అనువాదలహరి

హైలా సెలయేరు… రాబర్ట్ ఫ్రాస్ట్, అమెరికను

జూన్ నెలకి మా సెలయేటి పరుగూ, సంగీతమూ పల్చబడతాయి
ఆ తర్వాత దాని కోసం ఎంత గాలించినా,
ఎక్కడో భూగర్భంలో కనీ కనిపించకుండా పారడమో
(హైలా తనతో బాటే నెలరోజుల క్రిందటివరకూ
మంచులో గంటలుకొట్టుకుంటూ పరిగెత్తే బళ్ళలా
పొగమంచులో నినదించిన పాదప, జీవజాలాన్ని తీసుకుపోతుంది)
లేదా దాని నీళ్ళు పలచబడుతున్న కొద్దీ పెరిగిన
కలుపుమొక్కలతో నిండి, గాలికి ఇట్టే కొట్టుకుపోయే
బలహీన మొక్కలతో మలుపువరకూ సాగుతుంది.
ఇప్పుడు ఆ సెలయేటి గర్భంలో రంగు వెలసిన
కాగితంలా ఎండుటాకులు అతుక్కుని ఉన్నాయి
అది బాగా ఎరిగున్న వారికి తప్ప సెలయేరులా కనిపించదు.
ఐనా, గలగల పారుతూ ధ్వనించే సెలయేళ్ళకు మల్లే
దీనిని కూడా అంత అపురూపంతోనూ చూస్తారు.
మనకు ప్రియమైనవి యథాతథంగా ఇష్టపడడం సహజం
.
రాబర్ట్ ఫ్రాస్ట్

(March 26, 1874 – January 29, 1963)

అమెరికను కవి

 .

Iamge Courtesy: http://upload.wikimedia.org

.

Hyla Brook

By June our brook’s run out of song and speed.

Sought for much after that, it will be found

Either to have gone groping underground

(And taken with it all the Hyla breed

That shouted in the mist a month ago,

Like ghost of sleigh bells in a ghost of snow)—

Or flourished and come up in jewelweed,

Weak foliage that is blown upon and bent,

Even against the way its waters went.

Its bed is left a faded paper sheet

Of dead leaves stuck together by the heat—

A brook to none but who remember long.

This as it will be seen is other far

Than with brooks taken other where in song.

We love the things we love for what they are.

.

Robert Frost

(March 26, 1874 – January 29, 1963)

American Poet

Poem Courtesy:

http://www.poemtree.com/poems/HylaBrook.htm

దాస్యమూ- స్వాతంత్య్రమూ… రాబర్ట్ ఫ్రాస్ట్, అమెరికను కవి

రెండుచేతులతో పెనవేసుకుని కొండలతో సహా నిలబడడానికీ,
భయాన్ని దూరంగా ఉంచడానికీ, గదిలో గది,
గదిలో గదిగా, ప్రేమకి నేల ఆసరా ఉంది
కానీ ఊహకి అలాంటి అవసరమేమీ లేదు,
ఎందుకంటే దానికి భయమెరుగని రెండు రెక్కలున్నాయి.

మంచులోనూ, ఇసుకలోనూ, పచ్చికమీదా
నేను ప్రేమ విడిచిన పదముద్రలు చూశాను
ప్రపంచపు బిగికౌగిటిలో అవి ఉక్కిరిబిక్కిరి అవుతూ…
ప్రేమ అంటే అదే, దానికి అలా ఉండడమే ఇష్టం.
కానీ ఊహకి కాళ్ళు ఒకచోట నిలువవు.

ఊహ తారానివహాలమధ్యనున్న చీకట్లు చీలుస్తూ
రాత్రల్లా “సిరియస్” నక్షరూపురేఖలే గమనించగలదు,
ప్రతి పండ్లచెట్టుమీదా ముగ్గిన ఫలాల ఘుమఘుమలతో
తొలిసంజవెలుగులు తన ఆలోచనలని వెనక్కి మరలించేదాకా
తిరిగి సూర్యుడు తన రాత్రిగృహం చెరుకునేదాకా.

ఆకాసాన్ని పరిశీలించడం వల్ల వచ్చేలాభాలు వాటికవే.
కానీ, కొందరు దానికి బానిసలై ప్రేమే గొప్పని
ఉన్నచోటనే ఉండి అన్నీ పొందడానికి ప్రయత్నిస్తారు.
అందమైన ఊహలు అనేకం విహరించడంవల్ల కలిగే లాభం
ఏ ఒక్క నక్షత్రానికో అంటిపెట్టుకున్నదానికంటే ఎక్కువ.
.
రాబర్ట్ ప్రాస్ట్
(March 26, 1874 – January 29, 1963)
అమెరికను కవి.

Robert Frost

 

Image Courtesy: 

http://upload.wikimedia.org 

.

Bond and Free

.

Love has earth to which she clings

With hills and circling arms about—

Wall within wall to shut fear out.

But Thought has need of no such things,

For Thought has a pair of dauntless wings.

On snow and sand and turf, I see

Where Love has left a printed trace

With straining in the world’s embrace.

And such is Love and glad to be.

But Thought has shaken his ankles free.

Thought cleaves the interstellar gloom

And sits in Sirius’ disc all night,

Till day makes him retrace his flight,

With smell of burning on every plume,

Back past the sun to an earthly room.

His gains in heaven are what they are.

Yet some say Love by being thrall

And simply staying possesses all

In several beauty that Thought fares far

To find fused in another star.

Robert Frost

(March 26, 1874 – January 29, 1963)

American Poet

Poem courtesy:

http://www.poemtree.com/poems/BondAndFree.htm

ఎడ్వర్డ్ థామస్ స్మృతిలో … రాబర్ట్ ఫ్రాస్ట్, అమెరికను కవి

నీ కవితలు గుండెమీదపెట్టుకుని నిద్రలోకి జారుకున్నాను
అలా పేజీలు తెరిచి ఉంచి, అర్థాంతరంగా విడిచిపెట్టి,
సమాధిమీది చిత్రంలోని పావురాయి రెక్కల్లా
నిద్రలోనైనా అవి మనిద్దరినీ కలుపుతాయేమోనని.

నేను జీవించి ఉండగా తప్పిపోయిన అవకాశం మరి రాదు
కొంచెం ఆలస్యమైనప్పటికీ నిన్ను నేను కలుసుకుంటాను
ముందుగా నువు సైనికుడివి, తర్వాత కవివి, తర్వాత రెండూను,
నీ జాతిలో సైనిక-కవిగా మరణించింది నువ్వే.

నా ఉద్దేశ్యమూ, నీ ఉద్దేశ్యమూ కూడా మనిద్దరిమధ్యా
ఏ దాపరికాలూ ఉండకూడదన్నది; సోదరా, ఇదొకటి మిగిలిపోయింది—
మరొక విషయం, ఆ తర్వాత అడక్కూడనిదొకటుంది
విజయం సాధించి కోల్పోయినదెంత, గెలిచినదెంత?

ఆ వైమీ(Vimy) పర్వతశ్రేణి మీద ఫిరంగిగుండు విరజిమ్మే అగ్నిని
హత్తుకుందికి వెళ్ళావు నువ్వు; నువ్వు రాలిపోయిన ఆ రోజు
నాకంటే నీకే యుద్ధం ముగిసినట్టనిపించింది,
ఇప్పుడు దానికి భిన్నంగా నీకంటే, నాకే ముగిసినట్టనిపిస్తోంది.

అయినా, శత్రువు రైన్ నది దాటి యుద్ధాన్ని
ప్రమాదకరంగా ఈవలకి పొడిగించాడని ఎరిగిన నేను
ఆ విషయం నీకు ఒకవేళ చెప్పకూడదనుకున్నా,
కనీసం, నా మాటలతో నిన్ను సంతోషపెట్టవద్దూ?
.
రాబర్ట్ ఫ్రాస్ట్
(March 26, 1874 – January 29, 1963)
అమెరికను కవి .

Iamge Courtesy: http://upload.wikimedia.org

.

To E. T.

.

I slumbered with your poems on my breast 

Spread open as I dropped them half read through       

Like dove wings on a figure on a tomb      

To see, if, in a dream they brought of you,

I might not have the chance I missed in life        

Through some delay, and call you to your face   

First soldier, and then poet, and then both,        

Who died a soldier-poet of your race.       

I meant, you meant, that nothing should remain 

Unsaid between us, brother, and this remained—                

And one thing more that was not then to say:    

The Victory for what it lost and gained.    

You went to meet the shell’s embrace of fire      

On Vimy Ridge; and when you fell that day       

The war seemed over more for you than me,              

But now for me than you—the other way.

How over, though, for even me who knew

The foe thrust back unsafe beyond the Rhine,    

If I was not to speak of it to you      

And see you pleased once more with words of mine?

 .

Robert Frost

(March 26, 1874 – January 29, 1963)

American Poet

First published in : The Yale Review, April 1920

Read about Edward Thomas here;

https://www.writersinspire.org/content/edward-thomas-biography

Poem Courtesy:

http://www.bartleby.com/273/106.html 

కలలోని బాధ.. రాబర్ట్ ఫ్రాస్ట్, అమెరికను కవి

 

.

నేను అడవిలోకి మరలిపోయాను, నా గీతం

చెదరగొట్టబడిన ఆకులతోపాటు చెల్లాచెదరైపోయింది.

ఆ అడవి అంచులకి ఒకసారి నువ్వు వచ్చేవు.

(ఇది నా కల) వచ్చి చూసి చాలసేపు ఆలోచనలోపడ్డావు.

కోరిక బలంగా ఉన్నా, లోపలికి అడుగుపెట్టలేదు.

“ధైర్యం చాలడంలేదు, అతని అడుగులు చాలదూరం దారితప్పేయి…

అతని తప్పు సరిచేసుకుంటె అతనే నన్ను కోరుకుంటాడు”

అన్నట్టు వ్యాకులంగా ఉన్న నీ తలను అయిష్టంగా తాటించేవు.

 

ఏంతో దూరం లేదు, చాలా దగ్గరగానే నిలబడి ఇదంతా గమనించేను

చెట్లమాటున గుబురుగా పెరిగిన చిట్టిపొదల వెనకనుండి.

నిన్ను పిలవలేకపోయానే అన్న తియ్యని బాధ దిగమింగుకోవలసివచ్చింది

నిను చూశానని నీతో చెప్పాలన్నకోరిక ఇప్పటికీ విడిచిపెట్టదు.

నేనక్కడ దూరంగా ఒంటరిగా ఉన్నానన్నది అసత్యం,

అడవి మేల్కొనడం, నువ్విక్కడ ఉండడమే దానికి నిదర్శనం.

.

Robert Frost

March 26, 1874 – January 29, 1963

అమెరికను కవి

 

Iamge Courtesy: http://upload.wikimedia.org
Iamge Courtesy: http://upload.wikimedia.org

 

A Dream Pang

 

I had withdrawn in forest, and my song

Was swallowed up in leaves that blew away;

And to the forest edge you came one day

(this was my dream) and looked and pondered long,

But did not enter, though the wish was strong:

You shook your pensive head as who should say,

“I dare not–too far in his footsteps stray–

He must seek me would he undo the wrong.”

 

Not far, but near, I stood and saw it all,

Behind low boughs the trees let down outside;

And the sweet pang it cost me not to call

and tell you that I saw does still abide.

But ’tis not true that thus I dwelt aloof,

For the wood wakes, and you are here for proof.

 

 

Robert Frost

March 26, 1874 – January 29, 1963

American Poet

 Poem Courtesy: http://wonderingminstrels.blogspot.in/2003/06/dream-pang-robert-frost.html

 

తుఫాను భయం… రాబర్ట్ ఫ్రాస్ట్, అమెరికను కవి

చీకటిలో గాలి మామీద కక్ష గట్టినట్టు వీస్తూ

తూర్పువైపు గది కిటికీని

మంచుతో బాదుతూ,

తన అరుపుల్ని నిగ్రహించుకుని

“ఒరే పిరికిపందా! రారా బయటికి”

అని గుసగుసలాడినట్టు అనిపిస్తుంది.

బయటికి వెళ్లకుండా ఉండడానికి పెద్దగా విచికిత్స అవసరం లేదు.

అబ్బే! లాభం లేదు. 

నా బలాబలాలు బేరీజు వేసుకుంటాను

మేమిద్దరం, ఒక బిడ్డ.

మాలో నిద్ర రానివాళ్ళం దగ్గరగామునగదీసుకుని

ఒకపక్క పొయ్యిలో నిప్పు నెమ్మదిగా ఆరిపోతుంటే

మరోపక్క చలి ఎలా మెల్లిగా పాకురుతుంటుందో గమనిస్తుంటాం.

తుఫాను గాలి ఎలా తెరలు తెరలుగా వీస్తుంటే

ఏ ఆటంకాలూ లేని వీధితలుపుకీ రోడ్డుకీ మధ్య మంచుపేరుకుపోయి

దగ్గరగా ఉందని ధైర్యమిచ్చే ధాన్యంకొట్టంకూడా ఎక్కడో ఉందనిపిస్తుంది.

నా మనసులో ఒక సందేహం కలుగుతుంది:

“అసలు రేపు మేము ఉదయాన్నే లేచి

ఎవరిసాయమూ లేకుండా మమ్మల్ని మేము రక్షించుకోగలమా?” అని.

.

రాబర్ట్ ఫ్రాస్ట్

March 26, 1874 – January 29, 1963

అమెరికను కవి

Iamge Courtesy: http://upload.wikimedia.org
Iamge Courtesy: http://upload.wikimedia.org

Storm Fear

When the wind works against us in the dark,

And pelts with snow

The lower chamber window on the east,

And whispers with a sort of stifled bark,

The beast,

“Come out! Come out!”—

It costs no inward struggle not to go,

Ah, no!

I count our strength,

Two and a child,

Those of us not asleep subdued to mark

How the cold creeps as the fire dies at length—

How drifts are piled,

Dooryard and road ungraded,

Till even the comforting barn grows far away,

And my heart owns a doubt

Whether ’tis in us to arise with day

And save ourselves unaided.

Robert Frost

March 26, 1874 – January 29, 1963

American Poet

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/125.html

నవంబరు అతిథి… రాబర్ట్ ఫ్రాస్ట్, అమెరికను

ఆమె నా పక్కన ఉంటే, నా సంగతి ఏమి చెప్పను

ఈ చెట్లు ఆకులు రాల్చే చీకటిరోజులే

రోజులు ఎలాఉండాలో చాటే గొప్ప రోజులంటుంది;

మోడువారి ఎండిపోయిన చెట్లంటే ఆమెకు ఇష్టం;

చిత్తడిగాఉండే పచ్చికదారులంట నడుస్తుంది.  

ఆమె సంతోషం నన్ను నన్నుగా ఉండనీదు

ఆమె మాటాడుతూ ఉంటుంది, నేను తృప్తిగా వింటూంటాను;

పక్షులెగిరిపోయినందుకు ఆమెకు సంతోషం

ఆమె ధరించిన సాదా గోధుమరంగు ఉన్ని వస్త్రము

అంటుకున్న మంచుతో వెండిలా మెరుస్తున్నందుకు ఆనందం.  

ఈ నిర్మానుష్యపు ఒంటరి వృక్షాలూ

మసకబారిన నేలా, మేఘావృతమైన ఆకాశమూ

ఆమె కనులారా చూసే ఈ అందాలన్నీ

చూడగల హృదయం నాకు లేదనుకుంటుంది.

అందుకే నాకు చిరాకు వేస్తుంది.  

ఈ నవంబరు నెలలోని బోసి అందాలను

మంచుకురవడం ప్రారంభం కాకముందు

చూడడం నేను నిన్ననే కొత్తగా తెలుసుకోలేదు

కాని ఆ విషయం ఆమెకి చెప్పి ప్రయోజనం లేదు

ఆమె పొగిడితే వాటికి వచ్చిన నష్టం ఏమీ లేదు.

.

రాబర్ట్ ఫ్రాస్ట్

అమెరికను

 

Iamge Courtesy: http://upload.wikimedia.org
Iamge Courtesy: http://upload.wikimedia.org

.

My November Guest

 .

My Sorrow, when she’s here with me,

  Thinks these dark days of autumn rain

Are beautiful as days can be;

She loves the bare, the withered tree;

  She walks the sodden pasture lane.

Her pleasure will not let me stay.

  She talks and I am fain to list:

She’s glad the birds are gone away,

She’s glad her simple worsted grey

  Is silver now with clinging mist.

The desolate, deserted trees,

  The faded earth, the heavy sky,

The beauties she so truly sees,

She thinks I have no eye for these,

  And vexes me for reason why.

Not yesterday I learned to know

  The love of bare November days

Before the coming of the snow;

But it were vain to tell her so,

  And they are better for her praise.

.

Robert Frost

American poet

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/123.html

 

యాభై ఏమిటి చెబుతోంది… రాబర్ట్ ఫ్రాస్ట్, అమెరికను కవి

నేను చిన్నగా ఉన్నప్పుడు నా  అధ్యాపకులందరూ  ముసలివాళ్ళు

నా  ఉత్సాహం నీరుకారిపోయేదాకా అర్థాన్ని వదిలి పదాలకోసం ప్రాకులాడేను,

కరిగించిన లోహంలా ఎలా పోతపోస్తే అలా తయారయ్యాను.

నేను బడికి వెళ్ళి వయోజనుడనై అంతా గతంగురించి నేర్చుకున్నాను

ఇప్పుడు నేను ముసలివాడిని, కానీ, నా గురువులు పిల్లలు.

ఒక మూసలోపొయ్యడానికి ఒదగనివి స్వయంగా ఫలించి, ఎదుగుతాయి;

ఎలా అతుకులువెయ్యాలా అని నేను పాఠాలతో సతమతమౌతున్నాను

ఇప్పుడు బడికి వెళుతున్నది పిల్లలనుండి భవిష్యత్తు నేర్చుకుందికి.

.

రాబర్ట్ ఫ్రాస్ట్

(March 26, 1874 – January 29, 1963

అమెరికను కవి

.

Iamge Courtesy: http://upload.wikimedia.org
Iamge Courtesy: http://upload.wikimedia.org

.

What Fifty Says

.

When I was young my teachers were the old.

I gave up fire for form till I was cold.

I suffered like a metal being cast.

I went to school to age to learn the past.

Now when I am old my teachers are the young.

What can’t be molded must be cracked and sprung.

I strain at lessons fit to start a suture.

I got to school to youth to learn the future.

.

Robert Frost

(March 26, 1874 – January 29, 1963

American Poet

పసిఫిక్ తీరంలో ఒకసారి… రాబర్ట్ ఫ్రాస్ట్, అమెరికను కవి

విరిగిన అల పెద్ద చప్పుడుచేసుకుంటూ బిందుతెర వేసింది.

పెద్ద కెరటాలు వెనక్కి తిరిగిచూశాయి తమని అనుసరిస్తున్నవాటిని,

మునుపెన్నడూ నీరు తీరానికి చెయ్యనిది

ఏదో చెయ్యాలని సంకల్పించుకున్నాయి.

ఆకాశంలో మేఘాలు దిగువగా కేశాల్లా వేలాడుతున్నాయి

కళ్ళవెలుగులకి అడ్డంగా తారాడుతున్న ముంగురుల్లా

మనం ఆ మాట అనలేము గానీ, అలా అనిపిస్తోంది

తీరం అదృష్టవంతురాలే, పెద్దకొండదన్నుగా ఉందని.

ఆ కొండకి భూఖండం దన్నుగా ఉంది;

రాత్రి ఏదో ఉపద్రవం రాబోతోందనిపిస్తోంది,

రాత్రి ఒక్కటే కాదు, బహుశా ఒక యుగం కావొచ్చు.

అందరూ దాని ఆగ్రహానికి సిద్ధపడడం మంచిదేమో!

దేవుడు “వెలుగు నశించుగాక” అని అనబోయే ముందు

సముద్రపు నీరు ముంచెత్తడానికి మించి ఏదో జరుగుతుంది.

.

రాబర్ట్ ఫ్రాస్ట్

March 26, 1874 – January 29, 1963

అమెరికను కవి.

.

Robert Frost   March 26, 1874 – January 29, 1963

  Robert Frost  

.

Once by the Pacific

 .

 The shattered water made a misty din.

 Great waves looked over others coming in,

 And thought of doing something to the shore

 That water never did to land before.

 The clouds were low and hairy in the skies,

 Like locks blown forward in the gleam of eyes.

 You could not tell, and yet it looked as if

 The shore was lucky in being backed by cliff,

 The cliff in being backed by continent;

 It looked as if a night of dark intent

 Was coming, and not only a night, an age.

 Someone had better be prepared for rage.

 There would be more than ocean-water broken

 Before God’s last ‘Put out the Light’ was spoken.

.

Robert Frost

March 26, 1874 – January 29, 1963

American Poet

Poem Courtesy: http://wonderingminstrels.blogspot.in/2002/01/once-by-pacific-robert-frost.html

బుజ్జి పిట్ట … రాబర్ట్ ఫ్రాస్ట్

bird at piano lesson with rock

.

రోజల్లా మా ఇంటిపక్కనే కూస్తున్న

ఒక పిట్టని తరిమేద్దామనుకున్నాను

.

ఇక ఎంతమాత్రం భరించలేననుకున్నాక

ద్వారం దగ్గరనిలబడి చప్పట్లుకొట్టేను

.

నాలో కూడ కొంతలోపం ఉంది ఉండాలి

అది పాడుతోందంటే దాని లోపం కాదు

.

అసలు ఆ మాటకొస్తే, ఏ పాటనైనా

అణచివెయ్యాలనుకోవడంలోనే ఏదో లోపం ఉంది

.

రాబర్ట్ ఫ్రాస్ట్

.

(ఎంతో అమాయకంగా కనిపిస్తున్న ఈ కవితలో ఒక అద్భుతమైన సందేశం ఉంది. ఏ పాటనైనా అణచివేయాలనుకోడం లోనే ఏదో లోపం ఉంది… అన్నది.

లోపాలని ఎత్తిచూపిస్తూ చిన్న కార్టూనులుగీసినా సహించలేని మనపాలకుల అసహనాన్ని ఈ నేపథ్యంలో చూడండి. ఈ కవితలో తాత్త్విక సందేశం ఎంత సున్నితంగా చెప్పబడిందో. ప్రజాస్వామ్యం అడ్దుపెట్టుకుని నియంతలు  పాలకులైతే విమర్శలు జీర్ణించుకోలేరు. అధికారం పోవడం తట్టుకోలేరు. కనుక వాళ్ళకి వ్యతిరేకంగా ఎంత చిన్న స్వరం వినిపించినా దాన్ని అణచివెయ్యాలని ప్రయత్నిస్తారు. If self-pity is hallmark of villainy, impatience is the hallmark of tyranny ప్రజాస్వామ్యాన్ని ప్రజలే  పరిరక్షించుకోవాలి… తమవారసులకి బానిసత్వం రాకుండా చూసుకోడానికి.) 

Robert Frost
Robert Frost (Photo credit: Boston Public Library)

.

A Minor Bird

.

I have wished a bird would fly away,

And not sing by my house all day;

.

Have clapped my hands at him from the door

When it seemed as if I could bear no more.

.

The fault must partly have been in me.

The bird was not to blame for his key.

.

And of course there must be something wrong

In wanting to silence any song.

.

Robert Frost

మంచుకురుస్తున్న సాయంత్రం… ఊరికి దూరంగా… రాబర్ట్ ప్రాస్ట్.

.

ఈ కళ్ళాలు* ఎవరివో నాకుతెలుసుననుకుంటున్నాను,
అయితే, అతని ఇల్లుమాత్రం ఊర్లోనే ఉంది;
అతను నేనిక్కడ ఆగడంగాని,
అతని తోటనిండా మంచు పరుచుకోడం గాని చూడలేడు.

ఈ ఏడాదిలోనే ఇంతచీకటి ఎరుగని సాయంత్రవేళ
గడ్డకట్టుకుపోయిన సరస్సుకీ
ఈ కళ్ళాలకీ మధ్య ఏ ఖండ్రికా లేనిచోట
ఆగిపోవడం నా చిన్ని గుర్రానికి వింతగా తోచవచ్చు

దాని జీరాకి తగిలించిన చిరుగంటలు ఒకసారి మోగిస్తూ
సంజ్ఞచేసింది పొరపాటున ఆగలేదుగదా అన్నట్టు.
ఇక్కడ వినిపిస్తున్న ఇతర శబ్దమేదైనా ఉందంటే, అది
చల్లగా వీస్తున్న గాలిదీ, నెమ్మదిగా కురుస్తున్న మంచుదీ.

ఈ తోపులు  చీకటిగా, అందంగా, గంభీరంగా ఉన్నై
కాని నేను నెరవేర్చవలసినవి చాలా ఉన్నాయి
నిద్రించేలోగా మైళ్ళు నడవాల్సి ఉంది
మరణించేలోగా చాలా చెయ్యాల్సి ఉంది

.

*విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లొ, ఊరికి దూరంగా పొలాల మధ్యలో పంటనూర్చుకుందికీ దాచుకుందికీ, పశువుల్ని కట్టడానికి పాకలువేసి, అప్పుడప్పుడు మనుషులు కూడా ఉండడానికీ ఉండే జాగాలని కళ్ళాలు (కళ్ళం +లు)  అంటారు.

Robert Frost, 1913.

రాబర్ట్ ప్రాస్ట్.

(ఈ కవితలో ప్రత్యేకత అది చాలా సరళంగా కనిపిస్తూనే అందించే తాత్త్విక సందేశం. దాన్ని ఎవరి మానసిక ప్రవృత్తినిబట్టి వాళ్లకిష్టమైన రీతిలో అన్వయించుకోవచ్చు. మనిషికి ప్రకృతిలో తన ఉనికిని మరిచిపోయేలా పరవసిస్తూ ఉండాలనిపిస్తుంది. అలా కట్టిపడివేయగల వస్తువులు చాలా ఉంటై. ఇది స్వకీయం. కాని తను నెరవేర్చవలసిన బాధ్యతలుకూడా పట్టిలాగుతుంటాయి.  అది పరకీయం. జీవితం  ఈ రెండింటి మధ్య సంఘర్షణలోనూ,  సమతౌల్యంలోనే ఉంది.  మనిషి మట్టిగా మాత్రమే మిగలకూడదు. )

.

Stopping by Woods on a Snowy Evening

.

Whose woods these are I think I know.
His house is in the village, though;
He will not see me stopping here
To watch his woods fill up with snow.

My little horse must think it queer
To stop without a farmhouse near
Between the woods and frozen lake
The darkest evening of the year.

He gives his harness bells a shake
To ask if there is some mistake.
The only other sound’s the sweep
Of easy wind and downy flake.

The woods are lovely, dark, and deep,
But I have promises to keep,
And miles to go before I sleep,
And miles to go before I sleep.
.

Robert Frost

(March 26, 1874 – January 29, 1963)

American Poet.

With a seemingly simple narration and words, Frost essentially conveys the conflict between the things that a man wants for himself and the things he has to oblige or discharge, and the subtle ultimate message that man’s obligations take precedence over his personal pleasures.

[This is one of the early poems of Robert Frost. The poem was inspired by a real life incident. That was a very difficult winter in New Hampshire that year. Frost was returning home after an unsuccessful trip at the market. That he did not have enough to buy Christmas presents for his children, overwhelmed Frost with depression and he stopped his horse at a bend in the road in order to cry. After a few minutes, the horse shook the bells on its harness, and Frost was cheered enough to continue home. ]

%d bloggers like this: