తోటమాలి … రబీంద్రనాథ్ టాగోర్, భారతీయ కవి
ఈ రోజు రబీంద్రనాథ్ టాగోర్ 159 వ జన్మదిన వార్షికోత్సవం
నీకు అదే ఇష్టమనిపితే
నా పాటని ఇప్పుడే ఆపేస్తాను.
నీ గుండె ఉద్వేగానికి లోనవుతోందంటే
నీ ముఖంలోకి చూడడం విరమించుకుంటాను.
నడుస్తూ నడుస్తూ, ఆశ్చర్యంతో అడుగు తడబడితే
నేను ప్రక్కకి తొలగి, వేరే దారి చూసుకుంటాను.
పూదండ గ్రుచ్చుతూ తడబడుతున్నావంటే
అలికిడిలేని నీ తోటవంక కన్నెత్తైనా చూడను.
ఈ కొలనునీరు తుంటరిగా నీపైకి ఎగురుతోందంటే
ఈ ఒడ్డున నా పడవ నడపడమే మానుకుంటాను.
.
రబీంద్రనాథ్ టాగోర్
(7 May 1861 – 7 August 1941)
భారతీయ కవి

The Gardener
If you would have it so,
I will end my singing.
If it sets your heart aflutter,
I will take away my eyes from your face.
If it suddenly startles you in your walk,
I will step aside and take another path.
If it confuses you in your flower-weaving,
I will shun your lonely garden.
If it makes the water wanton and wild,
I will not row my boat by your bank.
.
Rabindranath Tagore
(7 May 1861 – 7 August 1941)
Indian Poet
Poem Courtesy: Contributed by Nirupama Ravindra
క్షణకాలపు లోలత్వం… రబీంద్రనాథ్ టాగోర్, భారతీయ కవి
ప్రభూ! నీ ప్రక్కన కూర్చునే క్షణకాలపు లోలత్వానికి అనుమతి ప్రసాదించు.
నే చేయవలసిన పనులని తర్వాత నెమ్మదిగా చక్కబెట్టుకుంటాను.
నీ వదనాన్ని వీక్షించక నా మనసుకి విశ్రాంతీ, ఉపశమనమూ లేవు,
దరిలేని శ్రమసాగరంలో నా పని అశ్రాంతశ్రమల ప్రోవు.
నిట్టూర్పులతో, మర్మరధ్వనులతో నా ప్రాంగణంలో అడుగుపెట్టిన ఈ వేసవి రోజున
నికుంజవిహారులు నెత్తావి పూలగుత్తులచుట్టూ తమకంతో నృత్తగీతాలాలపిస్తునాయి.
దొరికిన ఈ కొద్ది ప్రశాంత విశ్రాంతి సమయమూ, నీ ఎదురుగా, మౌనంగా
కూర్చుని, నా జీవితాన్ని నీకు అంకితం చేస్తూ లోలోన ఆలపించనీ! ప్రభూ!
.
రబీంద్రనాథ్ టాగోర్
7th May 1861 – 7th Aug 1941
భారతీయ కవి

.
A Moment’s Indulgence
.
I ask for a moment’s indulgence to sit by thy side. The works
that I have in hand I will finish afterwards.
Away from the sight of thy face my heart knows no rest nor respite,
and my work becomes an endless toil in a shoreless sea of toil.
Today the summer has come at my window with its sighs and murmurs; and
the bees are plying their minstrelsy at the court of the flowering grove.
Now it is time to sit quiet, face to face with thee, and to sing
dedication of life in this silent and overflowing leisure.
.
Rabindranath Tagore
7 May 1861 – 7 August 1941
Indian Poet
Poem Courtesy:
http://famouspoetsandpoems.com/poets/rabindranath_tagore/poems/2203
మేఘాలూ- కెరటాలూ…. రబీంద్రనాథ్ టాగోర్, భారతీయ కవి
అమ్మా, అమ్మా! మేఘాల్లో ఉండేవాళ్ళు నన్ను పిలుస్తారే
“మనం లేచిందగ్గరనుండి రోజు అంతమయ్యేదాకా ఆడుకుందాం
బంగారు ప్రభాతంతో ఆడుకుందాం, వెన్నెలబిళ్ళ చంద్రుడితోనూ ఆడుకుందాం,”అని
“మరి నేను అక్కడికి చేరేదెలా?” అని అడుగుతానే.
వాళ్ళు, “భూమి అంచుదాకా రా, ఆకాశానికి చేతులు చాచు,
నువ్వు వెంటనే మేఘాల్లోకి తీసుకుపోబడతావు,” అన్నారే.
“అమ్మో! మా అమ్మ నాకోసం ఇంటిదగ్గర ఎదురు చూస్తుంటుంది.
ఆమెను వదలి ఎలా రాను?” అని నే నన్నానే.
అప్పుడు వాళ్ళు నవ్వుకుంటూ తేలి పోయారే.
అమ్మా, నాకు అంతకంటే మంచి ఆట వచ్చు.
నే నేమో మేఘాన్నిట, నువ్వేమో చంద్రుడివట.
మన ఇంటి కప్పే ఆకాశమట.
నేను నిన్ను నా రెండు చేతులతో కమ్ముకుంటాను.
అమ్మా, అమ్మా! కెరటాల్లో ఉండేవాళ్లు నన్ను పిలుస్తారే.
“మనం ఉదయం నుండి రాత్రి దాకా పాటలు పాడుకుందాం.
ఉండీ ఉడిగీ మనం అలా తెలియనిచోట్లకి ప్రయాణిద్దాం,” అన్నారే.
నే నడిగాను, “మరి నేను మీతో జతగూడే దెలా?” అని.
వాళ్లన్నారూ, “నువ్వు సముద్రపొడ్డుకి వచ్చి కళ్ళు గట్టిగా మూసుకో,
నువ్వు కెరటాల మీంచి అలా తేలుతూ తీసుకుపోబడతావు,” అన్నారే.
నేనన్నాను, “అమ్మో! మా అమ్మ సాయంత్రం అయేసరికల్లా ఇంట్లో ఉండాలంటుంది.
ఆమెను వదిలి నేను ఎట్లా రాను?” అని.
వాళ్లు నవ్వుకుంటూ, తుళ్ళుకుంటూ, వెళ్ళిపోయారే.
నాకు అంతకంటే మంచి ఆట తెలుసు.
నేనేమో కెరటాన్నిట, నువ్వేమో వింత తీరానివిట.
నేనలా దొర్లుకుంటూ దొర్లుకుంటూ వచ్చి నీ ఒడిలో నవ్వుతూ వాలుతాను.
మనిద్దరం ఎక్కడున్నామో, ప్రపంచంలో ఇంకెవరికీ తెలీదు.
.
రబీంద్రనాథ్ టాగోర్
7 May 1861 – 7 August 1941
భారతీయ కవి.
Clouds and Waves
.
Mother, the folk who live up in the clouds call out to me-
“We play from the time we wake till the day ends.
We play with the golden dawn, we play with the silver moon.”
I ask, “But how am I to get up to you?”
They answer, “Come to the edge of the earth, lift up your
hands to the sky, and you will be taken up into the clouds.”
“My mother is waiting for me at home, “I say,
“How can I leave her and come?”
Then they smile and float away.
But I know a nicer game than that, mother.
I shall be the cloud and you the moon.
I shall cover you with both my hands,
and our house-top will be the blue sky.
The folk who live in the waves call out to me
“We sing from morning till night;
on and on we travel and know not where we pass.”
I ask, “But how am I to join you?”
They tell me,
“Come to the edge of the shore and stand with your eyes tight shut,
and you will be carried out upon the waves.”
I say, “My mother always wants me at home in the everything-
how can I leave her and go?”
They smile, dance and pass by.
But I know a better game than that.
I will be the waves and you will be a strange shore.
I shall roll on and on and on,
and break upon your lap with laughter.
And no one in the world will know where we both are.
.
Rabindranath Tagore
7 May 1861 – 7 August 1941
Indian Poet
స్నేహగీతం … టాగోర్
గతించిన మధురక్షణాల జ్ఞాపకాలు
ఎన్నడైనా మనస్మృతిపథం వీడగలవా?
స్వయంగా అనుభవించినవి; మన జీవనాడి;
అవి ఎన్నడు మరువగలం?
.
మిత్రమా! ఒక సారి మరలిరా!
వచ్చి నా జీవితాన్ని పంచుకో.
చిరునవ్వులూ, కన్నీళ్ళూకలబోసుకుందాం
అదొక తీపిగురుతుగా మిగుల్చుకుందాం
.
వేకువనే మనిద్దరం కలిసి పూలు కోసేవాళ్ళం
ఇద్దరం గంటలకొద్దీ ఉయ్యాలలూగేవాళ్ళం
వంతులువారీగా ఇద్దరం వేణువూదుకున్నాం
చెట్లనీడన పాటలు పాడుకున్నాం
.
మధ్యలో ఎప్పుడో విడిపోయాం
ఒకరి చిరునామా ఒకరికి తెలియకుండా.
మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా నాకెదురైతే
వింతగా చూడకు… రా! స్నేహాన్ని తిరిగి చిగురించు.
.
టాగోర్

.
The memories of the good old days
Can you ever forget it?
It was seen by our eyes, was voice of our life
Can it ever be forgotten?
.
Come back once more, my friend
Come and be a part of my life
We will talk of smiles and tears
And will feel very good about it
.
Together we have plucked flowers in the dawn
Together we have spent hours on the swing
Together we have played the flute
Sang the songs under the shade
We parted in between, never knew where we went
If again I see you someday,
Come and be a part of my life.
.
Tagore
(English Translation of the Poem courtesy: Usharani of maruvam.blogspot.com)
ప్రేమ తత్వం … Tagore
.

రాత్రి చూడబోతే నల్లగా ఉంది, ఈ అడవికా అంతు కనిపించదు;
లక్షలమంది మనుషులు లక్షలమార్గాల్లో వస్తూపోతూ ఉంటారు.
ప్రతివారికీ ఈ చీకటిలోనే తాము చేరవలసిన సంకేతస్థలాలుంటాయి
కానీ, ఆ కలయిక ఎక్కడో, ఎవరితోనో, ఎందుకోసమో మాత్రం తెలీదు.
అయితే, మనకో నమ్మకం ఉంది: ఏ క్షణంలో నైనా
పెదాలపై చిరునవ్వు చిందుతూ, మన జీవనభాగ్యరేఖ ఎదురౌతుందని
సువాసనలూ, శబ్దాలూ, స్పర్శలూ, పాటలపల్లవులూ
మనల్ని తాకుతూ, పులకింతలు కలిగిస్తూ పోతుంటాయి.
కాని ఒకసారి ఒక విద్యుల్లత మెరుస్తుంది; ఆ క్షణంలో
నాకెవరు ఎదురౌతారో వాళ్ళతో అమాంతం ప్రేమలో పడిపోతాను.
ఆ వ్యక్తితో “నా జీవితం ధన్యమైంది! నీ కోసమే
ఇంతదూరం నడిచివచ్చాను” అనిచెప్పి ఆనందభాష్పాలు రాలుస్తాను.
ఈ చీకటిలో అంతదగ్గరగానూ వచ్చి దూరమైపోయినవాళ్ళు
అసలు ఉన్నారో లేదోనన్న ఉనికి కూడా నాకు తెలీదు.
.
టాగోర్
.
On the Nature of Love
The night is black and the forest has no end;
a million people thread it in a million ways.
We have trysts to keep in the darkness, but where
or with whom — of that we are unaware.
But we have this faith — that a lifetime’s bliss
will appear any minute, with a smile upon its lips.
Scents, touches, sounds, snatches of songs
brush us, pass us, give us delightful shocks.
Then peradventure there’s a flash of lightning:
whomever I see that instant I fall in love with.
I call that person and cry: ‘This life is blest!
For your sake such miles have I traversed!’
All those others who came close and moved off
in the darkness — I don’t know if they exist or not.
— Rabindranath Tagore
చివరి కోరిక … రబీంద్రనాథ్ టాగోర్.

(విశ్వకవి రవీంద్రుని 151 వ జయంతి సందర్భంగా)
.
నన్ను ఇతరులు అడిగినవన్నీ, నే నివ్వలేకపోయాను.
అంతమట్టుకు నాకు తెలుసు.
నాకు ఎరికే…
నే చేసిన మోసాలూ, తీర్చని ఋణాలూ, నెరవేర్చని పనులూ.
ప్రపంచానికి నేను ఎంతో ఋణపడి ఉన్నాను.
మరయితే, ఇప్పుడెందుకు ఇవన్నీ చెబుతున్నట్టు?
సంధిపేలాపనా? పశ్చాత్తాపమా? కోరికతోనా? అవసరముకొద్దీనా?
నేను ప్రపంచం నుండి కోరుకునేవి చాలానే ఉన్నాయి.
మాటల్లోచెప్పలేని లాలసతో కోరుకుంటూనే ఉన్నాను.
కోరికలు నెరవేరని నిస్పృహలో, అవసరాలు తీరని నిరాశలో,
నేను శపిస్తుంటాను, ఏడుస్తుంటాను.
.
ప్రభూ! ఇక నేనీ శాపగ్రస్తమైన వాంఛలూ,
అంతులేని పశ్చాత్తాపాలూ కోరుకోవడం లేదు.
నా కోరికని హరించు… ఈ తృప్తిపరచలేని కాంక్షని హరించు.
ఓ ప్రభూ! నేను వేడుకుంటాను, నా దురాశని హరించు.
ఈ ఋణభారం రోజురోజుకీ బరువైపోతోంది.
స్వామీ! నేను ప్రమాణం చేస్తున్నాను. నిన్నింక ఏ కోరికలూ కోరను.
నేను నీ అన్వేషణ ఉపసంహరించుకుంటాను.
నన్ను నీకు సమర్పించుకున్న ప్రశాంత క్షణంలో
నేను నీ శరణుజొచ్చేనన్న విషయం తెలిసి
బహుశా, నీవే నాకడకు వస్తావన్న ఎరుకతో
నీకై నిరీక్షిస్తుంటాను.
.
రబీంద్రనాథ్ టాగోర్.
( 8th May 1861 – 7th Aug 1941)
.
Final Expectation
.
Those things that everyone asked of me
I could not give, this much I know.
I know of the deceits, the debts unpaid
The work undone. To the world I owe
So much. So why do I speak right now?
In delirium, in regret, in desire, in need?
Seems I still have so much to demand
From the world. I beg in wordless greed.
I curse, I cry, in desperate despair
From wants unfulfilled, from needs unmet
My lord, I really do not desire more
Of this cursed craving, this deep regret.
Kill my desire…this insatiable yearning
Kill my greed, ye lord, I implore
This burden of debt gets heavier by the day..
I promise my lord, I’d desire no more.
I will give up my pursuit of you, I’ll wait
Knowing that you will come to me
Perhaps in that moment of quiet submission
When you know that I have turned myself over to thee.
.
Rabindranath Tagore.
“Although Tagore wrote successfully in all literary genres, he was first of all a poet. Among his fifty and odd volumes of poetry are Manasi (1890) [The Ideal One], Sonar Tari (1894) [The Golden Boat], Gitanjali (1910) [Song Offerings], Gitimalya (1914) [Wreath of Songs], and Balaka (1916) [The Flight of Cranes]. The English renderings of his poetry, which include The Gardener (1913), Fruit-Gathering (1916), and The Fugitive (1921), do not generally correspond to particular volumes in the original Bengali; and in spite of its title, Gitanjali: Song Offerings (1912), the most acclaimed of them, contains poems from other works besides its namesake. Tagore’s major plays are Raja (1910) [The King of the Dark Chamber], Dakghar (1912) [The Post Office], Achalayatan (1912) [The Immovable], Muktadhara (1922) [The Waterfall], and Raktakaravi (1926) [Red Oleanders]. He is the author of several volumes of short stories and a number of novels, among them Gora (1910), Ghare-Baire (1916) [The Home and the World], and Yogayog(1929) [Crosscurrents]. Besides these, he wrote musical dramas, dance dramas, essays of all types, travel diaries, and two autobiographies, one in his middle years and the other shortly before his death in 1941. Tagore also left numerous drawings and paintings, and songs for which he wrote the music himself.”Text Quoted From:
Nobel Lectures, Literature 1901-1967, Editor Horst Frenz, Elsevier Publishing Company, Amsterdam, 1969
ఎవరీతడు? … రవీంద్రనాథ్ టాగోర్
