అనువాదలహరి

తాతయ్య మరణం … అలెక్సాండర్ అలెక్సాండెరోవిచ్ బ్లోక్, రష్యను కవి

ఈ కవిత చివరి పాదంలో “నూతన గృహప్రవేశం” అని ఒక గొప్ప ప్రయోగం ఉంది. ఆ భావాన్ని అంత అందంగా తీసుకువచ్చిన అనువాదకుణ్ణి అభినందించకుండా ఉండలేను.

 ***

 

సాధారణంగా నిద్రకోసమో, మరణం కోసమో నిరీక్షిస్తుంటాం

ఆ సందర్భాలు ఎంతకీ ముగియక గొప్ప విసుగు తెప్పిస్తాయి.

ఒక్క సారి కిటికీలోంచి అలసటతీరుస్తూ గాలి రివట ఒకటి

వీచి, పవిత్రమైన బైబిలు పేజీలను తిరగేస్తుంది.

 

తెల్లని జుత్తుతో ఒక ముసలాయన  అక్కడికి వెళ్తాడు

ఒంటరిగా, మెరిసే కళ్ళతో గబగబా అడుగులేస్తూ.

మనవంకచూసి చిరునవ్వు నవ్వుతాడు, చేత్తో పలకరిస్తూ

మనకి బాగా పరిచయమున్న నడకతో నిష్క్రమిస్తాడు.

 

ఆ ముసలాయన మార్గాన్ని అంతవరకు గమనించిన మనందరం

ఒక్కసారి అతన్ని మనముందు పరున్న వ్యక్తిగా గుర్తిస్తాము

ఆనంద పారవశ్యంలో వెనుదిరిగి చూడబోతే

మనముందొక శవం ఉంటుంది శాశ్వతంగా కన్నులు మూసుకుని.

 

ఒక రకంగా ఆత్మ అనుసరించిన మార్గాన్ని తెలుసుకోవడం మంచిదే,

అందులోనూ, అది విడిచిపోతున్న వ్యక్తిలో ఆనందం కలిగిస్తున్నపుడు.

సమయం ఆసన్నమయింది: అతన్ని ప్రేమతో, భక్తితో తలుచుకుందికి,

మరొక “నూతన గృహప్రవేశా”న్ని ఆనందంగా జరుపుకుందికి.  

.

 

అలెక్సాండర్ అలెక్సాండెరోవిచ్ బ్లోక్

28 November 1880 – 7 August 1921

రష్యను కవి

 

The Death of a Grand Father

 

We waited commonly for sleep or even death.

The instances were wearisome as ages.

But suddenly the wind’s refreshing breath

Touched through the window the Holy Bible’s pages:

………

copyrighter material. read the full poem  in the link given below

.

Aleksander Blok

28 November 1880 – 7 August 1921

Russian Poet

 

Read the complete poem here :

 

రైతుని గమనించండి… అలెగ్జాండర్ పుష్కిన్, రష్యను కవి

ఇసక పర్రలలో స్వేచ్ఛాబీజాలు జల్లుతుంటే

చుక్క పొడవకముందే నేను నడుస్తున్నాను;

పాపం బానిస నాగళ్ళు విడిచిన చాళ్లలోకి

స్వచ్చమైన, నిష్కల్మషమైన వేళ్ళు విత్తులు జల్లుతున్నాయి

ఫలప్రదమైనది ఈ విత్తనము, తరాలను సృష్టిస్తుంది;

కానీ, ఈ పంట నొర్లుకునేవాడు, వట్టి అహంకారపు జులాయి

ఇప్పుడు నాకు అర్థం అయింది ‘వృధాశ్రమ’ అంటే ఏమిటో.

ఓ శాంతియుత దేశాల్లారా, మీకు కావలసినంత మెయ్యండి

మీ రెన్నడూ అన్నార్తుల ఆక్రందనలకి బదులు పలకలేదు !

స్వాతంత్ర పోరాటాల పిలుపులకి గొర్రెలా బదులు పలికేది?

ఉన్ని కత్తిరించడానికో, బలిగా ఇవ్వడానికో పనికివస్తాయి అవి

వాటికి దొరికే ఓలి… సుఖజీవులైన వాటి యజమానులు

తరాలుగా, నిస్సిగ్గుగా మెడకి తగిలించే… కాడి.

.

అలెగ్జాండర్ పుష్కిన్

6 June  1799 – 10 February 1837

రష్యను కవి

Image Courtesy: http://en.wikipedia.org/wiki/File:A.S.Pushkin.jpg
Image Courtesy: http://en.wikipedia.org/wiki/File:A.S.Pushkin.jpg

.

Behold a Sower

.

With freedom’s seed the desert sowing,

I walked before the morning star;

From pure and guiltless fingers throwing—

Where slavish plows had left a scar—

The fecund seed, the procreator;

Oh vain and sad disseminator,

I learned then what lost labors are….

Graze if you will, you peaceful nations,

Who never rouse at honor’s horn!

Should flocks heed freedom’s invocations?

Their part is to be slain or shorn,

Their dower the yoke their sires have worn

Through snug and sheepish generations.

.

Alexander Pushkin

Russian Poet

(6 June  1799 – 10 February 1837)

Poem Courtesy:

Modern Russian Poetry.  1921.

Comps: Deutsch and Yarmolinsky

http://www.bartleby.com/164/2.html

కటీఫ్… యెవగనీ యెటుషెంకో, రష్యను కవి

నాకు ప్రేమంటే విరక్తి వచ్చింది; మన కథకి పేలవమైన ముగింపు,
జీవితమంత నిరుత్సాహంగా, సమాధి అంత కళావిహీనంగా.
మన్నించు… ఈ ప్రేమగీతాన్ని ఇక్కడితో ఆపేస్తున్నాను
గిటారు పగలగొడుతున్నా, మనిద్దరికీ దాచుకుందికి ఏవీ లేవు. 

కుక్కపిల్లకేం తోచడం లేదు. ఆ బొచ్చుకుక్కకి చిన్నవిషయాన్ని
మనం ఎందుకు అంత క్లిష్టం చేసుకుంటున్నామో అర్థంకావటం లేదు.
అది నీ గది ముందుకొచ్చి మూలుగుతుంది. పోనీలే అని వెళ్లనిస్తాను. 
అది నా నా గది తలుపులు గోకినపుడు, నువ్వే వెళ్ళిపోతావు. 

ఓ కుక్కా! సున్నితమైన ఆవేశాలు గలదానా,
ఇలా ఆ గదికీ ఈ గదికీ పరిగెడుతుంటే నీకు పిచ్చెక్కుతుంది
నీకు ఈ పురాతనమైన భావన అర్థం కాదు,
అయిపోయింది, ఇక్కడితో సరి, కథ ముగిసింది, సమాప్తం, మంగళం.

నువ్వు సున్నితంగా ఆలోచిస్తున్నకొద్దీ, అప్పటిలాగే
“ప్రేమ పరిరక్షణ” అనే అద్భుతమైన నాటక ఆడాల్సి వస్తుంది.
“మన్నించడాలు” గుసగుసమంటాయి, దాని ప్రతిధ్వనులకై ఆసగా ఎదురుచూస్తాం,
కాని ఆవరించిన నిశ్శబ్దంలోంచి ఏదీ వెనుతిరిగి రాదు.

కనుక ప్రేమను మొదట్లోనే కాపాడుకోవడం మంచిది,
“ఎన్నడూ విడిపోం” శాశ్వతంగా కలిసుంటాం” వంటివి వాడకూడదు;
రైలు చక్రాలు ఏమిటి మొత్తుకుంటాయో పట్టించుకోవాల్సి ఉంది:
“ఎప్పుడూ ప్రమాణాలు చెయ్యొద్దు,” అవి తులాదండాల్లా ఊగుతుంటాయి.

మనం విరిగిపోయిన కొమ్మలు గుర్తుంచుకోవాల్సింది
ఆకాశం నిండా ముక్కలైన మేఘాల్ని గమనించాల్సింది
తెలివితక్కువగా ప్రేమ నటించే ప్రేమికుల్ని హెచ్చరించాల్సింది:
ఎంత ఎక్కువ ఆశపడితే, అంత ఎక్కువగా అబద్ధమని తేలుతుంది,” అని.

ప్రేమలో నిజమైన అనురాగం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడం
భరించవలసిన ప్రతి బంధాన్నీ జాగ్రత్తగా చూసుకోడం;
ఆమెకు నువ్వు స్వర్గాన్ని వాగ్దానం చెయ్యకు; అరెకరం సూచించు;
“జీవితాంతం” అనకు, కనీసం మరుసటి సంవత్సరం వరకైనా చాలు.

పదే పదే, “నిన్ను ప్రేమిస్తున్నా, నిన్ను ప్రేమిస్తున్నా” అనకు
ఆ చిన్న వాక్యం జీవితకాలం వెన్నాడుతుంది…
ఓ రోజు ఎప్పుడైనా నీకు ప్రేమ తగ్గి, గుర్తుచేసుకున్నప్పుడు,
అది కందిరిగలా కుట్టడమో, కత్తిలా దిగబడడమో చేస్తుంది.

అలా… మా కుక్కపిల్ల మతి పోయినట్టై
ఆ తలుపుకీ ఈ తలుపుకీమధ్య వస్తూ పోతూంది.
నిన్ను వదిలేసేను కనుక “క్షమించు” అని అడగను. కానీ,
ఒకందుకు క్షమాపణ చెబుతాను: ఒకప్పుడు నిన్ను ప్రేమించినందుకు.

.

యెవగనీ యెటుషెంకో

18th July 1932

రష్యను కవి

 

.

Breaking Up

.

I fell out of love: that’s our story’s dull ending,

as flat as life is, as dull as the grave.

Excuse me — I’ll break off the string of this love song

and smash the guitar. We have nothing to save.

 

The puppy is puzzled. Our furry small monster

can’t decide why we complicate simple things so —

he whines at your door and I let him enter,

when he scratches at my door, you always go.

 

Dog, sentimental dog, you’ll surely go crazy,

running from one to the other like this —

too young to conceive of an ancient idea:

it’s ended, done with, over, kaput. Finis.

 

Get sentimental and we end up by playing

the old melodrama, “Salvation of Love.”

“Forgiveness,” we whisper, and hope for an echo;

but nothing returns from the silence above.

 

Better save love at the very beginning,

avoiding all passionate “nevers,” “forevers;”

we ought to have heard what the train wheels were shouting,

“Do not make promises!” Promises are levers.

 

We should have made note of the broken branches,

we should have looked up at the smokey sky,

warning the witless pretensions of lovers —

the greater the hope is, the greater the lie.

 

True kindness in love means staying quite sober,

weighing each link of the chain you must bear.

Don’t promise her heaven — suggest half an acre;

not “unto death,” but at least to next year.

 

And don’t keep declaring, “I love you, I love you.”

That little phrase leads a durable life —

when remembered again in some loveless hereafter,

it can sting like a hornet or stab like a knife.

 

So — our little dog in all his confusion

turns and returns from door to door.

I won’t say “forgive me” because I have left you;

I ask pardon for one thing: I loved you before.

.

Yevgeny Yevtushenko

18th July 1932

Russian Poet

%d bloggers like this: