అనువాదలహరి

ఒక కుర్రాడి ఆలోచనలు… రాబర్ట్ లూయీ స్టీవెన్సన్, స్కాటిష్ కవి

ఏడు గంటలకి నేను నిద్రకి ఉపక్రమించేటపుడు
నా బుర్రలో ఎన్నో బొమ్మలు తారాడుతుంటాయి:
పెద్ద పెద్ద భవనాలూ, వాటిని చుట్టుముడుతూ మహాసర్పాలూ
వింత వింత గారడీలు చెయ్యగల పండ్లు పండే తోటలూ,
దుర్గాల్లో బందీలు చెయ్యబడీ, లేదా, మాయాలతాగృహాల్లో
దారితప్పిన అందమైన రాకుమార్తెలూ…
ఒక సాహసిక ఆశ్వికుడు సెలయేటిలో స్వారీచేస్తూ
పోతుంటే నా కలల్లో ఆ దారంతా స్పష్టంగా కనిపిస్తుంది
నేను ఏడు గంటలకి నిద్రకి ఉపక్రమించేటపుడు.

నేను ఏడు గంటలకి నిద్రలేచే సరికి
నేను వెతుకుతున్న మాయా ప్రపంచం మరి కనిపించదు
కోట ఉన్నచోట ఒక కుర్చీ వెక్కిరిస్తూ కనిపిస్తుంది
తోటలోని అందమైన ప్రదేశాన్నంతటినీ తివాచీ కప్పేస్తుంది
నేలలోంచి పొరపాటున కూడా ఏ దివ్య శక్తులూ బయటకి రావు
గుర్రంస్వారీ చేసిన రౌతుల జాగాలో బూట్లు కనిపిస్తాయి
గలగలమని సెలయేరు పారిన జాగాలో
ఇప్పుడు స్నానపుతొట్టే, నీళ్ళ కూజా ఉంటాయి;
నేను మళ్ళీ ఆ ఇంద్రజాలంకోసం వృధాగా వెతుకుతుంటాను
ఉదయం ఏడుగంటలకి నేను నిద్రలేచిన తర్వాత.
.
రాబర్ట్ లూయీ స్టీవెన్సన్

స్కాటిష్ కవి, నవలాకారుడు, వ్యాసకర్త, సంగీతకారుడు.

.

A Child’s Thought

.

At seven, when I go to bed,

I find such pictures in my head:

Castles with dragons prowling round,

Gardens where magic fruits are found;

Fair ladies prisoned in a tower,

Or lost in an enchanted bower;

While gallant horsemen ride by streams

That border all this land of dreams

I find, so clearly in my head

At seven, when I go to bed.

At seven, when I wake again,

The magic land I seek in vain;

A chair stands where the castle frowned,

The carpet hides the garden ground,

No fairies trip across the floor,

Boots, and not horsemen, flank the door,

And where the blue streams rippling ran

Is now a bath and water-can;

I seek the magic land in vain

At seven, when I wake again.

.

Robert Louis Stevenson

(13 November 1850 – 3 December 1894)

Scottish Poet, Novelist, Essayist, Musician and Travel writer.

Poem Courtesy:

https://www.poetrynook.com/poem/childs-thought

చిరుగాలి… రాబర్ట్ లూయీ స్టీవెన్సన్, స్కాటిష్ కవి

రోజల్లా వీచే ఓ చిరుగాలీ!


బిగ్గరగా ఆలపించు చిరుగాలీ!


గాలిపటాలు మీదకి ఎగరెయ్యడం చూశాను


ఆకాశంలోకి పక్షుల్ని  ఎగరేసుకుపోవడం చూశాను


నా చుట్టూ నువ్వు వీస్తున్న చప్పుడు విన్నాను…


ఆడవాళ్ళ పరికిణీలు గడ్డిమీద చప్పుడు చేసినట్టు.


రోజల్లా వీచే ఓ చిరుగాలీ!


బిగ్గరగా ఆలపించు చిరుగాలీ!


నువ్వు చేసే చాలా పనులు చూశాను


కానీ ఎప్పుడూ నిన్ను నువ్వు దాచేసుకుంటావు

నువ్వు నన్ను తొయ్యడం తెలుస్తోంది, నీ పిలుపూ వినిపిస్తోంది


కానీ నాకంటికి నువ్వు ఏమాత్రం కనిపించడం లేదు.


రోజల్లా వీచే ఓ చిరుగాలీ!


బిగ్గరగా ఆలపించు చిరుగాలీ!


ఎంతో బలంగా, శీతలంగా ఉండే నువ్వు,


జోరుగా వీచే నువ్వు ఇంతకీ పిన్నవా? పెద్దవా?


చెట్లూ మైదానాలలో స్వేచ్ఛగా చరించే మృగానివా


లేక నాకంటే బలశాలివైన ఒక చిరుకూనవా?


.

రాబర్ట్ లూయీ స్టీవెన్సన్ ,

13 నవంబరు 1850 –  3 డిశంబరు 1894)

స్కాటిష్ కవీ, రచయితా, వ్యాసకర్తా, యాత్రా కథకుడు.

English: Photograph of Robert Louis Stevenson
English: Photograph of Robert Louis Stevenson (Photo credit: Wikipedia)

.

The Wind

 

.

 

saw you toss the kites on high

And blow the birds about the sky;

And all around I heard you pass,

Like ladies’ skirts across the grass—

O wind, a-blowing all day long,

O wind, that sings so loud a song!

 

I saw the different things you did,

But always you yourself you hid,

I felt you push, I heard you call,

I could not see yourself at all—

O wind, a-blowing all day long,

O wind, that sings so loud a song!

 

O you that are so strong and cold,

O blower, are you young or old?

Are you a beast of field and tree

Or just a stronger child than me?

O wind, a-blowing all day long,

O wind, that sings so loud a song!

 

.

 

Robert Louis Stevenson.

(13 November 1850 – 3 December 1894)

Scottish novelist, poet, essayist, and travel writer.

 

 

Poem Courtesy:

 

http://www.gutenberg.org/files/34237/34237-h/34237-h.htm#Page_45

డడింగ్స్టన్ … రాబర్ట్ లూయీ స్టీవెన్సన్, స్కాటిష్ కవి

Isabelle Delobel & Olivier Schoenfelder perfor...
Isabelle Delobel & Olivier Schoenfelder perform a lift during their exhibition at the 2007 European Figure Skating Championships. (Photo credit: Wikipedia)

కాకుల  కా, కా, లతో పక్షుల కిలకిలలతో
ఈ చిట్టడవి సన్నటి ఈ నీరెండలో ఆహ్లాదంగా ఉంది.

దూరాన చర్చిలోనుండి ప్రార్థన తేలివస్తోంది
కాని వాళ్ళు చిత్తమొచ్చినరీతిలో అది పాడుతున్నారు

మేఘాలసందులలోనుండి జాలువారుతున్న బంగారు కిరణాలు
సరసుమీది నునుతరగలపై తళతళలాడుతున్నాయి

ఈ శిలలు కూడా ఒకదానికొకటి తమసామీప్యతకు
సంతసిస్తున్నట్టు కనిపిస్తున్నాయి

మరొకసారి నా మనసు ఉప్పొంగి ఉరకలేస్తూ
ఆనందంతో పరవశిస్తోంది

వెలుగునీడలు చేతి వేళ్లలా
నా స్వరతంత్రులను మీటుతున్నాయి

ప్రియతమా! నా ఊహగతాన్ని చిత్రిస్తోంది…
క్రిందటిసారి నువ్వు ఇక్కడ ఉన్నావే… ఆ రోజుని.

ఆ రోజు ఆకులుకూడా కదలని శీతగాలిలో
వేగంగా కదిలే స్కేటింగ్ బూట్ల చప్పుడుతో
ఈ సరస్సు మారుమోగింది

నువ్వు నామీదకి ఒరిగావు, నేను నీమీదకి ఒరిగేను
మన కేళి అపశృతులులేకుండా గాలిలోతేలినట్లు సాగింది.

ఒకసారి ఎడమపాదంతో, మరోసారి కుడిపాదంతో
జారుతూ మనం ఎన్నో వలయాలు తిరిగాము.

మనలాగే విహరిస్తున్న మనుషులమధ్యలోంచి
మనం ఊయలలా సాగిపోయాము
నువ్వు నా చెయ్యి గట్టిగా పట్టుకున్నావు

మనం చదునుగా ఉన్న మంచు మెరిసేదాకా,
గుంపులుగా మనుషులు వెళిపోయేదాకా ఆడేము

హంసలు విహరించే ఆ సరస్సు సాక్షిగా
అదిగో,  ప్రశాంతంగా ఉన్న ఆ కొండ సాక్షిగా చెబుతున్నా:
ఆ రోజు మనిద్దరం ప్రేమలోపడి ఉంటే
ఓహ్! ఈపాటికి ప్రేమలో మునిగిపోయి ఉండేవాళ్ళం

.

Note: డడింగ్స్టన్ స్కాట్లండులో ఎడింబరో కి తూర్పుగా ఉండే ఒక గ్రామం 

English: Accession no. PGP 114.1 Medium: Plati...
English: Accession no. PGP 114.1 Medium: Platinum print Original size: 36.90 x 29.20 cm Credit Purchased 1986 (Photo credit: Wikipedia)

రాబర్ట్ లూయీ స్టీవెన్సన్

(13 November 1850 – 3 December 1894)

స్కాటిష్ కవి, నవల రచయితా, వ్యాసకర్త.

.

Duddingstone – By Robert Louis Stevenson

With caws and chirrupings, the woods
In this thin sun rejoice.
The Psalm seems but the little kirk
That sings with its own voice.

The cloud-rifts share their amber light
With the surface of the mere –
I think the very stones are glad
To feel each other near.

Once more my whole heart leaps and swells
And gushes o’er with glee;
The fingers of the sun and shade
Touch music stops in me.

Now fancy paints that bygone day
When you were here, my fair –
The whole lake rang with rapid skates
In the windless winter air.

You leaned to me, I leaned to you,
Our course was smooth as flight –
We steered – a heel-touch to the left,
A heel-touch to the right.

We swung our way through flying men,
Your hand lay fast in mine:
We saw the shifting crowd dispart,
The level ice-reach shine.

I swear by yon swan-travelled lake,
By yon calm hill above,
I swear had we been drowned that day
We had been drowned in love.

.

Robert Louis Stevenson

(13 November 1850 – 3 December 1894)

 Scottish novelist, poet, essayist, and travel writer.

ప్రపంచపు తోటమాలి … RL Stevenson

మహానుభావుడు సూర్యుడు ప్రశాంతంగా
సువిశాల శూన్యాకాశంలో విహరిస్తున్నాడు.
వినీలగగనంలో ఈ వేసవి మధ్యాహ్నవేళ
వర్షంకంటే చిక్కనికిరణాలజల్లు కురిపిస్తున్నాడు.

అప్పటికేదగ్గరగా ఉన్నతెరల్ని ఇంకాదగ్గరగాలాగి
గదిని నీడగా, చల్లగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాం
అయినా ఒకటో రెండో కన్నాలు దొరుకుతూనే ఉన్నాయి
అతనికి తన వేళ్ళు అందులోంచి దూర్చడానికి

సాలీళ్ళుపట్టి దుమ్ముకొట్టుకుపోయిన అటక
చూరుకన్నంలోంచి చొచ్చుకొస్తున్న వెలుతురులో బాగా కనిపిస్తోంది
విరిగిపోయిన పెంకుల కొసలనుండి
నిచ్చెనవేసిన గడ్డివామిని నవ్వుతూ పలకరిస్తున్నాడు

మధ్యమధ్యలో తన బంగారు మోముతో
తోటలోని నేలనంతా పరికించి చూస్తున్నాడు
దట్టమైనబదనికపొదలలోని అట్టడుగుతీగెమీదకూడా
తనచురుకైన వాడి వేడి చూపులను ప్రసరిస్తున్నాడు

కొండలమీదా, సముద్రంపైనా,
నిలకడగా ఉన్న గాలిలోనూ తేలియాడుతూ
పిల్లల్ని సంతోషపరచడానికీ,
గులాబీలకి రంగులద్దడానికీ అదిగో,
ప్రపంచపు తోటమాలి ప్రయాణిస్తూనే ఉన్నాడు.

.

రాబర్ట్ లూయీ స్టీవెన్సన్

(13 November 1850 – 3 December 1894)

స్కాటిష్ కవీ, నవలా రచయితా.

ఇతని పేరు చెప్పగానే చప్పున గుర్తువచ్చేవి ట్రెజర్ ఐలండ్ (Treasure Island) అనే చిన్నపిల్లల అద్భుతమైన నవలా ;  డాక్టర్ జెకిల్ & మిస్టర్ హైడ్ (Strange case of Dr. Jekyll and Mr. Hyde) అన్న మనోవైజ్ఞానిక నవలా. తమ జీవితకాలంలోనే పేరుప్రఖ్యాతులు సంపాదించుకోగలిగిన అరుదైన సాహిత్యవేత్తలలో ఇతను ఒకడు.

ఈ కవితలో సౌందర్యమంతా నా మట్టుకు నాకు “ప్రపంచపు తోటమాలి” అని సూర్యుడిగురించి చేసిన ప్రయోగంలో ఉంది. అందుకే దీనిక శీర్షికకూడా అదే ఉంచేను. భాస్కరోసర్వభక్షకః అని ఆర్యోక్తి. సూర్యుడు వేసవిలో తన వాడి వేడి కిరణాలతో పంటపొలాల్ని మాడ్చి, పంటకి హానికలిగించే క్రిమికీటకాలని  నశింపజెయ్యకపోతే, తొలకరిజల్లులకి నేల మళ్ళీ వ్యవసాయానికి సిధ్ధంకాదు. అలాగే తోటమాలి కూడ పాదులుతీస్తూ, గొప్పులుతవ్వుతూ, చీడపట్టిన చెట్లని తీసేసి, కొమ్మల్ని త్రుంచేసి, వర్షాకాలానికి తోటని  సన్నద్ధం చేస్తాడు.

Portrait of Robert Louis Stevenson, 1892.
Portrait of Robert Louis Stevenson, 1892. (Photo credit: Wikipedia).

Summer Sun

.

Great is the sun, and wide he goes
Through empty heaven with repose;
And in the blue and glowing days
More thick than rain he showers his rays.

Though closer still the blinds we pull
To keep the shady parlour cool,
Yet he will find a chink or two
To slip his golden fingers through.

The dusty attic spider-clad
He, through the keyhole, maketh glad;
And through the broken edge of tiles
Into the laddered hay-loft smiles.

Meantime his golden face around
He bares to all the garden ground,
And sheds a warm and glittering look
Among the ivy’s inmost nook.

Above the hills, along the blue,
Round the bright air with footing true,
To please the child, to paint the rose,
The gardener of the World, he goes.
.

Robert Louis Stevenson

(13 November 1850 – 3 December 1894)Scottish Poet, Novelist and Essayist.

%d bloggers like this: