అనువాదలహరి

పురాతన వ్రాతప్రతి … ఆల్ఫ్రెడ్ క్రేంబోర్గ్, అమెరికను కవి

.

ఆకాశం … 

సూర్యుడూ, చంద్రుడూ

తమ దినచర్య రాసుకునే

అందమైన పాత తోలుపొరకాగితం.

దాన్ని అంతటినీ చదవాలంటే,

మీరు బృహస్పతి కంటే భాషాకోవిదులూ,

కలలతల్లి కంటే భావుకులూ,

యోగదృష్టిగలవారూ అయి ఉండాలి. 

కానీ,

దాన్నిఅందుకున్న అనుభూతి పొందాలంటే

మీరు దాని ప్రియ శిష్యులై ఉండాలి:

ఆత్మీయ శిష్యుణ్ణి మించి,

ఈ భూమిలాగో,

సముద్రం లాగో

నమ్మకమైన ఏకైక ఆంతరంగికులై నిలవాలి.

.

ఆల్ఫ్రెడ్ క్రేంబోర్గ్.

December 10, 1883 – August 14, 1966

అమెరికను కవి, నవలాకారుడూ, నాటక రచయితా, సాహితీ సంపాదకుడూ, సంకలన కర్తా

.

Alfred Kreymborg
Alfred Kreymborg (Photo credit: Wikipedia)

.

Old Manuscript

.

The sky

is that beautiful old parchment

in which the sun

and the moon

keep their diary.

To read it all,

one must be a linguist

more learned than Father Wisdom;

and a visionary

more clairvoyant than Mother Dream.

But to feel it,

one must be an apostle:

one who is more than intimate

In having been, always,

the only confidant—

like the earth

or the sea.

.

Alfred Kreymborg.

December 10, 1883 – August 14, 1966

American Poet, Novelist, Dramatist, Literary Editor and Anthologist.

ధూళికణానికి… ఛార్లెట్ స్మిత్, ఇంగ్లీషు కవయిత్రి

.

కంటికి కనరాని ఓ చిన్ని వ్యోమగామీ!

ఒక సన్నని గాలితీగకు వేలాడుతూ,

సూర్యకిరణాలమీద తేలియాడే చైతన్య అణుపదార్థమా!

నీ గాలివాటు ప్రయాణానికి గమ్యం ఏది? ఏ ఆలోచనతో

నువ్వు ఈ ఈథర్ లో నీ సూక్ష్మ శరీరాన్ని ప్రవేశపెట్టావు?

కంటిచూపుని ఎగతాళిచెయ్యడానికా?

పాపం! దట్టమైన నీలిమేఘాల మేలిముసుగు నిను దాచేలోగానే

వెంటాడే సుడిగాలి నీ ఖగోళయానానికి తెరదించుతుందే.

అయ్యో! అచ్చం అలాగే, ఊహాకల్పిత పసిడితీగెలమీద

ఆశల ఊపిరులూదే బూటకపుముఖస్తుతులకు పొంగిపోయి

ఏడుపొరల ఇంద్రధనుస్సులు తన కళ్ళలో నడయాడుతుండగా

గొప్పభావుకతగల కోడెవయసులోని కవికిశోరాలు

చేదు జీవిత సత్యాలని విస్మరించి నడుస్తాయి.   పాపం!

త్వరలోనే, చింతలు తాకి ఆ పగటికలలు కరగిపోతాయిగదా!


.

ఛార్లెట్ స్మిత్

ఇంగ్లీషు కవయిత్రి, నవలాకారిణి 

ఇంగ్లీషు సాహిత్యంలో కవయిత్రులలో ఛార్లెట్ స్మిత్ ది ఒక దయనీయ గాధ, అయినా సాహసోపేతమైనది. బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టినా, భర్త వ్యసనాలవల్ల, అప్పులుతీర్చలేని అతనితోపాటు జైలుపాలై, అక్కడ మొదటిసారిగా కవిత్వ రచనకు పూనుకుంది. ఆమె వ్రాసిన Elegiac Sonnets బహుళ జందరణ పొందడమే గాక, రొమాంటిక్ సాహిత్యోద్యమానికి రూప శిల్పులైన వర్డ్స్ వర్త్, కోలరిడ్జ్ లకు ప్రేరణకూడా. ఆమె వ్రాసిన కొన్ని సానెట్లలోని భావాలను, వర్డ్స్ వర్త్ తన కవితలలో పొందుపరచేడని పెద్ద వివాదము కూడా  ఉంది.

సైన్సులో అద్బుతమైన అలోచనలకూ, ఆవిష్కరణలకూ తెరతీసిన 18వ శతాబ్దములో ధూళికణం ఒక ప్రాణమున్న జీవిగా అనుకునేవారేమో తెలీదు. కాని, ధూళికణపు ప్రయాణంతో కొత్తగా కవితలురాసేవారి సాహిత్య ప్రయాణాన్ని పోల్చడం ఒక్క కొత్త భావన అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.    

.

English: Charlotte Turner Smith in Charlotte T...
English: Charlotte Turner Smith in Charlotte Turner Smith, Elegiac sonnets Fifth edition. London: Published by Thomas Cadell, 1789. (Photo credit: Wikipedia)

.
 Sonnet: To the Insect of the Gossamer
.
 Small viewless aeronaut, that by the line
 Of Gossamer suspended, in mid air
 Float’st on a sun-beam—Living atom, where
 Ends thy breeze-guided voyage? With what design

In æther dost thou launch thy form minute,
 Mocking the eye? Alas! before the veil
 Of denser clouds shall hide thee, the pursuit
 Of the keen Swift may end thy fairy sail!

Thus on the golden thread that Fancy weaves
 Buoyant, as Hope’s illusive flattery breathes,
 The young and visionary Poet leaves
 Life’s dull realities, while sevenfold wreaths

Of rainbow light around his head revolve.
 Ah! soon at Sorrow’s touch the radiant dreams dissolve.

.

 Charlotte Smith

4 May 1749 – 28 October 1806

English Romantic poet and Novelist.

ప్రయాస… వీరన్ కుట్టీ, మలయాళ కవి.

ఈ నీడ, ముందుకీ వెనక్కీ నడయాడుతూ

తనరూపాన్ని

పెంచుకుంటూ, కుంచించుకుంటూ పోవడం

అదేదో కాలక్షేపానికి ఆడే వినోదక్రీడ కాదు.
.

అది, తను ఎల్లకాలమూ

ఒకరి పాదాలక్రిందే పొర్లుతూ

తన ఉనికి కోల్పోతున్నందుకు పడే దుఃఖాన్ని

మరిచిపోడానికి చేసే ప్రయాస…

.

వీరన్ కుట్టీ,

మలయాళ కవి

.

Image Courtesy: https://www.facebook.com/veerankutty.mehfil

Veeran Kutty is  a Lecturer at Government College, Madapally, Kerala.

.

The Effort
.

This is no trivial pastime,
This play of the shadow ,
stretching and shrinking
it’s own image ..

It could be an attempt
to forget the sorrow
of being overshadowed,
Forever stuck beneath another…!

Malayalam Original: VEERAN KUTTY

English Rendering: GIRIJA CHANDRAN

A Wintry Dawn … Vinnakota Ravi Sankar , Indian Poet

(A Happy Halloween to all friends for whom it matters)

.

Bright is the sunshine

yet, there is little warmth in it.

It seems even the Sun  

shivers under the cold.

 

The pleasure of seeing the night off

doesn’t last a wee longer.

The day looks like the sorceress Cold

has only donned new attire for a change.

 

The sky waits yearningly

for the rare shadow of a bird

 

And the tree

which had not shed its leaves

drags its own shadow rather heavily.

 

An unknown fear seizes time and again

And the cold wind of memories

nips through, occasionally. 

 

One feels like folding himself up

into his own self,

shrinking back,

to undo evolution of this lone body

into the confines of that single primal cell.

.

Vinnakota Ravi Sankar

(The poem is taken from “Rendo Patra”)

 

Photo Courtesy:                     Vinnakota Ravisankar

Vinnakota Ravisankar is living in Columbia, South Carolina, USA for the last 14 years. He has to his credit three collections of poetry in Telugu published so far — kuMDeelO marri ceTTu (The Bunyan in a Flowerpot) (1993), vEsavi vaana(Summer Rain) (2002) & remDO paatra (The Second Role)(2010).

 

ఒక చలిపొద్దు  

.

ఎండగానే ఉంటుందిగాని

ఎక్కడా వేడి పుట్టదు

సూర్యుడుకూడా చలితో

గజగజవణుకుతాడు

రాత్రిగడిచిందన్న ఆనందం

ఎంతొసేపు నిలవదు.

పగలు— చీర మార్చుకుని వచ్చిన

చలిమంత్రగత్తెలా ఉంటుంది.

ఆకాశం ఒక పక్షినీడకోసం

ఆశగా ఎదురుచూస్తుంటుంది

ఆకులురాలనిచెట్టు

తననీడని తానే

భారంగా మోస్తుంది.

 

దిగులు దిగులుగా ఉంటుంది

పాతజ్ఞాపకాల ఈదురుగాలి

ఉండుండి సన్నగా కోస్తుంది.

 

ముడుచుకుపోవాలనుంటుంది

లోపలికి

వెనక్కి

ఏకాకి శరీరం లోంచి

ఏకకణంలోకి.

 

విన్నకోట రవిశంకర్. 

“రెండో పాత్ర” కవితా సంకలనం నుండి

On the Banks of River Kaveri… Afsar, Telugu, Indian

Trichy city, the Kaveri river and three gopura...
Trichy city, the Kaveri river and three gopurams of the Srirangam temple as seen from the Rock-Fort temple in Trichy. (Photo credit: Wikipedia)

1

A pining…

.

for not having drowned like a paper boat

when you were impregnably brimming over the banks;

for having failed to play like a pearl of water

on the sickle of your waist

when the first signs of youth blossomed over  there;

for not sharing a piece of firmament

standing at the threshold of your teary look

2

Kaveri!

You are now an abridged version of your own epic;

And I…

a worn out boat on your attenuating banks…

a childhood running into the crimps

of those aureate sarees drying up over there on your sands

3

As for the contentment,  well, there is.

There is that satisfaction that you lie here

on the hem of my cilia.

4

But,

What I came here for

is to anchor oceans in my eyes;

What I came here for

is to stream around your wizened ribs in ripples.

5

Isn’t it Kaveri?

.

(On the Banks of river Kaveri at Srirangam, South India one morning)

29-07-2012

Image Courtesy: Afsar’s Blog : http://www.afsartelugu.blogspot.in/

Afsar

.

కావేరి వొడ్డున

1

బెంగ
నువ్వు కడుపుతో పొంగి పొర్లుతున్నప్పుడు
నీలోపల కాయితప్పడవనై మునిగిపోలేదే అని!
నీ తొలి యవ్వనపు నడుం మెలిక మీద
అరనీటి బిందువై ఆడుకోలేదే అని!
నీ తడిచూపులో నిలిచి
వొక ఆకాశమయినా నీతో కలిసి పంచుకోలేదే అని.

2

కావేరీ,
నువ్విప్పుడు చిక్కి సగమయిన పద్యానివి.
నీ వొడ్డు మీద నేనొక అలసిపోయిన పడవని.
నీ వొంటిని ఆరేస్తున్న ఆ పసుపు చీరల
మడతల్లోకి పారిపోయిన పసితనాన్ని.

3

తృప్తికేం, వుంది!

ఈ కళ్ల చివర ఏదో వొక మూల
నువ్వున్నావన్న తృప్తి లేకపోలేదు.

4

కానీ
కంటి నిండా సముద్రాన్ని
దాచుకోవాలని కదా, నేనొచ్చా.
నీ పక్కటెముక చుట్టూ అలల చేతుల ప్రవాహమవ్వాలని కదా, వచ్చా.

5

కాదా మరి కావేరీ!

అప్సర్

(శ్రీరంగంలో కావేరీ వొడ్డున వొక పొద్దున)

29-07-2012

చీకటి అంటే లక్ష్యం లేదు… రూమీ, పెర్షియన్ కవి.

.

ఈ భౌతిక ప్రపంచం విలువిచ్చే వేవీ

ఆత్మ సత్యశోధన ముందు నిలబడవు.

.

నువ్వు నీ నీడని ఇష్టపడుతున్నావు,

బదులుగా, తిన్నగా సూర్యుడిని చూడు.

.

మనం ఒకరొకరు ఆక్రమించే

స్థల-కాలాకృతులు చూసుకొని ఏం తెలుసుకుంటాం?

.

రాత్రల్లా సగం మెలకువగా ఉన్నవాడు

రాబోయే ఉపద్రవాలు ఊహించుకుంటాడు.

వేగుచుక్క పొడుస్తుంది;

ఆకాసపుటంచులు కనిపించడం మొదలౌతుంది.

బిడారులో యాత్రికులు స్నేహాలు చేసుకుంటారు.

.

రాత్రి తిరిగే పక్షులకి

పగలు రాత్రిగా అనిపిస్తుంది,

కారణం, వాటికదే తెలుసు గనుక.

చీకటి భయ, కుతూహలములు

ఎంతమాత్రమూ రేకెత్తించని పక్షి అదృష్టవంతురాలు…

నిత్యం ఆనందంతో ఉండేవారిని “షాం తబ్రిజీ” అంటాము.

.

రూమీ

పెర్షియన్ కవి

( Note:

బిడారు: జంతువులపై ప్రయాణించే యాత్రికుల లేదా వర్తకుల సమూహం.

వేగుచుక్క: శుక్రగ్రహం. ఇది సాధారణంగా డిశంబరునెలలో తూర్పు దిక్కున కనిపిస్తుంటుంది. అది కనిపించిందంటే, ఇక సూర్యోదయం అవబోతున్నదని లెక్క.

షాం తబ్రిజీ: రూమీకి జ్ఞానోపదేశం చేసిన గురువు.

ఈ కవితలో సౌందర్యం …రాత్రి చరించే పక్షులకి పగలు చీకటిగా కనిపించడం. అందుకే గుడ్లగూబలకి “దివాంధములు” అంటారు.  అది స్వభావోక్తి అయినా, ఇక్కడ చేసిన మానసికవిశ్లేషణ చాలా పదునైనది. మనకి ఉండే Mental Blocks ని చాలా చక్కగా చెబుతోంది. (Remember Rumi was a 13th century Poet, Philosopher and Sufi Mystic).

Rumi's attributed photo
Rumi’s attributed photo (Photo credit: Eliza_Tasbihi)

.

Not Intrigued With Evening

.

What the material world values

doesnot shine the same in the truth of the soul.

You have been interested in your shadow.

Look instead directly at the sun.

What can we know by just watching

the time-and-space shapes of each other?

Someone half awake in the night

sees imaginary dangers;

the morning star rises;

the horizon grows defined;

people become friends in a moving caravan.

Night birds may think

daybreak a kind of darkness,

because that’s all they know.

It’s a fortunate bird

who’s not intrigued with evening,

who flies in the sun we call Shams.

.

Rumi

.

(From Soul of Rumi

English Translation by Coleman Barks)

కడపటి సమాధానాలు … కార్ల్ సాండ్ బర్గ్, అమెరికను కవి

Mist
Mist (Photo credit: Gene Wilburn)

.

నేను తుషారం మీద ఒక కవిత రాసేను

ఒకావిడ నన్నడిగింది: “దానికి అర్థం ఏమిటి?” అని

నేను అప్పటివరకు

మంచుబిందువుల సౌందర్యం గురించే ఆలోచించేను,

వాటి ముత్యపు మెరుపూ, బూడిద వర్ణమూ

ఎంతబాగా కలగలిసిపోయి

చీకటిపడ్డాక చిరు దీపాలవెలుగులో

కళావిహీనంగా పడుండే పూరిపాకలపై

తేలికగా జల్లుగా కురుస్తూ

వాటికి, రంగురంగుల్లో కదలాడే

అద్భుతమైన రహస్య స్థావరాలనే భ్రమ కల్పిస్తాయి కదా అని.

.

సమాధానంగా ఇలా అన్నాను:

“ఒకప్పుడు ఈ సృష్టి అంతా హిమమయమే

కొన్నాళ్లకి మళ్ళీ అదేస్థితి చేరుకుంటుంది.

మన కపాలాల్లో, గుండెలలో

ఎముకలూ, మాంసం కంటే నీరే ఎక్కువ ఉంది

కవులందరికీ మన్నూ నీరూ ప్రీతిపాత్రాలు

ఎందుకంటే అన్ని ప్రశ్నలకీ

కడపటి సమాధానాలు తిరిగి తిరిగి

అక్కడికే చేరుకుంటాయి గనక,” అని

.

కార్ల్ సాండ్ బర్గ్

January 6, 1878 – July 22, 1967

అమెరికను కవి

ముమ్మారు పులిట్జరు బహుమతి పొందిన కవి.  అందులో ఒకటి అబ్రహాం లింకన్ జీవిత చరిత్రకి. 1940 లో “The War Years”కీ , 1951 లో “Complete poems”కీ. The American Songbag (1927) అన్నది 1940 ల్లోనూ, 1960ల్లోనూ జానపద సాహిత్యంలో వచ్చిన విప్లవాత్మక ఆలోచనలకు ముందు సంకలించిన Urban Folk Songs. అతను గాయకుడు కావడంతో, కొన్ని స్వయంగా పాడేడు కూడా .

Carl Sandburg, American poet
Carl Sandburg, American poet (Photo credit: Wikipedia)

.

Last Answers

 

I wrote a poem on the mist

And a woman asked me what I meant by it.

I had thought till then only of the beauty of the mist,

             how pearl and gray of it mix and reel,

And change the drab shanties with lighted lamps at evening

             into points of mystery quivering with color.

 

   I answered:

The whole world was mist once long ago and some day

             it will all go back to mist,

Our skulls and lungs are more water than bone and tissue

And all poets love dust and mist because all the last answers

Go running back to dust and mist.

 

Carl Sandburg

January 6, 1878 – July 22, 1967

American Poet

 

 

(Poem Courtesy: http://wonderingminstrels.blogspot.com/2001/03/last-answers-carl-sandburg.html)

For Further Reading: http://www.carlsandburg.net/

బుజ్జి పిట్ట … రాబర్ట్ ఫ్రాస్ట్

bird at piano lesson with rock

.

రోజల్లా మా ఇంటిపక్కనే కూస్తున్న

ఒక పిట్టని తరిమేద్దామనుకున్నాను

.

ఇక ఎంతమాత్రం భరించలేననుకున్నాక

ద్వారం దగ్గరనిలబడి చప్పట్లుకొట్టేను

.

నాలో కూడ కొంతలోపం ఉంది ఉండాలి

అది పాడుతోందంటే దాని లోపం కాదు

.

అసలు ఆ మాటకొస్తే, ఏ పాటనైనా

అణచివెయ్యాలనుకోవడంలోనే ఏదో లోపం ఉంది

.

రాబర్ట్ ఫ్రాస్ట్

.

(ఎంతో అమాయకంగా కనిపిస్తున్న ఈ కవితలో ఒక అద్భుతమైన సందేశం ఉంది. ఏ పాటనైనా అణచివేయాలనుకోడం లోనే ఏదో లోపం ఉంది… అన్నది.

లోపాలని ఎత్తిచూపిస్తూ చిన్న కార్టూనులుగీసినా సహించలేని మనపాలకుల అసహనాన్ని ఈ నేపథ్యంలో చూడండి. ఈ కవితలో తాత్త్విక సందేశం ఎంత సున్నితంగా చెప్పబడిందో. ప్రజాస్వామ్యం అడ్దుపెట్టుకుని నియంతలు  పాలకులైతే విమర్శలు జీర్ణించుకోలేరు. అధికారం పోవడం తట్టుకోలేరు. కనుక వాళ్ళకి వ్యతిరేకంగా ఎంత చిన్న స్వరం వినిపించినా దాన్ని అణచివెయ్యాలని ప్రయత్నిస్తారు. If self-pity is hallmark of villainy, impatience is the hallmark of tyranny ప్రజాస్వామ్యాన్ని ప్రజలే  పరిరక్షించుకోవాలి… తమవారసులకి బానిసత్వం రాకుండా చూసుకోడానికి.) 

Robert Frost
Robert Frost (Photo credit: Boston Public Library)

.

A Minor Bird

.

I have wished a bird would fly away,

And not sing by my house all day;

.

Have clapped my hands at him from the door

When it seemed as if I could bear no more.

.

The fault must partly have been in me.

The bird was not to blame for his key.

.

And of course there must be something wrong

In wanting to silence any song.

.

Robert Frost

సహనశీలియైన సాలీడు… వాల్ట్ వ్హిట్మన్, అమెరికను కవి

Hanging Spider-Thatcher Park Indian Ladder Trail

.

ఒక్కతే, ఏకాంతంగా,

చడీ చప్పుడూ లేకుండా

ఆ ఏత్తైన గుట్టమీద నుండీ వేలాడుతున్న

ఒక సహనశీలియైన సాలీడుని చూశాను;

ఆ విశాలమైన పరిసరాల

శూన్యపుహద్దులని శోధించడానికి

అలుపన్నది ఎరగకుండా

తనలోంచి నిరంతరాయంగా

ఒక్కొక్కపోగూ, ఒక్కొక్క పోగూ

తియ్యడాన్ని గమనించేను.

.

ఓ మనసా!

మేరలులేని శూన్యసాగరాలు

చుట్టుముట్టిన నువ్వు

అనంతంగా ఆలోచిస్తూ,

ఏదోప్రయాసపడుతూ, చేతులెత్తేస్తూ

చుక్కల్ని అందుకోవాలనీ,

ముడివెయ్యాలనీ ఆరాటపడతావు; కానీ,

తీగెసాగిన నీ ఊహలు సేతువు నిర్మించగలిగేదాకా

వేసిన బలహీనమైన  లంగరులు నిలదొక్కుకునేదాకా

నువ్వు విసరిన ఆ సన్ననిపోచ

మరొక అంచుకి తగులుకునేదాకా

ఓ మనసా!

దానితో పోలికకి నువ్వెక్కడ సాటిరాగలవు?

.

వాల్ట్ వ్హిట్మన్

English: Walt Whitman. Library of Congress des...
English: Walt Whitman. Library of Congress description: “Walt Whitman”. (Photo credit: Wikipedia)

A noiseless, patient spider

.

A noiseless, patient spider,

I mark’d, where, on a little promontory, it stood, isolated;

Mark’d how, to explore the vacant, vast surrounding,

It launch’d forth filament, filament, filament, out of itself;

Ever unreeling them—ever tirelessly speeding them.

And you, O my Soul, where you stand,

Surrounded, surrounded, in measureless oceans of space,

Ceaselessly musing, venturing, throwing,—seeking the
spheres, to connect them;

Till the bridge you will need, be form’d—till the ductile anchor hold;

Till the gossamer thread you fling, catch somewhere, O my Soul.

.

Walt Whitman

పాపాయి … ఎజ్రా పౌండ్ , అమెరికను- ఇటాలియన్ కవి

ఒక మొలక నా చేతిలో మొలిచింది,

దాని సారం నా శరీరంలో ప్రవహించసాగింది.

మొక్కై గుండెల్లో పదిలంగా పెరిగింది.

అంటుకట్టగానే,

నా నుండి శాఖోపశాఖలై విస్తరించింది.

.

ప్రపంచానికి నువ్వు పసిపాపలా కనిపించవచ్చు గాని,

ఓ ముద్దు పాపాయీ!

నువ్వెంతో ఉదాత్తమైనదానివి

ఒక మహావృక్షానివి

నువ్వు తొలి జీవ వాహికవి

పిల్లతెమ్మెరను తోడ్కొనివచ్చే నల్లకలువవి.

.

(Notes: ఎజ్రాపౌండ్ కవితల్లో చాలా సంక్లిష్టమైన కవితే గాక, చాలా విస్తృతంగా, ఎక్కువసార్లు తప్పుగా, వ్యాఖ్యానింపబడిన కవితగా నాకు తోస్తుంది. చాలా వ్యాఖ్యానాలు మూలంలో రెండు పదాలదగ్గరికి వచ్చేసరికి చతికిలబడిపోతున్నాయి. అవి “downward the branches grow out of me” and “All this is folly to the world”  .

అయితే, ఈ కవితని అర్థం చేసుకునే ముందు ఎజ్రా పౌండ్ ఇమేజిజం అన్న ప్రక్రియకి ఆద్యుడన్న సంగతీ, 20వశతాబ్దపు తొలి దశకాల్లో చాలా ప్రపంచదేశాలూ, దేశాధినేతలూ అధికారం, ఆర్థిక శక్తితో ప్రపంచాన్ని శాసించాలని కలగంటున్నాయి తప్ప రష్యాలోని అక్టోబరు విప్లవం మూలస్థంబాలైన సమానత్వం, సమిష్ఠి వనరుల సిధ్ధాంతాలు మచ్చుకికూడ వాళ్ళ ఆలోచనలలో లేవని గుర్తిస్తే,  ఇక్కడ అతను వాడిన ప్రతీక దేనికో తెలుస్తుంది. ఈ సర్వమానవ సమానత్వమూ, ప్రపంచశాంతే ఆ పాపాయి. అది అధికారోన్మాదులకి తెలివితక్కువగా కనిపించడంలో ఆశ్చర్యం ఏముంది. రెండవది “Downward the branches grow out of me”  అంటే తలక్రిందులుగా పెరగడం కాక, “transplant” చెయ్యడం వల్ల గాని, రావిచెట్టులాగో మర్రి చెట్టులాగో మహావృక్షమై, వేళ్ళు క్రిందకి వేళాడి, ఆ భావాలు కాలూనుకుంటాయి అని భావం. (నాకు  అనిపించినది). అందులో కూడ ఆడపిల్ల అనే పేర్కొనడం కాకతాళీయం కాదు. మానవాళికి మనుగడ ఆమెచేతిలోనేకదా ఉన్నది.  ఇలా అనుకోడానికి అతని కవిత్వంలో నిగూఢంగా వాడిన పదాన్ని మనం మరిచిపోకూడదు. Violets అన్నవి మార్మిక చిహ్నాలలో ఆత్మకీ, శాంతికీ ప్రతీకలు. కనుక ఆ కోణంలో దీన్ని విశ్లేషించాలి అని నా భావన.)

ఎజ్రా పౌండ్

అమెరికను- ఇటాలియన్.

కవి, విమర్శకుడూ, సాహిత్యంలో ఇమేజిజం అనే ప్రక్రియకి రూపశిల్పి. జేమ్స్ జాయిస్, TS ఇలియట్, రాబర్ట్ ఫ్రాస్ట్  వంటి కవుల్ని గుర్తించి ప్రోత్సహించిన వాడు, 70కి పైగా పుస్తకాలు అచ్చువెయ్యడమేగాక, మరో 70 పుస్తకాలకి పరోక్షంగా  సహాయపడినవాడు, 1500 పైగా సాహిత్య విమర్శలూ, వ్యాసాలూ వ్రాసిన వాడు. 20వ శతాబ్దపు సాహిత్య ప్రముఖుల్లో ముందువరసలో ఉండే వ్యక్తి.

English: Undated black-and-white United States...
English: Undated black-and-white United States passport photograph of American writer Ezra Pound. Image courtesy of the Yale Collection of American Literature, Beinecke Rare Book & Manuscript                           (Photo credit: Wikipedia)

.

A Girl

.

The tree has entered my hands,

The sap has ascended my arms,

The tree has grown in my breast –

Downward,

The branches grow out of me, like arms.

.

Tree you are,

Moss you are,

You are violets with wind above them.

A child – so high – you are,

And all this is folly to the world.

.

Ezra Pound

30 October 1885 – 1 November 1972

An American expat Poet, Critic, and a pioneer of Imagism Movement in Literature.

How to interpret the Poem:

This is one of Pound’s toughest poems to interpret. And many people have interpreted differently yet, most of them failed when it came to the lines:  “downward the branches grow out of me” and “All this is folly to the world” .

So we should start interpreting the poem keeping this in mind and what the two stand for. His Imagism movement and his reasons behind supporting Mussolini give us enough clues.  “Girl” here is no longer a girl in the ordinary sense but a metaphor or an image for  equality of humanity (by removing social inequalities). There was a power struggle in the first decades of 20th century, everybody tried to dominate others by economic strength; for them equality among people just looked absurd. That it also seems really ridiculous to common people, psyched in to believe power and money are the chief pursuits of life, is no wonder. 

When love for humanity enters you, it fills you, it takes you over.  When it is nurtured in your heart and you share it (put it down like what you do to transplant), it branches off everywhere like a tree.  There is one interesting image  Ezra Pound has left in the poem for a clue… Violets. Violets are a magical  or mystic symbol for Peace and Spirituality. I thought one should interpret the poem in that angle.

%d bloggers like this: