అనువాదలహరి

నన్ను వెంట తరుముతూ… అబ్బాస్ కియరోస్తమి ఇరానియన్ కవి

అబ్బాస్ కియరోస్తమి దీనిని ఒక జపనీస్ హైకు లా రాసినా, దానికి ఉండే ప్రాథమిక లక్షణాలని మాత్రం తెలిసే అతను అనుసరించలేదు. ఇక్కడ నీడ చాలా చక్కగ అమరే ఉపమానం అయినప్పటికీ, కవి చెప్పదలుచుకున్నది మాత్రం నీడ కాదు. మనతో పాటు పెరిగే, మనకికూడ తెలియని మన వ్యక్తిత్వం.

***

నా చిన్నప్పటి నేస్తం

నా నీడ,

నన్ను వెంటాడుతూ వస్తోంది.

అదీ నాతో పెరిగింది,

నాతో పాటే వయసు మీరింది.

అది నన్ను

నా సమాధివరకూ

వెంటాడుతూనే ఉంటుంది.

.

అబ్బాస్ కియరోస్తమి

(22 June 1940 – 4 July 2016)

ఇరానియన్ కవి, ఫోటోగ్రాఫర్, సినీ దర్శకుడు.

.

.

I am being pursued

.

I am being pursued

by a shadow that was my playmate

in childhood;

it grew up with me,

it grew old with me,

it will continue

to pursue me

to the grave.

.

Abbas Kiarostami

(22 June 1940 – 4 July 2016)

Internationally noted film Director, Photographer and Poet

From:

(Kiarostami, 2005, p. 172, no. 298).

(http://www.iranicaonline.org/articles/haiku )

“ఎవరక్కడ?… రూమీ, పెర్షియన్ కవి

.

“ఎవరక్కడ?” అని అతనడిగేడు
“మీ విధేయుడైన సేవకుడిని,” అన్నాను నేను.
“ఈక్కడ నీకేం పని?” అడిగేడతను.
“ప్రభూ! మిమ్మల్ని దర్శించుకోడానికి వచ్చేను,” అన్నాను నేను.

“ఎన్నాళ్లని ఇలా తిరుగుతూ ఉంటావు?” అని అడిగేడతను.
“స్వామీ! మీరు ఇక చాలు అనేదాకా,” అన్నాను నేను.
“ఎన్నాళ్లని ఇలా మంటలో సలసల్కాగుతావు?”
“నేను పరిశుద్ధుడను అయేదాకా!” అన్నాను నేను.

అని, “ప్రభూ! ప్రేమమీద ప్రమాణం చేసి
చెబుతున్నా, నేను ప్రేమ కోసం
నా హోదానీ, నా సంపదనీ వదులుకున్నాను,” అన్నాను.

“నీ వాదన సరిగానే వినిపించావు గానీ
దానికి సాక్షులెవరూ లేరే” అన్నాడతను.
దానికి నేను, “నా కన్నిళ్ళే దానికి సాక్షులు;
వివర్ణమైన ఈ వదనమే దానికి ఋజువు,” అన్నాను.
“నీ సాక్షులు అంత నమ్మదగ్గవి కావు.
నీ కన్నులు మరీ తడిగా ఉన్నాయి చూడగలగడానికి.”
“మీ ధర్మనిరతి యొక్క ప్రభ వల్ల
నా కన్నులు స్పష్టంగానూ, లోపరహితంగానూ ఉన్నాయి.”
“ఇంతకీ, నీకు ఏమి కావాలి?”
“మీరు సర్వకాలములందూ నా చెలికాడు కావాలి.”
“నేను నీకు చెయ్యగలిగినదేమిటి?”
“అపారమైన మీ కరుణ నాపై చూపించడమే.”

“నీ ప్రయాణంలో తోడుగా ఎవరున్నారు?”
“ఓ ప్రభూ! మీ గురించిన తలపులే.”
“నిన్ను ఇక్కడకు రప్పించిందెవరు?”
“సుగంధపరిమళము వెదజల్లే అమృతమే”

“నీకు మిక్కిలి సంతృప్తినిచ్చేది ఏది?”
“నా ప్రభువు సాన్నిధ్యము.”
“అక్కడ నీకెమిటి కనిపిస్తుంది?”
“కొన్ని వేల వేల అద్భుతదృశ్యాలు.”
“భవనమంతా చిన్నబోయిందేమి?”
“గొంగకు భయపడి అందరూ తప్పుకున్నారు.”
“ఇంతకీ, ఎవరా దొంగ?”
“ఇంకెవరు? నన్ను మీనుండి దూరంచేసేవారే!”
అతనన్నాడు, “అక్కడమాత్రం భద్రత ఎదీ?”
“సేవనలోనూ, పరిత్యాగంలోనూ ఉంది.”
“పరిత్యజించడానికేమున్నది అక్కడ?”
“ముక్తి లభిస్తుందన్న ఆశ.”

“మరి ఓపలేని దుఃఖం ఎక్కడుంది?”
“మీ సన్నిధిలో పొందే ప్రేమ తీపులో”
“ఈ జన్మవలన నువ్వెలా లాభపడ్డావు?”
“నాకు నేను నిజాయితీగా ఉంటూ.”

ఇక ఇప్పుడు నిశ్శబ్దం పాటించవలసిన సమయం.
నేను గనక మీకు అతని నిజమైన తత్త్వాన్ని చెప్పేనంటే
మిమ్మల్ని ఈ తలుపులూ, ద్వారబంధాలూ, పైకప్పులూ ఆపలేవు,
మిమ్మల్ని మీరు త్యజించుకుని రెక్కలతో ఎగిరిపోతారు.

.

రూమీ,

పెర్షియన్ కవి

.

Jalal ad-Dīn Muhammad Rumi
Image Courtesy: http://en.wikipedia.org/wiki/Rumi

.

Who Is At My Door?

He said, ‘Who is at my door?’

I said, ‘Your humble servant.’

He said, ‘What business do you have?’

I said, ‘To greet you, 0 Lord.’

He said, ‘How long will you journey on?’

I said, ‘Until you stop me.’

He said, ‘How long will you boil in the fire?’

I said, ‘Until I am pure.

‘This is my oath of love.

For the sake of love

I gave up wealth and position.’

He said, ‘You have pleaded your case 

but you have no witness.’

I said, ‘My tears are my witness;

the pallor of my face is my proof.’

He said, ‘Your witness has no credibility;

your eyes are too wet to see.’

I said, ‘By the splendor of your justice 

my eyes are clear and faultless.’

He said, ‘What do you seek?’

I said, ‘To have you as my constant friend.’

He said, ‘What do you want from me?’

I said, ‘Your abundant grace.’

He said, ‘Who was your companion on the journey?

I said, ‘The thought of you, 0 King.’

He said, ‘What called you here?’

I said, ‘The fragrance of your wine.’

He said, ‘What brings you the most fulfillment?’

I said, ‘The company of the Emperor.’

He said, ‘What do you find there?’

I said, ‘A hundred miracles.’

He said, ‘Why is the palace deserted?’

I said, ‘They all fear the thief.’

He said, ‘Who is the thief?’

I said, ‘The one who keeps me from -you.

He said, ‘Where is there safety?’

I said, ‘In service and renunciation.’

He said, ‘What is there to renounce?’

I said, ‘The hope of salvation.’

He said, ‘Where is there calamity?’

I said, ‘In the presence of your love.’

He said, ‘How do you benefit from this life?’

I said, ‘By keeping true to myself

Now it is time for silence.

If I told you about His true essence

You would fly from your self and be gone,

and neither door nor roof could hold you back!

ప్రేమంటే ఇదే… రూమీ, పారశీక కవి

ప్రేమంటే ఇదే: ఎరుగని విహాయస పథాల్లోకి ఎగిరిపోవడం.

ప్రతి క్షణం కొన్ని వందల తెరలు తొలగేలా చేసుకోవడం .

మునుముందుగా, జీవితంపై మమకారాన్ని విడిచిపెట్టడం,

చివరకి, అడుగువెయ్యకుండానే, ముందడుగు వెయ్యడం;

ఈ ప్రపంచం అగోచరమని నిశ్చయించుకోవడం,

చివరకి, ‘నేను’ గా కనిపిస్తున్నదాన్ని ఉపేక్షించడం.

హృదయమా! ఇటువంటి ప్రేమికుల సమూహంలో

ప్రవేశించగలగడం ఎంతో అదృష్టమని నే చెప్పలేదూ?

చూపుల పరిధిదాటి చూడగలగడం వంటిది;

హృదయాంతరం చేరుకుని అనుభూతి చెందడం వంటిది.

.

రూమీ

(30 September 1207 – 17 December 1273)

పారశీక కవి

 

Jalal ad-Dīn Muhammad Rumi
Image Courtesy: http://en.wikipedia.org/wiki/Rumi

This Is Love:

This is love: to fly toward a secret sky, 

to cause a hundred veils to fall each moment. 

First, to let go of live. 

In the end, to take a step without feet; 

to regard this world as invisible, 

and to disregard what appears to be the self. 

Heart, I said, what a gift it has been 

to enter this circle of lovers, 

to see beyond seeing itself, 

to reach and feel within the breast.

.

Rumi

(30 September 1207 – 17 December 1273)

Persian Poet

గీతిక 314… రూమీ పెర్షియన్ కవి

ప్రేమ తమని నదిలా

తనలోకి ఈడ్చుకుపోతున్నట్టు ఎవరు అనుభూతిచెందలేరో,

ఎవరు ప్రాభాతాన్ని

చెలమనీటిని దోసిలితో తాగినట్టు గ్రోలలేరో,

లేక, సూర్యాస్తమయాన్ని రాత్రిభోజనంలా ఆరగించలేరో,

ఎవరు మారడానికి అయిష్టంగా ఉంటారో,

వాళ్ళని అలా నిద్రపోనీయండి.

ఈ ప్రేమ వేదాంత చర్చ పరిధికీ,

ఒకప్పటి మాయమాటలకీ, ఆత్మవంచనలకీ అతీతమైనది.

మీరు మీ మనసుని ఆ విధంగా మెరుగుపరచుకోదలిస్తే

అలాగే కానీండి. నిద్రపోండి.

నేను నా బుద్ధిని పక్కనబెట్టాను.

నా తొడుగులను విడిచి

పీలికలు పీలికలుగా చేసి పారవేశాను.

మీరు ఏ ఆచ్ఛాదనలూ లేకుండా ఉండలేనపుడు

చక్కగా మాటల ముసుగు కప్పుకుని

కమ్మగా నిద్రపోండి.

.

రూమీ

పెర్షియను కవి

.

Jalal ad-Dīn Muhammad Rumi
Image Courtesy: http://en.wikipedia.org/wiki/Rumi

.

Ode 314

Those who don’t feel this Love

pulling them like a river,

those who don’t drink dawn

like a cup of spring water

or take in sunset like supper,

those who don’t want to change,

let them sleep.

This Love is beyond the study of theology,

that old trickery and hypocrisy.

If you want to improve your mind that way,

sleep on.

I’ve given up on my brain.

I’ve torn the cloth to shreds

and thrown it away.

If you’re not completely naked,

wrap your beautiful robe of words

around you,

and sleep.

.

Rumi

ప్రేమలో మునిగిన పడవ… రూమీ, పెర్షియన్ సూఫీ కవి

నేను దహించుకుపోతేనే తప్ప ప్రేమకి సంతృప్తి కలగదా?

ఎందుకంటే, నా మనస్సే ప్రేమ ఆవాసమందిరం.

ఓ ప్రేమా! నీ ఇల్లు నువ్వు తగలబెట్టుకుంటానంటే, తగలబెట్టుకో!

“అది నిషిద్ధం,” అని ఎవడనగలడు?

ఈ ఇంటిని పూర్తిగా దహించు.

ప్రేమికుడి స్థావరం దహించబడ్డాక ఇంకా మెరుగౌతుంది.

ఈ రోజునుండీ దహించుకుపోవడమే నా పరమార్థం

నేను కొవ్వొత్తిలాటివాడిని, మంట నన్ను మరింతప్రకాశవంతం చేస్తుంది.

ఈ రాత్రికి నిద్రకి దేవిడీ మన్నా;

నిద్ర లేమితో అటూ ఇటూ తిరుగుతుంటాను

అదిగో, ఆ ప్రేమికులని చూడు ఎంత ప్రమత్తంగా ఉన్నారో.

శలభాల్లాగ దొరికిన ప్రియసమాగంలో ఎలా దహించుకుపోతున్నారో!

దేవుడు సృష్టించిన ఈ ప్రాణికోటి పడవని చూడు,

అది ప్రేమసాగరంలో నిలువునా ఎలా మునిగిపోయిందో పరికించు!

.

రూమీ

పెర్షియన్ సూఫీ కవి

Jalal ad-Dīn Muhammad Rumi Image Courtesy: http://en.wikipedia.org/wiki/Rumi
Jalal ad-Dīn Muhammad Rumi
Image Courtesy: http://en.wikipedia.org/wiki/Rumi

.

The Ship Sunk In Love

Should Love’s heart rejoice unless I burn?

For my heart is Love’s dwelling.

If You will burn Your house, burn it, Love!

Who will say, ‘It’s not allowed’?

Burn this house thoroughly!

The lover’s house improves with fire.

From now on I will make burning my aim,

From now on I will make burning my aim,

for I am like the candle: burning only makes me brighter.

Abandon sleep tonight; traverse fro one night

the region of the sleepless.

Look upon these lovers who have become distraught

and like moths have died in union with the One Beloved.

Look upon this ship of God’s creatures

and see how it is sunk in Love.

.

Jalaluddin Rumi

30 September 1207 –  17 December 1273

Persian Sufi Poet

 

[Mathnawi VI, 617-623

The Rumi Collection, Edited by Kabir Helminski] 

.

Poem Courtesy:  http://www.rumi.org.uk/passion.htm

సంతోషక్షణం… జలాలుద్దీన్ రూమీ, పెర్షియన్ కవి

నువ్వూ- నేనూ వరండాలో కూర్చున్నది
ఒక సంతోష క్షణం
చూడడానికి ఇద్దరం గాని నువ్వూ నేనూ ఒకే ఆత్మ
మనిద్దరమూ పూదోట సౌందర్యంతో
పక్షుల కిలకిలారావాలతో
ఇక్కడ జీవనస్రవంతిని అనుభవిస్తున్నాం.
చుక్కలు మనల్ని గమనిస్తుంటాయి
మనం వాటికి సన్నని సినీవాలి
అంటే ఏమిటో చూపిస్తాము.
మన అహాలు వదులుకుని ఇద్దరం కలిసి ఉంటాము
మనిద్దరం భవిష్యత్తుగురించి నిష్ఫలమైన ఊహాగానాలు చెయ్యం
మనిద్దరం నవ్వుతూ ఉంటే
ఆకసంలో పక్షులు పళ్ళు రుచిచూస్తుంటాయి
ఒక ఆకృతిలో ఈ భూమి మీద
మరొక ఆకృతిలో అనంతా కాల వేదికమీద… నువ్వూ నేనూ…
.
జలాలుద్దీన్ రూమీ
పెర్షియన్ కవి

Jalal ad-Dīn Muhammad Rumi Image Courtesy: http://en.wikipedia.org/wiki/Rumi

A moment of happiness,
you and I sitting on the verandah,
apparently two, but one in soul, you and I.
We feel the flowing water of life here,
you and I, with the garden’s beauty
and the birds singing.
The stars will be watching us,
and we will show them
what it is to be a thin crescent moon.
You and I unselfed, will be together,
indifferent to idle speculation, you and I.
The parrots of heaven will be cracking sugar
as we laugh together, you and I.
In one form upon this earth,
and in another form in a timeless sweet land.
.

Mewlana Jalaluddin Rumi

ముళ్ళకి భయపడకు (ఘజల్ 482) … హఫీజ్, పెర్షియను కవి

ఓ నా ఆత్మా! నువ్వు మళ్ళీ ప్రేమ మార్గంలో ఎందుకు తిరుగాడకూడదు?

నీ హృదయం ఒంటరితనాన్ని కోరుకుంటోంది; నీ జీవితం వృధాగా ముగుస్తుంది.

విధి అనే బ్యాటు నీ చేతిలోనే ఉంది; బంతినెందుకు కొట్టవు?

పైన ఎగురుతున్న అదృష్టపు పావురాన్ని ఎలాపట్టాలో నువ్వేనిర్ణయించుకోవాలి

నీ హృదయంలో ఎగసి ప్రవహించే ఈ ఎర్రని రక్తం

నీ ప్రియురాలిని గెలుస్తుంది; ఆమెని పోనివ్వకు.

ముళ్ళంటే ఉన్న భయం గులాబి దగ్గరకి వెళ్ళకుండా నిన్ను నిలువరిస్తే

లాభం లేదు. నువ్వు ఎన్నడూ దాని సుగంధాన్ని ఆశ్వాదించలేవు.

.

హఫీజ్

1325/26–1389/90

పెర్షియన్ మార్మిక  కవి

హఫీజ్ అన్నపేరుతో ప్రసిద్ధుడైన  ఖ్వాజా షంసుద్దీన్ ముహమ్మద్ హఫీజ్ షిరాజీ, పెర్షియన్ సాహిత్యంలో అగ్రగణ్యుడుగా గుర్తింపు పొండాడు. ఇప్పటికీ అతని కవితలు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ లలో ప్రతి ఇంటా లభ్యమవడమే గాక, అందరికీ కంఠస్థమై, అవి నానుడులుగా, జాతీయాలుగా చలామణీలో ఉన్నాయి. 14వశతాబ్ది తర్వాత వచ్చిన పెర్షియను సాహిత్యాన్ని అతని జీవితమూ, కవిత్వమూ ప్రభావితంచేసినట్టుగా ఇంకేదీ ప్రభావితం చెయ్యలేదని చెప్పవచ్చు.

 

.

Fear not the thorns! (Ghazal 482)…

.

O My Soul, in the lane of love, why don’t you stroll again?

Your heart strives lonesome; your days all end in vain!

The mallet of fate is in your hand why don’t you hit the ball?

The eagle of fortune in flight above, the shots are yours to call!

This ruby blood that floods and waves in your heart–

shall earn you the beloved, don’t let her depart!

I am afraid you will never breathe in- the charm of the rose–

if the fear of the thorns keeps you from reaching too close!

.

Hafez

1325/26 – 1389/90

Persian Poet

Translation: Maryam Dilmaghani, March 2014.

Poem Courtesy:

http://www.persianpoetryinenglish.com

%d bloggers like this: