అనువాదలహరి

నా ప్రియమిత్రుడు, జాన్ ఏండర్సన్, రాబర్ట్ బర్న్స్, స్కాటిష్ కవి

ప్రియ మిత్రమా, జాన్ ఏండర్సన్,

మనిద్దరికి తొలిసారి పరిచయమైనపుడు

నీ జుత్తు ఎంత కారునలుపుగా ఉండేదని,

ఒత్తైన నీ కనుబొమలు గోధుమరంగులో ఎంతో తీరుగా ఉండేవి;


కానీ జాన్, ఇప్పుడు ఆ కనుబొమలు పల్చబడ్డాయి,


నీ జుత్తు బాగా తెల్లబడింది;


ప్రియ మిత్రమా, జాన్ ఏండర్సన్,


నీకు అనేకానేక ఆశీస్సులు.


ప్రియ మిత్రమా, జాన్ ఏండర్సన్,


మనిద్దరం కొండ కలిసి ఎక్కేవాళ్ళం

ఎన్నో ప్రకాశవంతమైన రోజుల్ని

ఇద్దరం ఒకరికొకరు తోడుగా గడిపేం, గుర్తుందా,

కానీ, జాన్ ఇక మన అడుగులు తడబడక తప్పదు,

అయినా, చేతిలో చెయ్యి వేసుకుని నడుద్దాం లే,

ఇద్దరం కలిసే ఈ కొండ మొగల్లో నిద్రిద్దాం


ప్రాణ మిత్రమా, జాన్ ఏండర్సన్, సరేనా?

.

రాబర్ట్ బర్న్స్


25 January 1759 – 21 July 1796


స్కాటిష్ మహాకవి


.

English: Robert Burns Source: Image:Robert bur...
English: Robert Burns Source: Image:Robert burns.jpg Replacement of existing commons image with higher res version (Photo credit: Wikipedia)

.

John Anderson, my Jo

.

John Anderson, my jo, John,
When we were first acquent,
Your locks were like the raven,
Your bonnie brow was brent;
But now your brow is beld, John,
Your locks are like the snow;
But blessings on your frosty pow,
John Anderson, my jo!

John Anderson, my jo, John,
We clamb the hill thegither;
And monie a canty day, John,
We’ve had wi’ ane anither:
Now we maun totter down, John,
But hand in hand we’ll go,
And sleep thegither at the foot,
John Anderson, my jo.

.

Robert Burns

25 January 1759 – 21 July 1796

Scottish Poet

 

నేను చనిపోయిన పిదప… రాబర్ట్ బర్న్స్, స్కాటిష్ కవి

నేను చనిపోయిన పిదప స్పందనలేని ఈ మట్టిమీద

ఆడంబరానికి, లేని దుఃఖాన్ని ప్రదర్శించవద్దు;

బ్రతికున్నప్పుడు నేను ప్రేమించిన నా మిత్రులందరూ

ఒక కన్నీటిబొట్టు వదిలి, నా భార్యాబిడ్డల్ని ఓదార్చొచ్చు.

 

నేను చనిపోయిన పిదప అపరిచితుల్ని పక్కనుండి పోనీండి.

నా దేశ దిమ్మరి జీవితం గూర్చి హర్షించడానికిగాని

అవమాంచడానికిగాని ఎందుకూ, ఎలా  అన్నప్రశ్నలడగనీయొద్దు.

ఆశాశ్వతమైన కీర్తి కుసుమాల్ని నాపై వేయనీయొద్దు. 

 

నేను చనిపోయిన పిదప హత్యాసదృశంగా విమర్శించిన నాలుక

అంతవరకు నాగూర్చిచెప్పిన అబద్ధాలన్నిటినీ మరిచిపోయి

అది చేసిన దాఋణమైన తప్పులన్నిటినీ సరిదిద్దడానికి

వెగటుకలిగేలా రాయడమో, పొగుడుతూ పాడటమో చెయ్యొచ్చు.

 

నేను చనిపోయిన పిదప ప్రపంచానికి వచ్చే నష్టం ఏమిటి?

ఎప్పటిలాగే అంతులేని దాని గోలలో అది కొట్టుకుంటుంది.

ప్రతివ్యక్తీ జీవనక్రీడలో అలా నిస్సత్తువగా కాళ్ళీడ్చుకుంటూ

ఈ మైదానం నుండి కీర్తినో, దైవాన్నో చేరుకుందికి నిష్క్రమించవలసిందే. 

 

నేను చనిపోయిన పిదప, ఒక వివేకి తన కీర్తి కోసం

నా అస్థికలు ఒక ఉద్యానంలోనో, పట్టణంలోనో పదిలపరచొచ్చు;

ఒకప్పుడు నేను రొట్టెకోసం అలమటించినపుడు లేదన్నా, హతాసుడనై

చలువగమ్మి, గతాసువునైనపుడు చలువరాతి సమాధి కట్టొచ్చు.   

.

రాబర్ట్ బర్న్స్2

5 January 1759 – 21 July 1796

స్కాటిష్ మహాకవి

Robert Burns inspired many vernacular writers ...
Robert Burns inspired many vernacular writers across the Isles with works such as Auld Lang Syne, A Red, Red Rose and Halloween. (Photo credit: Wikipedia)

WHEN I AM DEAD.

.

When I am dead, let no vain pomp display

A surface sorrow o’er my pulseless clay,

But all the dear old friends I loved in life

May shed a tear, console my child and wife.


When I am dead, let strangers pass me by.

Nor ask a reason for the how or why

That brought my wandering life to praise or shame.

Or marked me for the fading flowers of fame.


When I am dead, the vile assassin tongue

Will try and banish all the lies it flung

And make amends for all its cruel wrong

In fulsome prose and eulogistic song.


When I am dead, what matters to the crowd.

The world will rattle on as long and loud,

And each one in the game of life shall plod

The field to glory and the way to God.


When I am dead, some sage for self-renown

May urn my ashes in some park or town.

And give, when I am cold and lost and dead,

A marble shaft where once I needed bread !

.

Robert Burns

25 January 1759 – 21 July 1796

Scottish National Poet.

ప్రేమా – నవ్వూ … రాబర్ట్ బర్న్స్ స్కాటిష్ మహా కవి.

నువ్వు నవ్వితే ప్రపంచం నీతో నవ్వుతుంది;
నువ్వుఏడిస్తే, నువ్వొక్కడివే ఏడవాలి;
ఈ పురాతనమైన నేల సంతోషం ఎరువుతెచ్చుకోవాలి
ఎందుకంటే, దానికి చాలినన్ని దుఃఖాలు దానికి ఉన్నాయి;

గొంతెత్తి పాడిచూడు, కొండలు ప్రతిధ్వనిస్తాయి,
అదే నిట్టూర్పు విడిచి చూడు, గాలిలో కలిసిపోతుంది.
ప్రతిధ్వనికూడా, ఆనందాన్ని సంతోషంగా నినదిస్తుంది
ఆలనాపాలనా చెప్పాలంటేనే, నోరుమెదపదు.

నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు ఉంటారు స్నేహితులు మెండు;
అదే దుఃఖిస్తూ ఉండు, ఒక్కడు ఓదార్చేవాడుండడు;
మధురమైన మదిరని పంచుతాను అను, వద్దనేవాడుండడు;
కన్నీళ్ళు దిగమింగుకోవాల్సివస్తే, ఒట్టుకి ఒక్కడుండడు తోడు.

ఆనందోత్సాహాల మేళాలలో
బారులుతీరిమరీ మనుషులు నిల్చుంటారు
బాధల గడప నడవలోనుండి మాత్రం
ఒకరి వెంట ఒకరు నెమ్మదిగా జారుకుంటారు

విందు చెయ్యి, మనుషులు కిక్కిరిసిపోతారు
ఉపవాసం చెయ్యి, ప్రపంచం పక్కనుంచి పట్టనట్టుపోతుంది;
బాగుపడి, పంచుకో…  ప్రపంచం నిను బతకనిస్తుంది
అదే చస్తున్నాను మొర్రో అను, ఏమాత్రం చేయూత అందించదు

ఉల్లాసంగా ఉండు… మనుషులు నీ స్నేహం కోరుకుంటారు
బాధలలో ఉండు, ముఖం చాటేస్తారు
అందరికీ నీ ఆనందంలో సమపాలు కావాలి
ఎవ్వరికీ నీ కష్టంలో వాటా అక్కరలేదు.

.

రాబర్ట్ బర్న్స్

స్కాటిష్ మహా కవి

.

Robert_Burns
Robert_Burns (Photo credit: Wikipedia)

.
Love and Laughter.
.
Laugh, and the world laughs with you;
Weep, and you weep alone;
This grand old earth must borrow its mirth,
It has troubles enough of its own.
Sing, and the hills will answer;
Sigh, it is lost on the air;
The echoes bound to a joyful sound
But shrink from voicing care.
Be glad, and your friends are many;
Be sad, and you lose them all;
There are none to decline your nectared wine,
But alone you must drink life’s gall.
.
There is room in the halls of pleasure
For a long and lordly train,
But one by one we must all file on
Through the narrow aisles of pain.
Feast, and your halls are crowded ;
Fast, and the world goes by;
Succeed and give, ’twill help you live;
But no one can help you die.
Rejoice, and men will seek you;
Grieve, and they turn and go
They want full measure of all your pleasure.
But they do not want your woe !
.
Robert Burns

మానసిక క్షోభతో … రాబర్ట్ బర్న్స్

Image Courtesy: http://4.bp.blogspot.com

.

ఓ పరమాత్మా!

నీవెవ్వరో నా కగమ్యగోచరం.

కానీ, నీకీ సృష్టిలో జరిగేవన్నీ

నీకు తెలుసుననే నమ్ముతున్నాను.

.

ఈ జీవుడు దీనుడూ, దుఃఖితుడై

 నీ మ్రోల నిలబడ్డాడు

ఈ హృదయాన్ని దొలిచే ఆవేదనలు

నీ ఆనతి వినా జరగవని నమ్ముతున్నాడు

.

అయితే, శర్వశక్తిమయా! నువ్వు

కోపంవలననో, నిర్దయతోనో ఇలా చేశావనుకోను.

ప్రభూ! అలసిన నా కనుల కన్నీరైనా తుడు

లేదా, శాశ్వతంగా మూసుకునేలా వరమివ్వు!

.

లేదూ, నీ చర్యల వెనుక ఏదో

నిగూఢ రహస్యం దాగున్నదంటే

నిగ్రహించడానికీ, నిర్విచారంగా మనడానికీ

ఈ హృదయానికి తగిన సంకల్పబలాన్నివ్వు!

.

Image Courtesy: http://upload.wikimedia.org

రాబర్ట్ బర్న్స్

(25 January 1759 – 21 July 1796)

రబ్బీ బర్న్స్ అనీ, స్కాట్లండ్ అభిమాన పుత్రుడనీ, రైతుకవి అనీ, స్కాట్లండు జాతీయకవిగా కీర్తించబడే, రాబర్ట్ బర్న్స్ మంచి కవీ, గేయ రచయితా. రొమాంటిక్ మూమెంట్ ఆద్యులలో ఒకడుగా కీర్తింపబడే బర్న్స్, స్వేఛ్ఛా వాదులకీ, సమసమాజము  కాంక్షించే వాళ్ళకీ గొప్ప ప్రేరణ. స్కాట్లండు లోనూ, స్కాటిష్ జాతీయులందరిచే ప్రపంచ వ్యాప్తంగానూ, వారి సాంస్కృతిక  ప్రతినిధిగా గుర్తింపబడి, స్కాటిష్ సాహిత్యం మీద అపారమైన ప్రభావం చూపించగలిగిన ప్రతిభాశాలి. స్వయంగా జానపద గీతాలు వ్రాయడమే గాక, స్కాట్లండు అంతా తిరిగి కొన్ని అపురూపమైన ప్రాచీన జానపద గీతాలు సేకరించి, సంకలించేడు.  A man is a man for all that; Tam o’ Shanter, To A Mouse అన్నవి అతనికి చాలా కీర్తి ప్రతిష్ఠలు తెచ్చి పెట్టిన కవితలలో కొన్ని.

.

Under The Pressure Of Violent Anguish

.

O Thou Great Being! what Thou art,
Surpasses me to know;
Yet sure I am, that known to Thee
Are all Thy works below.

Thy creature here before Thee stands,
All wretched and distrest;
Yet sure those ills that wring my soul
Obey Thy high behest.

Sure, Thou, Almighty, canst not act
From cruelty or wrath!
O, free my weary eyes from tears,
Or close them fast in death!

But, if I must afflicted be,
To suit some wise design,
Then man my soul with firm resolves,
To bear and not repine!

.

Robert Burns

(25 January 1759 – 21 July 1796)
%d bloggers like this: