్మాత్తుగా వచ్చే పాటలా కవి తన గొంతు తానే వింటాడు: అతని అనుభూతుల్ని ఉదాత్తమైనవిగా చేసి చెప్పుకుంటూనో, లేదా, తోడుగా వాయిస్తున్న వయొలిన్ రాగాలలో కరిగిపోతూనో; కానీ ఆ ప్రేమ నిలకడగా […]
-
మృత్యువంటే… ఛార్లెస్ సోర్లీ, స్కాటిష్ కవి, సైనికుడు
మృత్యువు రకరకాలుగా ఉంటుంది: అందులో గెలుపూ లేదు ఓటమీ లేదు: కేవలం ఒక బాల్టీ ఖాళీ అవడం, పలక శుభ్రంగా తుడిచిపెట్టడం లాంటిది, అప్పటివరకూ ఉనికిగలదానికి దయతో చరమగీతం పాడడం. అంతే! మనకి తెలిసినది ఇంతవరకే: మృత్యువు జీవనం కాదు, ఒక క్షీణస్థితి, ప్రాణం చిదిమివెయ్యబడుతుంది, బాల్టీ పగులుతుంది. ఎన్నో గొప్ప వింతలూ, విశేషాలు చూసినవారికి కూడా ముగింపుమాత్రం ఇంకా తెలీదు. మరణంలో విజయుడూ, విజితుడూ ఒక్కటిగా కలిసి పోతారు; పిరికివాడూ, సాహసికుడూ: మిత్రుడూ శత్రువూ, ఒకటే. […]
-
బహుమానాలు… జేమ్స్ థామ్సన్, స్కాటిష్ కవి
తను స్వారీ చెయ్యగల గుఱ్ఱాన్ని గాని, నడపగలిగిన పడవనిగాని ఒక మనిషికి ఇచ్చిచూడు; అతని హోదా, సంపద, బలం ఆరోగ్యం నేలమీదైనా, నీటిమీదైనా చెక్కుచెదరవు. ఒకమనిషికి వాడు తాగగలిగిన పొగాకుగొట్టాన్నిగాని, వాడు చదవగలిగిన పుస్తకాన్నిగాని ఇచ్చి చూడు; అతని గదిలో పేదరికం తాండవించవచ్చునేమోగాని, అతని ఇల్లు ప్రశాంతతతో ఆనందంతో కళకళలాడుతుంది. నేను ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నట్టు, ప్రేయసీ, ఒక పురుషుడికి అతనికి మనసైన స్త్రీని ఇచ్చి చూడు అతని హృదయం అదృష్టస్పర్శతో ఉదాత్తమౌతుంది ఇంట్లోనూ, నేలమీదా, నీటిమీదా! […]
-
ఒక కుర్రాడి ఆలోచనలు… రాబర్ట్ లూయీ స్టీవెన్సన్, స్కాటిష్ కవి
ఏడు గంటలకి నేను నిద్రకి ఉపక్రమించేటపుడు నా బుర్రలో ఎన్నో బొమ్మలు తారాడుతుంటాయి: పెద్ద పెద్ద భవనాలూ, వాటిని చుట్టుముడుతూ మహాసర్పాలూ వింత వింత గారడీలు చెయ్యగల పండ్లు పండే తోటలూ, దుర్గాల్లో బందీలు చెయ్యబడీ, లేదా, మాయాలతాగృహాల్లో దారితప్పిన అందమైన రాకుమార్తెలూ… ఒక సాహసిక ఆశ్వికుడు సెలయేటిలో స్వారీచేస్తూ పోతుంటే నా కలల్లో ఆ దారంతా స్పష్టంగా కనిపిస్తుంది నేను ఏడు గంటలకి నిద్రకి ఉపక్రమించేటపుడు. నేను ఏడు గంటలకి నిద్రలేచే సరికి నేను వెతుకుతున్న […]
-
అనుకోని సంఘటన… గెరీ కేంబ్రిడ్జ్, స్కాటిష్ కవి
మనోహరమైన రాత్రి. నేను ఆరుబయటకి నడిచి శిశిర నిశీధిని తలెత్తి ఆకాశాన్ని పరికిస్తాను అక్కడ మేఘాలమధ్య తారకలు దివ్యంగా మెరుస్తుంటాయి అప్పుడు మనసుకి ఏ ఆలోచనతడితే అది ఆలోచించవచ్చు. నెత్తిన మెరుస్తున్న కృత్తిక దిగువ గొప్ప ఆలోచనలు గిలకొడుతోంది. నలుప్రక్కలా దట్టంగా పరుచుకున్న ఈ రాతిరి కిటికీ వెలుతురులోంచి వెతికే కనులకు అందని, శుష్కమైన పశ్చాత్తాపాలనీ, వీడ్కోళ్ళనీ సులభంగా గుర్తుచేస్తోంది. కానీ, ఇదేమిటి అకస్మాత్తుగా నా కాళ్ళదగ్గర పాదాలను నాకుతూ? ఓహ్! ఎప్పుడూ మచ్చికగా ఉండే బలిష్ఠమైన […]
-
అశ్రద్ధచేసిన పూలతోట… రాబర్ట్ క్రాఫర్డ్, స్కాటిష్ కవి
ఆగష్టునెల వచ్చేసరికి నిర్లక్ష్యపుచాయలు గమనించాను ఇపుడు సెప్టెంబరులో నాకు నైరాశ్యం వచ్చేస్తోంది; తుప్పుపడుతున్న పనిముట్లు, మాయమవుతున్న వరుసలు, ఈ ప్రయత్నమంతా తాత్కాలికమని చెప్పకనే చెబుతున్నాయి ఆశావహంగా ప్రారంభమైన కార్యాచరణ ముగింపుకి వచ్చేసింది ఇప్పుడిది రాబోయే చెడురోజులను సూచించే కాకిమూకలకీ, ఏది పడితే అది మొలవడానికి అనుకూలంగా ఎన్నడు తయారవుతుందా అని ఎదురుచూసే కలుపుమొక్కలకీ నెలవు; ఈ చక్కని పూలవనాన్ని బీడువారేలా నిర్లక్ష్యం చేసిన తోటమాలి ఎవరై ఉంటాడు? నాకు తెలుసని అనుకుంటాను? కొందర్ని కలిసేను కూడా: అతను […]
-
ఉత్తరాలు రానపుడు… గెరీ కేంబ్రిడ్జ్, స్కాటిష్ కవి
నేను జీవితాన్ని ఎంచుకోకతప్పదు, ఇక్కడ నువ్వింత నిర్లక్ష్యంగా ఉంటూ, రహస్యాలేవీ లేనపుడు … నువ్వు స్టాండుమీదనుండి కొవ్వొత్తి తీసుకుని చీకటి గదుల్లోంచి దీపంలేని స్నానాలగదిలోకి నడుచుకుంటూ పోతావు అక్కడ మనిద్దరం మధ్యయుగంనాటి అద్భుతకథలోలా జంటగా వేడినీటి స్నానం చేస్తాం, ఊసులాడుకుంటూ సువాసనలు వెదజల్లే ఆవిరిలో స్నానంచేస్తున్నామన్న స్పృహతోనూ… బయట దట్టంగాకురుస్తున్న రాత్రివర్షానికీ, గీపెడుతున్న తుఫానుగాలికీ దూరంగా. అన్నిగంటలు కలిసి ఉండడంలో సంతృప్తి పరచడానికి ఏదీ మిగిలి లేదు; మనిద్దరం కలుషాలు వీడి, శాంతిపడి, పొడిబారి, సుగంధభరితమైన శరీరాలతో […]
-
రెండు సానెట్ లు… చార్ల్స్ హామిల్టన్ సోర్లీ, స్కాటిష్ కవి
I సత్పురుషులు ఉదాత్తమైన నీ ఆత్మని శ్లాఘించారు. మహోన్నతమైన నీ కీర్తిచంద్రికలకు కవులు సిగ్గుపడ్డారు. నువ్వు చూపిన మార్గంలో నడవడానికి ఉద్యుక్యులైన అనేకమంది సరసన మేమూ నిరీక్షిస్తూ నిలబడ్డాము. ఇప్పుడు పేరుబడ్డా, ఒకప్పుడు నువ్వెవరో ఎవరికీ తెలీదు; నీ ఉనికి గుర్తించకుండా జీవించడానికి ప్రయత్నించాము. కానీ ఇపుడు ప్రతి వీధిలోనూ, ప్రతి దిక్కునా నిలకడగా నిశ్చలంగా నీ గుర్తులున్న స్థంబాలు చూస్తున్నాము. ‘కొండలమీదకి ఎక్కడానికి మార్గము ‘అని సూచిస్తూ మా ఊర్లో ఉన్న పాడుబడ్డ పొడుగాటి రాటని […]
-
అంకితం… రాబర్ట్ లూయీ స్టీవెన్సన్, స్కాటిష్ కవి
ఇదే నీకు నా మొదటిదీ కడసారిదీ బహుమతి ఈ చిన్ని కవితాగుచ్చాన్ని అంకితం ఇస్తున్నాను. నా దగ్గర ఉన్న ఒకే ఒక ఆస్తి ఈ కవితలే వాటిని ఉన్నవున్నట్టుగా నీకు సమర్పిస్తున్నాను. నేను మత్తులో లేకుండా నిజం చెబుతున్నాను, నీ దృష్టికి వీటిని ఎప్పుడో తీసుకురావలసింది తీసుకువచ్చి, నా మనసుతో నింపిన ఈ కీర్తనలని నువ్వు మెచ్చుకుంటే ఎంతో బాగుండేది ఈ దయలేని ప్రపంచం అంతా, ముక్త కంఠంతో నాకూ, నా కవితలకూ, ఎంతకీ ఆగని కరతాళధ్వనులతో […]