వాలిపోతున్న బార్లీ పంటలా… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
Image Courtesy: https://www.farmingindia.in/barley-crop-cultivation/
సముద్రతలానికి దిగువన
గాలివాటుకి తలవాల్చినా
నిరంతరాయంగా కూని రాగాలు
తీసుకునే బార్లీపంటలా
తలను వాల్చినా, మళ్ళీ
తలెత్తుకునే బార్లీపంటలా
నేనుకూడా, బీటలువారకుండా
ఈ బాధనుండి బయటపడతాను.
నేనూ అలాగే, నెమ్మదిగా
ప్రతి పగలూ, ప్రతిరాత్రీ
దిగమింగుతున్న దుఃఖాన్ని
గేయంగా మలుచుకుంటాను.
.
సారా టీజ్డేల్
(August 8, 1884 – January 29, 1933)
అమెరికను కవయిత్రి
.

.
Like Barley Bending
.
Like barley bending
In low fields by the sea,
Singing in hard wind
Ceaselessly;
Like Barley bending
And rising again,
So would i, unbroken,
Rise from pain;
So would I softly,
Day long, night long,
Change my sorrow
Into song.
.
Sarah Teasdale
(August 8, 1884 – January 29, 1933)
American Poet.
From:
Sara Teasdale Poems Published by PoemHunter.com – The worlsd’s Poetry Archive, 2004 under Clessic Poetry Series.
అంతా అయిన తర్వాత … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
ఇప్పుడు నువ్వంటే నాకు ప్రేమ లేదు,
నీకూ నే నన్నా ప్రేమ లేదు,
అద్భుతమైన పెను తుఫానులా
ప్రేమ మనల్ని తాకి, వెళ్ళిపోయింది.
అయినప్పటికీ, మనిద్దరి మధ్యా
దూరాలూ, కాలమూ పెరుగుతున్నకొద్దీ
ఏవో చిన్న చిన్న విషయాలు
జ్ఞాపకానికి వస్తూనే ఉంటాయి:
వానతోపాటు వచ్చిన వాసన
చినుకులతోపాటు నేలమీదకి జారి
అక్కడ రాలిన ఎండుటాకుల్లోకీ
పుష్పించే లతాగుల్మాలలోకి చేరినట్టు…
స్ఫటికాల్లాటి వానబిందువులు
అక్కడి సాలెగూళ్ళ వలలపై తేలి
మిణుకుమనే తారకలతో
సామ్యాన్ని ఆపాదించుకున్నట్టు.
.
సారా టీజ్డేల్
(8 August 1884 – 29 January 1933)
అమెరికను కవయిత్రి

.
Afterwards
.
I do not love you now,
Nor do you love me,
Love like a splendid storm
Swept us and passed
Yet while the distance
And the days drift between us,
Little things linger
To make me remember
As the rain’s fragrance
Clings when the rain goes
To the wet under leaves
Of the verbena,
As the clear rain-drops
Cling to the cobwebs
Leaving them lightly
Threaded with stars.
.
Sara Teasdale
(August 8, 1884 – January 29, 1933)
American poet
వసంతంలో పారిస్ నగరం… సారా టీజ్డేల్ , అమెరికను కవయిత్రి
కాసేపు కనిపించీ కాసేపు కనిపించని
సూర్యుడి వెలుగులో నగరం ప్రకాశిస్తోంది.
పిల్లగాలి హుషారుగా ఈదుకుంటూ పోతోంది.
ఒక చిన్న జల్లు కురిసి ఆగిపోయింది.
నీటిబొట్లు మాత్రం చూరుకి వేలాడుతూ
ఒకటొకటిగా క్రిందకి రాలుతున్నాయి.
ఆహ్! ఇది పారిస్, ఇది పారిస్,
వసంతం అడుగుపెట్టింది.
బోయిస్ పార్కు చిత్రమైన స్పష్టాస్పష్ట కాంతితో
మిలమిలా మెరుస్తుండడం నాకు తెలిసినదే.
పొడవైన ఛాంప్స్ రాచవీధిలో ఆర్క్ డ ట్రీయోంఫ్
ప్రాచీనతకి చిహ్నంగా నిశ్చలంగా, హుందాగా నిలబడుతుంది.
కానీ మహోన్నతంగా పెరిగిన అకేసియా చెట్లమీద పడే
వెలుతురుకి కాలిబాటమీద నీడలు దోబూచులాడుకుంటాయి.
ఓహ్, ఇది పారిస్, ఇది పారిస్,
చెట్ల ఆకులు పచ్చదనాన్ని సంతరించుకుంటున్నాయి.
సూర్యాస్తమయం అయింది, వెలుగు తిరోగమించింది,
పడీ పడనట్టు నాలుగు చినుకులు రాలేయి.
కానీ సియాన్ నదిమీదనుండి ఇంత హాయిగా గాలి
వీస్తుంటే, దాన్ని ఎవరు పట్టించుకుంటారు?
అయినా, అందమైన యువతి ఒకతె కిటికీ
అద్దం పక్కన కూచుని ఏదో కుట్టుకుంటోంది.
అది పారిస్, అది పారిస్ నగరం అయి
అది వసంతం అయితే, మరోసారి తప్పక రండి.
.
సారా టీజ్డేల్
(8th Aug 1884 – 29th Jan 1933)
అమెరికను కవయిత్రి
.

.
Paris in Spring
.
The city’s all a-shining
Beneath s fickle sun,
A gay young wind is a-blowing,
The little shower is done,
But the raindrops still are clinging
And falling one by one—
Oh, it’s Paris, it’s Paris
And springtime has begun.
I know the Bois is Twinkling
In a sort of hazy sheen,
And down the Champs the gay old arch
Stands cold and still between.
But the walk is flecked with sunlight
Where the great acacias lean,
Oh, it’s Paris, it’s Paris,
And the leaves are growing green.
The sun’s gone in, the sparkle’s dead,
There falls a dash of rain,
But who would care when such an air
Comes blowing up the Seine?
And still Ninette sits sewing
Beside the windowpane
When it’s Paris, it’s Paris
And springtime’s come again.
.
Sara Teasdale
(8th Aug 1884 – 29th Jan 1933)
American
Poem Courtesy:
https://archive.org/details/collectedpoemsof00teas/page/36
ఒక చలి రాత్రి… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
నా కిటికీ అద్దం మంచుతో మెరుస్తోంది
లోకం అంతా ఈ రాత్రి చలికి వణుకుతోంది
చంద్రుడూ, గాలీ రెండంచుల కత్తిలా
భరించశక్యంకాకుండా బాధిస్తున్నారు.
భగవంతుడా! ఇలాంటపుడు తలదాచుకుందికి
కొంపలేనివాళ్లనీ, దేశద్రిమ్మరులనీ రక్షించు.
దేముడా! మంచుమేతలు వేసిన వీధుల్లో దీపాల
వెలుగుకి తచ్చాడే నిరుపేదలని కరుణించు.
మడతమీదమడతవేసిన తెరలతో వెచ్చగా,
నా గది ఇప్పుడు వేసవిని తలపిస్తోంది.
కానీ ఎక్కడో, గూడులేని అనాధలా
నా మనసు చలికి మూలుగుతోంది.
.
సారా టీజ్డేల్
(August 8, 1884 – January 29, 1933)
అమెరికను కవయిత్రి

.
A winter Night
.
My windowpane is starred with frost,
The world is bitter cold tonight,
The moon is cruel, and the wind
Is like a two-edged sword to smite.
God pity all the homeless ones,
The beggars pacing to and fro,
God pity all the poor tonight
Who walk the lamp-lit streets of snow.
My room is like a bit of June,
Warm and close-curtained fold on fold,
But somewhere, like a homeless child,
My heart is crying in the cold.
.
Sara Teasdale
Poem Courtesy:
https://archive.org/details/collectedpoemsof00teas/page/29
ముగింపు… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
ఏ సుఖసంతోషాలమీదకీ ఇపుడు మనసుపోవవడం లేదు,
వర్షంతో ముంచెత్తిన ఈ సెప్టెంబరు రోజు ముగింపుకొచ్చింది
నేను అమితంగా ప్రేమించిన వ్యక్తికి ఈ రోజు వీడ్కోలు పలికేను
ఎంతో ప్రయత్నం మీద నేను నా మనసుని అణుచుకోగలిగేను.
వదలకుండా వీస్తున్న రొజ్జగాలి శీతకాలపు రాకడ సూచిస్తోంది
వర్షానికి తడిసి కిటికీ అద్దాలు మసకబారి, చల్లగా తగులుతున్నాయి;
నేను ప్రయత్నపూర్వకంగా నా అదృష్టాన్ని దూరంచేసుకున్నాను
ఇక ఈ జన్మకి అదృష్టం నా దగ్గరకి తిరిగిరాదు.
.
సారా టీజ్డేల్
8 ఆగష్టు 1884 – 29 జనవరి 1933)
అమెరికను కవయిత్రి
.
.
An End
.
I have no heart for any joy,
The drenched September day turns to depart,
And I have said goodbye to what I love,
With my own will I vanquished my own heart.
On the long wind I hear the winter coming-
The window-panes are cold and blind with rain;
With my own will I turned the summer from me,
And summer will not come to me again.
.
Sara Teasdale
(August 8, 1884 – January 29, 1933)
American Poet
Poem Courtesy:
https://www.poetryfoundation.org/poetrymagazine/browse?contentId=16343

సంఘర్షణ… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
.
నాలోని యోగీ, భోగీ
రాత్రీ పగలూ పోట్లాడుకుంటూ ఉంటారు.
సమ ఉజ్జీలేమో, అతి జాగ్రత్తగా, లొంగకుండా
ఒకర్నొకరు తిట్టుకుంటూ
నాకు ఒకపక్క చెమట్లు పట్టేస్తుంటే
సూర్యోదయం మొదలు చీకటిపడేదాకా కొట్టుకుంటారు.
రాత్రయినదగ్గరనుండీ పోరాటం మళ్ళీ ప్రారంభం.
పొద్దుపొడుస్తుంటే వణుక్కుంటూ వాళ్ళని గమనిస్తాను.
ఈసారి ఒకరి అంతు రెండోవాళ్ళు చూసేదాకా కొట్టుకుంటారు.
ఎవరు జయిస్తారన్నది నేను పట్టించుకోను.
ఏవరు గెలిచినా, చివరికొచ్చేసరికి
ఓడిపోయేదాన్ని నేనే!
.
సారా టీజ్డేల్
(8 August 1884 – 29 January 1933)
అమెరికను కవయిత్రి
.

.
Conflict
.
The Spartan and the Sybarite
Battle in me day and night.
Evenly matched, relentless, wary,
Each one cursing the adversary
With my slow blood dripping wet,
They fight from sunrise to sunset.
And from sunset the fight goes on.
I shiver and hear them in the dawn.
They fight to death this time, but I
Care little which will have to die,
Whichever it is, when the end has come,
I shall be the defeated one.
.
Sara Teasdale
(8 August 1884 – 29 January 1933)
American Poet
Poem Courtesy:
https://www.poetryfoundation.org/poetrymagazine/browse?contentId=35824

నాకు నక్షత్రగతులు తెలుసు, కానీ… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
నాకు పేరు పేరునా నక్షత్రాలు తెలుసు
ఆల్డెబరాన్ (రోహిణి), ఆల్టేర్ (శ్రవణం) …
విశాలమైన నీలాకాశపు నెచ్చెన
అవి ఎలా ఎక్కుతాయో కూడా తెలుసును.
వాళ్ళు చూసే చూపులనుబట్టి
మగవాళ్ళ రహస్యాలు పసిగట్టగలను
వారి వింత వింత, చీకటి ఆలోచనలు
బాధకలిగించడంతో పాటు జాగ్రత్తనీ బోధించాయి.
కానీ నీ కళ్ళే నా ఊహకి అందటం లేదు,
అవి పదే పదే పిలుస్తున్నట్టు అనిపిస్తున్నా…
నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదో తెలీదు
అలాగని, అసలు ప్రేమించటం లేదనీ చెప్పలేను.
నాకు చాలా విషయాలు తెలుసును. ఏం లాభం?
సంవత్సరాలు వస్తున్నాయి, పోతున్నాయి,
చివరకి నేను తెలుసుకుందామని ఉబలాటపడేది
బహుశా తెలుసుకోకుండానే మరణిస్తాను.
.
సారా టీజ్డేల్
(8 August 1884 – 29 January 1933)
అమెరికను కవయిత్రి
Sara Teasdale
(August 8, 1884 – January 29, 1933)
.
I Know the stars
.
I know the stars by their names
Aldebaran, Altair
And I know the path they take
Up the heaven’s broad blue stair
I know the secrets of men
By the look of their eyes
Their gray thoughts, their strange thoughts
Have made me sad and wise.
But your eyes are dark to me
Though they seem to call and call—
I cannot tell if you love me
Or do not love me at all.
I know many things,
But years come and go,
I shall die not knowing
The thing I long to know.
.
Sara Teasdale
(8 August 1884 – 29 January 1933)
American Lyrical Poet
రా!… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
మౌక్తికరజోసదృశమైన ఈ వాసంత సాయంసంధ్యవేళ
వర్ణహీనమైన చంద్రుడు పూరేకలా తేలియాడుతుంటే,
నను పొదువుకునేందుకు చేతులుజాచుకుంటూ, రా!
వీడని ముద్దుకై పెదాలు సిద్ధంచేసుకుంటూ రా!
రా! జీవితం, గడుస్తున్న వత్సరాల వలలో
ఎగురుతూ చిక్కిన ఒక బలహీనమైన చిమ్మట.
ఇంత కాంక్షతో రగిలే మన సంగతీ త్వరలో అంతే!
బూడిదరంగు రాయి రప్పలమై గడ్డిలో పొరలాడడమే.
.
సారా టీజ్డేల్
(August 8, 1884 – January 29, 1933)
అమెరికను కవయిత్రి
.

.
Come
.
Come, when the pale moon like a petal
Floats in the pearly dusk of spring,
Come with arms outstretched to take me,
Come with lips pursed up to cling.
Come, for life is a frail moth flying,
Caught in the web of the years that pass,
And soon we two, so warm and eager,
Will be as the gray stones in the grass.
.
Sara Teasdale
(August 8, 1884 – January 29, 1933)
American
ఆ వయసుకి… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
ఈ రాత్రి నా కళ్ళు మూసుకుని ఒక చిత్రమైన
ఊరేగింపు నా కళ్ళముందునుండి పోవడం గమనిస్తాను…
నీ ముఖాన్ని నేను అప్పటికింకా చూడకముందు రోజులు
ఎంతో ఆశలహేలతో నా ముందునుండి నడిచిపోతుంటాయి;
అవును! సిగ్గూ, సున్నితమైన మనసున్నరోజులు తరలిపోతాయి
కన్నీటిపొరతో ఏమీ కనిపించకపోయినా నృత్యంచేసే నర్తకిలా
అలా రోజులు గడచిపోయినా, గడచిన ప్రతిరోజూ
నన్ను నీ సన్నిధికి చేరుస్తోందని తెలుసుకోలేకపోయాను;
ఆ త్రోవలు చాలా ఇరుకుగా ఒకదానికొకటి దూరంగా ఉన్నప్పటికీ
ప్రతీదారీ నన్ను నీ హృదయాసమీపానికే చేర్చింది…
ఓహ్, పిచ్చి సున్నితమైన వయసు! ఓహ్, ఒంటరి ఏకాంత దినాలు,
గొంతు కన్నీళ్ళలో మునిగిపోయినా, పాడటానికి తపించిన రోజులు!
.
సారా టీజ్డేల్
(8 ఆగష్టు 1884 – 29 జనవరి 1933)
అమెరికను కవయిత్రి.
