రా!… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
మౌక్తికరజోసదృశమైన ఈ వాసంత సాయంసంధ్యవేళ
వర్ణహీనమైన చంద్రుడు పూరేకలా తేలియాడుతుంటే,
నను పొదువుకునేందుకు చేతులుజాచుకుంటూ, రా!
వీడని ముద్దుకై పెదాలు సిద్ధంచేసుకుంటూ రా!
రా! జీవితం, గడుస్తున్న వత్సరాల వలలో
ఎగురుతూ చిక్కిన ఒక బలహీనమైన చిమ్మట.
ఇంత కాంక్షతో రగిలే మన సంగతీ త్వరలో అంతే!
బూడిదరంగు రాయి రప్పలమై గడ్డిలో పొరలాడడమే.
.
సారా టీజ్డేల్
(August 8, 1884 – January 29, 1933)
అమెరికను కవయిత్రి
.

.
Come
.
Come, when the pale moon like a petal
Floats in the pearly dusk of spring,
Come with arms outstretched to take me,
Come with lips pursed up to cling.
Come, for life is a frail moth flying,
Caught in the web of the years that pass,
And soon we two, so warm and eager,
Will be as the gray stones in the grass.
.
Sara Teasdale
(August 8, 1884 – January 29, 1933)
American
పెరటి పాట… గ్వెండొలీన్ బ్రూక్స్, అమెరికను కవయిత్రి
నా జీవితమంతా ముందరి వాకిట్లోనే గడిపాను.
నా కొకసారి పెరట్లోకి తొంగి చూడాలని ఉంది
అక్కడ ఏ సంరక్షణా లేక, గరుకుదేరి ఆబగా రొడ్డబలిసింది.
అక్కడ పూచిన గులాబికూడా అందంగా కనిపించదు.
నేనుప్పుడు ఆ పెరట్లోకి వెళ్దా మనుకుంటున్నాను.
అనాధపిల్లలు ఆడుకుంటున్న ఆ చోటుకి
వీలయితే వీధిచుట్టూ తిరిగైనా.
ఇవాళ నాకు ఆనందంగా గడపాలని ఉంది.
వాళ్ళు చాలా అద్భుతమైన పనులు చేస్తుంటారు.
వాళ్ళు హాయిగా కేరింతలాడుకుంటూ ఆనందంగా ఉంటారు.
మా అమ్మ అసహ్యించుకుంటుంది గాని, నే నైతే అది బాగుందంటాను.
వాళ్ళెంత అదృష్టవంతులో కదా! పావుతక్కువ తొమ్మిదికి
ఇంట్లోకి రావలసిన బలవంతం లేదు.
మా అమ్మ అంటుంటుంది జానీ మే
పెద్దయేక చెడుతిరుగుళ్ళు తిరుగుతుందని.
ఆ జార్జి నేడో రేపో జైలు కెళతాడనీని.
(ఎందుకంటే మా పెరటి తలుపు క్రిందటి చలికాలం అమ్మేసేడు)
నేను మాత్రం ఫర్వాలేదంటాను. నిజంగా! ఒట్టు!
నాకుకూడా కారునలుపు లేసులతో అల్లిన మేజోళ్ళు తొడుక్కుని,
ధైర్యంగా ముఖానికి రంగు పులుముకుని రోడ్లంబట తిరగాలనీ
చెడ్డపిల్లని అనిపించుకోవాలనీ ఉంది.
.
గ్వెండొలీన్ బ్రూక్స్
(June 7, 1917 – December 3, 2000)
అమెరికను కవయిత్రి
Gwendolyn Brooks
A Song in the Front Yard
I’ve stayed in the front yard all my life.
I want a peek at the back
Where it’s rough and untended and hungry weed grows.
A girl gets sick of a rose.
I want to go in the back yard now
And maybe down the alley,
To where the charity children play.
I want a good time today.
They do some wonderful things.
They have some wonderful fun.
My mother sneers, but I say it’s fine
How they don’t have to go in at quarter to nine.
My mother, she tells me that Johnnie Mae
Will grow up to be a bad woman.
That George’ll be taken to Jail soon or late
(On account of last winter he sold our back gate).
But I say it’s fine. Honest, I do.
And I’d like to be a bad woman, too,
And wear the brave stockings of night-black lace
And strut down the streets with paint on my face.
నీకు పెనుగాలంటే భయమా?… హామ్లిన్ గార్లాండ్, అమెరికను
నీకు పెనుగాలి హోరంటే భయమా?
వర్షం కత్తిలాకోస్తుంటే భయమా?
ఫో! వాటిని ఎదుర్కో. వాటితో పోరాడు!
మళ్ళీ ఆటవికుడివయిపో!
తోడేల్లా ఆకలితో అలమటించి చలిలో వడకట్టిపో!
వెళ్ళు, వెళ్ళు, కొంగలా బురదలో నడూ.
నీ అరచేతులు బండబారుతాయి,
నీ బుగ్గలు ఎండకి నలుపెక్కుతాయి,
నువ్వు చింపిరిజుత్తుతో, అలసి, నల్లనడతావు.
అయితేనేం, నువ్వొక మనిషిలా తిరుగుతావు.
.
హామ్లిన్ గార్లాండ్
(September 14, 1860 – March 4, 1940)
అమెరికను
.

Image Courtesy: Wikipedia
.
DO YOU FEAR THE WIND?
.
O you fear the force of the wind,
The slash of the rain?
Go face them and fight them,
Be savage again.
Go hungry and cold like the wolf,
Go wade like the crane:
The palms of your hands will thicken,
The skin of your cheek will tan,
You’ll grow ragged and weary and swarthy,
But you’ll walk like a man!
.
Hamlin Garland
(September 14, 1860 – March 4, 1940)
American Novelist, Poet, Essayist
Poem Courtesy:
యువత – యాత్రికుడూ…. సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
ఓ వృద్ధయాత్రికుడా, చాలా దేశాలు తిరిగావు,
ప్రేమలేని తావు ఎక్కడన్నా కనిపించిందా?
ఏ సముద్రతీరమైన ఫరవా లేదు
ఉంటే, దయచేసి నాకు విశదీకరించు.
నేను దేముడంటే విసిగిపోయాను
నాకతన్నించి దూరంగా పారిపోవాలనుంది
దిగంతాల అంచునున్న సముద్రతీరాలకి
నావవేసుకుని వెళ్ళాలన్నా నేను సిద్ధమే.
ప్రేమలేని రేవు నాకు తెలిసినదొకటుంది
అక్కడికి చేర్చే నావ నీ చేతిలోనే ఉంది
నీ కత్తిని నీ గుండేల్లోకి బలంగా దింపు
నువ్వు ఆ తీరానికి తిన్నగా చేరుకుంటావు.
.
సారా టీజ్డేల్
(August 8, 1884 – January 29, 1933)
అమెరికను కవయిత్రి
.
Youth and the Pilgrim
Gray pilgrim, you have journeyed far,
I pray you tell to me
Is there a land where Love is not,
By shore of any sea?
For I am weary of the god,
And I would flee from him
Tho’ I must take a ship and go
Beyond the ocean’s rim.
“I know a port where Love is not,
The ship is in your hand,
Then plunge your sword within your breast
And you will reach the land.”
.
Sara Teasdale
(August 8, 1884 – January 29, 1933)
American
Poem Courtesy:
http://www.mckinley.k12.hi.us/ebooks/pdf/helen10.pdf
ప్రత్యూషవేళలో కీచురాళ్ళు… లెనోరా స్పేయర్, అమెరికను
రాత్రల్లా కీచురాళ్ళు అరుస్తూనే ఉంటాయి
చిమ్మచీకటిలాంటి నిశ్శబ్దంలో
చిన్న చిన్న చుక్కలు మిణుకుమిణుకుమన్నట్టు.
వేసవిరాత్రుల నిరామయతలో
క్రమం తప్పని అద్భుతమైన లయతో అవి అరుస్తూనే ఉంటాయి:
నీడల్ని వాటి చిన్నిగొంతులతో మోస్తున్నాయేమోన్నట్టుగా.
కానీ, ప్రత్యూషకిరణాలకి మేల్కొన్న పక్షుల రవాలు
చెట్టునుండి చెట్టుకు ప్రాకుతూ అడివల్లా సందడి నిండినపుడు
ఓ ప్రత్యూష స్వర్ణవర్ణసమ్మేళనమా!
ఒక దాని వెనక ఒకటిగా
కీచురాళ్ళు నిశ్శబ్దాన్ని సంతరించుకుంటాయిసుమా.
.
లెనోరా స్పేయర్,
7 November 1872 – 10 February 1956
అమెరికను
.
Lady Speyer
Painting by John Singer Sargent, 1907
.
Crickets at Dawn
.
ALL night the crickets chirp,
Like little stars of twinkling sound
In the dark silence.
They sparkle through the summer stillness
With a crisp rhythm:
They lift the shadows on their tiny voices.
But at the shining note of birds that wake,
Flashing from tree to tree till all the wood is lit—
O golden coloratura of dawn!—
The cricket-stars fade slowly,
One by one.
.
(Poetry, A Magazine of Verse)
Leonora Speyer
7 November 1872 – 10 February 1956
American Poet and Violinist
1927 Pulitzer Prize for Poetry for her book of poetry Fiddler’s Farewell.
Anthology of Magazine Verse for 1920.
Ed. William Stanley Braithwaite (1878–1962).
సానెట్ 04 … ఏడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
(ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే 66వ వర్ధంతి సందర్భంగా)
*
నీ రూపాన్నీ, దాని గురించి నే కన్నకలలతో సహా
నా జ్ఞాపకాలు పరిభ్రమించడానికి అనుమతించేది
ఈ సిగరెట్టు కాల్చడం పూర్తయీదాకా మాత్రమే.
నేలమీద నుసి నిశ్శబ్దంగా రాలుతుంటే
నేపథ్యంలోని జాజ్ సంగీతంతో కలిసి
చలిమంట వెలుగులో ముక్కలు ముక్కలుగా క్రీనీడలు
గోడమీద వంకరలుపోతూ కత్తిలా పొడవుగా సాగేవరకే.
ఒక లిప్త కాలం, ఆ తర్వాత అంతా ముగిసిపోతుంది.
ఆ తర్వాత శలవు. వీడ్కోలు. కల కనుమరుగౌతుంది.
నీ ముఖాన్నీ, దాని రంగునీ, అందులోని
ప్రతి కవళికనీ నేను సులభంగా మరిచిపోగలను.
మాటలు, ఎన్నడూ మరువలేను; చిరునవ్వు, సాధ్యపడట్లేదింకా;
కానీ నీ జీవితంలో నువ్వు గర్వపడే ఈ క్షణం మాత్రం
సూర్యాస్తమయం తర్వాత కొండమీది వెలుగులాటిది.
.
ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే
(February 22, 1892 – October 19, 1950)
అమెరికను కవయిత్రి, నాటక కర్త
పులిట్జరు బహుమతి గ్రహీత

Sonnet 04
.
Only until this cigarette is ended,
A little moment at the end of all,
While on the floor the quiet ashes fall,
And in the firelight to a lance extended,
Bizarrely with the jazzing music blended,
The broken shadow dances on the wall,
I will permit my memory to recall
The vision of you, by all my dreams attended.
And then adieu,—farewell!—the dream is done.
Yours is a face of which I can forget
The color and the features, every one,
The words not ever, and the smiles not yet;
But in your day this moment is the sun
Upon a hill, after the sun has set.
.
Edna St Vincent Millay
(February 22, 1892 – October 19, 1950)
American
Pulitzer Prize for Poetry in 1923
కెసాండ్రా… ఎడ్విన్ ఆర్లింగ్టన్ రాబిన్సన్, అమెరికను కవి
ప్రాచీన గ్రీకు ఇతిహాసం ప్రకారం కెసాండ్రా(అలెగ్జాండ్రా) ప్రయం, హెకూబాల కుమార్తె పేరు.
ఆమె భవిష్యత్తు ఎంత ఖచ్చితంగా చెప్పగలిగినా అవి ప్రజలు నమ్మకుండుదురుగాక అని అపోలో ఆమెను శపించాడని ప్రతీతి.
ఇది చాలా గొప్ప కవిత. దేశభక్తి అంటే జెండాలు ఎగరెయ్యడం, నినాదాలివ్వడం ఒక్కటే కాదు. మనం చేస్తున్న తప్పులు గ్రహించి సరిదిద్దుకుని, జనబాహుళ్యానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ లాభించే పనులు చెయ్యాలి. మనబాగు కోసం పదిమందిని చంపుకుంటూ పోతుంటే, మనకి పాలించడానికి మిగిలేవి శ్మశానాలే అన్నసత్యం మరిచిపోకూడదు.
ఈ కవి కొన్ని గొంతు మింగుడుపడని సత్యాలని చెప్పాడు… అమెరికను యుద్ధోన్మాదం గురించి.
అది మనకీ వర్తిస్తుంది. మనకున్న శతాబ్దాల వర్ణ, లింగ, వర్గ వివక్ష వారసత్వంగా సంక్రమిస్తోంది. పదిమందికి మంచిచెయ్యనిది మనకి మంచిచేస్తున్నదయినా నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టలేకపోతే, చరిత్రచూపిస్తున్న సత్యాన్ని చూడడం ఇష్టంలేక మనం కళ్ళు మూసుకున్నట్టు అవుతుంది తప్ప రాబోయే వినాశం మాత్రం తప్పదు.
.
ఎవరో అంటుంటే విన్నాను: “నిజానికి
ఈ పిల్లలకి నేనేమి సలహా ఇవ్వగలను?
మీకు డాలరు తప్ప మరోటి తెలియదు
అదెక్క్డ పడిపోతుందోనని మీ భయం.
“దానికోసం ఎత్తైన పూజామందిరాలు కడతారు
మిమ్మల్నందరూ చూడడానికి, కానీ మీరు గుడ్డివాళ్ళు
దాన్నుండి ఎక్కువసేపు దృష్టిమరల్చ లేరు
మీ ముందూ వెనకా ఏమున్నాయో చూడడానికి.
“మీ విచక్షణ కాసేపు ఆగమని ప్రబోధించినా
ఓ నవ్వు నవ్వి, మీకే ఎక్కువ తెలుసునంటారు;
కాని మీకు తెలిసినదాన్ని గుండెల్లో
లోహపు కడ్డీల్లా భద్రంగా దాచుకుంటారు.
మీరు నవ్వుతూ అంటారు: “మేమింకా కుర్రాళ్ళం,
విడిచిపెట్టి, మా మానాన్న మమ్మల్ని ఎదగనీండి: అని
కాలం మిమ్మల్ని ఎంత భరించాలి, విధి ఇంకా
మీకెంత అనుగ్రహించాలి అన్న దానికి సమాధానం లేకుండా.
“అదృష్టవశాత్తూ కొన్ని సంతోషకరమైన సంవత్సరాలు
కలిసొచ్చాయి; కానీ ఆ గర్వమే మీ పతనానికి దారి తీస్తోంది.
కాలం మీకు ఆ అదృష్టం అలాగే కొనసాగుతుందనీ
మీకు పరీక్షపెట్టకుండా ముద్దు చేస్తుందనీ అనుకుంటున్నారా?
నశించిన ఏ చరిత్ర గ్రహణం,
నిలకడలేని ఏ నక్షత్రాల గుడారాలు
మీకు సహస్రాబ్దాల ముందుచూపునిచ్చి
యుద్ధాలని కొనసాగనిమ్మంటున్నాయి?
ప్రపంచం ఇంతవరకు ఎరుగని
చరిత్రకెక్కని ఏ పదవీ చ్యుతి
ఎక్కడ జరిగిందనుకున్నా, మీకొక్కరికేనా,
అంత తేటతెల్లంగా సంకేతాలిచ్చింది?
“మీ డాలరూ, మీ పావురం, మీ రాబందూ
అవొక మూర్తి త్రయం. వాటిని మీరు
మీకంటే కూడా గొప్పగా ఊహించుకుంటారు
అది లాబిస్తుంది, ఉబ్బిస్తుంది, కొత్తగా ఉంటుంది.
“శక్తి మీది, మీ చూపుది కాదు.
మీరు దేనిమీదనడుస్తున్నారో చూడలేకున్నారు;
మీకు శతాబ్దాల విజ్ఞానం మార్గం చూపిస్తోంది
కానీ దాన్ని అనుసరించే తెలివే మీకు లేకున్నది.
క్రూరమూ, నిర్దాక్షిణ్యమైన పాత సత్యాలనే
ఎప్పటికీ అనుసరించాలని అనుకుంటున్నారా?
ఇప్పుడు ప్రపంచం ఏమిటో అంచనావెయ్యడానికి
కళ్ళు తెరిచి చూడవలసిన అవసరం లేదా?
మీకిప్పుడు ఉన్నదానికి మూల్యంగా
ప్రజలందర్నీ పణం పెట్టాల్సిందేనా?” …
మరొకమాట వినిపించలేదు.. నవ్వుతున్న జనంతో పాటే
మేమూ నడిచాం. ఎవరూ వినలేదు, పట్టించుకోలేదు.
.
ఎడ్విన్ ఆర్లింగ్టన్ రాబిన్సన్
December 22, 1869––April 6, 1935
అమెరికను కవి
.
.
Cassandra
.
I heard one who said: “Verily,
What word have I for children here?
Your Dollar is your only Word,
The wrath of it your only fear.
“You build it altars tall enough
To make you see, but you are blind;
You cannot leave it long enough
To look before you or behind.
“When Reason beckons you to pause,
You laugh and say that you know best;
But what it is you know, you keep
As dark as ingots in a chest.
You laugh and answer, ‘We are young;
Oh, leave us now, and let us grow:’
Not asking how much more of this
Will Time endure or Fate bestow.
“Because a few complacent years
Have made your peril of your pride,
Think you that you are to go on
Forever pampered and untried?
“What lost eclipse of history,
What bivouac of the marching stars,
Has given the sign for you to see
Millenniums and last great wars?
“What unrecorded overthrow
Of all the world has ever known,
Or ever been, has made itself
So plain to you, and you alone?
“Your Dollar, Dove and Eagle make
A Trinity that even you
Rate higher than you rate yourselves;
It pays, it flatters, and it’s new.
“And though your very flesh and blood
Be what your Eagle eats and drinks,
You’ll praise him for the best of birds,
Not knowing what the Eagle thinks.
“The power is yours, but not the sight;
You see not upon what you tread;
You have the ages for your guide,
But not the wisdom to be led.
“Think you to tread forever down
The merciless old verities?
And are you never to have eyes
To see the world for what it is?
“Are you to pay for what you have
With all you are?”—No other word
We caught, but with a laughing crowd
Moved on. None heeded, and few heard.
.
Edwin Arlington Robinson
December 22, 1869––April 6, 1935
American Poet who won 3 Pulitzer Prizes.
The New Poetry: An Anthology. 1917.
Harriet Monroe, ed. (1860–1936).
http://www.bartleby.com/265/307.html
ఋణగ్రస్తుడు… సారా టీజ్డేల్, అమెరికను
ఈ బొందిలో ఊపిరి
ఇంకా కొట్టుమిట్టాడినంతవరకూ,
నల్లగా కాలుడు ఎదురైనపుడు
దాని గర్వపు పురులు విచ్చుకున్నపుడు;
ప్రేమా, ప్రఖ్యాతులపై అప్పటికీ
నాకు కోరిక సడలనప్పుడు;
కాలం దాన్ని లొంగదీసుకోకుండా
చాలా ఉన్నతంగా మనసుని నిలబెట్టినపుడు,
విధితో నేనెందుకు వాదులాడుతాను?
ఎందుకంటే, నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది:
నేను జీవితానికి ఋణపడి ఉన్నాను
నాకు జీవితం కాదు.
.
సారా టీజ్డేల్
August 8, 1884 – January 29, 1933
అమెరికను కవయిత్రి

Debtor…
.
So long as my spirit still
Is glad of breath
And lifts its plumes of pride
In the dark face of death;
While I am curious still
Of love and fame,
Keeping my heart too high
For the years to tame,
How can I quarrel with fate
Since I can see
I am a debtor to life,
Not life to me?
.
Sara Teasdale
August 8, 1884 – January 29, 1933
American
Poem Courtesy: http://www.readbookonline.net/readOnLine/26326/
జ్ఞానోదయం… సారా టీజ్డేల్, అమెరికను
జరుగుతున్న పొరపాట్లకి
నా తల బద్దలుకొట్టుకోవడం మాని
ప్రతి తెరవని తలుపు వెనకా ఒక రాజీమార్గం
దాగుంటుందని తెలుసుకునే వేళకి;
జీవితాన్ని కళ్ళల్లోకళ్ళుపెట్టి చూసి, నెమ్మదించి,
ప్రాప్తకాలజ్ఞత అలవరచుకునే వేళకి
జీవితం నాకు సత్యాన్ని ఆవిష్కరిస్తుందేమో గాని
ప్రతిగా, నా యవ్వనాన్ని పూర్తిగా లాక్కుంటుంది.
.
సారా టీజ్డేల్
(August 8, 1884 – January 29, 1933)
అమెరికను కవయిత్రి
ఈ కవితలో ప్రకటించిన సత్యం అందరికీ తెలిసినదే… మనం సత్యాన్ని అవగతం చేసుకునే వేళకి జీవిత చరమాంకంలోకి వచ్చెస్తాం… ఆ సత్యం యవ్వనంలో ఉన్నప్పుడు అవగతమైతే బాగుణ్ణుకదా!. అది ప్రకృతి కల్పనకి విరుద్ధం. దాన్నే తనదైన శైలిలో చెప్పింది సారా టీజ్డేల్.
అమెరికను కవయిత్రులలో అత్యంత ప్రతిభాశాలీ, హృదయ సౌకుమార్యమూ, కవిత్వాన్ని అతి చిన్నపదాలలో చొప్పించి చెప్పగల నేర్పూ కల కవయిత్రి.
.

.
Wisdom
.
When I have ceased to break my wings
against the faultiness of things
and learned that compromises wait
Behind each hardly opened gate
When I can look Life in the eyes
Grown calm and very coldly wise –
Life will have given me the Truth
and taken in exchange – my Youth.
.
Sara Teasdale
(August 8, 1884 – January 29, 1933)
American
అది పైకి చెప్పే మాట కాదు … సారా టీజ్డేల్

అది పైకి చెప్పే మాట కాదు.
కొన్ని మాటలే బయటకి వస్తాయి;
అది కళ్లల్లో ప్రతిఫలించేదీ కాదు,
తల అవనతం చెయ్యడమూ కాదు,
పదిలపరచుకోవలసినవెన్నో ఉన్న
హృదయపు సడిలేని అలజడి
కేవలం జ్ఞాపకాలు కలతపరచే
కలతనిద్ర.
.
