అనువాదలహరి

కాలం… యదార్థమూ, మిధ్యా … S T కోలరిడ్జ్

చదునుగా విశాలంగా ఉన్న ఆ పర్వతాగ్రం మీద

 (అదెక్కడో సరిగ్గా తెలీదు గాని, గంధర్వలోకం అయిఉండొచ్చు)

ఆస్ట్రిచ్ లా తమ రెండు రెక్కలూ తెరచాపల్లా జాపుకుంటూ

ఇద్దరు ముచ్చటైన పిల్లలు

ఒక అక్కా, తమ్ముడూ

అనంతంగా పోటీపడుతూ పరిగెత్తుతున్నారు

.

అక్క అతన్ని మెడ్డాయించింది

అయినా వెనక్కి తిరిగిచూస్తూ పరిగెడుతోంది

ఎప్పుడూ తమ్ముడివంకే చూస్తూ, అతని మాటలు వింటూ

ఎందుకంటే, పాపం! అతనికి చూపులేదు.

గరుకుతోవైనా, మెత్తని నేల అయినా

ఒక్కలాగే అడుగులు వేసుకుంటూ సాగుతున్నాడు.

అతనికి తెలీదు పోటీలో ముందున్నాడో, వెనకున్నాడో!

.

కోలరిడ్జ్

Samuel Taylor Coleridge at age 42
Samuel Taylor Coleridge at age 42 (Photo credit: Wikipedia)

Time, Real And Imaginary

AN ALLEGORY

On the wide level of a mountain’s head,
(I knew not where, but ’twas some faery place)
Their pinions, ostrich-like, for sails outspread,
Two lovely children run an endless race,
A sister and a brother!
This far outstript the other;
Yet ever runs she with reverted face,
And looks and listens for the boy behind:
For he, alas! is blind!
O’er rough and smooth with even step he passed,
And knows not whether he be first or last.

1815.

ST Coleridge.

(21 October 1772 – 25 July 1834)

English Poet, Critic and Philosopher

Further Reading: http://en.wikipedia.org/wiki/Samuel_Taylor_Coleridge

వయసూ – ముదిమీ … ST కోలరిడ్జ్

Double-flowered Cherry Blossoms
Double-flowered Cherry Blossoms (Photo credit: Wikipedia)

తలలూపుతున్న పూలగుత్తులమధ్య

తూగాడే పిల్లగాలిలా కవిత్వమూ,

వాటిలోని మకరందాన్ని గ్రోలుతున్న

తేనెటీగలా ఆశా ఉండేవి.

రెండూ నా స్వంతం!

వయసులో ఉన్నప్పుడు

ఆశా కవిత్వమూ ప్రకృతిలో విహరించేవి!

ఓహ్!… (నిట్టూర్పు)

వయసులో ఉన్నప్పుడు!

అదెప్పటి మాట! ఎంతదురదృష్టం!

అప్పటికీ ఇప్పటికీ ఎంత వ్యత్యాశం!

ఈ గాలితిత్తి అప్పటికింకా రూపుదిద్దుకోలేదు

ఈ శరీరం నాకు క్షమించరాని ద్రోహం చేసింది.

ఆ రోజుల్లో పర్వతాగ్రాలమీదా, సైకతశ్రోణులమీదా

ఎంత తేలికగ మెరుపులా పరుగులెత్తేది…

సరస్సుల్లోనూ, విశాలమైన నదీ ప్రవాహాలమీదా,

పూర్వం మనకు ఏమీ తెలియనిరోజుల్లో

ఏ తెరచాపలూ, తెడ్ల సహాయం లేకుండా

సుడిగాలులకీ, ఉత్తుంగతరంగాలకీ వెరవకుండా

సాగిపోయే నీటైన నాటు పడవల్లా!

వయసులో ఉన్నప్పుడు ఈ శరీరంకూడా

శీతావాతాతపాల్ని లెక్కచేసేది కాదు

పువ్వులెంతో అందంగా ఉండేవి;

ప్రేమ పూలంత కోమలంగా ఉండేది;

స్నేహం నీడనిచ్చే వృక్షంలా ఉండేది;

ఏంత ఆనందంగా ఉండేది! స్నేహం, ప్రేమ, స్వేఛ్ఛ

అన్నీ వానచినుకుల్లా చుట్టుముట్టేవి

ఈ ముదిమి నన్ను ముసురుకోక మునుపు.

ముదిమి ముసురుకోక మునుపు!

ఓహ్! (నిట్టూర్పు)

దౌర్భాగ్యం కాకపోతే!

ఈ ముదిమి, వయసు ఉడిగిందని నాకు చెప్తోంది!

ఓ వయసా! ఎన్ని మధురమైన వత్సరాలు

మనిద్దరం ఒకటిగా కలిసి గడిపేం!

నువ్వు నన్ను వదిలి వెళ్ళేవంటే నమ్మశక్యం కాదు.

నువ్వు వెళ్ళే అవకాశం లేదు,

ఎందుకంటే, నీ సంధ్యారవాలింకా మ్రోగనే లేదు…

నువ్వు వేషాలు మార్చగల మాయలమరాఠీవి

నన్ను నువ్వు వీడిపోయావని నమ్మించడానికి

నువ్వుఈ కొత్త వేషం ధరించేవేమో!

ఈ నుదుటవేలాడే వెండిజలతారు కేశాలూ,

కొద్దిగావంగిన నడకా,శరీరంలోని మార్పూ

నీ పెదాలవిరిసిన విరులనుకుంటున్నాను,

ఈకన్నీళ్ళు నీకంటివెలుగుచూడడంవల్ల వచ్చినవి.

ఆహ్,జీవితం అంటే ఏమిటి? ఒక ఆభాస; ఒక ఆలోచన;

కనుక నేనూ యవ్వనం ఒకగూటిపక్షులమనే భావిస్తాను.

తుహిన బిందువులు ప్రభాత మణులు,

కానీ, అస్తమయవేళ అవే కన్నీటి సుడులు!

ఆశ అడుగంటిన వేళ, జీవితం చేసే హెచ్చరిక

ముదిమిలో విచారించడానికి పనికొస్తుంది;

ఆ విచారించడం కూడా సాధారణంగా  ఎలాంటిదంటే,

మనకి చాలా ఆప్తుడైన బంధువుకి

వదలలేక వదలలేక వీడ్కోలిస్తూ

అందులొనే మళ్ళీ పరాచికాలాడుతూ

“ఎక్కువరోజులు ఉండిపోయా”వని

నవ్వలేక చెప్పినట్టు.

.

English: Samuel Taylor Coleridge, poet
English: Samuel Taylor Coleridge, poet (Photo credit: Wikipedia)

కోలరిడ్జ్

(21 October 1772 – 25 July 1834)

.

Youth and Age

.

Verse, a breeze ‘mid blossoms straying,
Where Hope clung feeding, like a bee –
Both were mine! Life went a-maying
With Nature, Hope, and Poesy,
When I was young!

When I was young? – Ah, woeful When!

Ah! for the change ‘twixt Now and Then!
This breathing house not built with hands,
This body that does me grievous wrong,
O’er aery cliffs and glittering sands
How lightly then it flashed along,
Like those trim skiffs, unknown of yore,
On winding lakes and rivers wide,
That ask no aid of sail or oar,
That fear no spite of wind or tide!
Nought cared this body for wind or weather
When Youth and I lived in’t together.

Flowers are lovely; Love is flower-like;
Friendship is a sheltering tree;
O the joys! that came down shower-like,
Of Friendship, Love, and Liberty,
Ere I was old!
Ere I was old? Ah woeful Ere,
Which tells me, Youth’s no longer here!
O Youth! for years so many and sweet
‘Tis known that Thou and I were one,
I’ll think it but a fond conceit –
It cannot be that Thou art gone!
Thy vesper-bell hath not yet tolled –
And thou wert aye a masker bold!
What strange disguise hast now put on,
To make believe that thou art gone?
I see these locks in silvery slips,
This drooping gait, this altered size:
But Springtide blossoms on thy lips,
And tears take sunshine from thine eyes:
Life is but Thought: so think I will
That Youth and I are housemates still.

Dew-drops are the gems of morning,
But the tears of mournful eve!
Where no hope is, life’s a warning
That only serves to make us grieve
When we are old:
That only serves to make us grieve
With oft and tedious taking-leave,
Like some poor nigh-related guest
That may not rudely be dismist;
Yet hath out-stayed his welcome while,
And tells the jest without the smile.

ST Coleridge

(21 October 1772 – 25 July 1834)

Romantic Poet, Critic and Philosopher.

Further Reading: http://en.wikipedia.org/wiki/Samuel_Taylor_Coleridge

జీవితం ఒక వరం … కోలరిడ్జ్

ఆత్మహత్య చేసుకోదలచుకున్న వ్యక్తి వాదన:

.

నేను పుట్టబోయే ముందు, అసలు నాకు పుట్టాలని ఉందో

లేదో అడగలేదు; అలా జరిగి ఉండవలసింది కాదు.

జీవించడమే ప్రశ్న అయినపుడు, ఆ ప్రయత్నం చెయ్యడానికి

పంపించే వస్తువుకి  ఇష్టం ఉండాలి; లేదు అంటే అర్థం? చావడమే.

.

ప్రకృతి సమాధానం:

.

ఎలా పంపేనో అలా వెనక్కితిరిగిరావడం లేదూ?

శరీరం వల్ల కొత్తగా వచ్చిన నష్టం ఏముంది?

ముందు నువ్వేమిటో ఆలోచించుకో.

గతంలో నువ్వేమిటో ఒకసారి గుర్తు చేసుకో!

నీకు అమాయకత్వాన్నిచ్చేను, భవిష్యత్తుమీద ఆశని ఇచ్చాను

ఆరోగ్యాన్ని, మేధస్సునీ, ఎన్నో అవకాశాలనూ ఇచ్చాను.

నాకు నువ్వు తిరిగి ఇచ్చినదేమిటీ? నేరమూ, సోమరితనం, నిరాశా?

ఒక సారి లెక్కలేసుకుని చూడు ; తనిఖీ చేసుకో, తైపార వేసుకో!

అప్పుడు దమ్ముంటే— చావడానికి ప్రయత్నించు!

.

Samuel Taylor Coleridge (1772-1834)
Samuel Taylor Coleridge (1772-1834) (Photo credit: Wikipedia)

సామ్యూల్ టేలర్ కోలరిడ్జ్

(21 October 1772 – 25 July 1834)

English Poet, Philosopher

(కోలరిడ్జ్ అపారమైన మేధా సంపత్తి ఉన్న వ్యక్తేగాక  ఇంగ్లీషులో రొమాంటిక్ మూవ్ మెంట్ గా పిలవబడే ఒక భావ విప్లవ ఉద్యమానికి వర్డ్స్ వర్త్ తో కలిసి రూపకల్పన చేసినవాడు. అతని మేధస్సుకి దీటైన (బ్రిటిష్ రాయల్ సొసైటీ సభ్యులకి అనేక సాహిత్య ఉపన్యాసాలిచ్చిన మేధావి) సాహిత్య కృషిని మిగల్చలేకపోయినా, ప్రకృతిని అంతవరకు చూడని ఒకకోణం లో ఆవిష్కరించిన వ్యక్తి.

ఈ కవితలో ఎంత సున్నితంగా, ఆత్మహత్యని నిరసించాడో గమనించండి. ప్రకృతి మనకు ఒక మనిషిగా  బ్రతకగలిగే అవకాశాన్నేగనక ఇచ్చి ఉండకపోతే, మనం ఏ రాయి, రప్పలా అచేతనంగా పడిఉండే వాళ్లమో తెలీదు. ప్రాణం ఇచ్చి, జ్ఞానేంద్రియాలిచ్చి, ప్రకృతిని అనేకవన్నెలలో చూసి ఆనందించగల బుద్ధివిశేషాన్నిచ్చి పంపితే, వ్యక్తి తనకిచ్చిన సంపదని గుర్తించలేక, లేనిదానికోసం వగస్తూ, నిరాశతో జీవితాన్ని అంతంచేసుకో జూస్తున్నాడంటే ఎంత హాస్యాస్పదం? మనిషి తన బలాన్ని అవగాహన చేసుకుని ఇటువంటి అపురూపమైన అవకాశం దొరికినందుకు ఆనందిస్తూ జీవితానికి ఒక పూర్ణతని సాధించాలని కవిభావన.)

.

The Suicide’s Argument

Ere the birth of my life, if I wished it or no
No question was asked me–it could not be so !
If the life was the question, a thing sent to try
And to live on be YES; what can NO be ? to die.

NATURE’S ANSWER

Is’t returned, as ’twas sent? Is’t no worse for the wear?
Think first, what you ARE! Call to mind what you WERE!
I gave you innocence, I gave you hope,
Gave health, and genius, and an ample scope,
Return you me guilt, lethargy, despair ?
Make out the invent’ry ; inspect, compare !
Then die–if die you dare !
.

Samuel Taylor Coleridge

%d bloggers like this: