అనువాదలహరి

మేం ముసుగు వేసుకుంటాం… పాల్ లారెన్స్ డన్ బార్, అమెరికను కవి

మేము నవ్వుతూ, అబద్ధాలు చెప్పగల ముసుగు వేసుకుంటాం
అది మా బుగ్గలు మరుగుచేసి, కళ్ళకి మెరుపు నిస్తుంది…
అందుకు మనిషి వంచనా శిల్పానికి మేము ఋణపడి ఉన్నాం.
ఒకప్రక్క గుండెలు పగిలి రక్తాలుకారుతున్నా
నవ్వుతూ ఎంతో సునిశితంగా మాటలు అల్లి మాటాడతాం.

మా ప్రతి కన్నీటి బొట్టూ, నిట్టూరుపూ
గణించగల తెలివితేటలు ప్రపంచానికెందుకివ్వాలి?
వీల్లేదు. ప్రపంచాన్ని కేవలం మమ్మల్ని చూడనిస్తాం
కానీ, మేము ముసుగు ధరించే ఉంటాం.

ఓ మహాప్రభూ, క్రీస్తూ! నీ కోసం పిలిచే మా పిలుపులు
చిత్రహింసలు అనుభవిస్తున్న హృదయాలనుండి వెలువడుతున్నవి.
మేము పాడుతూ ఉండొచ్చు, కానీ మా పాదాల క్రింద మట్టి
పరమ నీచమైనది, మా గమ్యం ఇంకా అనంత దూరం;
కానీ ప్రపంచాన్ని మాత్రం వేరేలా తలపోయనీ,
మేము మాత్రం ముసుగు ధరించే ఉంటాం.
.

పాల్ లారెన్స్ డన్ బార్

(June 27, 1872 – February 9, 1906)

అమెరికను కవి

.

.

We Wear the Mask

We wear the mask that grins and lies,

It hides our cheeks and shades our eyes—

This debt we pay to human guile;

With torn and bleeding hearts we smile,

And mouth with myriad subtleties.

Why should the world be over-wise,

In counting all our tears and sighs?

Nay, let them only see us, while

We wear the mask.

We smile, but, O great Christ, our cries

To thee from tortured souls arise.

We sing, but oh the clay is vile

Beneath our feet, and long the mile;

But let the world dream otherwise,

We wear the mask!

.

Paul Laurence Dunbar 

(June 27, 1872 – February 9, 1906)

American Poet

Poem Courtesy:

http://www.poemtree.com/poems/WeWearTheMask.htm

సానుభూతి… పాల్ లారెన్స్ డన్ బార్, అమెరికను కవి

పాపం! పంజరంలోని పిట్టకి ఎలా ఉంటుందో నాకు తెలుసు.

మిట్టలమీది వంపుల్లో సూర్యుడు బాగా ప్రకాశిస్తున్నప్పుడు

లేలేత గడ్డిమొలకల్లో గాలి మెత్తగా కదులుతున్నపుడు,

గాజుప్రవాహంలా నది తరళంగా పరిగెత్తుతున్నపుడు,

తొలిపికము పాడినపుడు, తొలిమొగ్గ విరిసినపుడు

దాని కలశంలోని మంద్రపరిమళం అంతరించినపుడు

పాపం, పంజరంలోని పిట్టకి ఎలా ఉంటుందో నాకు తెలుసు.

ఎర్రని తన రెక్కల రక్తం జాలిలేని తీగలపై గడ్డకట్టేదాకా

పంజరంలోని పిట్ట ఎందుకురెక్కలు కొట్టుకుంటుందో నాకు తెలుసు.

అది తిరిగి తనకొమ్మపైకి ఎగిరి వాలాలి, తను ఆనందంతో

ఊగుతున్నపుడు పడిపోకుండా గట్టిగా పట్టుకోవాలి;

పాతగాయాల మచ్చల్లో నొప్పి ఇంకా సలుపుతూనే ఉంటుంది —

అది సరికొత్తగా, మరింతసూదిగా పొడిచినట్టుంటుంది.

అది రెక్కలెందుకు కొట్టుకుంటుందో నాకు తెలుసు.

ఆహ్!  పంజరంలోని పిట్ట ఎందుకు పాడుతుందో నాకు తెలుసు.

తను స్వేచ్ఛగా బయటపడడానికి పంజరం గోడలు కొట్టికొట్టి

దాని రెక్కకి గాయమై, గుండె ఒరిసిపోయినపుడు,

అది ఆనందంతోనో, పట్టలేని సంతోషంతోనో కాదు,

దాని హృదయాంతరాళాలనుండి వినిపిస్తున్న ప్రార్థన అది

పైన స్వర్గంలో ఉన్నవానికి అది పెట్టుకుంటున్న మొర.

నాకు తెలుసు పంజరంలోని పిట్ట ఎందుకు పాడుతుందో!

.

పాల్ లారెన్స్ డన్ బార్

(June 27, 1872 – February 9, 1906)

ఆఫ్రికన్- అమెరికను కవి, నాటక కర్త, నవలాకారుడు.

Paul Laurence Dunbar

.

Sympathy

I know what the caged bird feels, alas!

When the sun is bright on the upland slopes;

When the wind stirs soft through the springing grass,

And the river flows like a stream of glass;

When the first bird sings and the first bud opes,

And the faint perfume from its chalice steals—

I know what the caged bird feels!

I know why the caged bird beats his wing

Till its blood is red on the cruel bars;

For he must fly back to his perch and cling

When he fain would be on the bough a-swing;

And a pain still throbs in the old, old scars

And they pulse again with a keener sting—

I know why he beats his wing!

I know why the caged bird sings, ah me,

When his wing is bruised and his bosom sore,—

When he beats his bars and he would be free;

It is not a carol of joy or glee,

But a prayer that he sends from his heart’s deep core,

But a plea, that upward to Heaven he flings—

I know why the caged bird sings!

.

Paul Laurence Dunbar

(June 27, 1872 – February 9, 1906)

American Poet, Novelist, Playwright

Poem Courtesy:

http://www.poemtree.com/poems/Sympathy.htm

 

రాత్రి ప్రయాణించే ఓడలు… పాల్ లారెన్స్ డన్ బార్, ఆఫ్రికన్- అమెరికన్ కవి

అల్లదిగో ఆకాశంలో దట్టమైన నల్లని మేఘాలు కమ్ముకుంటున్నాయి

ఏదో జరగబోతున్నట్టున్న చీకటిలోకి నేను దూరంగా చూస్తున్నాను

గంభీరంగా ధ్వనించే ఫిరంగులమోత నాకు వినిపిస్తుంది

ఉండీ ఉడిగీ మెరిసే ఏ చిన్న వెలుగైనా కనిపిస్తుంది.

దాన్నిబట్టి నాకు కావలసిన ఓడ ప్రయాణిస్తోందని తెలుస్తుంది.

గాయపడ్ద నా మనసు చిందించే కన్నీళ్ళతో కళ్ళు మసకబారుతున్నై

ఎందుకంటే నేనా ముఖ్యమైన ఓడకి సంకేతాలిస్తూ హెచ్చరించాలి

నేను చేతులు ఊపుతూ బ్రతిమాలుతున్నాను, గట్టిగా అరుస్తున్నాను

నాకు అడుగుదూరంలోనే మాటలు గాలిలో కలిసిపోతున్నాయి

అలా వెళిపోతున్న నౌకకి వాటి లేశమాత్రపు గుసగుస చేరుతుందేమో.

ఓ ధరణీ!ఓ ఆకాశమా!ఓ సాగరమా!అన్నిటినీ మించి

చీకటికి వెరచే నా హృదయమా! ఓ బేల మనసా!

నాకు ఆశ లేనట్టేనా? కనుచూపుకి అందకుండా

మాటకి అందకుండా అలా అలా పరిగెత్తుతున్న ఆ నౌకని

ఎదుర్కుని నిరోధించగల వేరే మార్గం లేదా?

.

పాల్ లారెన్స్ డన్ బార్

(June 27, 1872 – February 9, 1906)

ఆఫ్రికన్- అమెరికన్ కవి

 

 Paul Laurence Dunbar

.

Ships That Pass in the Night

.

 Out in the sky the great dark clouds are massing;

  I look far out into the pregnant night,

Where I can hear a solemn booming gun

  And catch the gleaming of a random light,

That tells me that the ship I seek is passing, passing.

 

My tearful eyes my soul’s deep hurt are glassing;

  For I would hail and check that ship of ships.

I stretch my hands imploring, cry aloud,

  My voice falls dead a foot from mine own lips,

And but its ghost doth reach that vessel, passing, passing.

 

O Earth, O Sky, O Ocean, both surpassing,

  O heart of mine, O soul that dreads the dark!

Is there no hope for me? Is there no way

  That I may sight and check that speeding bark

 Which out of sight and sound is passing, passing?

.

Paul Laurence Dunbar

(June 27, 1872 – February 9, 1906)

African-American poet, novelist, and playwright

Poem Courtesy:

The Book of American Negro Poetry.  1922.

Ed: James Weldon Johnson, (1871–1938). 

 (http://www.bartleby.com/269/3.html

 

సానుభూతి… పాల్ లారెన్స్ డన్ బార్

Image Courtesy: http://www.derekhaines.ch

.

నాకు తెలుసు పంజరంలోని పిట్టకి ఏమనిపిస్తుందో! పాపం! ప్చ్!

ఆ పర్వత సానువులపై సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు

గరిక మొలకలలోంచి గాలి తలదువ్వినట్టు వీచుతున్నప్పుడు

గాజుపారినట్టు నది స్వచ్ఛంగా ప్రవహిస్తున్నపుడు

తొలిపిట్ట పాడుతుంటే, తొలిమొగ్గ విచ్చుకుంటూ

దాని లేత పరిమళం హృదయం నుండి నలుదిశలా వ్యాపిస్తున్నపుడు

నాకు తెలుసు పంజరం లోని పిట్టకి ఏమనిపిస్తుందో!

.

నాకు తెలుసు

క్రూరమైన పంజరపు ఊచలు దాని రక్తంతో ఎరుపెక్కేదాకా

అందులోని పిట్ట రెక్కలు ఎందుకు కొట్టుకుంటుందో!

అది తన కొమ్మమీదకి ఎగిరి ఊయలలూగుదామనుకుంటే

మళ్ళీ పంజరంలోని తనకొయ్యమీదకే తిరిగి వాలాలి—

ఆ బాధ,  మానుతున్న మచ్చలకిందిగాయాలలో

పదే పదే సలుపుతూ మరింత తీవ్రంగా పోటుపెడుతుంది.

నాకు తెలుసు అది రెక్కలు ఎందుకలా కొట్టుకుంటోందో.

.

హే భగవాన్! నాకు తెలుసు

పంజరంలోని పిట్ట దాని రెక్కలు నెత్తురోడుతూ

హృదయం పచ్చిపుండయిపోయినా,

పంజరాన్ని విడిచి అది స్వేచ్ఛగా ఎగురుతున్నపుడు

ఎందుకు ఆలపిస్తోందో!

అది ఆనందంతో, సంతోషంతో పాడే గీతికలు కావు…

దాని హృదయాంతరాలనుండి పలికే ప్రార్థనలు,

ఊర్ధ్వదిశగా పరమాత్మకి అది విన్నవించుకునే కృతజ్ఞతా నివేదనలు…

నాకు తెలుసు పంజరం లోని పిట్ట అందుకే పాడుతోంది.

.

పాల్ లారెన్స్ డన్ బార్

(June 27, 1872 – February 9, 1906)

.

(జూన్ 27, 1872 – ఫిబ్రవరి 9, 1906)   డన్ బార్ 19వ శతాబ్దపు ఉత్తరార్థం లో పేరెన్నికగన్న ఆఫ్రికన్- అమెరికన్ కవులలో ఒకరు. అతను కవే గాక, నాటక రచయితా, నవలాకారుడూ, కథా రచయితా వ్యాసకర్తా కూడ. అంతేగాక 1903 లో బ్రాడ్వేలో విజయవంతంగా ప్రదర్శించబడిన Dahomey అనే సంగీత రూపకానికి పాటలు రాసేడు. అతను పక్షిలా గాలిలో ఎగరడాన్ని సాకారం చేసిన రైటు సోదరులకు సహాధ్యాయి.  అతను తన 33 సంవత్సరాల జీవితకాలం లో  సుమారు పన్నెండు కవితా సంకలనాలూ, నాలుగు కథా సంకలనాలూ,  ఐదు నవలలూ, ఒక నాటకం రచించేడు.

ఆ రోజుల్లో సర్వసామాన్యమైన కవితా వస్తువు బానిసత్వ విముక్తి. ఈ కవిత దాన్ని చాలా చక్కగా ఆ విష్కరిస్తుంది. ఈ కవితలో ప్రత్యేకత దీని మొదటి పదాలని ప్రముఖ ఆఫ్రికన్- అమెరికన్ కవయిత్రి  మాయాఏంజెలో తనకవితా సంకలనానికి శీర్షికగా వాడుకుంది.

(1897 sketch by Norman B. Wood) Image Courtesy: http://upload.wikimedia.org

Sympathy … Paul Laurence Dunbar
.
I know what the caged bird feels, alas!
When the sun is bright on the upland slopes;
When the wind stirs soft through the springing grass,
And the river flows like a stream of glass;
When the first bird sings and the first bud opes,
And the faint perfume from its chalice steals–
I know what the caged bird feels!

I know why the caged bird beats his wing
Till its blood is red on the cruel bars;
For he must fly back to his perch and cling
When he fain would be on the bough a-swing;
And a pain still throbs in the old, old scars
And they pulse again with a keener sting–
I know why he beats his wing!

I know why the caged bird sings, ah me,
When his wing is bruised and his bosom sore,–
When he beats his bars and he would be free;
It is not a carol of joy or glee,
But a prayer that he sends from his heart’s deep core,
But a plea, that upward to Heaven he flings–
I know why the caged bird sings!
.
Paul Laurence Dunbar
(June 27, 1872 – February 9, 1906)
African-American Poet, Novelist, Lyricist and Play Wright

Dunbar was well known, apart from his poetry, for his short stories, novels, librettos, plays, songs and essays.  He had two distinct voices — that of standard English of the classical poet and the evocative dialect of a black American at the the turn of the 19th century. He had a felicity of native dialect for poetry what Mark Twain had for prose.
Oak and Ivy was Dunbar’s first collection of poetry where he employed the classical diction in the larger sectionOak and employed dialect in the smaller section Ivy to feature his lighter poems. Majors and and Minors was his second collection. He later collected these two into one volume as Lyrics of Lowly Life.  In all he wrote about dozen books of poetry, four books of short stories, five novels, and a play.  He also wrote lyrics for In Dahomey – a successful musical comedy written and performed entirely by African-Americans which appeared on Broadway in 1903. He was also honoured with the ceremonial sword by the President Theodore Roosevelt.

%d bloggers like this: