సేవ… రాబర్ట్ బ్రౌనింగ్, ఇంగ్లీషు కవి
(ఈ రోజు రాబర్ట్ బ్రౌనింగ్ 205 వ జన్మదినం.)
అన్ని సేవలూ భగవంతుని దృష్టిలో సమానమే
ఇప్పుడు నడిచినా, ఒకప్పుడు నడిచినా
అతను మన నేలమీద నడిస్తే స్వర్గమే.
మనందరం అతనెలా అనుకుంటే అలాగే పనిచెయ్యగలం
మనలో గొప్పవాళ్ళైనా, నీచులైనా తోలుబొమ్మలమే
ఇందులో ఒకరు ఉత్తములూ, ఒకరు అధములూ లేరు.
“చిన్న సంఘటన” అనొద్దు. “చిన్న” దేమి?
ఇంతకంటే ఎక్కువ బాధ కలగాలా?
ఇంతకంటే ఏదో పెద్ద సంఘటన జరగాలన్నట్టు?
ప్రభూ! జీవితంగా చుట్టుకునే
కర్మల దారపు కండెనుండి వేరు చెయ్యి.
ప్రతిపనిలో, పురి ఎక్కువో తక్కువో అవుతుంది.”
.
Pippa Passes నుండి
రాబర్ట్ బ్రౌనింగ్
(7 May 1812 – 12 December 1889)
ఇంగ్లీషు కవి.
రాబర్ట్ బ్రౌనింగ్ కవితల్లో చెప్పిన దాని కంటే చెప్పనిది ఎక్కువ ఉంటుంది. అతను చెప్పినదాంట్లోంచే చెప్పని దానికి
సూచనకూడా ఉంటుంది.
రెండవ పద్యం చూడ్డానికి భావం వెంటనే స్ఫురించదు. జీవితమనే దారపు కండె మనం చేస్తున్న పనుల హెచ్చుతగ్గుల
బట్టి (పురి) పేనుకుంటుంది. ఎక్కువ పురి ఉన్న దారం శ్రేష్ఠమైనదైతే, తక్కువ పురి ఉన్న దారం త్వరగా పోతుంది. ఈ
జీవిత చక్రం మనం చేసే కర్మలబట్టి ఏదో ఫలితం ఇస్తూనే ఉంటుంది. ఎప్పుడూ సున్న కాదు. మనకి ఈ చక్రంలోంచి
విముక్తి ఉండదు. దానినే కవి అర్థిస్తున్నాడు.)
.
.
Service
All service ranks the same with God:
If now, as formerly he trod
Paradise, his presence fills
Our earth, each only as God wills
Can work—God’s puppets, best and worst,
Are we; there is no last nor first.
Say not “a small event”! Why “small”?
Costs it more pain than this, ye call
A “great event,” should come to pass,
Than that? Untwine me from the mass
Of deeds which make up life, one deed
Power shall fall short in or exceed!
.
Robert Browning
(7 May 1812 – 12 December 1889)
English Poet
Poem Courtesy:
The World’s Best Poetry.
Eds. Bliss Carman, et al
Volume IV. The Higher Life. 1904.
III. Faith: Hope: Love: Service
ఎదురుచూపు… రాబర్ట్ బ్రౌనింగ్, ఇంగ్లీషు కవి
(ఈ కవిత తన భార్య ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్ మృతి సందర్భంగా 1861లో వ్రాసినది.)
మృత్యువంటే భయపడుతునానా? గొంతులో చల్లదనం ప్రారంభమై
ముఖాన్ని చలిగాలి తాకి,
మంచు పేరుకోడం ప్రారంభమై, ఈదురుగాలులు వీస్తున్నాయంటే
నేను ఆ ప్రదేశానికి చేరువయ్యానన్న మాట.
రాత్రి చూడబోతే బలీయము, విరుచుకుపడుతోంది తుఫాను
పట్టవలసింది శత్రు స్థావరం
అక్కడ భయంకరమైన శత్రువు కంటికెదురుగా నిలిచిన్నప్పటికీ
సాహసికుడు ముందుకు పోక తప్పదు
ప్రయాణం ముగిసింది, శిఖరం చేతికందింది,
సరిహద్దులు కూలిపోయాయి
బహుమతి చేతికి చిక్కే వరకూ పోరాడవలసి ఉన్నా, కడకి
అన్నిపోరాటాలకీ అదే బహుమతి
నేను నిత్య పోరాట యోధుణ్ణి— ఇది మరొక్క పోరాటం
చివరదీ, అన్నిటిలోకి మిన్న ఐనదీ
మృత్యుభయం కళ్ళకు గంతలు కట్టి, నిర్వీర్యం చేసి,
నామీద పెత్తనం చెలాయించడం నాకు నచ్చదు;
లాభం లేదు. దాని అంతు చూడవలసిందే, పూర్వపు వీరుల్లా
నా సహచరుల్లా పోరాడవలసిందే.
ముందుండి ఎదుర్కోవాలి, ఒక్క నిముషంలో జీవితంలోని
వేదనల, నిరాశల, నిర్లిప్తతల బాకీలు చెల్లించాలి
ధీరులకి పరిస్థితి ఒక్కసారిగా విషమించడమే మంచిది,
చివరి ఘడియ ఎంతసేపో ఉండదు
ప్రకృతిశక్తులు ముమ్మరమై, అంతవరకూ ఉత్సాహపరచిన
మిత్రుల మాటలు పలచనై, గాలిలో కలిసి
ఆగిపోతాయి. బాధలలోంచి మొదట నిష్కృతి లభిస్తుంది,
వెనువెనకనే ఒక వెలుగు; తర్వాత గుండె ఆగుతుంది.
ఓ నా ప్రాణంలో ప్రాణమా! నేను నిన్ను మళ్ళీ హత్తుకుంటాను
తక్కినది అంతా పరమాత్మలోనే!
.
రాబర్ట్ బ్రౌనింగ్
ఇంగ్లీషు కవి.
.
Prospice*
.
Fear death? — to feel the fog in my throat,
The mist in my face,
When the snows begin, and the blasts denote
I am nearing the place,
The power of the night, the press of the storm,
The post of the foe;
Where he stands, the Arch Fear in a visible form,
Yet the strong man must go:
For the journey is done and the summit attained,
And the barriers fall.
Tho’ a battle’s to fight ere the guerdon be gained,
The reward of it all.
I was ever a fighter, so — one fight more,
The best and the last!
I would hate that death bandaged my eyes, and forebore,
And bade me creep past.
No! let me taste the whole of it, fare like my peers
The heroes of old,
Bear the brunt, in a minute pay glad life’s arrears
Of pain, darkness and cold.
For sudden the worst turns the best to the brave,
The black minute’s at end,
And the elements’ rage, the friend-voices that rave,
Shall dwindle, shall blend,
Shall change, shall become first a peace out of pain,
Then a light, then thy breast,
O thou soul of my soul! I shall clasp thee again,
And with God be the rest.
.
(Note: Prospice in Latin means “Looking Forward”)
Robert Browning
7 May 1812 – 12 December 1889
English Poet and Playwright
నిశాసమాగమము … రాబర్ట్ బ్రౌనింగ్, ఇంగ్లీషు కవి
.
విభూతిరంగులో సముద్రం, నీలివర్ణంలో సుదీర్ఘమైన నేల;
దిగంతాల అంచున పసుపురంగులో అర్థచంద్రబింబం;
నిద్రలో జడుసుకుని లేచినట్టు ఉవ్వెత్తుగా ఎగసి
వడివడిగా చిన్నచిన్న వృత్తాల్లో పరిగెడుతున్న అలలు.
నావలో నేను ఒడ్దుసమీపించి, ఉప్పుటేరుని కలిసి,
దాని అలసటతీర్చడానికి పర్రలో లంగరు వేశాను
.
సంద్రపువాసనవేస్తూ మైలుపొడవు వెచ్చని తీరం;
కళ్ళం చేరడానికి ఇంకా దాటవలసిన మూడు పొలాలు;
కిటికీఅద్దం మీద నెమ్మదిగా తట్టిన ఒక తట్టు,
తత్తరగా గీచిన అగ్గిపుల్లచప్పుడు, ఒక్కసారిగా లేచిన నీలిమంట,
ఒకదానికై ఒకటి కొట్టుకుంటునే రెండుగుండెలసవ్వడికన్నా
నెమ్మదిగా, భయోద్వేగాలతో పెల్లుబుకుతున్న నోటిమాట.
.
రాబర్ట్ బ్రౌనింగ్,
(7 May 1812 – 12 December 1889)
ఇంగ్లీషు కవి, నాటక కర్త.
.

.
Meeting At Night
.
The gray sea and the long black land;
And the yellow half-moon large and low
And the startled little waves that leap
In fiery ringlets from their sleep,
As I gain the cove with pushing prow,
And quench its speed i’ the slushy sand.
Then a mile of warm sea-scented beach;
Three fields to cross till a farm appears;
A tap at the pane, the quick sharp scratch
And blue spurt of a lighted match,
And a voice less loud, through its joys and fears,
Than the two hearts beating each to each!
,
Robert Browning .
English poet and Dramatist
For a very brief but an excellent biography please visit: http://www.victorianweb.org/authors/rb/rbbio.html
Related articles
- that’s nice. (sea-jen.typepad.com)
- Less Is More (thegoodbadme.wordpress.com)
- Tuesday Poetry Blogging (thefirstdark.wordpress.com)
- Great Love Poems – Life In A Love by Robert Browning (lugenfamilyoffice.com)
- However high you aim, try not to look down (thetimes.co.uk)