అనువాదలహరి

గాయపడిన మన్మధుడు… ఎనాక్రియన్, గ్రీకు కవి

ఒకసారి గులాబిదొంతరలలో పరున్న

మన్మధుణ్ణి ఒక తేనెటీగ కుట్టింది.

అంతే, కోపంతో వాళ్ళమ్మదగ్గరకి పరిగెత్తి,

ఏడ్చిగగ్గోలుపెడుతూ ఇలా అన్నాడు:

‘అమ్మా! కాపాడే! నీ కొడుకు ప్రాణం పోతోందే!” 

 “అరే నా బంగారు తండ్రీ! ఏమయిందమ్మా?”

అప్పుడు వెక్కి వెక్కి ఏడుస్తూ ఇలా అన్నాడు:

“రెక్కలున్న పామేదో నన్ను కరిచిందే,

జానపదులు దాన్ని తేనెటీగ అంటారే.

“దాని కామె పకపకా నవ్వి, ముద్దులతో, 

కేశపాశంతో ముంచెత్తి, కన్నీరు తుడుస్తూ, 

 “అయ్యో నాయనా! నవ్వొస్తోందిరా!

దీనికేఉపద్రవం వచ్చినట్టు ఏడవాలిట్రా?

అలాగయితే నీ బాణాలతో అందర్నీ గాయంచేస్తావే  

వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందో చెప్పు మరి? “

 .

(అనువాదం: రాబర్ట్ హెర్రిక్) 

ఎనాక్రియన్

582 – 485 BC

గ్రీకు కవి

The wounded Cupid

.

Cupid, as he lay among

Roses, by a bee was stung.

Whereupon in anger flying

To his mother, said, thus crying,

Help! O help! Your boy’s a-dying.

And why, my pretty lad? Said she.

Then blubbering replied he:

A winged snake has bitten me,

Which country people call a bee.

At which she smiled, then with her hairs

And kisses, drying up his tears,

Alas! Said she, my wag, if this

Such a pernicious torment is;

Come, tell me then how great’s the smart

Of those thou woundest with your dart!  

.

(Tr: Robert Herrick) 

Anacreon 

582- 485 BC 

Greek Poet 

Poem Courtesy:

https://archive.org/details/anthologyofworld0000vand/page/263/mode/1up

నిజమైన ఉపవాస దీక్ష… రాబర్ట్ హెర్రింగ్, ఇంగ్లీషు కవి

వంటగది శుభ్రంచేసుకుని
సామాన్ల జాబితా కుదించి
మాంసం,తినుబండారాలను తగ్గించడమా
ఉపవాసదీక్ష అంటే?

మాంసపు రుచులు
విడిచిపెట్టి
కంచాన్ని
చేపలతో నింపడమా?

లేక, కొన్నాళ్ళు తిండి మానేసి,
కండకోల్పోయి చర్మంవేలాడేలా సుక్కి
నీరసంతో తలవాల్చుకుని
విచారించడమా?

ఎంతమాత్రం కాదు! నీ కంచంలోని
అన్నమూ, మాంసమూ
ఆకొన్న మరొక జీవికి
అందించడం ఉపవాసమంటే.

అక్కరలేని మతవివాదాలనుండి
ఏనాటివో, తరగని చర్చలనుండి
వాటివల్ల కలిగే ద్వేషాన్నుండి
జీవితాన్ని త్రుంచి విముక్తంచెయ్యడం. 

విచారమగ్నమైన హృదయంతో
భోజనసామగ్రికి బదులు
చేసే పాపాల్ని తగ్గించుకోవడం
ఉపవాసదీక్షవహించడం అంటే!
.

రాబర్ట్ హెర్రిక్

24 ఆష్టు 1591 – 15 అక్టోబర్ 1674

ఇంగ్లీషు కవి.

.

.

A True Lent

.

Is this a fast,—to keep 

    The larder lean,       

        And clean   

From fat of veals and sheep?

 

Is it to quit the dish              

    Of flesh, yet still       

        To fill

The platter high with fish?   

 

Is it to fast an hour,     

    Or ragg’d to go,               

        Or show      

A downcast look, and sour? 

 

No! ’t is a fast to dole   

    Thy sheaf of wheat, 

        And meat,           

Unto the hungry soul. 

 

It is to fast from strife, 

    From old debate      

        And hate,—

To circumcise thy life.          

 

To show a heart grief-rent;   

    To starve thy sin,     

        Not bin,—   

And that ’s to keep thy Lent.

.

Robert Herrick

24 August 1591 – buried 15 October 1674

English Poet

The World’s Best Poetry.

Eds: Bliss Carman, et al. 

Volume IV. The Higher Life.  1904.

VI Human Experience

Poem Courtesy: https://www.bartleby.com/360/4/180.html

అనంతం… రాబర్ట్ హెర్రిక్, ఇంగ్లీషు కవి

ఓ వయసా! కాలమా! శలవు!
చూడండి, నేను నిష్క్రమిస్తున్నాను.
నేను వెళ్ళబోయేచోట మాత్రం
శాశ్వతంగా ఉంటానని తెలుసు.  

నా ఈ నేత్రాలు
త్రి కాలాలూ  ఎలా
ఈ సువిశాల అనంతత్వంలో
కొట్టుకుపోయాయో చూడగల్గుతాయి.

అక్కడ చంద్రబింబం
నక్షత్రాల్ని  శాసించదు; బదులు,
రాత్రితో పాటే, ఆమెకూడా
అంతులేని వెలుగులో మునకలేస్తుంది.

.

రాబర్ట్ హెర్రిక్

24 August 1591 – 15 October 1674

ఇంగ్లీషు కవి

.

 

.

Eternitie

.

O Yeares! and Age! Farewell  

Behold I go,       

Where I do know        

Infinitie to dwell. 

And these mine eyes shall see        

All times, how they     

Are lost i’ th’ Sea       

Of vast Eternitie. 

Where never Moone shall sway       

The Starres; but she,          

And Night, shall be     

Drown’d in one endlesse Day.

.

Robert Herrick

24 August 1591 – 15 October 1674

English Poet

 

Poem Courtesy:

The Oxford Book of English Mystical Verse. 1917.

Eds. Nicholson & Lee

ప్రిమ్రోజ్ … రాబర్ట్ హెర్రిక్, ఇంగ్లీషు కవి

“నాకెందుకు పూలలో యువరాణివంటి

అందమైన కుసుమాన్ని పంపిస్తున్నా?”వని అడుగు

“మంచుముత్యం జతచేసిన ఈ

ప్రిమ్రోజ్ ని ఎందుకు పంపుతున్నా?”వని అడుగు

నీ చెవుల్లో రహస్యంగా చెబుతాను:

ప్రేమలోని తియ్యదనంలో కన్నీళ్ళుగూడా కలగలిసి ఉంటాయని.

“ఈ పువ్వెందుకు పసిడివర్ణంలో ఉన్నా

అంత దీనంగా వాడిపోయినట్టుందేమిటి? అని అడుగు.

“ఈ తొడిమ ఎందుకు బలహీనంగా ఉండి

వంగిపోయినా, రాలిపోవడం లేదేమి?” అని అడుగు

నే బదులు చెబుతాను: అవి ప్రేమికునిలో

అణగారుతున్న ఆశలు ఎలా ఉంటాయో గ్రహిస్తున్నాయని.

.

రాబర్ట్ హెర్రిక్

( నామకరణం 24 ఆగష్టు 1591 –  15 అక్టోబరు 1674)

ఇంగ్లీషు కవి

.

Robert Herrik

.

The Primrose

.

Ask me why I send you here        

This sweet Infanta of the yeere?     

Ask me why I send to you  

This Primrose, thus bepearl’d with dew?  

I will whisper to your eares,                  

The sweets of love are mixt with tears.       

 

 

Ask me why this flower does show

So yellow-green and sickly too?      

Ask me why the stalk is weak        

And bending, yet it doth not break?                 

I will answer, these discover           

What fainting hopes are in a lover.

.

Robert Herrick

(baptised 24 August 1591 – buried 15 October 1674)

English Poet and a Cleric

 

Poem Courtesy:

Parnassus: An Anthology of Poetry. 1880.

Compiled by: Ralph Waldo Emerson, (1803–1882).

http://www.bartleby.com/371/48.html

కన్యలకి… సమయముండగానే మేలుకొమ్మని… రాబర్ట్ హెర్రిక్, ఇంగ్లీషు కవి

మీరు గులాబిమొగ్గలు ఏరుకుంటే ఏరుకున్నారు కానీ

ఈ ముసలినక్క కాలం పరిగెడుతూంటుంది. జాగ్రత్త.

ఇవాళ చిరునవ్వులు చిందించే ఈ పువ్వే

రేపు ఉదయానికి వాడి రాలిపోతుంది.


అద్భుతమైన ఆకాశ దీపం, సూరీడు,

వాడు నెత్తిమీదకొస్తున్నకొద్దీ

వాడి పరుగు ముగియబోతుంది,

అస్తమయానికి దగ్గరౌతాడు.


ఏ వయసులో అయితే యవ్వనం, రక్తం

వేడిగా ఉంటాయో అదే ఉత్తమమైనది,

ఒకసారి ఖర్చుపెట్టేసేక, వెనక వచ్చేవి

గడ్డురోజులూ, అంతకంటే గడ్డురోజులూ.


అందుకే, సిగ్గుపడొద్దు. కాలం సద్వినియోగం చేసుకొండి

అవకాశం వస్తే, తొందరగా ఒకింటివాళ్లవండి;

ఎందుకంటే, ఒకసారి మీ మిసమిసలు పోతే

ఇక జీవితాంతం నిరీక్షించవలసిందే.

.

రాబర్ట్ హెర్రిక్

(baptized 24 August 1591 – buried 15 October 1674)[

ఇంగ్లీషు కవి.

.

Robert_Herrick_Hesperides - the title pafe of ...
Robert_Herrick_Hesperides – the title pafe of the book (Photo credit: Wikipedia)

.

To Virgins, to Make Much of Time

.

Gather ye rosebuds while ye may,
Old time is still a-flying
And this same flower that smiles today
Tomorrow will be dying.

The glorious lamp of heaven, the sun,
The higher he’s a-getting,
The sooner will his race be run,
And nearer he’s to setting.

That age is best which is the first,
When youth and blood are warmer;
But being spent, the worse, and worst
Times still succeed the former.

Then be not coy, but use your time,
And, while ye may, go marry;
For, having lost but once your prime,
You may forever tarry.

Robert Herrick
(baptized 24 August 1591 – buried 15 October 1674)
English Poet

(Poem Courtesy: http://wonderingminstrels.blogspot.in/)
You can also see the poems of Herrick in this link:
http://www.luminarium.org/sevenlit/herrick/herribib.htm

మనసుకో విన్నపం … రాబర్ట్ హెర్రిక్, ఇంగ్లీషు కవి

నేనో చిన్నపాటి పాపం కూడా చెయ్యకూడదా?

ఎందుకు నువ్వు వెంటనే చిత్రగుప్తుడిలా చిఠా రాస్తావు?

ఒక చిన్న తియ్యని పాపం చేస్తాను

నువ్వు చూసీచూడనట్టు ఊరుకోవా?

నే చెయ్యబోయే సున్నితమైన అపరాథం

ఎవరికీ అనుమానం రాకుండా కప్పిపుచ్చుతాను

ఎంత చీకటి తెర వేస్తానంటే, నే చేసే పాపం

నరమానవుడి కంటికి కనిపించదు.

వివేకవంతుల కళ్ళు బహుమతులతో మూసుకుంటాయి,

లంచంతో ఇతర సాక్షుల్ని తూర్పారబట్టవచ్చు,

ఓ నోరులేని నిశిరాత్రి, విశృంఖలంగా తిరగడానికి

నీ పెన్నూ, ఇంకూ పక్కనబెట్టి

ఏమీ రాయకుండా చూడడానికి

బంగారంతో నీ నోరు మూయించలేనా?

.

సాధ్యపడదూ?… సరే. అయితే చేసేదేముంది?

అయితే, ఇకపై తప్పుదారిలో సంచరించనని

భవిష్యత్తుపై ఆనవేసి చెబుతున్నాను. అప్పుడు

నీకుగాని, యమధర్మరాజుకిగాని భయపడక్కరలేదు.

.

రాబర్ట్ హెర్రిక్

(24 August 1591 – buried 15 October 1674)

ఇంగ్లీషు కవి

.

ఈ కవితలో మంచి చమత్కారాలున్నాయి. ముఖ్యమైన విషయం ఇది 17వ శాతాబ్దపు కవి వ్రాసినది. అప్పట్లోనే  “వివేకవంతుల కళ్ళు బహుమతులతో మూసుకుంటాయి; సాక్షుల్ని లంచంతో తూర్పారబట్టవచ్చు ” అనడంలో అవినీతికి చాలా వయసుందనీ, అది వయసుతోపాటు బలపడటమే తప్ప బలహీనం కావటం లేదనీ తెలుస్తోంది. అంతేకాదు, బంగారానికి కూడ లొంగని మనసు ఉన్నవాడు అటు యముడికి కూడా భయపడక్కరలేదు అని సందేశాన్నిచాలా సున్నితంగా చెప్పేడు. ఇక్కడ బంగారం ప్రసక్తి చాలా ముఖ్యమైనది. అన్నిప్రలోభాలలోకంటే, బంగారం ప్రలోభం పెద్దది. “మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమోనమః” అన్నది ఊరికే రాలేదు. కన్నతల్లికీ, బిడ్దలకీ శత్రుత్వం తేగల శక్తి బంగారానికి ఉన్నది. ఈ సందర్భంలో కొందరు హిరణ్యం అంటే బంగారం కానక్కరలేదు, ఏ నాణెమైనా కావొచ్చు అనుకోవచ్చు. 1605 వరకూ బ్రిటనులో  అంతెందుకు, మనదేశం బ్రిటిషువాళ్ళు పరిపాలించేరోజుల్లో కూడా,బంగారు నాణేలు చలామణీలో ఉండేవి. అది సావెరీను(Sovereign). అందులో 113 వీసాల బంగారం ఉండేదని వికిపీడియా ఉవాచ.

.

English: Robert Herrick (baptized 24 August 15...
English: Robert Herrick (baptized 24 August 1591 – buried 15 October 1674[1]) was a 17th century English poet. (Photo credit: Wikipedia)

.

To His Conscience

.

Can I not sin, but thou wilt be

My private protonotary?

Can I not woo thee, to pass by

A short and sweet iniquity?

I’ll cast a mist and cloud upon

My delicate transgression,

So utter dark, as that no eye

Shall see the hugg’d impiety.

Gifts blind the wise, and bribes do please

And wind all other witnesses;

And wilt not thou with gold be tied,

To lay thy pen and ink aside,

That in the mirk and tongueless night,

Wanton I may, and thou not write?

–It will not be:And therefore, now,

For times to come, I’ll make this vow;

From aberrations to live free:

So I’ll not fear the judge, or thee.

.

Robert Herrick

24 August 1591 – buried 15 October 1674

 English poet.

(Poem Courtesy: http://www.eliteskills.com/c/1884)

పొరపాట్లలో ఆనందం … రాబర్ట్ హెర్రిక్, ఇంగ్లీషుకవి.

.

English: Robert Herrick (baptized 24 August 15...
English: Robert Herrick (baptized 24 August 1591 – buried 15 October 1674[1]) was a 17th century English poet. (Photo credit: Wikipedia)

ధరించిన ఉడుపులలో తమాషా తికమకలు,

మనలో రగిగించే కొంత కొంటెతనం    

.

మన ఏకాగ్రతని భగ్నం చేసే

భుజాలు దిగిపోయిన వస్త్రాలు

.

అక్కడక్కడ  తప్పిపోయిన లేసు

ఎర్రని జాకెట్టుకి కలిగించే ఆకర్షణ

.

మరిచిపోయిన ముంజేతి చొక్కామడతకి

అటూ ఇటూ ఊగే అక్కడకట్టిన రిబ్బన్లు 

.

గాలికి రెపరెపలాడే పరికిణీలో,

చూసితీరాల్సిన జయకేతనపు విసురులు 

.

నాగరికత ఉట్టిపడే నెక్ టై కట్టిన అతనే   

అశ్రధ్ధగా వదిలేసిన షూ లేసు

.

ఏ లోపంలేకుండా కళాత్మకంగా ఉండేవాటికన్నా

ఇలాంటివే నా మనసు వశపరుచుకుంటాయి .

.

 రాబర్ట్ హెర్రిక్, 

 1591–1674

 ఇంగ్లీషుకవి.

ఈ కవితని చదివే ముందు, కవికాలాన్ని గుర్తించడం చాలా అవసరం. ఆ రోజుల్లో ఎక్కడా పొరపాటులేకుండా వేసుకునే వస్త్రధారణ వారి నాగరికతనీ, అంతస్థునీ సూచించేది. అందుకని వాళ్ళు బహుశ ఈ వేషధారణలో అతిగా ప్రవర్తించేవారేమో! అటువంటి “అసహజమైన లేదా కృతకమైన ” పధ్ధతులకి విసిగిపోయిన ఒక కవి స్పందనగా దీన్ని భావించవచ్చు.  దీనికి ప్రతిస్పందనగా రాబర్ట్ బ్రౌనింగ్  బెన్ జాన్సన్(Ben Jonson)  రాసిన కవిత ఒకటి ఉంది. అది రేపు ప్రచురిస్తాను.  పైన చెప్పిన వాటిలో ఎక్కడా అశ్లీలత లేదు. అప్పటి వస్త్రధారణ గురించి స్మక్షిప్తంగా తెలియజేస్తాయి అంతే!  కట్టుబాట్లపట్ట, వాటిలోని “అతి” పట్ల ఒక రకమైన నిరసన మాత్రమే దీని మనం తీసుకో వచ్చు.     

.

Delight in Disorder

.

A sweet disorder in the dress  

Kindles in clothes a wantonness;

A lawn about the shoulders thrown

Into a fine distraction;

An erring lace, which here and there

Enthrals the crimson stomacher;

A cuff neglectful, and thereby

Ribands to flow confusedly;

A winning wave, deserving note,

In the tempestuous petticoat;

A careless shoe-string, in whose tie

I see a wild civility:

Do more bewitch me, than when art

Is too precise in every part.

.

Robert Herrick

English Poet

1591–1674

(Note:

Lawn: A fine linen or cotton fabric, used for clothing.

Stomacher: A richly ornamented garment covering the stomach and chest, worn by both sexes in the 15th and 16th centuries, and later worn under a bodice by women.)

To  Read about Robert Herrick pl. visit: http://en.wikipedia.org/wiki/Robert_Herrick_(poet)

Poem Courtesy: http://www.poetryfoundation.org/poem/176697

%d bloggers like this: