అనువాదలహరి

వాడిన పువ్వులనూ ప్రేమించాను… రాబర్ట్ బ్రిడ్జెస్, ఇంగ్లీషు కవి

నేను వాడిన పువ్వులనూ ప్రేమించాను
వాటి మార్మిక హృదయమందిరాల్లో
అశాశ్వతమైన తీయని సుగంధాలతో
వైవిధ్యభరితమైన రంగులు జతగూడుతాయి
అవి ప్రేమయాత్రలకు ఉద్దీపనాలు
కంటికెదురుగా కనిపించే ఆర్ద్రప్రేమ సంకేతాలు.
క్షణంలో వయసుమీరుతాయి.

వాటిని ఆహ్వానించడానికి  భయంతో
నీరుగారిపోతున్న ఆకాశ వేదికని
తమ సమ్మోహకరమైన సుగంధాలు
నింపకముందే, అంతరించే గాలుల్ని ప్రేమించాను.
హృదయ కాంక్షను వ్యక్తపరిచిన
విస్ఫులింగాలబోలిన రాగరంజిత స్వరాలు
పలుచనై, శాశ్వతంగా కనుమరుగవుతాయి.
నా గీతికకూడా అటువంటి వాయుతరంగమైపోవాలి.

ఓ నా గేయమా! నువ్వుకూడా గాలిలా పతనమవు!
కుసుమంలా వాడి వడలిపో!
పూసెజ్జలాంటి మృత్యువుకి భయపడకు
వాయు లీనపు మృత్యువుకి బెదరకు.
ఆనందంగా విహరించు, ఇక్కడినుండి ఎగసిపో!
నీది ప్రేమలోని మాధుర్యాన్ని గ్రహించే పారీణత
అంతిమయాత్రకు సిద్ధమౌతున్న నిన్ను చూసి
అందం ఒక కన్నీటిచుక్క వదులుతుందిలే!
.
రాబర్ట్ బ్రిడ్జెస్

(23 October 1844 – 21 April 1930)

ఇంగ్లీషు కవి

.

.

I Have Loved Flowers That Fade

.

I have loved flowers that fade,

Within whose magic tents

Rich hues have marriage made

With sweet unmemoried scents:

A honeymoon delight,

A joy of love at sight,

That ages in an hour

My song be like a flower!.

I have loved airs that die

Before their charm is writ

Along a liquid sky

Trembling to welcome it.

Notes, that with pulse of fire

Proclaim the spirit’s desire,

Then die, and are nowhere

My song be like an air!.

Die, song, die like a breath,

And wither as a bloom;

Fear not a flowery death,

Dread not an airy tomb!

Fly with delight, fly hence!

‘Twas thine love’s tender sense

To feast; now on thy bier

Beauty shall shed a tear.

.

Robert Bridges

(23 October 1844 – 21 April 1930)

British Poet

Poem Courtesy: http://www.famousliteraryworks.com/bridges_i_have_loved_flowers_that_fade.htm

 

చీకటి చిక్కబడుతోంది… రాబర్ట్ బ్రిడ్జెస్, ఇంగ్లీషు కవి

పగలల్లా భీకరంగా ఎండ కాసి కాసి
సంధ్యవేళకి చీకటి చిక్కబడుతోంది,
గాలి ఎగరేస్తున్న కెరటాలకి, రాత్రి
భీకరంగా ఉంటుందని అర్థమయింది
దూరాన ఎక్కడో ఉరుము ఉరుముతోంది.

సముద్రపక్షికూనలు కొండల
శిఖరాగ్రాల అంచులపై ఎగురుతున్నాయి
అలవాటుగా ఇచ్చవచ్చినట్టు ఎగురుతూ
ఆనందంగా రెక్కలల్లార్చుతున్నాయి దిగడానికి
రెక్కలతెలుపు నీటితెలుపుతో కరిగిపోతూ

కనుచూపుమేరలో ఓడల జాడలేదు
సూర్యుడు ఇలా క్రిందకి గ్రుంకేడోలేదో
దట్టమైన మేఘాలు కూడబలుక్కున్నట్టు
దూరాన ఉదయించబోయే చంద్రుణ్ణి మూసేసేయి.
పాపం, వెర్రి ప్రేమికా! నువ్వు ఏకాకివి.

.

రాబర్ట్ బ్రిడ్జెస్

(23 October 1844 – 21 April 1930)

ఇంగ్లీషు కవి

.

Robert Bridges

.

The Evening Darkens Over

The evening darkens over
After a day so bright,
The windcapt waves discover
That wild will be the night.
There’s sound of distant thunder.

The latest sea-birds hover
Along the cliff’s sheer height;
As in the memory wander
Last flutterings of delight,
White wings lost on the white.

There’s not a ship in sight;
And as the sun goes under,
Thick clouds conspire to cover
The moon that should rise yonder.
Thou art alone, fond lover.

.

Robert Bridges

(23 October 1844 – 21 April 1930)

English Poet

విషాదము.. రాబర్ట్ బ్రిడ్జెస్, ఇంగ్లీషు కవి

వాంఛ అనే రోగము గడ్డురోజుల్లో

నిరాశతో కూడిన ఆలోచనలతో సతమతమౌతూ,

మనిషిని మరిచి, దేవుణ్ణి మెప్పించజూస్తుంది;

కానీ నిద్రలో కూడా విచారానికి మందు కనిపెట్టలేదు.

ఒకప్పుడు కలలుగనడంతో పాటు, తెగువకీ,

గొప్ప పేరుప్రతిష్ఠలకీ అవకాశమిచ్చిన ‘సంశయత ‘

ఇప్పుడు చుక్కలు పొడవని చీకటిగా మారి

చలిరాత్రిలో భయంకరమైన అడ్డుగోడై నిలుస్తోంది.

మూర్ఖుడా! అసాధ్యమైన దానిని కోరుకున్న నువ్వు

ఇపుడు అసహనంతో ఊరికే నిరుత్సాహపడుతున్నావు. చూడు

సృష్టి ఏమీ మారకుండా ఎలా ఉందో. ఆనందం వివేకాన్ని హత్తుకుంది

నీ కంటికి కనిపించకపోయినా అందరికీ అందంగా కనిపిస్తోంది.

ఈ భూమి మీద ప్రేమా, సౌందర్యం, యవ్వనం హరించుకుపోలేదు:

అవి నిన్ను సంతోషపెట్టలేకపోతే, నువ్వు మరణించినట్టు లెఖ్ఖ.

.

రాబర్ట్ బ్రిడ్జెస్ 

23 October 1844 – 21 April 1930

ఇంగ్లీషు కవి

 

 

Robert Bridges

“Melancholia”

The sickness of desire, that in dark days

Looks on the imagination of despair,

Forgetteth man, and stinteth God his praise;

Nor but in sleep findeth a cure for care.

Incertainty that once gave scope to dream

Of laughing enterprise and glory untold,

Is now a blackness that no stars redeem,

A wall of terror in a night of cold.

Fool! thou that hast impossibly desired

And now impatiently despairest, see

How nought is changed: Joy’s wisdom is attired

Splended for others’ eyes if not for thee:

Not love or beauty or youth from earth is fled:

If they delite thee not, ’tis thou art dead. 

Robert Bridges 

23 October 1844 – 21 April 1930

English Poet

 

మనిద్దరిలో ఒకరు ముందు పోవలసినపుడు… రాబర్ట్ బ్రిడ్జెస్, ఇంగ్లీషు కవి

మనిద్దరిలో ఒకరు ముందు పోవలసినపుడు

అది నేనే కావాలని కోరుకుంటున్నాను,

ఎప్పటిలా ఇంటిలో హాయిగా ఉండు

అలా అయితేనే నే కోరుకున్నది జరుగుతుంది.

నా మనసుకూడా నీది చేసుకుని

నీ మోకాళ్ళమీద బిడ్డకి పాటపాడు,

లేదా, ఒంటరిగా నీలో నువ్వు

నీ కోసం రాసిన పాటలు చదువుకో.

.

రాబర్ట్ బ్రిడ్జెస్

23 October 1844 – 21 April 1930

ఇంగ్లీషు కవి

 

 

.

Robert Bridges

.

When Death to Either shall come

.

When Death to either shall come,  

  I pray it be first to me,—        

Be happy as ever at home,        

  If so, as I wish, it be.    

Possess thy heart, my own;               

  And sing to the child on thy knee,    

Or read to thyself alone  

  The songs that I made for thee.

.

Robert Bridges.

23 October 1844 – 21 April 1930

English Poet

Poem Courtesy:

The Oxford Book of English Verse: 1250–1900.

Ed: Arthur Quiller-Couch, 1919.

http://www.bartleby.com/101/840.html

%d bloggers like this: