Tag: Russian
-
ఆఖరి ఆకు… అలెగ్జాండర్ పూష్కిన్, రష్యను కవి
నా బ్రతుకు కోరికల పరిధి దాటింది నా వ్యామోహాలుతలుచుకుంటే విసుగేస్తోంది; శూన్యహృదయ జనితాలైన దుఃఖాలొక్కటే చివరకి మిగిలేది. నా అధికార తీరాలపై విధి రేపే క్రూరమైన తుఫానుల నీడలో నా తుది ఘడియకోసం ఎదురుచూస్తూ దుఃఖభరితమైన ఒంటరి బతుకు ఈడుస్తున్నాను. ఆవిధంగా, శీతగాలి ఊళలేస్తూ చలితో కోతపెడుతుంటే ఆఖరిఆకు మాత్రమే మిగిలి మోడుబారిన కొమ్మ … గజగజా వణుకుతోంది. . అలెగ్జాండర్ పూష్కిన్ 6 జూన్ 1799 – 10 ఫిబ్రవరి 1837 రష్యను కవి . […]
-
వాళ్ళిచ్చిన ఈ శరీరాన్ని నేనేం చేసుకోను? … ఓసిప్ మాండెల్ స్టామ్, రష్యను
ఇంత స్వంతమై, నాతో ఇంత ఆత్మీయంగా మసిలే ఈ శరీరాన్ని నేనేం చేసుకోను? బ్రతికున్నందుకూ, ప్రశాంతంగా ఊపిరిపీలుస్తున్నందుకూ, తెలిస్తే నాకు చెప్పు, ఎవర్ని స్తుతించాలో? నేనే పువ్వునీ, తోటమాలిని కూడా ఈ అఖండ భూగృహంలో నేను ఒంటరివాణ్ణి కాను. నేను విడుస్తున్న ఈ వెచ్చని ఊపిరి కాలమనే నిర్మలమైన అద్దంమీద నువ్వు చూడగలవు. అందులో ఇప్పటిదాకా కనీకనిపించని ఒక ఆకారం స్పష్టంగా రూపుకట్టి ఉంది. ఈ ఊపిరి దాని జాడ మిగల్చకుండా ఎక్కడికో నిష్క్రమిస్తుంది కానీ, ఈ […]
-
ఎవరికీ అప్పగించవద్దు… అలెగ్జాండర్ బ్లోక్, రష్యను కవి
నువ్వు అనుసరించదలుచుకున్న మార్గాలని కృతజ్ఞతలేని జనసమూహానికి అప్పగించవద్దు. నీ అందమైన హర్మ్యాన్ని పశుబలంతో కూలదోస్తారు. నువ్వు గర్వంగా ఆరాధించేదాన్ని చులకనచేస్తారు. భారమైన తన శిలువను ఈడ్చుకుపోయేవాడు ఎప్పుడూ ఒంటరే. ఋజుమార్గంలో నడిచే అతని మనోబలం ఎన్నడూ సడలదు అతన్ని స్ఫూర్తిని ఎత్తైన కొండలమీద వెలిగిస్తూ దట్టంగా పరుచుకున్న చీకటితెరలను చీలుస్తుంటాడు. . అలెగ్జాండర్ బ్లోక్ 28 November 1880 – 7 August 1921 రష్యను కవి . Do not entrust… . […]
-
నేను అతిసామాన్యంగా జీవించడం నేర్చుకున్నాను… అనా అఖ్మతోవా, రష్యను కవయిత్రి
నేను వివేకంగా, అతిసామాన్యంగా జీవించడం నేర్చుకున్నాను: ఆకాశం వంక చూడడం, దేవుణ్ణి ప్రార్థించడం, అతివేలమయిన నా కష్టాలు మరిచిపోడానికి చీకటిపడకముందే ఎక్కువదూరం అలా నడవడం. కొండవాలులో అంట్రింత చెట్లు గలగలలాడుతున్నపుడూ, సంజెరంగులోని బెర్రీపళ్ళు గుత్తులుగా వాలినపుడూ నేను ఆనందంగా కవితలు అల్లుకుంటాను… నశ్వరమైన జీవితంగురించీ, సౌందర్యం, మృత్యువుగురించీ. నేను ఇంటికి తిరిగి వస్తాను. మెత్తని బొచ్చుగల పెంపుడుపిల్లి నా అరచేతిని నాకుతుంది. ముద్దుగా కులుకుతుంది. చెరువుగట్టుననున్న రంపపు మిల్లు పొగగొట్టం కొస క్రింద పొయ్యిలో చెలరేగుతున్న మంటలకి […]
-
కామన… పూష్కిన్, రష్యను కవి
రోజులు సాగుతూ ఉంటాయి; ప్రతిక్షణమూ విఫలప్రేమ వల్ల గాయపడ్డ నా మనసులోని బాధనీ దుఃఖాన్ని ఇనుమడింపజేస్తూ చీకటి మిగిల్చి నిద్ర పోనీని కలలకీ, వెంటాడే కోరికలకీ దారితీస్తుంది; అయినా, నేను ఫిర్యాదు చెయ్యను; బదులుగా, శోకిస్తాను; కన్నీళ్ళు నాకు మనశ్శాంతి నిస్తాయి, ఇచ్చి శలవుతీసుకుంటాయి. గాఢమైన దుఃఖానికి బందీ అయిన నా మనసుకి, నా మాటనమ్మండి, చెప్పలేని ఆనందం కలుగుతుంది. జీవితమా! సాగిపో! రిక్తాత్మా! రా, ముందుకి ఎగిరిపో, నిశ్శబ్ద తమోశూన్యంలోకి అంతర్థానమైపో! నా ప్రేమ గురించి […]
-
పేరు… అలెగ్జాండర్ పుష్కిన్, రష్యను కవి
నా పేరుతో నీ కేమిటి అనుబంధం? అది సమసిపోతుంది దూర తీరాలలో ఎక్కడో ఏకాంతంగా దొర్లుకుంటూ వెళ్ళి ఒడ్డున పగిలైన అలలా… లేదా, చీకటి కీకారణ్యంలో ఒక కేకలా. నీ వాళ్ళ సమాధులమధ్య ఒక స్పందనలేని గీతగా మిగులుతుంది; అర్థం కాని భాషలో గజిబిజిగా అల్లుకున్న ఒక సమాధి లిపిలా అదేమిటి మరి? ఎప్పుడో గతించిన కాలం, ఎన్నో పిచ్చి కలలమధ్య తప్పిపోయిన ఒక కల, జ్ఞానదేవత కటాక్ష వీక్షణాలు జ్ఞాపకాలుగా నీ ఆత్మపై ప్రసరించవులే. ఒకవేళ […]
-
ఎక్కడికో దూరంగా… అలెగ్జాండర్ సెర్గేవిచ్ పుష్కిన్, రష్యను కవి
ఎక్కడో దూర దేశంలో ఉన్న ఇంటికి నువ్వు ప్రయాణమయ్యావు. ఇంతకుముందెన్నడూ ఎరుగనంత దుఃఖంతో నీ చేతుల్లో ఏడ్చాను నా చేతులు చల్లబడి తిమ్మిరెక్కాయి. అయినా నిన్ను వెళ్ళకుండా ఆపడనికి ప్రయత్నించేను; ఈ బాధకి అంతంలేదని గాయపడ్ద నా ఆత్మకి తెలుసు. మన గాఢమైన చుంబనం నుండి నీ పెదాల్ని అదాత్తుగా దూరం చేశావు. ఇలాంటి ఏకాంతప్రదేశానికి బదులు మరో అందమైన చోటు గురించి చెబుతూ “మేఘాచ్ఛాదనలేని అనంతాకాశం క్రింద ఆలివ్ చెట్టు నీడల్లో మళ్ళీ మనం ఇద్దరం […]
-
హాప్స్… బోరిస్ పాస్టర్ నాక్, రష్యను కవి
ఐవీ లత చుట్టుముట్టిన ఈ విల్లో చెట్టు నీడన, నీనడుముచుట్టూ నే చేతులువేసి, పొడవుకోటు మన భుజాలపై కప్పుకుని, ఇప్పటివరకు ఎరగని పెద్ద తుఫానుబారినుండి రక్షణ తీసుకుంటున్నాం. అది ఐవీ లత అనుకున్నాను, నాది పొరపాటు. పొదలన్నిటా వ్యాపించి ఈ అడవిని చుట్టింది ఐవీ లత కాదు, హాప్స్. నీ సామీప్యం మత్తెక్కిస్తోంది! నెచ్చెలీ! పద. ఈ పొడుగుకోటుని నేలపై పరుద్దాం. . బోరిస్ పాస్టర్ నాక్ (10 February 1890 – 30 May 1960) రష్యను […]
-
బుల్లిపిట్ట… అలెగ్జాండర్ సెర్గెవిచ్ పూష్కిన్, రష్యను కవి
నేను పరదేశంలోనైనా సంప్రదాయపు అలవాట్లూ, విధులూ నిర్వర్తిస్తాను. నేను సంతోషంగా ఒక బుల్లి పిట్టను వసంతోత్సవాల్లో స్వేచ్ఛగా విహరించమని వదుల్తాను. ఇప్పుడు నాకు ఎంతో ఊరటగా ఉంది. అందుకు సర్వశక్తిమయుడైనదేముడికి ఎంతైనా ఋణపడి ఉన్నాను. అతని సృష్టిలో కనీసం ఒక జీవికైనా నేను స్వాతంత్ర్యాన్ని ఇవ్వగలిగేను. . అలెగ్జాండర్ సెర్గెవిచ్ పూష్కిన్ 6 జూన్ 1799 – 10 ఫిబ్రవరి 1837 రష్యను కవి. . Image Courtesy: http://en.wikipedia.org/wiki/File:A.S.Pushkin.jpg . A Little Bird […]
-
నన్ను మంత్రముగ్ధుణ్ణి చేసిన క్షణం… పుష్కిన్, రష్యను కవి
నన్ను మంత్రముగ్ధుణ్ణి చేసిన ఆ క్షణం ఇంకా గుర్తే: నా కళ్ళు అప్పుడే అలా ఎత్తి చూశాను, నువ్వు అక్కడ ఉన్నావు, అపురూపమూ అరుదూ ఐన సౌందర్య రహస్యం లిప్తకాలం కళ్ళముందు కదిలివెళిపోయిన అనుభూతి… మూగ పరివేదనతో, నిరాశతో లోపలే ప్రార్థించుకున్నాను. ప్రపంచమెప్పుడూ వృధా జీవిత ప్రయాసలనే గౌరవిస్తుంది. ఊరడించే నీ పలుకులని చాలకాలం మనసులో భావించుకున్నాను, నీ రూపం నా కలలని చాలకాలం వేధించింది. కాలం గడిచిపోయింది. ఒక భయంకరమైన తుఫాను నాకై నేను పదిలంగా […]