Tag: PB Shelly
-
జంటబాసిన పులుగు… షెల్లీ, ఇంగ్లీషు కవి
జంటబాసిన పులుగొకటి శీతవేళ కొమ్మపై కూర్చుని రోదిస్తున్నది ; పైన గడ్డకట్టిన శీతగాలి కోత క్రింద గడ్దకడుతున్న సెలయేటి పాత. ఆకురాలిన అడవిలో మచ్చుకైన లేదు చిగురు నేలమీద వెతికితే దొరకదు పూలతొగరు గాలిలో లేదు సన్ననిదైన విసరు ఉన్నదొక్కటే మిల్లు చక్రపు విసురు. . P. B. షెల్లీ (4 August 1792 – 8 July 1822) ఇంగ్లీషు కవి . . The Widow Bird . A widow bird sate […]
-
మృదుల కంఠస్వరాలు మరుగైనపుడు… షెల్లీ, ఇంగ్లీషు కవి
మృదుల కంఠస్వరాలు మరుగైనపుడు సంగీతం, జ్ఞాపకాలలో నినదిస్తుంది. కమ్మని పూవులు వాడిపోయినా, వాటి నెత్తావి, మేల్కొలిపిన ఇంద్రియంలో పదిలం. గులాబి రేకులు, గులాబి రాలిపోయినా, ప్రియుల సమాధులపై పోగుబడతాయి. అలాగే నువ్వు లేకున్నా, నీ గూర్చిన ఆలోచనలూను; ప్రేమ ఎప్పుడూ నివురుగప్పి ఉంటుంది. . షెల్లీ 4 August 1792 – 8 July 1822 ఇంగ్లీషు కవి. . . Music, when Soft Voices die . Music, when soft voices die, […]
-
నీ కథ సగమే గానం చేశాడొకడు… షెల్లీ, ఇంగ్లీషు కవి
నీ కథ సగమేపాడి విడిచిపెట్టాడొకడు పొద్దుపొడుపుతో మాయమైన నక్షత్రాల వెలుగులా; డీడాల్* సృష్టించిన ఖాళీ బంగారు పాత్ర ఎండిపోయిన పెదాలకి, గాలిని అందించి వెక్కిరించినట్టు. . PB షెల్లీ ఆగష్టు 4, 1792 – జులై 8, 1822 ఇంగ్లీషు కవి (* డీడాలస్ అన్న గ్రీకు కళాకారుడు అపూర్వమైన బంగారు కళాకృతులను తయారుచేసేవాడట. అందుకని డీడాల్ అన్నది అపురూప కళాకృతికి మారుపేరుగా నిలిచిపోయింది.) . . One Sung of Thee who Left […]
-
మృదుల కంఠస్వరాలు కనుమరుగైపోయేక… షెల్లీ, ఇంగ్లీషు కవి.
మృదుల కంఠస్వరాలు కనుమరుగైపోయేక సంగీతం జ్ఞాపకాల్లో ప్రతిధ్వనిస్తుంటుంది; సుకుమారమైన పూల నెత్తావి అవి వాడిపోయినా అవి రేకెత్తించిన ఇంద్రియజ్ఞానంలో నిక్షిప్తమై ఉంటాయి. గులాబి రేకులు, గులాబి రాలిపోయేక ప్రియురాలి సమాధిదగ్గర పోగుచెయ్యబడతాయి; అలాగే, నీ ఆలోచనలు, నీ తదనంతరం, ప్రేమ తనలోతాను నెమరువేసుకుంటుంటుంది. . P B షెల్లీ 4 August 1792 – 8 July 1822 ఇంగ్లీషు కవి. . . Music, when Soft Voices die . Music, when soft […]
-
క్షీణచంద్రుడు… షెల్లీ, ఇంగ్లీషు కవి
1 పలుచని మేలిముసుగులో దాగుని క్రమంగా మతిస్థిమితం కొల్పోతూ, సన్నగా, పాలిపోయి,తన మందిరంలోంచి వణుకుతూ బయటకి నడిచి వస్తున్న మృత్యుముఖంలో ఉన్న స్త్రీలా చీకటి తూరుపు దిశను నిరాకారమైన తెల్లని ముద్దలా చంద్రుడు ఉదయించేడు. 2 ఎందుకు నువ్వు అలా పాలిపోయావు, అకాశాన్ని ఎక్కిన అలసటవల్లా, భూమిపై తొంగి చూడడం వల్లా, వేరే పుట్టుక పుట్టిన నక్షత్రాల మధ్య తోడులేక తిరగడం వల్లా? దేని మీదా దృష్టిపెట్టలేని సంతృప్తిలేని కళ్ళలా, ఎప్పుడూ మార్పుకి లోనవడం వల్లా? . […]
-
తరచు అపవిత్రమయే మాట — షెల్లీ
Image Courtesy: http://www.google.com/imgres?q=inter-stellar+space . తరచు అపవిత్రతతకు గురయే మాటని నేను మరోసారి అపవిత్రం చేస్తాను… . ఎప్పుడూ అబధ్ధమని తృణీకరించే ఒక భావనని నువ్వు మరోసారి తృణీకరిస్తావు… . నిరాశను పోలిన ఒక ఆశను, వివేకం అణచి ఉంచుతుంది … . ఎవరో చూపించే జాలికన్న, నువ్వుచూపే జాలి ఎంతో ప్రియమైనదవుతుంది … . నువ్వు అంగీకరించినా, లేకున్నా, నేనివ్వగలిగేది పురుషులు “ప్రేమ” అని పిలిచేదాన్ని కాదు… మనసును మహోన్నతం చేసేదీ, భగవంతుడుకూడా నిరాదరించలేని ఒక […]